Guppedantha Manasu March 16th Episode: గుప్పెడంత మనసు.. మహేంద్రతో అనుపమ పెళ్లిపై వసుధార చర్చ.. శైలేంద్ర ఫ్రస్టేషన్-guppedantha manasu serial march 16th episode vasudhara mahendra about anupama marriage guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu March 16th Episode: గుప్పెడంత మనసు.. మహేంద్రతో అనుపమ పెళ్లిపై వసుధార చర్చ.. శైలేంద్ర ఫ్రస్టేషన్

Guppedantha Manasu March 16th Episode: గుప్పెడంత మనసు.. మహేంద్రతో అనుపమ పెళ్లిపై వసుధార చర్చ.. శైలేంద్ర ఫ్రస్టేషన్

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 11:48 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 16వ తేది ఎపిసోడ్‌లో అనుపమ గతం, పెళ్లిపై ఆలోచిస్తుంది వసుధార. మరోవైపు మను, ఏంజెల్ కలుసుకుంటారు. దాంతో అనుపమ టెన్షన్ పడుతుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 16వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 16వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1026: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మనను వచ్చి భోజనం చేయిమని ఓల్డీ అడుగుతుంది. దానికి తినాలని లేదు అని మను అంటాడు. ఇతరులు సంతోషంగా ఉండటంతో నీ కడుపు నిండిపోయిందని అర్థం అవుతోంది. ఎవరికైనా సంతోషంగా ఉంటే కడుపు నిండుతుంది. ఎదుటి వాళ్ల సంతోషంలో ఆనందపడేవాడిని నిన్నే చూస్తున్నాను అని అమ్మమ్మ అంటుంది. అలాంటిదే అనుకో ఓల్డీ అని మను అంటాడు.

ఆశలు పెట్టుకోకు

ఇంతకీ వసుధార బర్త్ డే ఎలా జరిగింది. ఎవరెవరు వచ్చారు అని అడుగుతుంది. దాంతో బాగా జరిగింది. అంతా వచ్చారు అని పేర్లు చెబుతాడు మను. మరి అనుపమ అని అడుగుతుంది ఓల్డీ. తను కూడా కాలేజీ స్టాఫే కదా రాకుండా ఎలా ఉంటుంది అని మను అంటాడు. ఏమైనా మాట్లాడిందా అని ఓల్డీ అంటుంది. నాతో ఎందుకు మాట్లాడుతుంది. అలాంటిదేం జరగలేదు. అలాంటి ఆశలు పెట్టుకోకు అని మను అంటాడు. నా ఆశ నీ గురించే నాన్న అని ఓల్డీ అంటుంది.

అయినా ఒకవేళ తను మాట్లాడిన ఉపయోగం ఏముంటుంది. నాకు రావాల్సిన సమాధానం రానంతవరకు ఎంత మాట్లాడిన లాభం లేదు. నేను ఈ జన్మకి ప్రశ్నలతోనే మిగిలిపోవాలేమో. అన్ని మనం అనుకున్నట్లే జరగవు అని మను అంటాడు. ఎందుకు జరగదు అని ఓల్డీ అంటే.. ఏమో నేను బతికి ఉన్నంతవరకు అది జరగదేమో అని మను అంటే.. అదేంటీ నాన్న అలా మాట్లాడుతావ్ అని ఓల్డీ అంటుంది. నిజం కళ్లముందు కనిపిస్తుంటే ఇలా మాట్లాడుకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి వెళ్లిపోతాడు మను.

అన్ని తెలుసు కదా

మనుకి, అనుపమకు ఉన్న రిలేషన్ గురించి ఆలోచిస్తుంది వసుధార. ఏం లేదనుకుందాం అనుకున్నా నా మనసు ఏదో ఉందని చెబుతుంది. కానీ, అది ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అని వసుధార అనుకుంటూ ఉండగా.. మహేంద్ర వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. మీరు అనుపమ బెస్ట్ ఫ్రెండ్ కదా. మీకు ఆమె గురించి అన్ని తెలుసు కదా అని వసుధార అంటే.. అవును, అన్ని తెలుసు. కానీ, ఈ మధ్యే అర్థమవుతోంది. తను నా దగ్గర కొన్ని దాచిపెట్టిందని మహేంద్ర అంటుంది.

అనుపమ మేడమ్ ప్రవర్తన వింతగా ఉంది. మను గురించి టాపిక్ వస్తే టెన్షన్ పడుతుంది. అతన్ని ప్రేమగా చూస్తుంది అని వసుధార అంటుంది. అవును, నేను కూడా గమనించాను. తనలో తానే మదన పడుతుంది అని మహేంద్ర అంటాడు. అనుపమ మేడమ్‌ను అరకు కంటే ముందు చివరిగా ఎప్పుడూ చూశారు అని వసుధార అంటుంది. జగతి కడుపుతో ఉన్నప్పుడు చాలా ప్రేమగా చూసుకునేది. ట్యాబ్లెట్ల్, హెల్త్ అన్ని దగ్గరుండి చూసుకునేది. నేను ఎప్పుడు అంటుండేవాన్ని నీ రుణం ఎలా తీర్చుకోను అని మహేంద్ర అంటాడు.

రిషి ఉన్నాడని నమ్ముతున్నాను

మనం ఫ్రెండ్స్ మన మధ్య అలాంటివి ఏం లేవని అనుపమ చెప్పేది. రిషి పుట్టాక వెళ్లిపోయింది. నేను జగతి ఎంతో కంగారు పడ్డాం. కానీ, అనుపమ గురించి తెలియలేదు. తర్వాత అరకులో కనిపించింది. అప్పటికే జగతిని పొగోట్టుకున్నాం. జగతి గురించి ఎలా అడిగిందో నీకు తెలుసు. ఇప్పుడు రిషి దూరం అయ్యాడు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేంద్ర. అయ్యో మావయ్య ఊరుకోండని వసుధార అంటుంది. నన్ను క్షమించమ్మా.. ఆధారాలన్ని రిషి చనిపోయినట్లే కనిపించేసరికి, అన్నయ్య కాదనే సరికి కర్మకాండలకు ఒప్పుకున్నాను. కానీ, రిషి ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని మహేంద్ర అంటాడు.

రిషి సార్‌ను వెతికి ఎలాగైనా తీసుకొస్తాను అని వసుధార అంటుంది. నాకు నీపై నమ్మకం ఉందమ్మా. అనుపమ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది కదా అని మహేంద్ర అంటాడు. ఆమె గతం గురించి మీరు ఎప్పుడు అడగలేదా అని వసుధార అంటుంది. చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ అడగలేదు. అడిగినా ఏదో విచిత్రంగా ఆన్సర్ చెబుతుంది. గుచ్చి గుచ్చి అడగలేనమ్మా అని మహేంద్ర అంటాడు. మరి ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదో అడగలేదా అని వసుధార అంటుంది. అడగలేదమ్మా అని మహేంద్ర అంటాడు.

నాకోసం ఎవరు చూడరు

ఇప్పుడు అడగండి అని వసుధార అంటుంది. ఇప్పుడు అడిగిన మనకు అర్థం కానీ సమాధానం చెబుతుంది. మనం అనుకున్నట్లు మనుకు, అనుపమకు గతం ఉంటే కచ్చితంగా ఏదో ఒక రోజు తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు మహేంద్ర. మరోవైపు ఏంజెల్ ఓ చోట ఉంటుంది. ఇంతలో మను వస్తే.. అతనికోసమే ఎదురుచూస్తున్నట్లు చెబుతుంది. నా కోసమా. నాకోసం ఎవరు ఎదురుచూడరు. నా వాళ్లు నాకు దూరమైపోతారు అని మను అంటాడు.

అవునా. అంటే మీకు గతం ఉందా. మీకు దూరమైపోయింది ఎవరు. మీ గర్ల్ ఫ్రెండా. లేదా కుటుంబ సభ్యులా అని ఏంజెల్ అడుగుతుంది. దాంతో ఆ విషయం అనవసరం అని మను అంటాడు. తర్వాత మను బర్త్ డే గురించి అడుగుతుంది ఏంజెల్. ఇప్పుడు ఎందుకు గ్రాండ్‌గా బర్త్ డే చేపిద్దామనా. అవసరం లేదు. అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పను అని మను అంటాడు. ఇంతలో ఏంజెల్‌కు అనుప కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది.

అర్జంట్ వర్క్ ఉంది

నువ్ చెప్పిన చోటే ఉన్నాను అని చెప్పిన ఏంజెల్ ఇక్కడ నాతో ఎవరున్నారో తెలుసా. మను గారు కూడా నాతోనే కలిసి ఉన్నారు అని అంటుంది. దాంతో అనుపమ తెగ కంగారు పడిపోతుంది. కొంచెంసేపు ఏం మాట్లాడదు. తర్వాత ఏంజెల్ పిలిచేసరికి.. సరే ఇప్పుడు మనం కలవట్లేదు. సాయంత్రం కలుద్దాం. నీతో మాట్లాడే ముఖ్యమైన విషయం కన్నా కాలేజీలో అర్జంట్ పని పడింది. దానికి లేట్ అవుతుంది అని కాల్ కట్ చేస్తుంది ఏంజెల్.

ఏమైందని మను అడిగితే.. నాకు అర్థమైతే కదా మీకు చెప్పడానికి. మా అత్తయ్య ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తుంది. కలుస్తా అంటుంది. మళ్లీ అప్పుడే కలవను అంటుంది. స్క్రూల్ లూజ్ అయినట్లుంది అని ఏంజెల్ అంటే.. అరే.. అలా అంటావేంటీ అని మను అంటాడు. హలో మను గారు. అంటుంది మా అత్తయ్యను. మీకెందుకు కోపం వస్తుంది. మీకు మా అత్తయ్యతో అసలు పరిచయమే లేదన్నారు కదా అని ఏంజెల్ అంటుంది. పెద్దవాళ్లను అలా అనడం ఏంటి అని మను అంటాడు.

నువ్ రాక్షసుడవని

సరే కానీ మీతో అబద్ధం చెప్పాను. నేను మీకోసం ఎదురుచూడట్లేదు. మా అత్తయ్య కలుస్తానంటే ఎదురుచూస్తున్నాను. మీకోసం ఎదురుచూసేందుకు మీరేమైనా మా అత్త కొడుకా అని ఏంజెల్ అంటుంది. నా పేరు చెప్పకుండా ఉండాల్సింది అని మెల్లిగా సనుగుతాడు మను. దాంతో ఆ వినొచ్చింది. మీరు ఉంటే మా అత్త ఎందుకు రాదు అని ఆరా తీస్తుంది ఏంజెల్. సరే నాకు అర్జంట్ వర్క్ ఉందని చెప్పి మను వెళ్లిపోతాడు. మరోవైపు నువ్ సాధించి ఏంట్రా. నువ్ రాక్షసుడివి అని అంతా అంటారు. అంతగా పీకింది ఏంట్రా. నీచుడా. దరిద్రుడా అని తనను తానే తిట్టుకుంటాడు శైలేంద్ర.

ఇంతలో వచ్చిన దేవయాని ఏంటీ నాన్న ఇది అని అడుగుతుంది. ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా కానీ ఆ ఎండీ సీటు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది కదా మామ్. ఒకప్పుడు రిషిగాడు. ఒకప్పుడు జగతి పిన్ని అడ్డుగా ఉంది. కొన్నాళ్లు వసుధార. ఇప్పుడు ఆ మనుగాడు అడ్డుగా వచ్చాడు. ఇన్ని అడ్డంకులా అని శైలేంద్ర చిరాకు పడతాడు. తప్పదు నాన్న అన్నింటిని అధిగమించి ముందుకు వెళ్లాలి. దేనికైనా టైమ్ పడుతుంది. కొన్నింటికి సంవత్సరాలు పడుతుంది అని దేవయాని అంటుంది.

దేవయాని మోటివేషన్

ఏమో మమ్మీ నేను ఓడిపోయానేమో అనిపిస్తుంది. నేను మంచి కోసం చేయట్లేదు కాబట్టి ఇలా జరుగుతుందేమో అని శైలేంద్ర అంటాడు. మంచివాళ్లకు మంచి, చెడ్డవాళ్లకు చెడు జరగాలని లేదు. రాక్షసులు కూడా ఎంతోకాలం కష్టపడ్డారు. నువ్ కూడా అంతే. కావాలంటే కారులో మోటివేషన్ సాంగ్ పెట్టుకో. హ్యాపీగా కాలేజీకి వెళ్లు. ఒక్కోసారి మనం ఏం చేయలేకపోయినా. నీ కష్టం చూసి ఒక్కోసారి దేవుడు సహాయం చేస్తాడేమో. మనం ఆశను మాత్రం వదులుకోకూడదు. వెళ్లు నాన్న వెళ్లు అని దేవయాని మోటివేట్ చేస్తుంది.

Whats_app_banner