Guppedantha Manasu March 25th Episode: గుప్పెడంత మనసు- రాజీవ్ శైలేంద్రను గన్‌తో బెదిరించిన మను- అనుపమతో దేవయాని గేమ్-guppedantha manasu serial march 25th episode manu warning to shailendra rajeev guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu March 25th Episode: గుప్పెడంత మనసు- రాజీవ్ శైలేంద్రను గన్‌తో బెదిరించిన మను- అనుపమతో దేవయాని గేమ్

Guppedantha Manasu March 25th Episode: గుప్పెడంత మనసు- రాజీవ్ శైలేంద్రను గన్‌తో బెదిరించిన మను- అనుపమతో దేవయాని గేమ్

Sanjiv Kumar HT Telugu
Mar 25, 2024 09:05 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 25వ తేది ఎపిసోడ్‌లో రాజీవ్, శైలేంద్ర దగ్గరకు వెళ్లిన మను వారిని గన్‌తో బెదిరిస్తాడు. తన తల్లిపై అటాక్ చేసింది మీరేనని కన్ఫర్మ్ అయితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 25వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 25వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1033: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మను నీ కొడుకు అని తెలిసింది. మరి ఇన్నాళ్లు మనను దూరంగా పెట్టావంటే మీ మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండాలి. అందుకు గల కారణం ఏంటీ అని అనుపమను మహేంద్ర అడుగుతాడు. ఇప్పుడు నేను ఏం చెప్పలేను అని అనుపమ బదులిస్తుంది. అలా అంటావేంటీ.. మను నీ కొడుకు అయితే.. మరి మను తండ్రి ఎవరు అని మహేంద్ర అడుగుతాడు. దాంతో అనుపమ షాక్ అవుతుంది.

ఇబ్బంది పడుతున్నట్లుంది

అతడు ఏం చేస్తుంటాడు అని మహేంద్ర అంటాడు. మహేంద్ర ప్లీజ్ వదిలేయ్ అని అనుపమ అంటే.. లేదు అనుపమ. నేను వదిలేయను. నీ గతం ఏంటో తెలియాల్సిందే. జగతి కడుపుతో ఉన్నంతవరకు తెలుసు. ఆ తర్వాత నీ జీవితంలో ఏం జరిగిందో తెలియాల్సిందే. ఎందుకు చెప్పవు. నాకు తెలియాల్సిందే అని మహేంద్ర గట్టిగా అడుగుతాడు. ఇంతలో ఏంజెల్ వచ్చి.. ఏంటీ సార్ మా అత్తయ్యను ఏదో అడుగుతున్నారు. తను చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఉంది అని అంటుంది.

ఇబ్బంది కాదు. నిజమే అడుగుతున్నాను. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలియాలి కదా అని మహేంద్ర అంటాడు. అసలు నాకు అత్త అని ఒకరు ఉన్నారని, మా నాన్నకు చెల్లెలు ఉందని పాతికేళ్లకు తెలిసింది. ఇప్పుడు ఆమెకు కొడుకు ఉన్నాడని మీ ద్వారా తెలిసింది. మా అత్తయ్య ఓ చట్రంలో బతుకుతుంది. చాలా ప్రైవేసీగా ఉంటుంది. తను ఇన్నాళ్లు ఎవరికీ ఏం తెలియకుండా ఉందంటే ఆ గతం చాలా బాధపడేది అయి ఉంటుంది అని ఏంజెల్ అంటుంది.

మారుస్తాడేమో చూడాలి

తనలో తానే బాధపడితే ఏం లాభం. మనకు చెబితే మనం ఏదైనా పరిష్కారం ఆలోచిస్తాం కదా అని మహేంద్ర అంటాడు. నాకు ఏ బాధలేదు అని అనుపమ అంటుంది. అయినా మహేంద్ర తన గురించి అడుగుతుంటే.. ఏంజెల్ కలుగజేసుకుని వదిలేయండి సార్. మా అత్తయ్య చాలా ఇబ్బంది పడుతుంది. మీరే అన్నారు కదా తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటివరకు ఎదురుచూద్దాం. అప్పుడైనా దేవుడు మా అత్తయ్యను మారుస్తాడేమో అని ఏంజెల్ అంటుంది.

మహేంద్ర వెళ్లిపోతుంటే.. ఆగమని చెప్పిన అనుపమ.. ఈ ప్రశ్నలు తనను అడిగినట్లు మనను అడగకు అని చెబుతుంది. మరోవైపు మను గారు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని అనుకుంటుంది వసుధార. ఇంతలో సాలరీలకు సంబంధించిన ఫైల్ తీసుకొస్తాడు ఒకతను. దానిపై వసుధార సైన్ తీసుకుంటాడు. దీనిపై మను గారి సంతకం కావాలని అతను చెప్పడంతో సరే నేను చూసుకుంటానులే అని వసుధార అంటుంది.

సంతకాలు చేయాల్సినవి

మనుకు కాల్ చేసి వసుధార మాట్లాడుతుంది. కాలేజీకి రమ్మని అడుగుతుంది. ఎలా వస్తాను మేడమ్. అనుపమ మేడమ్ రావొద్దని చెప్పారు కదా అని మను అంటాడు. అప్పుడు ఏదో ఆమె ఆవేశంలో అన్నారు అని వసుధార అంటే.. ఆ మాట అనుపమ మేడమ్ చెబితే బాగుంటుంది అని మను అంటాడు. కానీ, మీ అవసరం కాలేజీకి చాలా ఉంది. మీరు సంతకాలు చేయాల్సిన పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయని వసుధార అంటుంది. మీరు తల్చుకుంటే నా సంతకం ఎంత మేడమ్ అని మను అంటాడు.

నేను అలా ఒకరిని పదవి నుంచి తీసేయాలని అనుకోను. అయినా మీతో ఓసారి మాట్లాడాలి. విషయం చెబితే గానీ రారా అని వసుధార అంటే.. ఇదివరకు కూడా మాట్లాడాలని పిలిచి వచ్చాకా మాట్లాడేది ఏం లేదని అన్నారు అని మను అంటాడు. అప్పుడు మీపై ఉన్న అభిప్రాయం వేరు. ఇప్పుడు వేరు. అయినా మీ అమ్మగారికి మెడిసిన్ తీసుకురావాలి. ఏం ఆలోచించకుండా సాయంత్రం రండి అని కాల్ కట్ చేస్తుంది. మరోవైపు రాజీవ్ శైలేంద్ర అనుపమ గురించి మాట్లాడుకుంటారు.

కామెడీ చేయకు భయ్యా

డిశ్చార్చ్ చేశారని శైలేంద్ర అంటాడు. అంటే మను గాడి మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా అని రాజీవ్ అంటాడు. అబ్బా గట్టిగానే ఆలోచిస్తున్నావ్. ఏం ప్లాన్ చేస్తున్నావ్ అని శైలేంద్ర అంటుండంగా.. ఓ కారు శైలేంద్ర మీదకు వస్తుంది. దాంతో షాక్ అయిన శైలేంద్ర.. ఏంటీ నా మీద ఏమైనా ప్లాన్ చేశావా అని శైలేంద్ర అంటాడు. కామెడీ చేయకు భయ్యా అని రాజీవ్ అంటాడు. ఇంతలో కారులో నుంచి దిగిన మను శైలేంద్రకు గన్ గురి పెడతాడు.

మీ ఇద్దరిలో మా అమ్మపై అటాక్ చేసింది ఎవరని అడుగుతాడు మను. మీ అమ్మ ఎవరు భయ్యా అని వెటకారంగా అంటాడు రాజీవ్. నాటకాలు ఆడకండి అని మను అన్నా.. అసలు ఎవరు భయ్యా మీ అమ్మ అని రాజీవ్ మళ్లీ అంటాడు. అనుపమ మను వాళ్ల అమ్మ అని శైలేంద్ర అంటాడు. దాంతో నాకు ఎందుకు చెప్పలేదు భయ్యా అని రాజీవ్ డ్రామాలు ఆడతాడు. ఇప్పుడు ఎలా ఉంది. భయ్యా. బాగుందా. డిశ్చార్జ్ చేశారా. దేవుడు దయ వల్ల డిశ్చార్జ్ చేసే ఉంటారు అని రాజీవ్ అంటాడు.

టార్గెట్ మిస్ అవ్వదు

డిశ్చార్జ్ అయ్యారు కాబట్టే మీరు ప్రాణాలతో ఉన్నారు. తనపై అటాక్ చేయాల్సిన అవసరం మీకు తప్పా ఇంకెవరికీ లేదు. నాపై అటాక్ ప్లాన్ చేస్తే.. మధ్యలో మా అమ్మ అడ్డు వచ్చింది అని మను అంటాడు. చూడు భయ్యా.. నాకు శత్రుత్వం నీపై. ఏమైనా చేయాలనుకుంటే నీపై చేస్తాను కానీ. దాగుడుమూతలు ఆడను. నేను అటాక్ చేయాలనుకుంటే నువ్ ఇలా మాట్లాడవు. నా టార్గెట్ మిస్ అవ్వొదు అని రాజీవ్ అంటాడు. గుడ్.. ఇదే దమ్ముతో ఉండు. మీరు మగాళ్లు అయితే నాపై మాత్రమే ప్లాన్స్ చేసుకోండి అని మను అంటాడు.

తర్వాత కాలేజీలో అనుపమకు గాయం చేసినవాన్ని ఏం చేశాడో చెప్పిన మను ఇప్పుడు కత్తితో గాయం చేసినందుకు చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇన్వేస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. ఇకనుంచి నా ఫోకస్ మీ ఇద్దరిపైనే అని మను అంటే.. వీ డోంట్ కేర్ భయ్యా, ఆల్వేస్ వెల్ కమ్ భయ్యా అని రాజీవ్, శైలేంద్ర ఒకేసారి అంటారు. ఇది మీపై డౌట్ వచ్చినందుకే. మీరే చేశారని కన్ఫర్మ్ అయితే ఆరోజే మీ డేట్ ఆఫ్ డెత్ అని ఫిక్స్ అయిపోయిండని చెప్పి వెళ్లిపోతాడు మను.

మంచివాళ్ల లిస్టులో

వాడికి డౌట్ వచ్చింది భయ్యా. అందుకే గాయపడిన సింహంలా రెచ్చిపోతున్నాడు. నిజం తెలిస్తే మన శాల్తీలు గల్లంతు చేస్తా అంటున్నాడు అని రాజీవ్ అంటాడు. అప్పటిదాకా వాడికి అంత ఛాన్స్ ఇస్తామా. వాడు వార్నింగ్ ఇస్తే.. నేను ఫినిష్ చేస్తాను అని శైలేంద్ర అంటాడు. హుమ్.. అలాగే భయ్యా అని రాజీవ్ అంటాడు. మరోవైపు అనుపమ కోసం దేవయాని వెళ్తుంది. నీకు ఇలా జరగడం ఏంటీ. నాకు ఈ విషయం తెలిసి కంగారు పడ్డాను. భోజనం కూడా సరిగా చేయలేదు. సరిగా తినలేదు అని డ్రామా చేస్తుంది దేవయాని.

హాస్పిటల్‌లో స్పృహ లేకుండా ఉన్నావని తెలిసి రాలేదు అని దేవయాని అంటుంది. ఇక్కడైనా వచ్చారు సంతోషం అని ఏంజెల్ పంచ్ వేస్తుంది. ఏ ముదనష్టపోడు ఇలా చేశాడో అని అన్న దేవయాని.. మర్చిపోయానే.. నా కొడుకు ప్లానే కదా అని మనసులో అనుకుంటుంది దేవయాని. ఏమో మనలాంటి మంచివాళ్లకే ఇలా జరుగుతుంటాయ్ అని దేవయాని అంటే.. మీరు కూడా మంచివాళ్ల లిస్టులో జాయిన్ అయ్యారా అని ఏంజెల్ అంటుంది.

నీ భర్త ఎవరు

తర్వాత అనుపమను ఆడుకుందామనుకుంటే ఈ ఎంజెల్ అడ్డుగా ఉందే అనుకున్న దేవయాని కాఫీ కావాలని పంపించేస్తుంది. తర్వాత మను నీ కొడుకు అంట కదా. మరి నీ భర్త ఎవరు అని దేవయాని అనుపమను అడుగుతుంది. దాంతో అనుపమ సైలెంట్‌గా ఉంటే.. కొంపదీసి.. మను కుంతీ పుత్రుడా ఏంటీ అని దేవయాని అంటుంది.