Guppedantha Manasu: మను తండ్రి ఎవరో చెప్పనున్న అనుపమ? భవానీతో ఇంట్లో మళ్లీ అడుగు పెట్టిన ముకుంద-guppedantha manasu krishna mukunda murari serial march 25th episode promo mukunda entry with bhawani into home ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu: మను తండ్రి ఎవరో చెప్పనున్న అనుపమ? భవానీతో ఇంట్లో మళ్లీ అడుగు పెట్టిన ముకుంద

Guppedantha Manasu: మను తండ్రి ఎవరో చెప్పనున్న అనుపమ? భవానీతో ఇంట్లో మళ్లీ అడుగు పెట్టిన ముకుంద

Sanjiv Kumar HT Telugu
Mar 24, 2024 07:04 AM IST

Guppedantha Manasu Serial: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ మార్చి 25వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..

గుప్పెడంత మనసు కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ మార్చి 25 ఎపిసోడ్ ప్రోమో
గుప్పెడంత మనసు కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ మార్చి 25 ఎపిసోడ్ ప్రోమో

Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో అనుపమ డిశ్చార్జ్ అవుతుంది. ఏంజెల్ తన ఇంటికి తీసుకెళ్తానని ఎంత పట్టుబట్టిన ఆఖరుకు మహేంద్ర తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. మను గురించి, తన భర్త గురించి మహేంద్ర అడిగితే ఇప్పుడు ఏం మాట్లాడలేనని చెబుతుంది అనుపమ. మరోవైపు రాజీవ్‌ను శైలేంద్ర కలుస్తాడు. మనును చంపేందుకు ప్లాన్ వేస్తే దాని నుంచి వాడు తప్పించుకున్నాడు. అనుపమ ప్రాణాలతో బయట పడింది అని శైలేంద్ర చెబుతాడు.

మనం దొరికిపోతాం

అనుపమ నోరు తెరిస్తే నా పనైపోతుంది. ఇంతకుముందు రిషిపై ఎటాక్ చేసిన రౌడీనే మనును చంపేందుకు పెట్టాను. వాడిని అనుపమ గుర్తు పట్టింది. ఈ ఎటాక్‌పై ఎంక్వైరీ చేయిస్తే మనం దొరికిపోతాం. జాగ్రత్తగా ఉండు అని శైలేంద్ర భయంతో అంటాడు. దాంతో మనం కాదు నువ్వు అని శైలేంద్రపై సెటైర్ వేస్తూ రివర్స్ అవుతాడు రాజీవ్. నేను దొరికితే నువ్వు దొరికినట్లే కదా అని శైలేంద్ర అంటాడు. ఎంక్వైరీలు జరిగిన మనును దెబబ్బకొట్టేందుకు తన కుట్రలు ఆపనని శైలేంద్రతో రాజీవ్ అంటాడు.

ఇలా ఫోన్ చేసి బెదిరించడాలు, పోస్టర్స్ వేయడాలు ఉండవు. ఇక నుంచి డైరెక్ట్ ఎటాక్‌లే చేస్తానని చెప్పిన రాజీవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజీవ్ మాటలతో శైలేంద్ర భయం మరింత పెరుగుతుంది. ఏ మాత్రం తేడా కొట్టన రాజీవ్‌తోపాటు తను దొరికిపోతానని టెన్షన్ పడుతుంటాడు శైలేంద్ర. మరోవైపు పోస్టర్స్ విషయంలో మనను అపార్థం చేసుకున్నందుకు వసు బాధపడుతుంటుంది. మనుకు సారీ చెప్పేందుకు తన క్యాబిన్‌కు వస్తుంది. కానీ, క్యాబిన్ లాక్ చేసి ఉంటుంది.

వాళ్లను బాధపెడుతుంది

మనుకు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తుంది. మరోవైపు అనుపమ దగ్గరికి వెళ్తాడు మహేంద్ర. మను నీ కొడుకు అనే విషయం మా దగ్గర ఎందుకు దాచావని అనుపమని అడుగుతాడు మహేంద్ర. నీ జీవితానికి సంబంధించిన రహస్యాలను మా దగ్గర దాచిపెట్టి మమ్మల్ని పరాయివాళ్లను చేస్తున్నావ్ అని మహేంద్ర అంటే.. మను విషయంలో నేను దాచిన రహస్యం నా అనుకున్న వాళ్లను బాధపెడుతుంది. నాకు తెలిసిన వాళ్లను ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎవరికీ చెప్పలేదు అని అనుపమ అంటుంది. అనంతరం మను తండ్రి ఎవరు అని మహేంద్ర అడగడంతో అనుపమ షాక్ అవుతుంది. మరి తండ్రి ఎవరో చెబుతుందా లేదా అనేది చూడాలి.

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి మార్చి 25వ తేది ఎపిసోడ్ ప్రోమోలో జైలులో ఉన్న మురారి దగ్గరికి ముకుంద వెళ్తుంది. మురారి దెబ్బలు చూసి ముకుంద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమగా చెంప తడుతుంది. మురారి ఈ దెబ్బలు ఏంటీ.. కొట్టారా నిన్ను నాదే తప్పు. నన్ను క్షమించు. కృష్ణను అరెస్ట్ చేయమంటే.. నన్ను నిన్ను అరెస్ట్ చేశారు. తప్పంతా నాదే అంటూ తన చెంపలు తానే వాయించుకుంటుంది ముకుంద.

వెనుకడుగు వేసేది లేదు

అనంతరం మొహం మారిన తర్వాత మళ్లీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ముకుంద. ఈ సారి భవానీతో కలిసి ఇంట్లోకి వస్తుంది ముకుంద. ముకుంద వస్తుంటే ఎవరా అని అంతా చూస్తుంటారు. వారిలో మురారి కూడా ఉంటాడు. ముకుంద తన కాలు ఇంట్లో పెడుతుంది. ఒకసారి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి వెనక్కి వెళ్లిపోయా. కానీ, ఈసారి మాత్రం వెనుకడుగు వేసేది లేదు అని మకుంద అనుకుంటుంది. మరి తనే ముకుంద అని మురారి ఇంట్లో వాళ్లకు చెబుతాడా అనేది చూడాలి.