Vennela Kishore: తమిళ హారర్ సినిమాలో వెన్నెల కిశోర్.. క్రేజీగా టైగర్ లుక్-vennela kishore baak first look released along with raashi khanna tamil horror franchise aranmanai 4 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vennela Kishore: తమిళ హారర్ సినిమాలో వెన్నెల కిశోర్.. క్రేజీగా టైగర్ లుక్

Vennela Kishore: తమిళ హారర్ సినిమాలో వెన్నెల కిశోర్.. క్రేజీగా టైగర్ లుక్

Sanjiv Kumar HT Telugu
Apr 12, 2024 02:17 PM IST

Vennela Kishore Baak Movie Look: టాలీవుడ్‌లో స్టార్ కమెడయిన్‌గా పేరు తెచ్చుకున్న వెన్నెల కిశోర్ ఇప్పుడు తమిళ హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమానే బాక్. ఇటీవల బాక్ మూవీ నుంచి వెన్నెల కిశోర్‌తోపాటు రాశీ ఖన్నా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

తమిళ హారర్ సినిమాలో వెన్నెల కిశోర్.. క్రేజీగా టైగర్ లుక్
తమిళ హారర్ సినిమాలో వెన్నెల కిశోర్.. క్రేజీగా టైగర్ లుక్

Vennela Kishore Baak Tiger Look: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు వెన్నెల కిశోర్. వెన్నెల మూవీతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిశోర్ ఆ మూవీ టైటిల్‌నే తన పేరుగా బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే చారి 111 మూవీతో హీరోగా సైతం అడుగుపెట్టాడు. ఫుల్ లెంత్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమా టాక్ పరంగా పాజిటివిటీ తెచ్చుకుంది.

కానీ, బాక్సాఫీస్ వద్ద ఊహించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మళ్లీ వెన్నెల కిశోర్ ఎప్పటిలానే హాస్య నటుడిగా సినిమాలను కొనసాగిస్తున్నాడు. అలా ఆయన నటిస్తున్న కొత్త మూవీ బాక్. తమిళంలో అత్యంత విజయమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ సిరీస్ అరణ్‌మనై నాలుగో భాగంగా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా, సుందర్ సి, రాశీ ఖన్నాతోపాటు వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదివరకు తమన్నా, సుందర్ సి ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేసిన మూవీ మేకర్స్ రీసెంట్‌గా రాశీ ఖన్నాతో పాటు వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. రెండు పోస్టర్లలో హాంటెడ్ హౌస్ నేపథ్యంలో భయానకంగా ఉంది. రాశి ఖన్నా టెర్రిఫైడ్‌గా కనిపించగా, వెన్నెల కిషోర్ కూడా టెన్షన్‌ పడతూ కనిపించారు. ఈ రెండు పోస్టర్స్ క్రేజీగా ఉన్నాయి. ఇందులో వెన్నెల కిశోర్ టైగర్ రోల్‌లో కనిపించనున్నాడు. పోస్టర్‌పై టైగర్ అని రాసి రిలీజ్ చేశారు.

అలాగే రాశీ ఖన్నా మాయ అనే పాత్ర చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు. అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్‌మనై'కి నాల్గవ వెర్షన్‌ మరింత బిగ్గర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో 'బాక్'గా టైటిల్ ఫిక్స్ చేశారు. తమన్నా, రాశి ఖన్నా, సుందర్ సి, వెన్నెల కిషోర్‌తోపాటు, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

సుందర్ సి, అవ్ని సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై 'బాక్' సినిమాను రూపొందిస్తున్నారు. ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనుంది. అయితే ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. ఈ మూవీకి హిప్ పాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.