Brahmamudi April 11th Episode: బ్రహ్మముడి- అపర్ణపై విరుచుకుపడ్డ ఇందిరాదేవి- పుట్టింటికి కావ్య- అనామిక బ్యూటిఫుల్ స్కెచ్
Brahmamudi Serial April 11th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 11వ తేది ఎపిసోడ్‌లో కావ్యను నానా మాటలు అంటుంది అపర్ణ. దాంతో కోడలిపై విరుచుకుపడుతుంది ఇందిరాదేవి. అనంతరం రాజ్‌తో పుట్టింటికి వెళ్తానని చెబుతుంది కావ్య. అలాగే అనామిక బ్యూటిఫుల్ స్కెచ్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్కూల్ రీ యూనియన్‌కు శ్వేత ఒప్పుకోవడంతో తనకు థ్యాంక్స్ చెబుతుంది కావ్య. ఈ విషయం రాజ్‌కు తెలియద్దు అనుకుంటారు. మరి ఈ విషయం తెలిసిన వెన్నెల రాజ్‌కు చెప్పకుండా ఉంటుందా అని శ్వేత అనుమానం వ్యక్తం చేస్తుంది. అలా జరిగిన మంచిదే. నేను ఇకనుంచి ఆయన ఫోన్ కనిపెడుతూ ఉంటాను. వెన్నెల ఫోన్ చేసినా దొరికిపోతుంది అని కావ్య అంటుంది.
వచ్చేలా చేయాలి
సో.. దీంతో ఎలాగైనా వెన్నెల దొరికుతుందన్నమాట. నేను రాజ్ చెప్పినట్లు విని నిన్ను బాధపెట్టాను. సారీ చెప్పడానికి వచ్చే ధైర్యం చేయలేదు. ఇన్ని రోజులు దాని గురించి చాలా గిల్టీగా ఉండేది అని శ్వేత అంటుంది. తప్పు చేసే ఉద్దేశమే ఉంటే ఇప్పుడు ఇలా హెల్ప్ చేయవు కదా. ఫ్రెండ్‌వి కాబట్టి ఆయన అడిగింది చేశావ్. నువ్ మాత్రం ఈ రీయూనియన్ సంగతి చూడు. మా ఆయన ఉన్న పరిస్థితుల్లో రానంటాడు. కానీ, వచ్చేలా నువ్వే చేయాలి అని కావ్య అంటుంది.
అది నేను చూసుకుంటాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటుంది శ్వేత. మరోవైపు కల్యాణ్‌కు రాజ్ చెక్ పవర్ ఇవ్వడాన్ని తలుచుకుంటూ ఉంటాడు సుభాష్. ఇంతలో వచ్చిన అపర్ణ తనకు ఇంట్లో ఉండాలని లేదని చెబుతుంది. నాకు అలాగే ఉంది. ఇద్దరిదీ ఒకే కారణం కదా అని సుభాష్ అంటాడు. అయినా వాళ్లే మాటలు అంటుంటే చాలా కష్టంగా ఉంది. ఉమ్మడి కుటుంబం కదా అని ఓపికగా ఉంటే అలుసు అయిపోతున్నాం అని అపర్ణ అంటుంది.
నేను చూస్తాను
సానుభూతి, ఓదార్పు చేయాల్సిన అవసరం లేదు. దెప్పి పొడవం, ఎగతాళి చేయకుండా ఉంటే చాలు అని ధాన్యలక్ష్మీ, రుద్రాణిల గురించి అంటుంది అపర్ణ. మన దగ్గర గట్టి సమాధానం లేదు. చెబితే వాడు వినడు. వీళ్లు ఆపితే ఆగరు అని సుభాష్ అంటాడు. నేను మీలా ఇలా తప్పించుకోలేను. వాడు ఇలా ఎన్ని రోజులు ఉంటాడో నేను చూస్తాను. నేనే ఏదో ఒకటి చేస్తాను బయటకు వెళ్లిపోతుంది అపర్ణ. రాజ్ బిడ్డతో వస్తాడు.
నా స్థాయి తగ్గిపోయింది. నా ఆజ్ఞనుల అభ్యర్థనలు కాకముందే నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయమంటావ్ రాజ్ అని అపర్ణ అడుగుతుంది. నువ్ క్షమించలేని వాళ్లను మర్చిపోవాలి. మర్చిపోవాలనుకుంటున్న వాళ్లను క్షమించాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటావ్ అని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య కోసం ఇందిరాదేవి ఎదురుచూస్తుంటుంది. కావ్య రాగానే ఏమైందని అడుగుతుంది. జరిగింది చెబుతుంది కావ్య. ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో తెలియకుండా ఉంది అని ఇందిరాదేవి భయపడుతూ చెబుతుంది.
అరిష్టం ఎలా పోతుంది
ఏమైందని కావ్య అడిగితే.. అపర్ణను చూపిస్తూ.. రుద్రాణి, ధాన్యలక్ష్మీ మాటలకు సమాధానం చెప్పలేక సతమతం అవుతుంది అని ఇందిరాదేవి అంటుంది. సరే నేను అత్తయ్యకు కాఫీ ఇస్తాను అని చెప్పి వెళ్లి ఇస్తుంది కావ్య. తలనొప్పికి కాఫీ ఇస్తే సరిపోతుంది.. మరి ఇంటికి పట్టిన అరిష్టం ఎలా పోతుంది అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. దాంతో రాజ్, ఇందిరాదేవి షాక్ అవుతారు. నువ్ ఇంట్లో అడుగుపెట్టి సంవత్సరం అవుతుంది. అప్పటినుంచే ఈ గొడవలు, మనస్పర్థలు అని అపర్ణ అంటుంది.
ఈ ఇంట్లోకి నష్ట జాతకురాలివి నువ్వు రావడం వల్లే ఉమ్మడిగా ఉన్న కుటుంబం ఇలా అవుతోంది. నువ్ అంటే ఇష్టం లేక నా కొడుకు పక్కదారి పట్టి ఉంటాడు. వాడి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నాడు. నీకు అన్యాయం జరిగింది కదా. ఇంకా ఎందుకు ఈ చూరు పట్టుకుని వేలాడుతున్నావ్. అందరూ అన్నట్లు ఈ ఐశ్వర్యం వదులుకోలేక.. నీ పుట్టింటికి గతిలేక అని అపర్ణ అంటుంది. ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. అపర్ణ అని గట్టిగా పిలుస్తుంది.
నువ్వే పోషించావా
ఏమన్నావ్. నీ కొడలిని ఎంత మాటన్నావ్. నష్ట జాతకురాలా. అరిష్టమా. పుట్టింటికి గతిలేక ఇక్కడ ఉంటుందా. అది అరిష్టం కాదు. అయిష్టం. తను నష్ట జాతకురాలు కాదు. నష్టపోయిన అభాగ్యురాలు. ఐశ్వర్యం అంటే ఏంటీ కారు బంగలానా. అన్నింటికింటే ఐశ్వర్యమైన సౌభాగ్యాన్ని నీ కొడుకు ఇంకొకరికి ఇచ్చి వచ్చాడు. ఏంటీ కావ్య పుట్టింటికి గతిలేదా. తను పుట్టినప్పటినుంచి నువ్వే పోషించావా. ముగ్గురు అమ్మాయిలని కని పోషించిన ఆ కుటుంబాన్ని అంటావా. ముగ్గురు అమ్మలను కన్న ఆ ఇంటిని అనే హక్కు నీకు ఎవరిచ్చారు అని ఇందిరాదేవి అంటుంది.
ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ అహంకారం. ఎక్కడికిపోయింది నీ వివేకం. నీ తోటి కోడలు అనింది అని, అవహేళన చేసింది అని వాళ్లకు సమాధానం చెప్పలేక, నీ కొడుకుని నిలదీయలేక.. ఏమనదులే, ఎదురుతిరగదులే అని కావ్యను ఇన్నిన్ని మాటలు అంటావా. తప్పు ఎక్కడ జరిగిందో, ఎవరు చేశారో నీకు బాగా తెలుసు. నీలో నిజంగా అంతర్మథనం జరిగి ఉంటే ఆ అభాగ్యురాలికి పరిహారం ఏంటో అది చూడు. వెళ్లు ఇక్కడి నుంచి అని మండిపడుతుంది ఇందిరాదేవి. దాంతో అపర్ణ వెళ్లిపోతుంది.
ధాన్యలక్ష్మీ-రుద్రాణి సంతోషం
ఏంటీ అమ్మమ్మ ఈ ఆవేశం అని కావ్య అంటే.. నీ అత్త తాను కూడా కోడలన్న విషయం మర్చిపోయింది. తనకు కూడా ఓ అత్త ఉందని, ఇలా అనకుంటే ముందు ముందు ఇలాంటి చాలా జరుగుతాయి. నువ్ ఏం చేయాలనుకుంటున్నావో చేయి. అందరికి సమాధానం చెప్పు. ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది ఇందిరాదేవి. అపర్ణ అన్న మాటలు తలుచుకుంటూ ఫీల్ అవుతాడు రాజ్. మరోవైపు తమ కొడుకులు ఆఫీస్‌కు వెళ్లారని సంబరపడిపోతారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి.
ఇంతలో క్యారియర్లతో వచ్చిన స్వప్న, అనామిక వాళ్లు చేసింది చెబుతారు. ఆయనకు నేను తెచ్చింది తినడం ఇష్టం లేక వార్నింగ్ ఇచ్చి పంపించారు అని అనామిక అంటే.. నీ కొడుకు అమ్మాయిల అందాలు తినేస్తూ గడుపుతున్నాడు. అందుకే నేనే పెట్టలేదు. మీ కొడుకుల గురించి బాగా సంబరపడిపోతున్నారు కానీ, అక్కడ అంత సీన్ లేదు అని స్వప్న అంటుంది. ఏం కొడుకులను తల్లుల్లారా. వాళ్లను పెళ్లి చేసుకున్నందుకు మా జన్మ ధన్యమైంది అని అనామిక అంటుంది.
వింటూనే ఉన్నాను
నీ కోడలు ఎన్ని మాటలు అందో చూశావా అని రుద్రాణి అంటే.. నీ కోడలు తక్కువ అందా. నీ కొడుకు గట్టి పెట్టినట్లు చెప్పింది. అందులో కాస్తా నీకు తెచ్చి పెట్టింది అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరోవైపు నీకో మాట చెప్పాలి. వింటావా. కానీ అది నీకు నచ్చకపోవచ్చు అని రాజ్ అంటాడు. ఇప్పటివరకు నేను మీ మాట వింటూనే వచ్చాను. ఈ బిడ్డను తీసుకొచ్చి మీ కొడుకు అన్నారు. అది ఎవరికీ నచ్చదు. నాకు నచ్చలేదు. వినలేదా. దీనికి ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పండి అని కావ్య అంటుంది.
నువ్ మీ పుట్టింటికి వెళ్లిపో. మా ఇంట్లో ఉండొద్దు. వెంటనే వెళ్లిపో. నేను మంచి వ్యక్తిని కాదు. మంచి భర్తను కాదు అని రాజ్ అంటే.. అది నేను చెప్పాలి కదా అని కావ్య అంటుంది. నేను చెబుతున్నాను కదా. దానికి సాక్ష్యం నీ ఎదురుగానే ఉంది. నేను మొదటి నుంచి దూరం పెడుతూనే వచ్చాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏముంది. నీ ఓర్పుకు తగినా ఓదార్పు లేదు. సహనాన్ని ఓర్చుకునే సహనం లేదు. నిన్ను మా అమ్మ ఎంతలా అవమానించిందో అంతా విన్నాను అని రాజ్ అంటాడు.
లెక్కలు తేల్చుకోవాలి
మా అమ్మే కాదు. మా అత్త, పిన్ని, అనామిక ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. సర్దుకుపోవడం కూడా అన్నిసార్లు కరెక్ట్ కాదు. చేతకానీతనంగా జమకడతారు. ఎందుకు ఇక్కడ వెళ్లిపో అని రాజ్ అంటాడు. సరే వెళ్లిపోతాను అని కావ్య అంటే.. రాజ్ షాక్ అవుతాడు. ఏంటీ అలా చూస్తున్నారు. ఇంత త్వరగా ఒప్పుకున్నానా. వెళ్తాను. కానీ, ఇలా కాదు. నేను వెళ్లడానికి చాలా కారాణాలు ఉండొచ్చేమే. కానీ, నాకు కొన్ని లెక్కలు తేల్చుకోవాల్సి ఉంది అని కావ్య అంటుంది.
అవన్ని తేలాకే వెళ్తాను. ఒక్కసారి ఈ గడపదాటి వెళ్తే.. మళ్లీ జన్మలో ఈ గడప తొక్కను అని కావ్య అంటుంది. మరోవైపు అనామిక అందంగా తయారవుతూ ఉంటుంది. భార్య తలుచకుంటే ఏమైనా చేస్తుందని నిరూపించాను. ఆయనను ఆఫీస్‌లో అడుగుపెట్టేలా చేశాను. ఇక నా దారిలో పెట్టుకోవాలి. నేను చెప్పినట్లు వినేలా చేసుకోవాలి అని బాగా అందంగా రెడీ అవుతుంటుంది అనామిక. అంటే భర్త కోసం బ్యూటిఫుల్‌గా స్కెచ్ వేస్తుంది. ఇంతలో అనామిక తల్లి ఫోన్ చేసి అక్కడ చాలా దారుణంగా పరిస్థితి తయారైందని చెబుతుంది.
అంతా పాడవుతుంది
సమస్యలు పెరిగిపోతున్నాయని. నువ్ ఇంకెప్పుడు నీ భర్తను ఇక్కడికి తీసుకొస్తావ్ అని అనామిక తల్లి అంటుంది. అంత తప్పు చేసిన రాజ్‌నే ఇంట్లో వాళ్లు బయటకు పంపలేదు. ఎలాంటి తప్పు చేయలేని కల్యాణ్‌ను ఎలా వదులుకుంటారు. ఆయన ఇవాళే ఆఫీస్‌కు వెళ్లారు. మన దారిలోకి తెచ్చుకోవాలి. ఆయనకు డౌట్ వస్తే అంతా పాడవుతుంది అని అనామిక అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో దుగ్గిరాల బంధువు వస్తుంది. రాజ్ ఎక్కడ అని అడిగితే.. అప్పుడే రాజ్ బిడ్డను ఎత్తుకుని కిందకు వస్తాడు. ఏంటీ నీకు మనవడు పుట్టాడా. అమ్మా కావ్య నార్మల్ డెలివరీనా సిజేరియన్ ఆ అని ఆమె అడుగుతుంది. కరెక్ట్ క్వశ్చన్ అడిగావ్ కానీ, రాంగ్ పర్సన్‌ను అడిగావ్. అది మా రాజ్‌ను అడగాలి. అదే మ్యాజిక్ అని రుద్రాణి అంటుంది.