Guppedantha Manasu April 8th Episode: గుప్పెడంత మనసు- తండ్రిని వాడు అన్న మను, అంతు చూస్తానని ఛాలెంజ్- వసుధారకు వార్నింగ్
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 8వ తేది ఎపిసోడ్‌లో వసుధారకు మను స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. అలాగే తన కన్నతండ్రిని వాడు అంటూ చాలా కోపంగా ఎమోషనల్ అవుతాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Episode 1045: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో విశ్వనాథం ఇంటికి మను వచ్చిన విషయం తెలిసిందే. మీరు నన్ను మీ కూతురు కొడుకు అంటున్నారు. కానీ మీ కూతురు మాత్రం నన్ను కొడుకుగా చూడట్లేదు. నేను ఆమెను అమ్మా అని పిలవలేను. అలాంటప్పుడు మిమ్మల్ని తాతయ్య అని ఎలా పిలవగలను. ఆమె ద్వారానే మీరు వచ్చారు అని మను అంటాడు.
వాళ్ల ద్వారానే తెలుస్తుంది
నీ బాధ అర్థం చేసుకోగలను మను. కానీ, ఇన్నాళ్లు నువ్ ఎవరో తెలియదు. కానీ, ఇప్పుడు తెలిసింది. అసలు మీ మధ్య దూరానికి గల కారణం ఏంటో చెబితే పరిష్కరించుకుందాం కదా అని విశ్వనాథం అంటాడు. క్షమించండి సార్. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను అని మను అంటాడు. నువ్ మాట్లాడకుండే మాకెలా తెలుస్తుంది అని విశ్వనాథం అంటాడు. సమస్యకు కారణం ఎవరో వాళ్ల ద్వారానే తెలుస్తుంది అని మను వెళ్లిపోతుంటే.. ఏంజెల్, వసుధార ఆపాలని ట్రై చేస్తారు.
ఇదేనా మీరు చెప్పిన ముఖ్యమైన విషయం. మీరు చెప్పగానే ముందు వెనుక ఆలోచించకుండా వచ్చేశాను. మీ మీద గౌరవంతో అని వెళ్లిపోతాడు మను. సారీ వసుధార. నేను చెప్పడం వల్లే మనును తీసుకొచ్చావ్. కానీ, ఇప్పుడు మను నిన్ను అపార్థం చేసుకుంటున్నాడు అని ఏంజెల్ అంటుంది. నేను అనుకున్నట్లే మను గారు హర్ట్ అయ్యారు. నేను చూసుకుంటానులే. సార్ మీరు బాధపడకండి. ఏదో ఒకరోజు మీరంత కలిసి ఉంటారు అని చెప్పి వెళ్లిపోతుంది.
స్వీట్ వార్నింగ్
ఇన్నాళ్లు కూతురు ఉన్న దూరంగా ఉంది. ఇప్పుడు మనవడు కూడా ఉండాల్సిందేనా అని విశ్వనాథం బాధపడిపోతాడు. మరోవైపు కోపంతో ఉంటాడు మను. అతనికి వసుధార కాఫీ ఇస్తుంది. కానీ, మను తీసుకోడు. మీకు బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి అని వసుధార అంటుంది. మీలాంటి గొప్ప వ్యక్తులు ఇలా సారీ చెప్పకండి. నేను చెప్పాలని కూడా అనుకోను. నేను మీకు చెప్పేంత వ్యక్తిని కాకపోవచ్చు. కానీ, ఇతరుల ఫీలింగ్స్ అర్థం చేసుకుని ప్రవర్తిస్తే మంచిది అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు మను.
అర్థం చేసుకున్నాను. విశ్వనాథం గారి పరిస్థితి కూడా అర్థం చేసుకున్నాను. ఈ వయసులో ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా. జ్ఞాపకాలు. ఈ వయసులో ఆయనకు మీతో ఉన్న జ్ఞాపకాలు కావాలి అని వసుధార అంటుంది. నాకు ఇప్పుడు ఏ బంధాలు, ప్రేమలు అవసరం లేదు. ఒక్క అమ్మ ప్రేమ తప్పా అని మను చాలా ఎమోషనల్‌గా అంటాడు. అప్పుడే వచ్చిన మహేంద్ర డోర్ పక్కన ఉండి వింటాడు. నాకు ఏ పిలుపు వద్దు. ఒక్క అమ్మ అని తప్పా అని మను అంటాడు.
తెలుసుకోలేకపోతున్నాను
ఈ సీన్ సేమ్.. రిషి ప్రేమ కోసం అమ్మ అని పిలిపించుకోవడం కోసం జగతి పడిన ఆరాటం కనిపిస్తుంది. మీ బాధ అర్థం చేసుకున్నాం కాబట్టే.. అనుపమ గారిని చాలా అడిగాం. మావయ్య అయితే గట్టిగానే నిలదీసారు. అయినా కూడా ఆమె ఏ సమాధానం చెప్పలేదు అని వసు అంటుంది. మీకు కావాల్సింది సమాధానం మాత్రమే. మేడమ్ చెబితే సమాధానం మాత్రమే తెలుస్తుంది. కానీ, నాకు అది జీవితం. ఇప్పుడు కూడా నా తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అని మను అంటాడు.
ఎవరెవరో అనే మాటలు పడాల్సి వస్తుంది. నా తల్లిని వేలెత్తి చూపుతున్నారు. ఆ సమాధానమే నా జీవితం. ఆ సమాధానమే నా ఉనికి. దానికోసమే కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాను. పోరాటం చేస్తున్నాను. నా ఊపిరి ఆగేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను. కానీ, ఈ ప్రాసెస్‌లో నా గురించి అమ్మ బాధపడకూడదు. తను బాధపడుతుంటే అది చూసి నేను తట్టుకోలేను. అసలు ఇదంతా వాడి వల్లే అని తండ్రిని అంటాడు మను. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు.
నిలబెట్టి నిలదీస్తాను
ఇదంతా అతని వల్లే. నా తండ్రి వల్లే ఇదంతా జరిగింది. నా తల్లి ఏ పాపం చేసిందని నా తల్లి ప్రతిరోజు కన్నీళ్లతో గడపాలి. అతని వల్లే కదా. నా తల్లి ఏ తప్పు చేసిందని.. ఎవరెవరో ముందు తలదించుకోవాలి. తల వంచాలి. మేము ఇన్నాళ్లు నిందలు మోస్తూ వస్తున్నామంటే కారణం ఎవరు. వదిలిపెట్టను. ఈ లోకంలో ఏ మూలన పట్టుకుని వచ్చి నా తల్లి ముందు నిలబెట్టి నిలదీస్తాను. ఇన్నాళ్లు మేము పడ్డ బాధకి అతను సమాధానం చెప్పి తీరాల్సిందే అని మను అంటాడు.
ఇన్నేళ్లు మా మధ్య ఏర్పడిని దూరానికి అతను బాధ్యత వహించాల్సిందే.. వదిలిపెట్టను.. వదిలిపెట్టను అని మను వెళ్లిపోతాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన మహేంద్ర హాల్లో కూర్చుంటాడు. అనుపమని పిలిచి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా, గాయం చోట పెయిన్ ఉందా. మళ్లీ బట్టలు సర్దుకోవడం లాంటివి అంటూ మహేంద్ర మాట్లాడుతాడు. నువ్ వెళ్లమంటే వెళ్తాను అని అనుపమ అంటే.. నా ఉద్దేశం అది కాదు. నువ్ ఇక్కడ హ్యాపీగా ఉండాలని అని మహేంద్ర అంటాడు.
ఆశతో బతుకుతున్నాను
ప్రతి ఒక్కరు కష్ట కాలం చూస్తారు. జీవితం ఎవరినీ విడిచిపెట్టదు. నేను కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేశాను. నాకంటే ఎక్కువగా వసుధార చూసింది అని మహేంద్ర అంటాడు. అప్పుడు జగతి చనిపోవడంతో మహేంద్ర మందుకు బానిస అవడం, ఇంట్లోంచి వెళ్లిపోవడం, అరకు వెళ్లడం, అక్కడ అనుపమను కలవడం, తర్వాత రిషి మిస్ అయి దొరకడం, మళ్లీ మిస్ అవడం గురించి చెబుతుంది వసుధార. ఇప్పుడు రిషి సార్ లేకపోయినా వస్తారని ఆశతో ఎదురుచూస్తున్నాను. ఏదో ఒక రోజు మీ సమస్య కూడా తీరిపోతుంది అని వసుధార అంటుంది.
నా సమస్య తీరిపోనిది అని అనుపమ అంటుంది. నీ సమస్యను తక్కువ చేయడమని కాదు. వసుధార కష్టాలకంటే నీవి చాలా తక్కువ అని మహేంద్ర అంటాడు. నా సమస్యలు తెలియకుండా అలా అంటున్నావ్ అని అనుపమ అంటుంది. అందుకే మాకు చెప్పమనేది. ఇలా అడిగితే సైలెంట్‌గా ఉంటావ్. కానీ, నీ జీవితం నీ ఒక్కదానిదే కాదు. మనుది కూడా. నువ్ ఏం చేసిన దాని ప్రభావం మనుపై పడుతుంది అది మంచి అయినా చెడు అయినా అని మహేంద్ర అంటాడు.
షార్ట్ లిస్ట్ చేయాలి
ఇంతకుముందు జగతి, రిషి కూడా మీలాగే ఉండేవారు. సూటిగా చూసుకునేవారూ కూడా కాదు. ఒకరిపై ఒకరికి తెలియని కోపం, అధికారం ఉండేది. కానీ, ఏదో ఒక మూలన ప్రేమ ఉండేది. అదే వాళ్లిద్దరిని కలిపింది. అలాగే మీరు కూడా ఏదో ఒక రోజు కలుస్తారు అని మహేంద్ర అంటాడు. అనంతరం కాలేజీలో మీటింగ్ జరుగుతుంటుంది. అటెండెన్స్ తక్కువ ఉన్న పేరెంట్స్‌తో లెక్చరర్స్ మీటింగ్ గురించి అనుకున్నాం కదా. వాళ్లను షార్ట్ లిస్ట్ చేయాలి అని వసుధార అంటుంది.
నేను అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు ఇన్ఫార్మ్ చేశాను. వాళ్లు షార్ట్ లిస్ట్ చేస్తారు. మనం ఒక డేట్ అనుకుంటే ఆరోజు చెప్పి పేరెంట్స్‌కు ఇన్ఫార్మ్ చేద్దాం అని లెక్చరర్ అంటాడు. అలాగే కాలేజీలో ప్రతిదానికి గొడవలు అవుతున్నాయి. బ్యాచ్‌లుగా విడిపోయి గొడవలు పడుతున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేయాలని ఫణీంద్ర అంటాడు. మను సార్ రాలేదేంటని లెక్చరర్ అడుగుతాడు. అవునా రాలేదా. అతను రావడం మనకు గ్రహించలేదంటే అతని అవసరం లేదనేగా అని శైలేంద్ర అంటాడు.
శైలేంద్రకు షాక్
ఫ్యూచర్‌లో కూడా రాడేమో. ఆయనకు ఎన్ని ప్రాబ్రమ్స్ ఉన్నాయో అని శైలేంద్ర అంటాడు. ఆయన బోర్డ్ మెంబర్స్‌లో ఒకరు అలా అంటారేంటి అని లెక్చరర్ అంటాడు. కదా మరి ఎందుకు రాలేదు అని శైలేంద్ర అంటే.. అవును రాలేదు కదా. నువ్ వెళ్లి తీసుకురా. అతని సమస్య ఏంటో తెలుసుకుని తీసుకురా అని ఫణీంద్ర అంటాడు. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.