Krishna mukunda murari serial april 16th episode: బిడ్డతో కృష్ణ.. ముకుందతో మురారి సరసాలు, మనసులో మాట చెప్పేసిన ఆదర్శ్
Krishna mukunda murari serial april 16th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఆదర్శ్ ముకుంద మీద తనకున్న ఫీలింగ్స్ ని బయట పెడతాడు.
Krishna mukunda murari serial apruil 16th episode: కృష్ణని చంపేందుకు కూడా వెనుకాడనని అంటుంది. ఈ పంతాలతో పోగొట్టుకున్నది చాలు వద్దమ్మా వదిలేయ్ అంటాడు. ఇప్పుడు ఇలాగే వదిలేస్తే పోగొట్టుకున్న దానిలా మిగిలిపోతాను. ముందుకు వెళ్తేనే పోగొట్టుకున్నవి కూడా తిరిగి సంపాదించుకుంటాను. దాని కోసం ఎంత దూరమైన వెళ్తానని అంటుంది.
మనసులో మాట చెప్పిన ఆదర్శ్
ఎంత పని చేశావ్ నాన్న.. నా అకౌంట్ లో డబ్బులు వేసి నన్ను ఇరకాటంలో పెట్టావు. నేనే ముకుందని అని చెప్తే కానీ డబ్బులు రావు. డబ్బులు వదులుకుందామని అనుకుంటే డాక్టర్ తో అసలు పని అవదు. ప్లాన్ బి వేస్ట్ అయిపోతుంది. నా ల్యాప్ టాప్ ఉంటే సగం పని అయిపోతుంది. కానీ అది ఆదర్శ్ దగ్గర ఉంది.
ఆదర్శ్ దగ్గరకు వెళ్లాలంటేనే కంపరంగా ఉందని అనుకుంటూ ఉండగా ముకుంద గదిలోకి ఆదర్శ్ వస్తాడు. జాగింగ్ రమ్మని పిలుస్తాడు. బయటకి రాలేనని డల్ గా ఉందని చెప్తుంది. కంగారుగా డాక్టర్ దగ్గరకు వెళ్దామని అంటాడు. వద్దని చెప్తుంది. నువ్వు రాను అనేసరికి కాస్త డిసప్పాయింట్ అయ్యానని చెప్తాడు.
నా బాధ, సంతోషం ఏదైనా నీతోనే పంచుకోవాలని అనిపిస్తుంది. నీకు ముకుంద అని పేరు పెట్టాక ఎందుకో ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయ్యింది. కొంపదీసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అడుగుతాడా ఏంటని టెన్షన్ పడుతుంది. ఈ ఇంట్లో నేను ఫ్రీగా మాట్లాడటానికి షేర్ చేసుకోవడానికి నువ్వు తప్ప ఎవరు లేరు. అలాగే నీ మనసులో విషయాలు షేర్ చేసుకోవడానికి నీకు నేను తప్ప ఎవరూ లేరని అంటాడు.
ల్యాప్ టాప్ కోసం ముకుంద తిప్పలు
లేదు నాకు ఉన్నారని అంటుంది. నా ఫ్రెండ్ ముకుంద ఉంది కదా బాధ, సంతోషం ఏదైనా నాకు తనతో షేర్ చేసుకోవడం అలవాటు అంటుంది. అయినా తను ఇప్పుడు లేదు కదా అంటాడు. ఉంది నాలోనే నాతోనే ఉందని చెప్తుంది. తనకోక సాయం చేయమని అడుగుతుంది.
ముకుంద ల్యాప్ టాప్ కావాలని అడుగుతుంది. ఆదర్శ్ వెంటనే ఇస్తాను శాంతి పూజ తర్వాత కృష్ణ వాటిని తీసుకుంది. తనని అడిగి తీసుకొస్తానని అంటాడు. వద్దు తానే తీసుకుంటానని అంటుంది. మన దగ్గర లేని వాళ్ళతో బాధ పంచుకుంటే సంతోషం అవుతుంది.
ఇక నుంచి లేని ముకుందతో నీ బాధని పంచుకునే బదులు ఉన్న నాతో నీ సంతోషాన్ని బాధని పంచుకోమని చెప్తాడు. నేను డబ్బులు ఎలా తీసుకోవాలో టెన్షన్ పడుతుంటే నీ ఫిలాసఫీ ఒకటి. నేను నీతో బాధలు పంచుకోవడానికా నేను చచ్చానని చెప్పి రూపం మార్చుకుందని తిట్టుకుంటుంది. కృష్ణ దగ్గర ఉన్న ల్యాప్ టాప్ ఎలాగైనా తీసుకోవాలని అనుకుంటుంది.
ముకుందతో సరసాలు
రేవతి కిచెన్ లో ఉంటే కృష్ణ వచ్చి మాట్లాడుతుంది. తనకి మనవడిని మనవరాలిని ఇచ్చే ఉద్దేశం ఉందా అని గట్టిగా నిలదీస్తుంది. కృష్ణ తెగ సిగ్గుపడిపోతుంది. తాము ఒక్కటయ్యామని సిగ్గుపడుతూ చెప్పడం ముకుంద చూసి రగిలిపోతుంది. రేవతి తన కోడలిని బంగారం అని ముద్దు పెట్టుకుంటుంది.
ఆ బంగారం నేను కావాల్సింది అత్తయ్య కానీ ఎప్పటికైనా నీకు కోడలిని నేనే అవతానని ముకుంద మనసులో అనుకుంటుంది. త్వరలోనే తన చేతిలో మనవడిని పెడతావని సంతోషపడుతుంది. మురారి నిద్రలేచి వాష్ రూమ్ లోకి వెళతాడు. అప్పుడే ముకుంద కృష్ణ వాళ్ళ గదిలోకి వస్తుంది.
ల్యాప్ టాప్ ఎక్కడ ఉందో చూసుకుని తీసుకుని వెళ్లాలని గది మొత్తం వెతుకుతుంది. ముకుంద చెయ్యి తగిలి బొమ్మ కిందపడేసరికి కృష్ణ వచ్చిందని మురారి అనుకుంటాడు. టవల్ తీసుకోవడం మర్చిపోయానని చెప్పి అడుగుతాడు. ముకుంద టవల్ అందిస్తుంటే అది కృష్ణ అనుకుని తన చేతిని పట్టుకుంటాడు.
మురారి మాట నమ్మని కృష్ణ
మురారి తన చేతిని పట్టుకున్నాడని చెప్పి ముకుంద తెగ మురిసిపోతుంది. కృష్ణ అనుకుని నా చెయ్యి పట్టుకోవడం కాదు నేనే ముకుంద అని తెలిసి నా చేతిని పట్టుకోవాలి. ఇదంతా జరగాలంటే ల్యాప్ టాప్ చేతికి రావాలని వెతుకుతుంది. వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి కృష్ణ గదిలో ఉంటుంది.
బాత్ రూమ్ లోకి రమ్మంటే రాలేదు ఏంటని అడుగుతాడు. నన్ను ఎప్పుడు పిలిచారని అంటుంది. ఆటలొద్దు పొద్దున కూడా ఇలాగే వచ్చి రాలేదని అన్నావ్. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నావని అంటాడు. నేను పొద్దున రాలేదు, ఇప్పుడు రాలేదు ఏదేదో ఊహించుకుంటున్నారని చెప్తుంది.
వాష్ రూమ్ లో ఉంటే ఏదో కింద పడిన సౌండ్ వచ్చిందని అంటే కృష్ణ గది మొత్తం వెతుకుతుంది. ఎక్కడ ఏమి లేదని మురారి మాటలు కొట్టి పడేస్తుంది. మురారి చెప్పబోతుంటే వినిపించుకోదు. మరి నాకు టవల్ ఇచ్చింది ఎవరని ఆలోచిస్తాడు. కృష్ణ మాత్రం తనని ఏమి మాట్లాడనివ్వకుండా చేస్తుంది.
బిడ్డతో సంతోషంగా కృష్ణ
ముకుంద ఆదర్శ్ గదిలోకి వస్తుంది. తను లేకపోయేసరికి వెంటనే ల్యాప్ టాప్ కోసం వెతుకుతుంది. కబోర్డ్ లో ల్యాప్ టాప్ కనిపిస్తే దాన్ని తీసుకుంటుంది. ఇక బ్యాంక్ లో మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుని ల్యాప్ టాప్ తీసుకుని వెళ్ళిపోతుంది.
ఆదర్శ్ గురించి ఏం ఆలోచించారని భవానీని రేవతి అడుగుతుంది. నేను ఆలోచించినట్టుగా వాడి జీవితం ఏరోజు లేదు. ఏ తల్లి కడుపునో పుట్టి నాకు వారసుడిగా ఉన్నాడు. నా వంశానికి వారసుడిని ఇస్తాడని అనుకుంటే ఏవేవో జరిగిపోయాయని బాధపడుతుంది.
ఆదర్శ్ కి మళ్ళీ పెళ్లి చేస్తే వారసుడిని ఇస్తాడని రేవతి నచ్చజెపుతుంది. కృష్ణ, మురారిని చూసి ప్రస్తుతానికి నా ఆశలు వీళ్ళ మీదే ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలన్నా వాళ్ళ చేతిలోనే ఉందని అంటుంది. అప్పుడే కృష్ణ బిడ్డని ఎత్తుకుని కిందకు దిగుతున్నట్టు భవానీ ఊహించుకుంటుంది.
తరువాయి భాగంలో..
భవానీ ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ఈరోజుతో కృష్ణ పిల్లల్ని కనే అదృష్టానికి దూరం కాబోతుందని ముకుంద ఒక ట్యాబ్లెట్ ప్రసాదంలో వేస్తుంది. అది కృష్ణ తాగేలా చేస్తుంది.
టాపిక్