Guppedantha Manasu April 1st Episode: గుప్పెడంత మనసు.. మను వీక్‌నెస్‌తో ఆటాడుకున్న శైలేంద్ర.. మాట జారిన మహేంద్ర-guppedantha manasu serial april 1st episode shailendra tortured manu on father weakness guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu April 1st Episode: గుప్పెడంత మనసు.. మను వీక్‌నెస్‌తో ఆటాడుకున్న శైలేంద్ర.. మాట జారిన మహేంద్ర

Guppedantha Manasu April 1st Episode: గుప్పెడంత మనసు.. మను వీక్‌నెస్‌తో ఆటాడుకున్న శైలేంద్ర.. మాట జారిన మహేంద్ర

Sanjiv Kumar HT Telugu
Apr 01, 2024 08:25 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్‌లో మనుకు తన తండ్రి గురించి తెలియదన్న వీక్‌నెస్‌తో మానసికంగా టార్చర్ పెడతాడు శైలేంద్ర. శైలేంద్ర ఆపే క్రమంలో మహేంద్ర కూడా మాట జారుతాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1039: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కాలేజీలో బోర్డ్ మీటింగ్ పెట్టుకుంటారు. కాలేజ్ స్టూడెంట్స్ అటెండెన్స్ తక్కువగా ఉంటోంది. దానికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలను అనుకుంటారు. నేను విన్నాను. రెండు నెలలగా స్టూడెంట్స్ సరిగా రావట్లేదు. అటెండెన్స్ తగ్గుతోంది. అసలు వాళ్లు ఎందుకు రావట్లేదు అని ఫణీంద్ర అంటాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. కొంతమంది రిషి సార్ రావట్లేదని రావట్లేదు అని ఓ మేడమ్ చెబుతుంది.

ఇంకా రెచ్చిపోతారు

స్టూడెంట్స్ అటెండెన్స్ తగ్గితే.. వాళ్లు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇంతమంది స్టూడెంట్స్ ఫైన్ కడితే అది కాలేజీకే బ్యాడ్ నేమ్ తెస్తుంది అని వసుధార అంటుంది. స్టూడెంట్స్‌తో మాట్లాడి చూద్దామా అని మను అంటే.. అలా ఆల్రేడీ చెప్పాం. కానీ, వినట్లేదు అని మరొకతను అంటాడు. లేకుంటే వార్నింగ్ ఇద్దామని శైలేంద్ర అంటాడు. అలా చేస్తే వాళ్లు ఇంకా రెచ్చిపోతారు. స్టూడెంట్స్‌ను మచ్చిక చేసుకోవాలి అని ఫణీంద్ర అంటాడు.

సాధారణంగా స్టూడెంట్స్ లెక్చరర్స్ కంటే ఇంట్లో పేరెంట్స్‌కు ఎక్కువగా భయపడతారు. కాలేజీ అని చెప్పి బయట తిరుగుతుంటారు. అయితే మనం స్టూడెంట్స్ వాళ్ల పెరెంట్స్‌తో లెక్చరర్స్ మీటింగ్ పెడదాం అని వసుధార ఐడియా ఇస్తుంది. వాటే థాట్.. వాటే విజన్ అని వసుధార ఐడియాను పొగుడుతాడు మరో లెక్చరర్. దాంతో అంతా బెటర్ అనుకుంటారు. ఇది కదా నాకు కావాల్సింది అని అనుకున్న శైలేంద్ర మనును టార్గెట్ చేసి మాట్లాడతాడు.

తండ్రి ఎవరో తెలియదు

తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఇద్దరూ రావాలా. కొంతమంది సింగిల్ పేరెంట్‌ కూడా ఉంటారు. అంటే తండ్రి ఉండి తల్లి లేనివాళ్లు. తల్లి ఉండి తండ్రి లేని వాళ్లు అని శైలేంద్ర చెబుతుంటే మనుకు కోపం పెరిగిపోతుంది. అది కంట్రోల్ చేసుకునేందుకు పక్కనే వాటర్ గ్లాస్ పట్టుకుంటాడు. కానీ, శైలేంద్ర ఇంకా అంటూనే ఉంటాడు. ఇంకొంతమందికి అసలు తండ్రి ఎవరో కూడా తెలియదు. వాళ్ల పేరు కూడా తెలిసి ఉండదు అని శైలేంద్ర అనగానే కట్టలు తెంచుకున్న కోపంతో ఉన్న మను చేతితో గ్లాస్‌ను పగులగొడతాడు.

అదిపెద్దగా శబ్దం రావడంతో.. వెంటనే మహేంద్ర వచ్చి చేతికి కట్టు కడతాడు. ఏంటిది మను. ఫస్ట్ ఎయిడ్ చేసుకుందువు దా అంటే.. ఏదో అలా అయిపోయింది సార్. నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను. మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి అని మను వెళ్లిపోతాడు. తర్వాత టాపిక్ అంతా డైవర్ట్ అయింది అని మేడమ్ అంటే.. తల్లిదండ్రులు ఉన్నవాళ్లు వస్తారు. లేని వాళ్లు రారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఏదె పెద్ద అనాలిసిస్ లా వాగావ్ అని శైలేంద్రకు ఫణీంద్ర చివాట్లు పెడతాడు.

రెచ్చగొట్టిన శైలేంద్ర

నువ్ అన్నది కరెక్ట్ మామ్. మనుకు తండ్రి వీక్ నెస్ ఉంది. ఇక చూడా మను గాడికి మనుగడ లేకుండా చేస్తాను అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మరోవైపు శైలేంద్ర అన్నమాటలు గుర్తు చేసుకుంటూ రగిలిపోతాడు మను. అప్పుడే శైలేంద్ర వస్తాడు. ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాడు. బ్లడ్ కారిపోతుంది అని ఫస్ట్ ఎయిడ్ చేస్తానంటాడు శైలేంద్ర. కానీ మను వద్దని పక్కకు నెట్టేస్తాడు. స్పిరిట్ అయిన వేసుకో. బాగా మండుతుంది అని ఇన్ డైరెక్ట్‌గా మనుపై సెటైర్లు వేస్తాడు శైలేంద్ర.

తర్వాత మను తండ్రి గురించి కావాలనే గుచ్చి గుచ్చి మాట్లాడుతాడు. నీ తండ్రి ఎవరు. ఇన్నాళ్లు నువ్ మీ అమ్మ ఎందుకు దూరంగా ఉన్నారు. నేను అన్న మాటలు నీకు ఏమైనా తగిలాయా. నీకు నీ తండ్రి పేరు అయినా తెలుసా అని శైలేంద్ర రెచ్చగొడుతుంటాడు. ఆపుతావా అని కోపంతో కుర్చీలోనుంచి పైకి లేస్తాడు మను. అయినా కూడా శైలేంద్ర ఆపాడు. నాకు ఫణీంద్ర, దేవయాని తల్లిదండ్రులు. వసుధార తల్లి పేరు సుమిత్ర. వసుధార నాన్న పేరు చక్రపాణి. అదే కళ్లజోడు ఆయన అని కావాలనే మరింత రెచ్చగొడుతుంటాడు శైలేంద్ర.

ఎవరు పేరు రాయాలి

ఇలా ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటా మను మానసికంగా వేధిస్తాడు శైలేంద్ర. కానీ, మను మాత్రం ఏం మాట్లాడుకుండా బాధపడుతు సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతకుముందు మా రిషి, జగతి పిన్నికి గ్యాప్ వచ్చింది. అలా నీకు నీ తండ్రికి గ్యాప్ వచ్చిందా. నీ పేరు వెనుక సన్నాఫ్ అని ఎవరు పేరు రాయాలి అని శైలేంద్ర అంటుంటే.. మహేంద్ర వచ్చి అరుస్తాడు. దాంతో శైలేంద్ర ఆగుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని మహేంద్ర అంటాడు.

నేను వీళ్ల తండ్రి గురించి మీరు మాట్లాడితే మీరెందుకు వచ్చారు బాబాయ్ అని శైలేంద్ర అంటాడు. ఫస్ట్ ఎయిడ్ ఫస్టే తీసుకురావాలి. నేను కట్టు కడతానంటే చేయించుకోవట్లేదు. చూడండి బ్లడ్ ఎలా పోతుందో అని శైలేంద్ర అంటాడు. దాంతో మహేంద్ర మను చేతికి కట్టు కడతాడు. చూశారా బాబాయ్ మను పార్ష్యాలిటీ చూపిస్తున్నాడు. నేను కట్టు కడితే కట్టించుకోలేదు. కానీ, మీరు కడితే కట్టించుకున్నాడు. నేను అతని నాన్న ఎవరో తెలుసుకుందామని వచ్చాను అని శైలేంద్ర అంటాడు.

అనుపమను అడుగుతాను

నీకు ఎందుకు అని మహేంద్ర అంటాడు. లేదు నాకు కావాలి. ఇంతకీ మీ నాన్న ఎవరు బ్రదర్. నీకు చిన్నప్పటినుంచి లేడా. ఈ మధ్య మాట్లాడుకోవట్లేదా. తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పమనండి. లేకుంటే లేడని చెప్పమనండి. లేదా అనుపమ గారు చెప్పలేదని చెప్పమనండి అని మళ్లీ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు శైలేంద్ర. మహేంద్ర, వసుధార ఎంత వారించినా శైలేంద్ర వినడు. అలాగే అంటూ ఉంటాడు. మను చెప్పకుంటే నేను వెళ్లి అనుపమను అడుగుతాను అని శైలేంద్ర అంటాడు.

దాంతో అంతా షాక్ అవుతారు. మను కోపంగా చూస్తాడు. ఏంటీ బ్రదర్ అడగకూడదా. మరి నువ్వే చెప్పు. నీ తండ్రి ఎవరు అని శైలేంద్ర అంటాడు. ఎందుకు అతన్ని విసిగిస్తావ్. తన తండ్రి ఎవరో తనకు తెలియకపోవడం అతని లోపమే అని మహేంద్ర మాట జారుతాడు. దాంతో వసుధార, మను ఇద్దరూ షాక్ అవుతారు. మను బాధగా చూస్తారు. అది తన లోపం అయినంతమాత్రానా ఇలా అని ఒక్కసారి ఆగిపోతాడు మహేంద్ర. సారి మను అది బై మిస్టేక్ వచ్చింది అని మహేంద్ర అంటాడు. అది నా లోపం కాదు సార్.. అని గట్టిగా అరుస్తాడు మను. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.