Guppedantha Manasu March 18th Episode: ఊహించని ట్విస్ట్- మనును చెంప దెబ్బలు కొట్టిన అనుపమ- కాలేజీ నుంచి అవుట్
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. మను చెంపలను ఎడా పెడా వాయించేస్తుంది అనుపమ. కాలేజీ నుంచి వెళ్లిపోమని ఆర్డర్ వేస్తుంది. దాంతో శైలేంద్ర ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Episode 1027: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో వసుధార మహేంద్ర, అనుపకు కాఫీ ఇస్తుంది. కానీ, అనుపమ అలాగే ఉండిపోతుంది. అది చూసిన మహేంద్ర.. అనుపమ ఏమైనా.. సీరియస్‌గా ఆలోచిస్తున్నావా.. మరి కాఫీ తాగకుండా అలా ఉన్నావ్ అని అంటాడు మహేంద్ర. తర్వాత వసుధార నాకు ఒకామె తెలుసు. ఆమె ఎప్పుడు, ఎలా ఉంటుందో అస్సలు తెలియట్లేదు. ఆమె ఓ రకం అని మహేంద్ర అంటాడు.
మను బర్త్ డే తెలుసుకోవాలి
ఎవరి గురించి మహేంద్ర చెబుతున్నావ్ అని అనుపమ అడుగుతుంది. ఉందిలే ఒకావిడ. హా.. నీ గురించి కాదులే. నువ్ ఫీల్ అవ్వకు అని మహేంద్ర అంటాడు. తర్వాత వసుధార నాకో సహాయం చేయి. మను బర్త్ డే ఎప్పుడో తెలుసుకోవాలి. అతన్ని అడిగితే చెప్పట్లేదు. అందుకే మనమే తెలుసుకోవాలి. అనుపమ నువ్ కూడా తెలుసుకునేందుకు ట్రై చేయు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. దాన్ని బట్టి మను బర్త్ డే ఎలా తెలుసుకోవాలో నేను ట్రై చేస్తాను అని మహేంద్ర అంటాడు.
మహేంద్ర ఇలా అంటున్నాడు తెలుసుకుంటాడా ఏంటీ అని అనుపమ అనుకుంటుంది. అనుపమ చెప్పు.. నాకు లిస్ట్ రెడీ చేసి ఇస్తావుగా అని మహేంద్ర అడిగితే.. నాకు కాలేజీలో వర్క్ ఉందని కంగారుగా వెళ్లిపోతుంది అనుపమ. తర్వాత మను మనకు చాలా చేస్తున్నాడు. రిషి వెళ్లాకా నేను నమ్మకం అంతా కోల్పోయాను. కానీ, మను వచ్చాకా చాలా ధైర్యం వచ్చింది. ఆ శైలేంద్ర ప్లాన్స్ తిప్పి కొడుతున్నాడు. నీ సంతోషం కోసం బర్త్ డే చేశాడు. రిషి నీ పక్కనే ఉన్నట్లు చేశాడు అని మహేంద్ర అంటాడు.
రిషి లాగే చూసుకుంటున్నాడు
అవును, అయినవాళ్లే ఆపదలు పెడుతుంటే ఎక్కడి నుంచో వచ్చి మనకు అండగా ఉన్నారు. శైలేంద్రే కాదు. రాజీవ్ విషయంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. మనును చూసే రాజీవ్ కూడా వెనుకడుగు వేస్తున్నాడు అని వసుధార అంటుంది. తర్వాత వసుధార వెళ్లిపోతుంది. అనంతరం జగతి ఫొటో దగ్గరికి వెళ్లి జరిగిన విషయాలన్ని చెప్పుకున్న మహేంద్ర.. మను గురించి గొప్పగా చెబుతాడు. మన రిషి లాగే మా బాగోగులు చూసుకుంటున్నాడు. అతనికి ఏదో ఒకటి చేయాలని ఉంది అని మహేంద్ర అనుకుంటాడు.
తర్వాత రిషి ఫొటో చూస్తూ తనకోసం చేయించిన కంకణం తీస్తాడు. నాన్న రిషి నీకోసం ఈ కంకణం చేయించాను. కానీ, నువ్ దూరమైపోయావు. మాకు నీలా మను వచ్చాడు. నీ విషయంలో పెద్ద తప్పును ఆపాడు. నువ్ లేవనే చీకటిలో బతుకుతున్న మాకు నువ్ ఉన్నావన్న వెలుగు నింపాడు. నువ్ ఎక్కడున్నా మను తీసుకొస్తాడని నాకు నమ్మకం ఉంది. మన కుటుంబానికి అండగా ఉన్న మనుకి ఈ కంకణం ఇస్తాను. అతనికి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేం. కానీ, ఇది ఇచ్చి తృప్తి పడతాను అని మహేంద్ర అనుకుంటాడు.
షాక్ అయిన అనుపమ
మనుతో ఎలాగైనా మాట్లాడాలి. వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. అసలు వాడితో మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ నా వల్ల కావట్లేదు అని అనుపమ మను ఛాంబర్‌కు వెళ్లి చూస్తుంది. వాడు వచ్చాక మళ్లీ వద్దాం అని వెళ్లిపోతున్న అనుపమకు రాజీవ్ చేసిన పోస్టర్స్ కనిపిస్తాయి. కొత్త ప్రేమ జంట అని వసు, మను ఉన్న పోస్టర్ చూసి షాక్ అవుతుంది అనుపమ. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో అక్కడి వచ్చిన వసుధార కూడా పోస్టర్ చూసి షాక్ అవుతుంది.
ఏంటిది మేడమ్.. ఈ పోస్టర్ ఏంటని అడుగుతుంది. అమ్మా వసుధార నువ్ ఏం కంగారుపడకు అని అనుపమ అంటుంది. ఇంతలో మను వస్తాడు. వాళ్ల చేతిలో ఉన్న పోస్టర్ చూసి మను కూడా షాక్ అవుతాడు. రేయ్.. ఏంట్రా ఇది అని మను కాలర్ పట్టుకుని మరీ అడుగుతుంది అనుపమ. అంతేకాకుండా మను చెంపను ఎడాపెడా వాయిస్తుంది. దాంతో వసుధార ఆపుతుంది. అది చూసి శైలేంద్ర చాలా సంతోషిస్తాడు. నీకు అసలు బుద్ధి లేదా. నీకు ఏది అనిపిస్తే అడుగుతావా. నీకు ఏది అనిపిస్తే చేసేస్తావా అని అంటుంది అనుపమ.
ఇంకా బాధపెట్టాలా
తర్వాత పోస్టర్‌ను చించేస్తుంది. అసలు నిన్ను మనిషి అంటార్రా. వసుధార గురించి తెలిసి కూడా ఇలా చేస్తావ్. అప్పటికే వసుధార చెప్పింది. నీ మనసులో ఏదో కుట్ర ఉంది అని. ఇప్పుడు నమ్ముతున్నాను అని అనుపమ చాలా ఫైర్ అవుతుంది. మేడమ్ మీరు పొరపడుతున్నారు. కనిపించేది అంతా నిజం కాదు అని మను అంటాడు. ఛీ.. ఆపు.. వసుధార కాలేజీ కోసం కష్టపడుతుంది. రిషి కోసం వెతుకుతోంది. ఇంత కష్టపడుతున్న వసుధారను ఇంకా బాధపెట్టాలనుకుంటున్నావా అని అనుపమ అంటుంది.
ఒక అమ్మాయి పరువు ఎలా తీయాలని అనిపించిందిరా. నీకు నీ కన్నవాళ్లు గుర్తు రాలేదా. ఇది తెలిస్తే వాళ్లు ఏమైపోతారో అని ఆలోచించవా అని అనుపమ అంటుంది. మేడమ్.. మీకు నేనేంటో తెలుసు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. నేను ఇది చేశాను అంటే నమ్ముతున్నారా అని మను అంటాడు. అవును అని అనుపమ అంటుంది. దాంతో కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతాడు మను. ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా నువ్ ఉండకు. ఈ కాలేజీ విడిచిపెట్టి దూరంగా వెళ్లిపో. మళ్లీ మా జీవితాల్లోకి రాకు అని తెగేసి చెబుతుంది అనుపమ.
అపశకునంగా మాట్లాడకండి
మేడమ్ అంతా మాట అనకండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. నిజా నిజాలు తెలుస్తాయి అని మను అంటుండంగానే.. వెళ్లమని చెప్పానా.. వెళ్లు.. వెళ్తావా లేదా.. వెళ్లకుంటే నా శవాన్ని చూస్తావ్ అని అనుపమ అంటుంది. దాంతో వసు షాక్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకున్న మను.. మీరు అలా అపశకునంగా మాట్లాడకండి. మీరు అంతా బాగుండాలి. నేను వెళ్తాను. కేవలం మీకోసం వెళ్తున్నాను. నేను తప్పు చేయకున్నా తలదించుకుని వెళ్తున్నాను. కానీ, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి అని మను అంటాడు.
అది విని శైలేంద్ర తెగ సంబరపడిపోతాడు. నిందలు మోయడం, ఒంటరిగా బతకడం నాకు అలవాటే. కానీ, వెళ్లేముందు మీకు ఓ క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. మీరైనా నమ్ముతారా అని మను అంటాడు. ఇక ఎలాంటి క్లారిటీ అవసరం లేదండి. నేను అందరికంటే ఎక్కువగా నమ్మాను. కాలేజీ కోసం, రిషి సార్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారు అనుకున్నాను. కానీ, ఇలా చేస్తారనుకోలేదు అని వసుధార అంటుంది. దాంతో సైలెంట్‌గా ఉండిపోతాడు మను. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.