Brahmamudi: కావ్య విడాకులకు ఒప్పుకున్న రాజ్.. ఏంజెల్‌పై మను ఫైర్.. కాలర్ పట్టుకుని కొట్టుకున్న మురారి-ఆదర్శ్
Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ మార్చి 18వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..
Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్ ప్రోమోలో విడాకులపై పేపర్స్‌పై సంతకం చేసి రాజ్‌కు ఇచ్చిన కావ్య సాయంత్రం వరకు తన నిర్ణయం చెప్పమని అంటుంది. దాంతో సాయంత్రం వచ్చిన రాజ్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఇంట్లో అందరిముందు కావ్యకు సంబంధించిన విషయం చెబుతాడు. నా జీవితానికి సంబంధించిన విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను అని రాజ్ అంటాడు. దాంతో షాక్ అయి చూస్తారు కావ్య, ఇందిరాదేవి.
పుట్టింటి వాళ్లు కూడా ఉండాలి
అదేంటంటే.. మీ అందరి సమక్షంలోనే బయటపెట్టాలని అనుకుంటున్నాను. ఎవరు ఆమోదించినా.. ఆమోదించకపోయినా.. ఆ నిర్ణయం మాత్రం మార్చుకోలేను అని రాజ్ అంటాడు. దాంతో కావ్య మరింత షాక్ అవుతుంది. అది రేపే ఎందుకు చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది. కళావతి వాళ్ల పుట్టింటి వాళ్లు కూడా ఉండాలి అని రాజ్ అంటాడు. దానికి ఇందిరాదేవి, కావ్య షాక్ అయి చూస్తారు. చూస్తుంటే.. కావ్య విడాకులకు రాజ్ ఒప్పుకుని సంతకం చేస్తాడని తెలుస్తోంది. అది తెలిసి ఇందిరాదేవి ఏం చేస్తుందో చూడాలి.
Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో అనుపమ గురించి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. అదే విషయం మహేంద్రకు చెబుతుంది. ఈ మధ్య అనుపమ మేడమ్ ప్రవర్తన విచిత్రంగా ఉంది మావయ్య. మను వచ్చినదగ్గరి నుంచి ఆవిడ ఎందుకో టెన్షన్ పడుతున్నారు. అప్పుడప్పుడు మనును చాలా ప్రేమగా చూస్తున్నారు. ఆవిడలో ఏదో తెలియని ఎమోషన్ కనిపిస్తుంది అని మహేంద్రతో వసుధార అంటుంది.
గర్ల్ ఫ్రెండ్ దూరమైందా
అవును, నేను కూడా గమనించాను. ఒకవేళ అనుపమకు, మనుకు గతం ఉంటే అది మనకు కచ్చితంగా తెలుస్తుంది అని మహేంద్ర అంటాడు. తర్వాత అనుపమ కోసం ఎదురుచూస్తున్న ఏంజెల్‍కు మను ఎదురుపడుతాడు. దాంతో అతనితో సరదాగా మాట్లాడుతుంది. తనకోసమే ఎదురుచూస్తున్నట్లు చెబుతుంది. తనకోసం ఎవరు ఎదురుచూడరని, తనకు కావాల్సిన వాళ్లు దూరమయ్యారని అంటాడు మను. ఎవరా దూరమైనవాళ్లు.. గర్ల్ ఫ్రెండా, కుటుంబ సభ్యులా అని ఏంజెల్ అంటుంది.
మధ్యలో ఏంజెల్‌కు అనుపమ కాల్ చేస్తుంది. నాతోపాటు మను గారు కూడా ఉన్నారు అని ఏంజెల్ చెబుతుంది. దాంతో టెన్షన్ పడిపోతుంది అనుపమ. తర్వాత మనం కలవట్లేదు సాయంత్రం కలుద్దాం. ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనుపమ. దాంతో మా అత్తయ్యకు స్క్రూల్ లూజ్ అయినట్లు ఉంది అని మనుతో ఏంజెల్ అంటుంది. దాంతో అలా అంటారేంటీ అని మను ఫైర్ అవుతాడు. మా అత్తయ్యను అంటే మీకు ఎందుకు కోపం వస్తుంది అని ఏంజెల్ అంటుంది. పెద్దవాళ్లను అలా అనడం కరెక్ట్ కాదు కదా అని మను చెబుతాడు.
కోపంతో ఆదర్శ్
Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి మార్చి 18వ తేది ఎపిసోడ్ ప్రోమోలో నేను ఏమైనా తప్పు చేశానా.. ముకుందకు ఎంతలో నచ్చజెప్పాను, ఎంతలా బతిమిలాడానో తనకు తెలుసు. ఆ దేవుడికి తెలుసు. అయినా కూడా ఎందుకింత మొండిగా ప్రవర్తించింది. ఎందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది అని మురారి అనుకుంటాడు. ఆదర్శ్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావ్ అని రేవతి అడుగుతుంది. దాంతో కోపంతో మాట్లాడుతాడు ఆదర్శ్.
అసలు ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ముందుంటే నాకు నరకంగా ఉంది పిన్ని అని చెప్పి వెళ్లబోతున్న ఆదర్శ్‌ను మురారి ఆపుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్. అసలు నువ్ ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావ్ అని మురారి అంటాడు. నువ్ నాకేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉందిగా.. నీ మాయలాడి పెళ్లాం. తనకు ఇచ్చుకో అని ఆదర్శ్ అంటాడు. దాంతో కోపంతో ఆదర్శ్ కాలర్ పట్టుకుంటాడు మురారి. అది చూసి అంతా షాక్ అయి.. ఆపేందుకు వస్తారు.
కృష్ణను అంటే ఊరుకోను
తర్వాత మురారిని గట్టిగా వెనక్కి తోసేసిన ఆదర్శ్.. ఏం చేస్తావురా.. ఏం చేస్తావ్ అని గట్టిగా అరుస్తుంటాడు. నువ్ నీ భార్య కలిసి నా ముకుంద చావుకు కారణం అయ్యారు అని ఆదర్శ్ బాధగా, ఆవేశంగా అంటాడు. దాంతో మళ్లీ ఆదర్శ్ కాలర్ పట్టుకున్న మురారి.. నన్ను ఏమైనా అను పర్లేదు. కానీ, కృష్ణని ఏమైనా అంటే మాత్రం ఊరుకోను అని మురారి అంటాడు. ఏం చేస్తావురా.. ఏం చేస్తావు అని ఆదర్శ్ అంటాడు. మురారి, ఆదర్శ్ ఇద్దరూ అదే పనిగా ఒకరి కాలర్ మరొకరు పట్టుకుని గొడవ పడుతుంటారు. ఇంట్లో వాళ్లు ఆపేందుకు ప్రయత్నిస్తుంటారు.