Guppedantha Manasu March 19th Episode: గుప్పెడంత మనసు.. జగతి లాగే బలైన అనుపమ.. బయటపడిన తల్లీ కొడుకుల బంధం, మను గతం ఇదే!
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్‌లో అందరి మబ్బులు వీడిపోయాయి. ఒక్కసారిగా సస్పెన్స్‌కు తెరదించారు. మను అనుపమ కొడుకే అనే ట్విస్ట్ రివీల్ అయింది. అనుమపను రౌడీ కత్తితో పొడవడంతో నిజం బయటపడింది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Episode 1028: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో మను ఛాంబర్‌లో రాజీవ్ వేసిన పోస్టర్స్ చూసి అనుపమ ఫైర్ అవుతుంది. ఎంతచెప్పినా వినకపోవడంతో వసుధార మేడమ్ మీకు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను అని మను చెబుతాడు. అవసరం లేదండి. మీరు ఎంతగానో మాకు అండగా ఉన్నారనుకున్నాను. రిషి సార్‌ను నన్ను కలుపుతారని నమ్మాను. కానీ, మీరు ఇలా చేశారు. ఇంతలా దిగజారుతారని అనుకోలేదు అని వసుధార అంటుంది.
వసుధారకు సారీ
అది కాదండి అని మను అంటే.. ఇక దయచేయండి అని వసుధార అంటుంది. దాంతో సంబరపడిపోయిన శైలేంద్ర.. పక్కకు వెళ్లిపోతాడు. మను మౌనంగా కన్నీళ్లతో బయటకు వెళ్లిపోతాడు. వసుధార, అనుపమ ఇద్దరూ హగ్ చేసుకుంటారు. సారీ వసుధార అని అనుపమ చెబితే.. అతను చేసిన దానికి మీరెందుకు చెబుతున్నారు అని వసుధార అంటుంది. నువ్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు కదా అని తలదించుకుని వెళ్లిపోతుంది అనుపమ.
మరోవైపు అనుపమ చింపేసిన ముక్కలను శైలేంద్ర ఒక్కటిగా పేర్చుతాడు. ఎంత పని జరిగిందిరా నీకు. ఎవడు తీసినా గోతిలో వాడి పడినట్లు.. నేను తీసిన గోతిలో నువ్ పడ్డావ్. అసలు ఈ మ్యాటర్ బ్రదర్‌కు తెలుసో లేదో అని రాజీవ్‌కు కాల్ చేస్తాడు శైలేంద్ర. పార్టీ చేసుకుందామా భయ్యా అని రాజీవ్ అంటాడు. ఈ విషయం నీకు అప్పుడే తెలిసిందా అని శైలేంద్ర అంటాడు. మన పనే అది కదా అని రాజీవ్ అంటాడు. వాడి కాలేజీలోకి వచ్చిన స్పీడ్ చూసి ఎక్కువ కాలం ఉంటాడేమో అనుకున్నాను. కానీ, ఇంత త్వరగా వెళ్లిపోతాడనుకోలేదు అని శైలేంద్ర అంటాడు.
మంచి పని చేసింది
అంతేనా ముందు ఏది వద్దన్నాడు. తర్వాత ఎండీ అయ్యాడు. నా మరదలి పిల్ల మనుసలో ఫాస్ట్‌గా స్థానం సంపాదించాడు. వాడి స్పీడ్ చూసి కాస్తా భయపడ్డాను భయ్యా. ఎక్కడ నా వసుధార నాకు కాకుండా పోతుందేమో అని. కానీ ఆ అనుపమ వాడిని వెళ్లగొట్టి మంచి పని చేసింది అని రాజీవ్ అంటాడు. అవును ఆ అనుపమ వాన్ని ఎందుకు వెళ్లిపోమ్మంది అని శైలేంద్ర అంటాడు. అది మనకెందుకు భయ్యా అని రాజీవ్ అంటాడు. సరే మరి నేను ఇచ్చిన టాస్క్ ఆపేయమని వాడికి చెబుతాను అని శైలేంద్ర చెప్పి కాల్ కట్ చేస్తాడు.
తను టాస్క్ ఇచ్చిన వాడికి కాల్ చేసిన శైలేంద్ర.. నేను ఫొటో ఇచ్చి ఫినిష్ చేయమని చెప్పాను కదా. అది వదిలేసేయ్. ఏం చేయకు అని అంటాడు. అతన్ని వేయాలా వద్దా అన్నది నేను డిసైడ్ చేస్తాను మీరు కాదని రౌడీ అంటాడు. అరేయ్ నేనే కదరా టాస్క్ ఇచ్చింది ఇప్పుడు వద్దని అంటున్నా కదా అని శైలేంద్ర అంటాడు. ఒకసారి అడ్వాన్స్ తీసుకున్న మిడిల్ డ్రాప్ అంటూ ఉండదు. నేను ప్రఫెషనల్. ఒక్కసారి కమిట్ అయితే చేస్తానని ముందే చెప్పాగా అని ఆ రౌడీ శైలేంద్రకు ఎదురుతిరుగుతాడు.
నువ్వేంటీ డల్‌గా ఉన్నావ్
వాడిని ఫినిష్ చేశాకా కాల్ చేస్తా సార్ అని రౌడీ కాల్ కట్ చేస్తాడు. దాంతో కోపంతో ఫ్రస్టేట్ అయిన శైలేంద్ర.. ఎవడికివాడు హీరోలా, విలన్‌లా ప్రవర్తిస్తున్నాడు. సోషల్ మీడియా వచ్చాకా.. ప్రతి ఒక్కడికీ యాటిట్యూడ్ పెరిగిపోయిందని అనుకుంటాడు. మను జరిగినదంతా తలుచుకుని బాధతో వెళ్తుంటే మహేంద్ర ఎదురవుతాడు. మమ్మల్ని అందరిని సంతోషంగా ఉంచి. నువ్వేంటీ డల్‌గా ఉన్నావని అడుగుతాడు. పై నుంచి మెట్లు దిగుతుంది అనుపమ. అప్పుడే వసుధార వస్తుంది.
ఇదేంటో తెలుసా. ఇది రిషి కోసం చేయించింది. సరైన సమయం చూసి రిషికి తొడగాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. కానీ, ఇప్పుడు రిషి ఏమయ్యాడో తెలీదు. ఇప్పుడు రిషి లేని సమయంలో మాకోసం ఎంతో చేశావ్. ఒక కొడుకులా అండగా ఉన్నావ్. తండ్రికి వెన్నుదన్నుగా ఉండేవాన్ని కొడుకు అంటారు. రిషి లేని సమయంలో గత కొన్ని రోజులుగా నువ్ నాకు అలా వెన్నుదన్నుగా నిలబడ్డావ్. అందుకే ఈ కంకణం నీకు తొడగాలని అనుకుంటున్నాను అని మహేంద్ర అంటాడు.
తండ్రిలాగే భావించాను
దాంతో వసుధార షాక్ అవుతుంది. అయ్యో.. సార్ ఇలాంటివి ఏవి వద్దు. నాకు ఇలాంటివి ఇష్టం లేదు. నీ మాటల్లో లేని ఇష్టం మనసులో కనిపించట్లేదనిపిస్తుంది. నువ్ ఇష్టం లేదంటే నేను ఊరుకోను. వసుధారకు ఇష్టం లేకున్న బర్త్ డే సెలబ్రేషన్స్‌కు ఒప్పించావ్ కదా అని మహేంద్ర అంటాడు. సార్ అది వేరు ఇది వేరు. ఏమనుకోకండి. నేను కూడా మిమ్మల్ని తండ్రిలాగా, గురువులాగే భావించాను. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అని మను అంటాడు. ఆ మాటలు శైలేంద్ర కూడా వింటాడు.
ఇంతలో మను సెక్రటరీ వస్తాడు. నా వస్తువులన్ని కారులో ప్యాక్ చేసి పెట్టు అని చెబుతాడు. దాంతో ఏంటీ మను నేను మాట్లాడుతుంటే వస్తువులు ప్యాక్ చేయమంటున్నావ్. ఎక్కడికి వెళ్తున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. ఇక్కడ నా పని అయిపోయింది. ఇక నా అవసరం ఉండదేమో సార్. నేను వెళ్లిపోతున్నాను సార్. నాకు మళ్లీ వచ్చే ఉద్దేశం లేదు. నేను వచ్చినా కానీ ఇక్కడ చాలా మందికి నచ్చదు. వెళ్లిపోతున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అని మను వెళ్లిపోతుంటాడు.
మను కోసం రౌడీ
ఆగు మను అని మహేంద్ర అపుతాడు. ఏమైంది. ఎవరు ఏమన్నారు. నువ్ డల్‌గా ఉన్నప్పుడే అర్థమైంది అని మహేంద్ర అంటాడు. దాంతో ప్లీజ్ సార్ ఆపకండి అని చేతులతో దండం పెడుతాడు మను. దాంతో మహేంద్ర షాక్ అయి ఆగిపోతాడు. మను వెళ్లిపోతాడు. తర్వాత అనుపమ, వసుధారలను చూసిన మహేంద్ర.. ఏదో జరిగి ఉంటుంది అని అనుకుంటాడు. మరోవైపు మను కోసం రౌడీ ఎదురుచూస్తుంటాడు. శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు.
అనుపమ ఏం జరిగింది అని నిలదీస్తాడు మహేంద్ర. తనే వచ్చాడు. వెళ్లాలని అనుకున్నాడు. వెళ్లాడు అని అనుపమ అంటుంది. అలా అయితే ముందు చెప్పి వెళ్లిపోతాడు. ఇలా సడెన్‌గా వెళ్లడు అని మహేంద్ర అంటాడు. నాకేం తెలుసు మహేంద్ర. నన్నెందుకు అడుగుతున్నావ్ అని అనుపమ అంటుంది. తను చెప్పదు నువ్ చెప్పు వసుధార అని అంటాడు మహేంద్ర. వసుధార సైలెంట్‌గా ఉంటుంది. మనును చూసిన రౌడీ అతనే ఫొటోతో కన్ఫర్మ్ చేసుకుంటాడు.
అనుపమను పొడిచిన రౌడీ
మను దిగాలుగా వెళ్లిపోతుంటాడు. అతని కోసం రౌడీ కారు పక్కన నుంచి కత్తి పట్టుకుని వస్తాడు. అదంతా చెట్టు చాటు నుంచి శైలేంద్ర చూస్తాడు. ఇంతలో మనుపైకి కత్తితో రౌడీ రావడం చూసిన అనుపమ షాక్ అవుతుంది. అరకులో రిషిని చంపేందుకు వచ్చిన అతనే ఆ రౌడీ అని గుర్తు పడుతుంది. దూరం నుంచి మను అని గట్టిగా అరుస్తుంది. కానీ మను వినడు. దాంతో అనుపమ పరుగెత్తుకు వెళ్తుంది. మనును తప్పించి అనుపమ మధ్యలోకి వస్తుంది. దాంతో ఆ రౌడీ అనుపమను కత్తితో పొడుస్తాడు.
అది చూసి షాక్ అయిన మను.. అమ్మా.. అని ఒక్కసారిగా అరుస్తాడు. అది విని వసుధార, మహేంద్ర, శైలేంద్ర షాక్ అవుతారు. అమ్మా అని అనుకుంటారు. తర్వాత మేడమ్ అంటూ కంగారుపడతాడు మను. మహేంద్ర కారులో అనుపమను తీసుకువెళ్తారు. మను గాడు అనుపమ కొడుకా అని శైలేంద్రకు మబ్బులు విడిపోతాయి. ఇన్నాళ్ల నుంచి సస్పెన్స్‌గా సాగిన మను, అనుపమ రిలేషన్ గురించి బయటపడుతుంది. కట్ చేస్తే హాస్పిటల్‌లో అనుపమకు ట్రీట్ మెంట్ జరుగుతుంటుంది.
మను ఫ్లాష్ బ్యాక్
అనుపమను చూస్తూ జరిగిన విషయాలను మను గుర్తు చేసుకుంటాడు. అమ్మా అని మను పిలిస్తే.. వద్దు.. నువ్ నన్ను అమ్మా అని పిలవద్దు. నీకు నాకు ఇకనుంచి ఎలాంటి సంబంధం లేదు. ఇక నుంచి నీకు ఎవరు లేరు. నాకు లేరు అని కన్నీళ్లతో అనుపమ అంటుంది. అమ్మా అలా అనకు. నువ్ కాకుండా నాకు ఇంకెవరు ఉన్నారు. నా వల్ల పొరపాటు జరిగింది. అది నా పెయిన్ వల్ల వచ్చిందే కానీ. కావాలని చేయలేదు. నన్ను క్షమించమ్మా అని కాళ్లు పట్టుకుంటాడు మను.
నన్ను దూరం పెట్టకు అమ్మా అని మను అంటాడు. దాంతో తన తలపై చేయి పెట్టుకుని.. ఇంకొక్కసారి నన్ను అమ్మా అని పిలిచావంటే నేను చచ్చినంతా ఒట్టు అని ఒట్టు వేయించుకుంటుంది అనుపమ. ఇంకెప్పుడు నాకు కనిపించకు. ఇక్కడి నుంచు దూరంగా వెళ్లిపో అని అనుపమ వెళ్లిపోతుంది. మను ఏడుస్తూ మౌనంగా ఉండిపోతాడు. అక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్