Krishna mukunda murari december 28: అన్నాచెల్లెళ్లకి చెమటలు పట్టించిన పరిమళ.. కృష్ణకి మురారి సేవలు, రగిలిపోయిన భవానీ-krishna mukunda murari december 28th mukunda cautions dev about parimala help to the murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari December 28: అన్నాచెల్లెళ్లకి చెమటలు పట్టించిన పరిమళ.. కృష్ణకి మురారి సేవలు, రగిలిపోయిన భవానీ

Krishna mukunda murari december 28: అన్నాచెల్లెళ్లకి చెమటలు పట్టించిన పరిమళ.. కృష్ణకి మురారి సేవలు, రగిలిపోయిన భవానీ

Gunti Soundarya HT Telugu
Dec 28, 2023 07:23 AM IST

Krishna mukunda murari december 28th Episode: మురారి అసలు దోషిని పట్టుకోవడం కోసం స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపిస్తుండటంతో ముకుంద టెన్షన్ పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి డిసెంబర్ 28 ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి డిసెంబర్ 28 ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari december 28th: మురారి కృష్ణని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొస్తాడు. అది చూసి భవానీ రగిలిపోతుంది. మధుకర్ ఏమైందని అడుగుతాడు. కృష్ణకి కాలు బెణికిందని చెప్తాడు. పెద్దత్తయ్య ఎన్ని అనుకుంటుందో ఇప్పుడే కాలు బెణకాలా అని మనసులో అనుకుంటుంది. చిన్న నొప్పి అని నిర్లక్ష్యం చేయకూడదు తగ్గేవరకు అని మురారి అంటుంటే అలా అని తగ్గేవరకు ఎత్తుకుని తిరుగుతావా ఏంటని ముకుంద అడుగుతుంది.

కృష్ణకి సేవలు.. రగిలిపోతున్న భవానీ

కృష్ణ కాలికి మురారి స్ప్రే చేస్తుంటే భవానీ కోపంగా బ్రేక్ ఫాస్ట్ పైకి తీసుకురా అని వెళ్లబోతుంది. మురారి ఆగండి మీతో మాట్లాడాలని చెప్తాడు. కృష్ణ కాలికి మురారి తన చేతులతో మందు రాయడం చూసి భవానీ కోపం మరింత పెరిగిపోతుంది. చూశారుగా అత్తయ్య అంతగా చెప్పి ఐదు నిమిషాలు కూడా కాలేదు అంటే ఏంటి అర్థమని ముకుంద భవానీకి ఎక్కించే పనిలో ఉంటుంది. నాకు కృష్ణ మీద ప్రేమ కంటే మురారికి మీ మీద పంతమే కనిపిస్తుందని అంటుంది. పరిమళ దగ్గరకి వెళ్దామని అనుకున్నా కానీ ఇంతలోనే ఇలా జరిగిందని మురారి అంటాడు.

పరిమళ నుంచి తప్పించుకున్న దేవ్

కృష్ణ వెళ్తానని అంటే ఈ పరిస్థితిలో ఎక్కడికి వద్దు ఇక్కడే రెస్ట్ తీసుకోమని చెప్తాడు. పరిమళని రమ్మని చెప్పాను తను నీకు ట్రీట్మెంట్ ఇస్తుంది ణా పని అవుతుందని అంటాడు. ఇప్పుడు పరిమళ ఇక్కడికి వచ్చి దేవ్ ని చూస్తే ఎలా అనుకుని వెంటనే తనకి ఫోన్ చేసి రావొద్దని చెప్పాలని ముకుంద మనసులో అనుకుంటుంది.

మురారి పరిమళకి ఫోన్ చేసి కృష్ణ కాలు బెణికిందని తనని వదిలి రావడం కరెక్ట్ కాదని అనిపిస్తుందని చెప్తాడు. నువ్వే ఇంటికి రా కృష్ణకి ట్రీట్ చేసినట్టు ఉంటుంది, మన పని కూడా అవుతుందని అంటాడు. పరిమళ ఉన్న షాప్ కి దేవ్ వెళతాడు. పక్కనే ఉన్న పరిమళని దేవ్ చూసి షాక్ అవుతాడు. వెంటనే అక్కడి నుంచి పరిమళ చూడకముందే వెళ్ళిపోతాడు.

ముకుంద మీద బలపడుతున్న కృష్ణ అనుమానం

ఇవాళ నిజానిజాలు బయట పడతాయని అంటాడు. దేవ్ కి ఫోన్ చేసి రావొద్దని చెప్పాలని పక్కకి వెళ్ళిపోవడం కృష్ణ గమనిస్తుంది. ముకుంద ఎందుకు టెన్షన్ పడుతుంది. మొన్న ఏమో ఎవరూ చూడకుండా లోపలికి వెళ్ళింది. కేసు విషయంలో ముకుంద ఎందుకో కంగారుపడుతుందని స్పష్టంగా అర్థమవుతుందని అనుకుంటుంది. దేవ్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ముకుంద టెన్సన్ పడుతుంది.

భవానీ ముకుందని ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. కృష్ణకి సేవలు చేస్తున్నాడని బాధపడుతున్నవా? మురారి కేవలం నన్ను రెచ్చగొట్టడానికి అలా చేస్తున్నాడు. నేను ఇందాక కోపడ్డాను కదా ఇలాంటి విషయాల్లో కొంచెం ఓపిక పట్టాలని చెప్తుంది. నాకు అన్ని నిజాలు తెలుసని అత్తయ్యకి తెలిస్తే నా గతి ఏంటని ముకుంద మనసులో అనుకుంటుంది.

దోషి ఎవరో తెలిసిపోతుందన్న మురారి

ఎందుకు తనని కూర్చోబెట్టావని మురారిని భవానీ గట్టిగా అడుగుతుంది. స్కెచ్ ఆర్టిస్ట్ వస్తున్నాడు పరిమళ పోలికలు చెప్పగానే అసలు వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. కావాలని ఇంట్లోనే కూర్చుని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఓవర్ యాక్షన్ కాదు కన్సన్ అంటాడు. నేనేం అడగలేదు కదా ఎందుకు సంజాయిషీ ఇస్తున్నావ్ ఏదైనా తప్పు చేస్తున్నావా అంటుంది.

మీకు అలా అర్థం అయితే నేనేం చేయలేను పెద్దమ్మ. అమ్మ ఇక నుంచి నీ కోడలు ఇంట్లోనే ఉంటుందని మురారి చెప్తాడు. ఇప్పుడు నేను డాక్టర్ కి కనిపిస్తే నేను అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యేది. డాక్టర్ ని లేపేస్తే అసలు ఏ టెన్షన్ ఉండదు కదా అనుకుని మళ్ళీ ఇంత తక్కువ టైమ్ లో అంత రిస్క్ చేయకూడదని అనుకుంటాడు.

మధుకర్ దేవ్ ని అనుమానంగా చూసి ఏంటి టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. ఏం లేదని చెప్పి కవర్ చేస్తాడు. ఎందుకో దేవ్ ని చూస్తుంటే నమ్మాలని అనిపించడం లేదని మధు డౌట్ పడతాడు. ఇంటి బయట ఉన్న దేవ్ దగ్గరకు ముకుంద కంగారుగా వస్తుంది. వీడు ఏంటి ముకుంద నామీద డౌట్ పడతాడని దేవ్ అంటే కృష్ణ, మురారికి హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్తుంది.

దేవ్ ని అలర్ట్ చేసిన ముకుంద

హాస్పిటల్ లో మురారిని ట్రీట్ చేసే డాక్టర్ మెడికల్ షాప్ లో కనిపించదని, ఈ కేసులో తనని గుర్తు పట్టే ఏకైక మనిషి తనేనని ముకుందకి చెప్పడంతో మరింత కంగారుపడుతుంది. నువ్వు ఎవరి దగ్గర నుంచి తప్పించుకుని వచ్చావో తన పేరు పరిమళ. ఆవిడ మురారికి ఫ్రెండ్ ఇప్పుడు ఇంటికి వస్తుంది. పరిమళ శేఖర్ ని గుర్తు పడతానని చెప్పింది కదా అతని ఆనవాలు పోలీసులకి చెప్పి బొమ్మలు గీసే ఆర్టిస్ట్ ని పిలుస్తున్నారు. అతను బొమ్మ గీస్తే నువ్వు నేను అడ్డంగా దొరికిపోతామని ముకుంద అసలు విషయం చెప్తుంది.

ఏదో నాలుగైదు రోజులు మ్యానేజ్ చేస్తే పెళ్లి అయిపోతుందని అనుకుంటే ఈ తలనొప్పి ఏంటని దేవ్ కూడా టెన్షన్ పడతాడు. తప్పదు ఎలాగో మ్యానేజ్ చేయమని చెప్తుంది. మధుకర్ దేవ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణతో అటు వస్తుంది. ఎందుకో దేవ్ ని చూస్తుంటే నమ్మాలని అనిపించడం లేదని మధుకర్ తన అనుమానాన్ని చెప్తాడు. నాకు ఎందుకో అతని ఓవర్ యాక్షన్ చేస్తుంటే నిజంగానే మనకి సపోర్ట్ చేస్తున్నాడంటే నమ్మకం కలగడం లేదు. నాకు తన క్యారెక్టర్ ఎందుకో అసహ్యంగా అనిపిస్తుందని చెప్తాడు. కానీ కృష్ణ మాత్రం నమ్మదు. దేవ్ ఎందుకో తేడాగా కనిపిస్తున్నాడని అంటాడు. మురారి వచ్చి కృష్ణని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్తాడు.

టీ20 వరల్డ్ కప్ 2024