Brahmamudi: కంపెనీపై కల్యాణ్‌కు ఫుల్ పవర్ ఇచ్చిన రాజ్.. షాక్‌లో మను.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మురారి కృష్ణ-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial latest episode promo raj gives full power to kalyan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: కంపెనీపై కల్యాణ్‌కు ఫుల్ పవర్ ఇచ్చిన రాజ్.. షాక్‌లో మను.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మురారి కృష్ణ

Brahmamudi: కంపెనీపై కల్యాణ్‌కు ఫుల్ పవర్ ఇచ్చిన రాజ్.. షాక్‌లో మను.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మురారి కృష్ణ

Sanjiv Kumar HT Telugu
Apr 07, 2024 05:45 AM IST

Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరిగనుందనేది ప్రోమోల్లో చూస్తే..

కంపెనీపై కల్యాణ్‌కు ఫుల్ పవర్ ఇచ్చిన రాజ్.. షాక్‌లో మను.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మురారి కృష్ణ
కంపెనీపై కల్యాణ్‌కు ఫుల్ పవర్ ఇచ్చిన రాజ్.. షాక్‌లో మను.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మురారి కృష్ణ

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్‌కు పుట్టుమచ్చ లేకపోవడంతో కావ్య షాక్ అవుతుంది. కానీ కావ్య పుట్టుమచ్చ చూడటంపై రాజ్‌కు అనుమానం వచ్చి.. పుట్టుమచ్చ లేకుంటే నా కొడుకు కాకుండా పోడు అని అంటాడు. ఎక్కడ బయటపడలేదు కదా. ఈయన ఎలా కనిపెట్టారబ్బా అని కావ్య అనుకుంటుంది. అనంతరం కల్యాణ్ విషయం రాజ్ పెద్ద నిర్ణయం తీసుకుంటాడు.

పైనున్న బిడ్డే కారణం

నా ప్లేసులో కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నాడు కదా. అందుకే వాడి పేరున పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇవ్వాలనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. దాంతో కల్యాణ్ చాలా షాక్ అవుతాడు. అనామిక, ధాన్యలక్ష్మీ మాత్రం సంబరపడిపోతారు. లీగల్‌గా చెక్ పవర్ ఇష్యూ చేయబోతున్నాను అని రాజ్ అంటాడు. దాంతో ఇందిరాదేవి ఆలోచనలో పడితే.. అపర్ణ కంగారుపడుతుంది. ఈ సంక్షోభం అంతటికి కారణం.. ఆ పైన ఉన్న బిడ్డ అని అపర్ణ అంటుంది.

వాడి కోసం ఈ తల్లి ప్రేమను దూరం చేసుకున్నావ్. భార్య నమ్మకాన్ని దూరం చేసుకున్నావ్. ఈ ఇంటి సభ్యుల దృష్టిలో దోషిగా మిగిలిపోయావ్. కాబట్టి, ఇప్పటికైనా నిజం బయటపెట్టు. లేదంటే వాన్ని వదిలిపెట్టు అని అపర్ణ అంటుంది. కానీ, రాజ్ మాత్రం బిడ్డను వదిలేసే ఆలోచనే లేదని చెబుతాడని తెలుస్తోంది. బిడ్డ కోసం అన్ని వదులుకుని, కల్యాణ్‌కు పవర్ ఇష్యూ చేసేందుకు సిద్ధపడిన రాజ్ అపర్ణ మాటను లెక్కచేయడు అని తెలుస్తోంది.

ఈ ఇంటికి వారసుడివి

Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో సర్‌ప్రైజ్ అని చెప్పి మనును కారులో తీసుకెళ్తుంది వసుధార. ఎక్కడికి అని మను అంటే.. అలా చెబితే సర్‌ప్రైజ్ ఉండదు కదా అంటుంది. కట్ చేస్తే విశ్వనాథం ఇంటికి మనును తీసుకెళ్తుంది వసుధార. ఇది ఎవరిల్లు అని మను ఆలోచిస్తుంటాడు. ఇంతలో విశ్వనాథం వచ్చి మనును ప్రేమగా హగ్ చేసుకుంటాడు. నువ్ అనుపమ కొడుకువా అని ఎమోషనల్ అవుతాడు.

నువ్ అనుపమ కొడుకువి అంటే నా మనవడివి. ఈ ఇంటికి నాకు వారసుడివి నాన్నా నువ్వు అని విశ్వనాథం అంటాడు. దాంతో మను షాకింగ్‌గా చూస్తాడు. తనకు ముందే ఏం చెప్పలేదని వసుధారవైపు చూస్తాడు మను. ఇక విశ్వనాథం, మనును చూసి ఏంజెల్ సంతోషిస్తుంది.

మా ఇంటికి

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో భవానీ ఇంటి నుంచి లగేజ్‌తో మురారి, కృష్ణ బయటకు వెళ్తుంటారు. అది చూసిన రేవతి.. రేయ్.. లగేజ్‌తో సహా ఎక్కడికి బయలుదేరారురా అని అడుగుతుంది. ఇంటికి వెళ్తున్నాం అని మురారి బదులిస్తాడు. ఏ ఇంటికి వెళ్తున్నారు అని రేవతి మళ్లీ అడుగుతుంది. మా ఇంటికి అని చాలా గట్టిగా, కోపంగా చెబుతాడు మురారి.

దాంతో అంతా షాక్ అవుతారు. మురారి కోసమే ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే.. వెళ్లిపోతానని అంటాడేంటీ అని మనసులో కంగారుపడుతుంది మీరా. అమ్మ.. నువ్ కూడా మాతో వచ్చేస్తే మంచిది అని రేవతితో అంటాడు మురారి. ఆదర్శ్ బాధకు కారణం మేమే అని గట్టి నమ్మకంతో ఉన్నాడు అత్తయ్య. మనం దూరం అయి ఆ బాధను దూరం చేసేద్దాం అని కృష్ణ అంటుంది. అనంతరం మురారి, కృష్ణ వెళ్తుంటారు. ఇంట్లో వాళ్లంతా ఆపుతారు.

మురారి-కృష్ణ బయటకు

కానీ, మురారి, కృష్ణ మాత్రం ఆగరు. మీరు వెళ్లొద్దు అని మధు చాలా బతిమిలాడుతాడు. దయచేసి ఆగండి మురారి అని మధు అంటాడు. అయినా మురారి వినిపించుకోడు. ఇంటి నుంచి మురారి, కృష్ణ ఒక్కసారిగా అడుగు బయటకు పెట్టి వెళ్లిపోతుంటారు. హాల్లో ఉన్న ఆదర్శ్ అదంతా చూస్తుంటాడు. కానీ స్పందించడు. ఆదర్శ్ కళ్లముందే మురారి, కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు.

IPL_Entry_Point