Brahmamudi: కంపెనీ నుంచి తప్పుకోనున్న రాజ్, అపర్ణ ఆర్డర్.. వసుధారకు మాటిచ్చిన మను.. భర్తకు మందు పోసిన మీరా-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial april 1st episode promo raj leaves company responsibilities ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Guppedantha Manasu Krishna Mukunda Murari Serial April 1st Episode Promo Raj Leaves Company Responsibilities

Brahmamudi: కంపెనీ నుంచి తప్పుకోనున్న రాజ్, అపర్ణ ఆర్డర్.. వసుధారకు మాటిచ్చిన మను.. భర్తకు మందు పోసిన మీరా

Sanjiv Kumar HT Telugu
Mar 31, 2024 07:21 AM IST

Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగనుందనేది ప్రోమోల్లో చూస్తే..

గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్
గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ తన కొడుకు అని ఇంట్లోకి తీసుకురావడంపై మళ్లీ రుద్రాణి పంచాయితీ పెడుతుంది. ఒకప్పుడు నా కొడుకు అసమర్థుడు అని, అమ్మాయిలతో తిరుగుతాడని వాడిని ఆఫీస్‌లో అడుగు పెట్టనివ్వకుండా చేశారు. వదినా నీ కొడుకు మాత్రం.. ఏ సమర్థత వెలగబెట్టాడు అని రుద్రాణి అంటుంది. దాంతో అంతా సైలెంట్‌గా ఉండిపోతారు. ఎవరు ఏం మాట్లాడుకుండా మౌనంగా ఉంటారు.

కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకో

రాహుల్‍కు కంపెనీ చూసుకునే హక్కు లేనప్పుడు.. రాజ్‌కు మాత్రం ఈ సీటులో కూర్చునే అర్హత ఎక్కడ ఉంది అని రుద్రాణి అంటుంది. దాంతో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపైనే ఉంది అని అపర్ణ అంటుంది. ఏం చేయమంటావో నువ్ చెప్పు మమ్మీ అని రాజ్ అంటాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా బిడ్డను వదిలేసి రావాలి. లేదు అంటే.. దీనికి పరిహారంగా నువ్ కంపెనీ బాధ్యతలు వదిలేసుకోక తప్పదు అని అపర్ణ చెబుతుంది.

అపర్ణ మాటలతో రాజ్ మాత్రమే కాకుండా అందరూ షాక్ అవుతారు. మరి రాజ్ బిడ్డను వదులుకుంటాడా, లేదా బిడ్డ కోసం కంపెనీ బాధ్యతలు వదిలేసుకుంటాడా అనేది తర్వాతి ఎపిసోడ్‌లో తెలియాల్సి ఉంది. లేదా ఇంకేమైనా ట్విస్టుతో రాజే కంపెనీని చూసుకునే అవకాశం కూడా ఉంది.

మాస్ వార్నింగ్

Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో అనుపమకు వసుధార థ్యాంక్స్ చెబుతుంది. ఎందుకు అని అనుపమ అంటే.. మీకు తెలుసు మేడమ్. నేను మిమ్మల్ని ఓ విషయంలో రిక్వెస్ట్ చేశాను. అది మీరు చేశారు. అందుకే థ్యాంక్స్ చెప్పాను అని మీకు తెలుసు కదా అని వసుధార సంతోషంగా అంటుంది. మరోవైపు కాలేజీలోకి అడుగుపెట్టిన మనును చూసి శైలేంద్ర షాక్ అవుతాడు.

ఏంటీ షాక్ అయి చూస్తున్నావ్. ఇక కాలేజీలో రచ్చ రచ్చ చేయొచ్చు అనుకుంటున్నావేమో. మళ్లీ రాజీవ్‌తో కలిసి పిచ్చి పిచ్చి పనులు చేస్తే పుచ్చ లేచిపోద్ది. జాగ్రత్త అని మాస్ వార్నింగ్ ఇస్తాడు మను. మను మాటలకు షాక్ అయిన శైలేంద్ర అలాగే చూస్తూ ఉండిపోతాడు. అనంతరం కాలేజీకి వచ్చిన మనుకు వసుధార థ్యాంక్స్ చెబుతుంది. కొందరి మాట కాదనలేక వచ్చానని మను అంటే.. అమ్మ మాట ఎవరు కాదనరు లేండి అని వసుధార అంటుంది.

మాటిచ్చిన మను

మీరు అనుపమ మేడమ్ చెబితేనే వస్తారు అని ఆమెతో చెప్పించానని వసుధార అంటుంది. మీరు ఏదైనా పట్టుపడితే సాధించేవరకు వదలరు కదా అని మను పొగుడుతాడు. కానీ, అన్ని అనుకున్నట్లు చేసిన రిషి సార్ జాడ మాత్రం కనిపెట్టలేకపోతున్నాను అని వసుధార బాధపడిపోతుంది. రిషిని వెతకడంలో తాను సాయం చేస్తానని వసుధారకు మాట ఇస్తాడు మను.

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి ఏప్రిల్ 1వ తేది ఎపిసోడ్ ప్రోమోలో ఆదర్శ్ మందు తాగేందుకు హాల్లోకి వస్తే వద్దని, పైన గదిలో కూర్చుని తాగమని మధు చెబుతాడు. కానీ, ఆదర్శ్ మాత్రం వినడు. నువ్వు ఎవడ్రా నాకు చెప్పేది. పచ్చి తాగుబోతువి ఎక్కడ తాగాలో నాకు తెలుసు అని అంటాడు. పెద్ద పిన్ని ఇంట్లో ఉంది. చూస్తే బాధపడుతుంది అని మధు చేయి పట్టుకుని తీసుకెళ్తే.. ఆదర్శ్ మాత్రం కోపంతో అరుస్తాడు.

నా పేరు మీద రాసివ్వండి

ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. అయినా గొడువ జరుగుతుంటుంది. ఇంతలో భవానీ వస్తుంది. ఆదర్శ్ ఏంటీ గొడవ అని అడుగుతుంది. నేను నీ కొడుకుని కాదు కదా. వీళ్లందరికీ నేను లోకువ అయిపోయాను. నన్ను పరాయి వాళ్లలా చూస్తున్నారు అమ్మా అని ఆదర్శ్ అంటాడు. ఇంకా ఏం చేస్తే సొంతవాళ్లలా ఫీల్ అవుతావ్ అని భవానీ కోపంగా అడుగుతుంది. ఈ ఇల్లు, ఆస్తి నా పేరు మీద రాసి ఇవ్వండి. అప్పుడు నేను డిసైడ్ చేస్తాను. ఇంట్లో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో అని ఆదర్శ్ అంటాడు.

ఆదర్శ్ మాటలు ఇన్‌డైరెక్ట్‌గా కృష్ణను అన్నట్లుగా ఉంటాయి. ఆ మాటలు విని కృష్ణ షాక్ అవుతుంది. అలాగే బాధపడుతుంది. కృష్ణతోపాటు మురారి, భవానీ కూడా ఆదర్శ్ మాటలకు షాక్ అవుతారు. అయితే తర్వాత ఆదర్శ్‌కు చివాట్లు పెట్టి భవానీ పంపించేస్తుందని తెలుస్తోంది.

మనసు మార్చేయాలి

అనంతరం పైన మేడమీద మీరా పేరు చెప్పుకుంటున్న ముకుంద ఆదర్శ్‌కు మందు పోస్తుంది. మీరా మందు పోయడం పూర్తి కాకముందే ఆదర్శ్ ఆ గ్లాస్ తీసుకుని తాగేస్తాడు. దాంతో సార్ నిదానంగా తాగండి సార్. మీ ఇల్లే కదా అని మీరా అంటుంది. అలా అని అనుకోవడమే. ఏది నాది కాదు. ఎవరికీ నేను అక్కర్లేదు అని ఆదర్శ్ అంటాడు. దాంతో తొందరగా ఆదర్శ్ మనసు మార్చేయాలి. నేను ఈ ఇంట్లో మనిషినే అని అనుకునేలా చేయాలి అని మీరా మనసులో అనుకుంటుంది.

WhatsApp channel