Guppedantha Manasu March 14th Episode: ఎండీ సీట్‌పై వసు కఠిన నిర్ణయం - శైలేంద్రకు షాక్ - రాజీవ్‌తో మను వార్
Guppedantha Manasu March 14th Episode: తన కంఠంలో ప్రాణం ఉండగా ఎండీ సీట్‌ను వదిలిపెట్టనని ప్రామిస్ చేస్తుంది వసుధార. ఆమె మాటలతో దేవయాని, శైలేంద్ర షాకవుతారు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu March 14th Episode: వసుధార బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాడు మను. రిషి లేని లోటు వసుధారకు రాకుండా చేసేందుకు ఆ వేడుకకు వచ్చిన అందరి చేత రిషి మాస్క్‌లు తొడగిస్తాడు మను. స్క్రీన్‌పై రిషి పెద్ద ఫొటో కనిపించేలా చేసి వసుధార చేత కేక్ కట్ చేయిస్తాడు. అవన్నీ చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి మాస్క్‌లు పెట్టుకొని మీరు విషెస్ చెబుతుంటే రిషి నే వచ్చి తనకు స్వయంగా శుభాకాంక్షలు అందజేసినట్లు ఉందని అంటుంది.
ఎండీ సీట్ ఎప్పటికీ నాదే...
ఎండీ పదవి చేపట్టిన తర్వాత చాలా కష్టాలు ఎదురయ్యాయని వసుధార అంటుంది. మానసికంగా చాలా కృంగిపోయానని, ఆ కష్టాలు తట్టుకోలేక ఎండీ పదవితో పాటు కాలేజీ వదిలిపెట్టాలని చాలా సార్లు అనుకుంటున్నట్లు వసుధార చెబుతుంది. కానీ మీ అందరి ప్రేమ, అభిమానులు చూసిన తర్వాత నా కంఠంలో ప్రాణం ఉండగా కాలేజీ వదిలిపెట్టనని ప్రామిస్ చేస్తుంది.
ఎన్ని కష్టాలు ఎదురైన, ఎంత మంది ఎన్ని కుట్రలు చేసిన ఎండీ పదవిని వదలనని చెప్పి శైలేంద్రకు పంచ్ ఇస్తుంది. వసుధార మాటలతో శైలేంద్ర, దేవయాని కోపం పట్టలేకపోతారు. మనుకు స్పెషల్‌గా థాంక్స్ చెబుతుంది వసుధార. నీ వల్లే వసుధార ఇంత సంతోషంగా ఉందని మనుపై ప్రశంసలు కురిపిస్తాడు మహేంద్ర.
దేవయాని కోపం...
తమ కళ్ల ముందే వసుధార బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినా ఏం చేయలేకపోవడంతో దేవయాని తట్టుకోలేకపోతుంది. రిషి అండ లేకపోయినా వసుధారను ఏం చేయలేకపోవడం, ఎండీ సీట్ నుంచి ఆమెను దించలేకపోతుండటంతో శైలేంద్ర కూడా కోపం పట్టలేకపోతాడు ఎండీ సీట్ నుంచి వసుధారను దించడానికి తాను వేసిన ప్లాన్‌ను తిప్పి కొట్టి తనను ఫూల్ చేశాడని మనుపై కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర.
వసుధార ఆనందం చూసిన తర్వాత నిద్ర కూడా పట్టడం అనుమానమేనని దేవయాని అంటుంది. వాళ్లిద్దరిని ఏదో ఒకటి చేయాలని ఇద్దరు అనుకుంటున్నారు. మిగిలిన కేక్ తినడం తప్ప ఏం చేయలేరని దేవయాని, శైలేంద్రలను ఎగతాళి చేస్తుంది ధరణి. వద్దని చెప్పినా వినకుండా దేవయాని, శైలేంద్రలకు బలవంతంగా వసుధార బర్త్ డే కేక్ తినిపిస్తుంది. కేక్ తినడం అయిపోగానే బెల్ట్ రెడీ చేస్తానని శైలేంద్రపై సెటైర్ వేస్తుంది ధరణి. ఆమె మాటలతో శైలేంద్ర కోసం మరింత పెరుగుతుంది. కానీ ఏం చేయలేక సైలెంట్‌గా ఉండిపోతాడు.
ఏంజెల్ ప్రశ్నలు..
నీ బర్త్‌డే ఎప్పుడు అని మనును అడుగుతుంది ఏంజెల్. మీరు వసుధార బర్త్‌డేను సెలబ్రేట్ చేసినట్లు మేము నీ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తామని మనుతో అంటుంది. కానీ తన బర్త్ డే డేట్ చెప్పకుండా సైలెంట్‌గా మను ఉండిపోతాడు. మనుకు చెప్పడం ఇష్టం లేదని అనిపిస్తుందని అనుపమ అంటుంది.
మనుకు చెప్పడం ఇష్టం లేకపోతే మీరు చెప్పండని అనుపమను అడుగుతుంది ఏంజెల్. నాకేం తెలుసు అని అనుపమ తడబడుతుంది. ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టకూడదని తెలియదా అంటూ ఏంజెల్‌పై ఫైర్ అవుతుంది. మనుతో మాట్లాడిన ప్రతిసారి అనుపమ సీరియస్ ఎందుకు అవుతుందో ఏంజెల్‌కు అంతుపట్టదు. అదే విషయమై అనుపమను నిలదీస్తుంది.
ఏంజెల్ తప్ప ఎవరూ లేరు...
నీకు ఏంజెల్ తప్ప ఎవరూ లేరు కదా...నీ ప్రేమ, కోపం అన్ని ఏంజెల్‌కు మాత్రమే సొంతం అని మహేంద్ర అంటాడు. నీకు తను తప్ప ఎవరూ లేరని చెబితేనే ఏంజెల్ కోపం పోతుందని అనుపమతో చెబుతాడు మహేంద్ర. అతడి మాటలతో మను షాకవుతాడు. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. అతడిని ఏంజెల్ ఆపి మీ బర్త్‌డే ఎప్పుడో చెప్పలేదు అని అడుగుతుంది. అది గుర్తుంచుకోవాల్సిన రోజు కాదు. అందుకే మర్చిపోయానని కోపంగా బదులిస్తాడు. తాను కనుక్కుంటానని మహేంద్ర అంటాడు.
వసుధార ఆనందం...
రిషి ఫొటో చూస్తూ ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని వసుధార అంటుంది. మీరు పక్కన లేరనే లోటు మాత్రం కనిపించిందని అంటుంది. వసుధార ఈ స్థాయికి చేరుకోవడానికి మీరే కారణం , మీ కోసం ఈ ప్రాణం ఎదురుచూస్తుందని రిషి ఫొటో చూస్తూ వసుధార అంటుంది. మను వల్ల మీరు తిరిగివస్తారనే నమ్మకం బలపడుతుందని, మనం ఒక్కటయ్యే రోజు తొందరలోనే ఉందని అంటుంది. తండ్రికి ఫోన్ చేసి తన బర్త్‌డేను మను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడని ఆనందపడుతుంది వసుధార.
రాజీవ్ అడ్డు...
మను కారులో వెళుతోండగా అతడిని అడ్డగిస్తాడు రాజీవ్. కారుకు బైక్ అడ్డుపెడతాడు. ఈ రోజు వసుధారకు కేక్ తినిపించాలని అనుకున్నా. కానీ కరెక్ట్‌గా కేక్ తినిపించే టైమ్‌లో నేలపాలు చేశావని మనుపై కోపంతో రగిలిపోతాడు రాజీవ్. వసుధార నా మరదలు...వసు నాది అని కోపంతో అంటాడు. రాజీవ్ కూడా రిషి మాస్క్ వేసుకొని బర్త్‌డే వేడుకకు వచ్చాడని మను అర్థం చేసుకుంటాడు. ఒక అమ్మాయి మనసు గెలుచుకొని దక్కించుకోవాలి.
అంతే కానీ వెంటపడి ఇబ్బంది పెట్టేవాళ్లను ఏమంటారో తెలుసా...కుక్క అని అంటారు రాజీవ్‌ను అవమానిస్తాడు. వసుధారను తెగ పొగిడేస్తున్నావు...ఈరోజు వసు బర్త్‌డేను ఎవరు చేయమన్నారు. మనును నిలదీస్తాడు రాజీవ్. నీలాంటి మృగాలు వసు వెంటపడకూడదనే ఆమెకు రక్షణగా ఉంటున్నానని మను బదులిస్తాడు. అతడి మాటలతో కోపం పట్టలేకపోయినా రాజీవ్ ఏం చేస్తావని కోపంగా మను కాలర్ పట్టుకుంటాడు. మను కూడా ఆవేశంగా రాజీవ్‌ను కొట్టడానికి పిడికిలి బిగిస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.