Brahmamudi: కావ్యకు ట్విస్ట్ ఇచ్చిన వెన్నెల? మీటింగ్‌లో వసుధారపై రాజీవ్ ప్లాన్.. ముకుంద కొత్త స్కెచ్!-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial latest episode promo vennela twist to kavya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: కావ్యకు ట్విస్ట్ ఇచ్చిన వెన్నెల? మీటింగ్‌లో వసుధారపై రాజీవ్ ప్లాన్.. ముకుంద కొత్త స్కెచ్!

Brahmamudi: కావ్యకు ట్విస్ట్ ఇచ్చిన వెన్నెల? మీటింగ్‌లో వసుధారపై రాజీవ్ ప్లాన్.. ముకుంద కొత్త స్కెచ్!

Sanjiv Kumar HT Telugu
Apr 14, 2024 07:52 AM IST

Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరిగనుందనేది ప్రోమోల్లో చూస్తే..

కావ్యకు ట్విస్ట్ ఇచ్చిన వెన్నెల? మీటింగ్‌లో వసుధారపై రాజీవ్ ప్లాన్.. ముకుంద కొత్త స్కెచ్!
కావ్యకు ట్విస్ట్ ఇచ్చిన వెన్నెల? మీటింగ్‌లో వసుధారపై రాజీవ్ ప్లాన్.. ముకుంద కొత్త స్కెచ్!

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తనే నిజమైన తండ్రి అని తెలిస్తే దుగ్గిరాల ఇంట్లో అదే చివరి రోజు అని కృష్ణుడికి చెప్పుకుంటుంది కావ్య. వాళ్ల భార్యాభర్తల బంధం జీవితాంతం ఉంటుందా.. తను ఈ ఇంటికి తిరిగి వస్తుందా లేదా అనేది కృష్ణుడి చేతుల్లోనే ఉందని, సాయం వద్దని, న్యాయం చేయమని చెప్పి రాజ్ స్కూల్ రీ యూనియన్‌‌కు వెళ్తుంది కావ్య.

వెన్నెల రావడం లేదా

పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని ఫ్లెక్సీలతో ఎంతో గ్రాండ్‌గా స్కూల్ రీయూనియన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. రాజ్ ఫ్రెండ్స్ అంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కారులో రాజ్‌తోపాటు బిడ్డను ఎత్తుకుని కావ్య వస్తుంది. ఫ్రెండ్స్ అందరితో రాజ్ మాట్లాడుతాడు. కావ్యను పరిచయం చేస్తాడు. మరోవైపు వెన్నెల రాలేదా అని శ్వేతను కావ్య అడుగుతుంది. దానికి రాలేదని శ్వేత బదులిస్తుంది. అంటే రావడం లేదా అని కావ్య షాక్ అవుతుంది.

వెన్నెల వస్తుంది.. ఆన్ ద వేలో ఉంది అని శ్వేత చెబుతుంది. మరోవైపు కారులో ఫోన్ మాట్లాడుకుంటూ వెన్నెల వస్తుంటుంది. ఆమె కళ్లు మాత్రమే కనిపించేలా చూపిస్తారు. పూర్తి మొహం చూపించరు. మరోవైపు రాజ్ తన స్నేహితులతో సంతోషంగా, సరదాగా మాట్లాడుతుంటాడు. మరి ఈ ప్రోగ్రామ్‌తో కావ్యకు వెన్నెల ఎవరో తెలుస్తుందా.. లేదా కావ్యకు వెన్నెల ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా.. ఆ బిడ్డకు నిజమైన తండ్రి రాజ్ అని తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మంచి స్థానంలో

Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో డీబీఎస్టీ కాలేజీలో స్టూడెంట్స్ పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ మీటింగ్‌లో వసుధారను అవమానించేందుకు నలుగురు పెరెంట్స్‌కు రాజీవ్ డబ్బులిస్తాడు. ఒక్కొక్కరికి లక్ష రూపాయాలి ఇస్తానని చెప్పడంతో ఆ పనికి వాళ్లు ఒప్పుకుంటారు.

మరోవైపు కాలేజీలో పెరెంట్స్ లెక్చరర్ మీటింగ్ జరుగుతుంటుంది. అటెండెన్స్ తక్కువ ఉన్న స్టూడెంట్స్‌తోపాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా వస్తారు. ఒక్కోసారి కాలేజీ భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, కాలేజీలో చదివిని విద్యార్థిని విద్యార్థులు మంచి స్థానంలో ఉండాలే తప్పా ఫెయిల్ అయి వెనుక ఉండిపోకూడదని వసుధార మంచి స్పీచ్ ఇస్తుంది.

పరువు పోనుందా?

రాజు అనే స్టూడెంట్‌ను లేపి ఎందుకు అటెండెన్స్ తక్కువ వచ్చిందని వసుధార అడుగుతుంది. కాలేజీకి రాకపోవడం వల్ల అని అతను చెబితే.. ఎందుకు రావట్లేదు అని అడిగిన వసుధార అతని తల్లిదండ్రులను అడుగుతుంది. దానికి వాళ్ల అమ్మ చెప్పిన వినట్లేదు. చెడు సావాసాలు చేస్తున్నాడు అని బదులిస్తుంది. ఆ తర్వాత పేరెంట్స్‌లో కొంతమంది వసుధారను అవమానించి, పరువు తీసేలా చేస్తారని తెలుస్తోంది.

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఇంట్లో అందరిగురించి ఆలోచిస్తావ్. అదంతా పక్కన పెట్టి కాస్తా నీ గురించి కూడా ఆలోచించుకుంటే ఈపాటికి మీ అత్తయ్యను ఎప్పుడో నానమ్మని చేసేదానివి అని కృష్ణతో భవానీ అంటుంది. దాంతో కృష్ణ, మురారి సిగ్గుతో సంతోషపడుతుంటే.. ఆదర్శ్, మీరా మాత్రం షాక్ అవుతారు. మళ్లీ వీళ్లు శోభనం గురించి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ దాన్ని ఎలా చెడగొట్టాలని ఆలోచించాలా అని మీరా అనుకుంటుంది.

ముకుంద ప్లాన్ ఏంటీ

పంతులు గారికి ఫోన్ చేసి ముహుర్తం పెట్టించేద్దాం అని రేవతి అంటే.. అవసరం లేదు అని భవానీ అంటుంది. దానికి అంతా షాక్ అవుతారు. ముహుర్తం పెట్టిన ప్రతిసారి ఏదో సమస్య. కాబట్టి ఈసారి ముహుర్తాలు లేవు. ఎప్పుడో భార్యాభర్తలు అయిన మీరు.. ఈరోజు నుంచి నిజమైన భార్యాభర్తల్లా మలుచుకోండి అని భవానీ అంటుంది. దానికి మురారి, కృష్ణ ఆనందపడితే మీరా మాత్రం కంగారుపడుతుంది. మరి ఈసారి శోభనాన్ని అడ్డుకునేందుకు ముకుంద ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.

IPL_Entry_Point