Guppedantha Manasu February 26th Episode: గుప్పెడంత మనసు.. ఫణీంద్ర కఠిన నిర్ణయం.. ఒప్పుకున్న మహేంద్ర.. మామకోడళ్ల గొడవే!
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్‌లో రిషికి కర్మకాండలు జరిపిద్దామని ఫణీంద్ర అంటాడు. మహేంద్ర ఎంత చెప్పిన వినడు. దాంతో మహేంద్ర కూడా ఒప్పుకుంటాడు. మరోవైపు వసుధార అనుమానిస్తుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Episode 1009: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషికి కర్మకాండలు జరిపిద్దాం. నీ బాధ చూడలేకపోతున్నాను అని ఫణీంద్ర అంటాడు. దాంతో షాక్ అయిన మహేంద్ర సైలెంట్‌గా ఉండిపోతాడు. నీ మనసు ఏమైనా నొప్పించానా అని ఫణీంద్ర అడుగుతాడు. లేదు అన్నయ్య.. మీరు ఎప్పుడు నా మనసు నొప్పించలేదు. సంతోషంగా ఉండేలా చూసుకున్నావ్. కానీ, మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తి వచ్చిందో కానీ నా బతుకు ఇలా అయింది అని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు.
మహేంద్ర షాక్
ఎమోషనల్ అవకు మహేంద్ర. అంతా విధి రాత అని దేవయాని అంటుంది. అవును బాబాయ్ నాకు చాలా బాధగా ఉంది. ముందు జగతి పిన్ని, తర్వాత నాకు ప్రాణంకంటే ఎక్కువైన నా తమ్ముడు రిషి చనిపోయారు అని శైలేంద్ర డ్రామా చేస్తాడు. నేను అయితే రేపు కర్మకాండలు జరిపిద్దామనుకుంటున్నాను అని ఫణీంద్ర అంటాడు. దాంతో షాక్ అయినా మహేంద్ర వద్దు అన్నయ్య.. వద్దు. నన్ను క్షమించండి అన్నయ్య. మీ మాట కాదంటున్నందుకు అని అంటాడు.
ఎందుకు వద్దంటున్నావ్ అని దేవయాని అంటే.. చెప్పు మహేంద్ర అని ఫణీంద్ర అంటాడు. వసుధార ఇంకా రిషి బతికే ఉన్నాడని నమ్ముతుంది. మొన్న సంతాప సభ జరిపిస్తేనే అరిచింది. ఇలా చేస్తే ఇంకా కోప్పడుతుంది. ఇంకోసారి రిషి చనిపోయాడని అనొద్దు అంటుంది అని మహేంద్ర అంటాడు. వసుధార పిచ్చి పిల్ల. మనతోనే కావట్లేదు రిషి చనిపోయాడని. తనకు నచ్చజెప్పాలని దేవయాని అంటుంది. దానికి తను చెప్పింది నిజమే. తను ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేలా చేయాలి అని ఫణీంద్ర అంటాడు.
కర్మకాండలు జరిపించాలి
ఎన్నోసార్లు నచ్చజెప్పి చూశాం అన్నయ్య. కానీ, వినట్లేదు అని మహేంద్ర అంటాడు. మరి నువ్వయితే రిషి చనిపోయాడని నమ్ముతున్నావ్ కదా అని దేవయాని అంటుంది. దాంతో మహేంద్ర సైలెంట్‌గా ఉంటే చెప్పు అని ఫణీంద్ర అంటాడు. నేను నమ్ముతున్నాను అన్నయ్య. డీఎన్ఏ టెస్ట్ చేయించాం. అది రిషి బాడీనే అని తేలింది అని మహేంద్ర అంటాడు. అలా అయితే కర్మకాండలు జరిపించాలి కదా అని ఫణీంద్ర అంటాడు. కానీ, వసుధార ఏమైపోతుందో అని భయమేస్తుంది. నాకు రిషి ఆత్మ ఎంతో ముఖ్యమో, వసుధార కూడా అంతే ముఖ్యం అని మహేంద్ర అంటాడు.
రిషి లేడని వసుధార నమ్మేవరకు ఇవేవి జరిపించొద్దు అని మహేంద్ర అంటాడు. అదేంటి మహేంద్ర అలా అంటావ్. రిషికి కర్మకాండలు జరిపించకపోతే ఇంటికి అరిష్టం అంటూ నానా మాట్లాడుతుంది. నువ్ ఆగు దేవయాని. మీ వదిన గురించి తెలిసిందే కదా. ఏం మాట్లాడాలో తెలియదు. ఇంటకి అరిష్టమా కాదా అనేది కాదు. రిషి ఆత్మకు శాంతి జరగలాని నేను అనుకుంటున్నాను. వసుధారకు తెలియడమే సమస్య అయితే. తనకు తెలియకండా జరిపిద్దాం అని ఫణీంద్ర అంటాడు.
కఠిన నిర్ణయం
దానికి షాక్ అయిన మహేంద్ర.. అలా చేస్తే వసుధార మనందరిపై అరిచేస్తుంది. నన్ను ద్వేషిస్తుంది. మనందరం మోసం చేశామని దూరంగా వెళ్లిపోతుంది అని మహేంద్ర అంటాడు. అలా జరగాలనే కదా ఇలా ప్లాన్ చేసింది అని శైలేంద్ర అనుకుంటాడు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని ఫణీంద్ర అంటాడు. అన్నయ్య మీరు ఇంత చెప్పాకా ఇలా కఠిన నిర్ణయం తీసుకుంటే ఎలా అని మహేంద్ర అంటాడు. తండ్రిగా రిషి కర్మకాండలు జరిపిస్తే జరిపించు లేకుంటే తండ్రి స్థానంలో పెదనాన్నగా నేనే జరిపిస్తాను. ఏమంటావ్ చెప్పు అని ఫణీంద్ర అంటాడు.
మీ ఇష్టం అన్నయ్య అని మహేంద్ర అంటాడు. మీ ఇష్టం అంటే ఏంటీ బాబాయ్ అని శైలేంద్ర అడుగుతాడు. జరిపించండి నేను వస్తాను అని చెప్పి మహేంద్ర వెళ్లిపోతాడు. దాంతో పంతులుకు ఫోన్ చేసి ఏర్పాట్లు చేయమని దేవయానికి ఫణీంద్ర చెబుతాడు. మరోవైపు ఫణీంద్ర, మహేంద్ర గురించి ఆలోచిస్తుంటుంది వసుధార. ఇది శైలేంద్ర కుట్రనా అని డౌట్ పడుతుంది. ఇంతలో అటెండర్ వచ్చి మను గారు ఈ ఫైల్ పై సంతకం చేయమన్నారు అని చెబుతాడు. దీనిపై ఆయన సంతకం లేదేంటి అని వసుధార అడుగుతుంది.
అధికారం చెలాయిద్దామనా
మీరు చేశాకే ఆయన చేస్తానని చెప్పారని అటెండర్ అంటాడు. ఫైలన అప్రూవల్ ఇచ్చేది ఎవరు. మరి ముందు ఆయనకదా సంతకం చేయాలి అని వసుధార అంటుంది. మీరు అడిగిన డౌటే నేను అన్నాను. కానీ, ఆయన ముందు మీదే పెట్టించుకురమ్మన్నారు అటెండర్ అంటాడు. దాంతో ఆ ఫైల్ తీసుకుని మను దగ్గరికి వెళ్తుంది వసుధార. ఏంటిది. అధికారం చెలాయిద్దామనుకుంటున్నారా అని ఫైర్ అవుతుంది. నానా మాటలు అంటుంది. దానికి సమాధానం ఇస్తాడు మను.
నేను మీలాగే కాలేజీ అభివృద్ధి కోసం చేస్తున్నాను. మీరు అప్రూవల్ చేసిన ఫైల్ పై సంతకం చేస్తే ఎలాంటి సమస్య ఉండదు అని అనుకున్నాను. కూల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకే కరెక్ట్ అనిపిస్తుంది అని మను అంటాడు. నేను మీకు టైమ్ ఇస్తున్నాను. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి అని వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు ఇది మావయ్య ఆలోచనల లేదు. మా ఆయన ప్లాన్‌లా ఉంది. ఇలా జరిగితే అందరిపై అరిచేసి వసుధార వెళ్లిపోతుంది. ఇది ఎలాగైన వసుధారకు చెప్పాలని ఫోన్ తీసుకుంటుంది ధరణి.
నిలదీసిన అనుపమ
ఇంతలో ఫోన్ చేస్తున్నావా అంటూ ఎంట్రీ ఇస్తారు శైలేంద్ర, దేవయాని. ఏంటీ ఇక్కడ జరిగేది వసుధారకు చెప్పాలనుకుంటున్నావా అని ధరణి ఫోన్ లాక్కుంటాడు శైలేంద్ర. నేను ఆ ఎండీ సీటు కోసం పిచ్చెక్కిపోతున్నాను. రేపటి వరకు సైలెంట్‌గా ఉండు అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ తీసుకుని వెళ్లిపోతాడు శైలేంద్ర. అనంతరం కాలేజీకి వచ్చిన మహేంద్రతో మీ అన్నయ్య ఎందుకు పిలిచారు అని అనుపమ అడుగుతుంది. ఏం లేదని మహేంద్ర అంటాడు.
ముఖ్యమైన విషయం అన్నావ్. ఏం లేకుండా ఎలా ఉంటుంది. నువ్ అబద్ధం చెబుతున్నావ్ అని అర్థమవుతోంది అని అనుపమ అంటుంది. మావయ్య ఏమైనా సమస్య అని వసుధార అంటుంది. అలాంటిదేం లేదు అమ్మా. అన్నయ్యకు హెల్త్ బాలేదట అందుకే రమ్మన్నారు అని మహేంద్ర అంటాడు. అవునా, ఇప్పుడు ఎలా ఉంది. అయినా దానికి ఒంటరిగా రమ్మనల్సిన అవసరం ఏముంది అని వసుధార అంటుంది. దాంతో మహేంద్ర సైలెంట్ అవుతాడు. మరోవైపు ఈ మాటలన్నీ మను వింటాడు.