Brahmamudi April 6th Episode: బ్రహ్మముడి- పుట్టుమచ్చ విషయంలో కావ్యకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజ్- అనామికకు కల్యాణ్ షాక్
Brahmamudi Serial April 6th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 6వ తేది ఎపిసోడ్‌లో బిడ్డకు ఉన్నట్లే రాజ్‌కు కూడా నడుముపై పుట్టుమచ్చ ఉందా అని చూసేందుకు ప్రయత్నించిన కావ్యకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు రాజ్. మరోవైపు అనామికకు కల్యాణ్ షాక్ ఇస్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఆ వెన్నెలను కనిపెట్టి ఏం చేస్తావ్. ఆమెతో నా మనవడికి ఉన్న బంధాన్ని బయటపెడతావా. అలా పెడితే ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో ఆలోచించావా. వెన్నెలను తీసుకొస్తే నీ పరిస్థితి ఏంటీ అని ఇందిరాదేవి అంటుంది. నేను తీసుకురాకుండా ఉంటే ఏదో ఒక రోజు తానే వస్తే. అప్పుడు మాత్రం ఏం చేస్తాను. అప్పుడు నా జీవితం ఓ ప్రశ్నగా మిగిలిపోతుంది అని కావ్య అంటుంది.
గొడవ చేయమేంటీ
జీవితం ప్రశ్నలా మిగిలిపోవడం కంటే ఒంటరిగా ఉండటం నయం. నాకు మీ మనవడి గురించి మనసులో ఏదో ఒక మూల నమ్మకం ఉంది. ఇప్పుడు మీ మనవడి మనసులో నాకు స్థానం ఉందా లేదా అనేది కాదు. ఆ బిడ్డకు తల్లి ఎక్కడ ఉంది అనేది. ఆ వెన్నెల ఎక్కడ ఉన్నా కనిపెట్టి తీరుతాను. అప్పుడు నా గురించి చూద్దాం అని కావ్య చెబుతుంది. మరోవైపు మీడియా ముందు అంతపెద్ద గొడవ చేయడం ఏంటీ అని కృష్ణ మూర్తి అడుగుతాడు.
అక్కడ మీడియా ఉంటుందని, అంత పెద్ద గొడవ జరుగుతుందని అనుకోలేదు అని అప్పు అంటుంది. మధ్య తరగతి వాళ్లు న్యాయం అడిగినా తప్పే అమ్మ. అవన్ని డబ్బున్న వాళ్లకు. చూశావుగా.. ఆఖరికి దోషిగా నిలబడ్డావ్ అని కృష్ణమూర్తి అంటాడు. వాళ్లు అన్నంత మాత్రానా అబద్ధం నిజం అయిపోతుందా నాన్నా అని అప్పు అంటే.. అవన్నీ ఎందుకమ్మా.. మన హద్దుల్లో మనం ఉంటే ఏ గొడవ ఉండదు కదా అని కృష్ణమూర్తి అంటాడు.
పదిమంది గురించి
దానికి ఎందుకు ఉండాలి అని కనకం అంటుంది. ఇన్నాళ్లు అలాగే ఊరుకున్నాం. కానీ, ఏ తప్పు చేయకుండా నా బిడ్డను అంటే ఊరుకునేది లేదు. అల్లుడు బిడ్డను తీసుకొస్తే ఏంటిది అని అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. పైగా నన్నే నిందించారు. మనం మాత్రం అన్నింటికి పడుతూ ఉండాలా. ఏ తప్పు చేయనంతవరకు ఊరుకోవాల్సిన పని లేదు. ఇన్నాళ్లు మన అమ్మాయిల గురించే ఆలోచించాను. పదిమంది ఏమనుకుంటారో అని వాళ్ల సంతోషం గురించి ఆలోచించలేదు అని కనకం అంటుంది.
ఒసేయ్ అప్పు.. నువ్ ఏ తప్పు చేయనంతవరకు నువ్ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు అండగా ఉంటాను. ఎవరైనా అడ్డొస్తే తాట తీస్తాను. అది ధాన్యలక్ష్మీ అయినా.. దుగ్గిరాల కుటుంబం అయినా అని వెళ్లిపోతుంది కనకం. దాంతో కృష్ణమూర్తి అప్సెట్ అవుతాడు. ఎందుకు నాన్న ఫీల్ అవుతావ్. ఎవరో ఏదో అన్నారని, రెచ్చగొట్టారని నేను ఏది చేయను. ఏది ఎక్కువ దూరం తెచ్చుకోను అని అప్పు సర్దిచెబుతుంది.
జీవిత సత్యాలు చెప్పగలను
మరోవైపు బాబును రెడీ చేస్తుంది కావ్య. రుద్రాణి వచ్చి రాజ్ బాబును తీసుకురావడం మాకే చాలా కష్టంగా ఉంది. ఇంకా నీకు ఎలా ఉంటుందో. ఈ బిడ్డకు ఆ తల్లి ఎవరో అని కావ్యను రెచ్చగొట్టేందుకు ట్రై చేస్తుంది. ఇప్పుడు మీ మాటలు విని మా ఆయనతో యుద్ధానికి దిగాలా అని కావ్య అంటుంది. భర్తతో యుద్ధం చేస్తే ఒంటరితనమే మిగులుతుందని నాకు బాగా తెలుసు. చూశావా నేను కూడా జీవిత సత్యాలు చెప్పగలను. బాబుకు అచ్చం రాజ్ పోలికలే వచ్చాయి. బిందెకు చెంబు ఊడిపడ్డట్టు భలే ఊడిపడ్డాడు బుడ్డోడు అని రుద్రాణి అంటుంది.
తులసి మొక్క నాటితో తులసి మొక్కే వస్తుంది అని చెప్పిన రుద్రాణి.. బాబు నడుముపై ఉన్న పుట్టుమచ్చ చూస్తుంది. అరే ఇది పుట్టిమచ్చే. చెబితే నమ్మలేదు కదా. రాజ్ స్టాంపే ఇది. రాజ్‌ను చిన్నప్పుడు నేనే ఎక్కువగా ఎత్తుకునేదాన్ని. వాడికి కూడా ఇదే చోట ఇలాంటి పుట్టుమచ్చే ఉన్నట్లు గుర్తు. చూసుకో మరి అని వెళ్లిపోతుంది రుద్రాణి. దాంతో ఆలోచనలో పడుతుంది కావ్య. వీడు ఆయన కొడుకే అయితే, ఆయనకు వీడిలాగే పుట్టుమచ్చే ఉంటే.. ఇంకా వేరే సాక్ష్యాల కోసం ఎందుకు చూడటం. ఇవాళ రాత్రికి తేల్చుకోవాలి అని కావ్య అనుకుంటుంది.
హీరోయిన్ నడుము
రాజ్ అద్దంముందు బనియన్, టవల్‌పై ఉండి రెడీ అవుతాడు. అక్కడికి వచ్చిన కావ్య మెల్లిగా రాజ్ నడుము చూసేందుకు ప్రయత్నిస్తుంది. అది గమనించిన రాజ్ ఉలిక్కిపడతాడు. ఏయ్.. ఏంటిది.. అని రాజ్ అంటే.. కావ్య దబాయిస్తుంది. దాంతో నువ్ నా నడుము చూశావ్ అని ఖుషిలో భూమిక డైలాగ్ కొడతాడు రాజ్. ఇదేమైనా సినిమానా హీరోయిన్ నడుము హీరో చూసేందుకు, చూశాడని గొడవ పడేందుకు అని రాజ్‌తో సెటైర్లు వేస్తుంది కావ్య.
ఆఖరుకు చూశాను, మీ నడుమే చూశాను. అయితే ఏంటీ అని మళ్లీ ఇలా చూశాను అన్నట్లుగా బనియన్ లేపుతుంది కావ్య. మళ్లీ రాజ్ అరుస్తాడు. అలా చేస్తే నాకు సిగ్గు అని రాజ్ అంటే.. అబ్బో సిగ్గు.. ఆ సిగ్గే ఉంటే వీడు ఎలా పుట్టుకొస్తాడు. ఏ వెన్నెల కురిసిన రాత్రి సిగ్గు వదిలేశారు. మీకు సిగ్గే ఉంటే.. ఇలా మన బతుకు ఉగ్గు వరకు వస్తుంది. నా బుతుకు బుగ్గి ఎందుకు అవుతుంది అని కావ్య అంటుంది. ఇదంతా ఆపేయమని దండం పెట్టి డ్రెస్ వేసుకుని వెళ్లిపోతాడు రాజ్. ఎలాగైనా ఈ రాత్రి సిగ్గు లేకుండా పుట్టుమచ్చ చూడాలని కావ్య అనుకుంటుంది.
ప్రేమగా ఉంటేనే సాధ్యం
మరోవైపు అనామిక కోపంతో రగిలిపోతుంటే.. రుద్రాణి వచ్చి చూస్తుంది. నువ్ ఇప్పుడు కల్యాణ్‌పై కోప్పడితే నేను అనుకున్నది జరగదు. నిన్ను మార్చాలి అని అనామిక దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. కల్యాణ్ అప్పుతో తిరగడం కన్నా పూర్తిగా ఎండీ బాధ్యతలు తీసుకోవడం ముఖ్యం. ముందు పూర్తిగా కంపెనీ చూసుకోని. ఆ తర్వాత అప్పును కల్యాణ్ జీవితం నుంచి దూరం చేద్దాం. కానీ, నువ్ ఇలా కోపంగా ఉంటే కుదరదు. కల్యాణ్‌తో ప్రేమగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది అని రుద్రాణి సలహా ఇస్తుంది.
మీరు అన్నది కూడా నిజమే ఆంటీ. మీరు ఎంత గొప్పవారు. మీ కొడుకుకు ఎండీ పదవి రాకున్నా.. కల్యాణ్ బాధ్యతలు చేపట్టేందుకు సలహాలు ఇస్తున్నారు అని అనామిక చాలా గొప్పగా చూస్తుంది. వాడు ఆఫీస్‌కు వెళ్లి చేయకూడని పనులు చేస్తేనే కదా నా కొడుకును ఎండీ సీటులో కూర్చోబెట్టగలను అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. తర్వాత రుద్రాణి వెళ్లిపోతుంది. కల్యాణ్ అనామిక దగ్గరికి వస్తాడు. కల్యాణ్‌తో ప్రేమగా మాట్లాడుతుంది అనామిక.
గొప్పలు నీకు నచ్చుతాయ్
పాలు తాగుతావా, జ్యూస్ తాగుతావా అంటే అక్కర్లేదని కల్యాణ్ అంటాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని కల్యాణ్ అంటే.. అది మీ అమ్మగారే చేశారు. నాకు దాని గురించి ఏం తెలియదు. అయినా ఇప్పుడు అది ఎందుకు. రేపటినుంచి ఎండీ బాధ్యతలు చేపట్టబోతున్నావ్. అది ఎంత గొప్ప విషయం అని అనామిక అంటుంది. అలాంటి గొప్పలు నీకు నచ్చుతాయి. ఇష్టం లేని పని చేయడం కష్టంగానే ఉంటుంది. అయినా ఇది అన్నయ్య కోసం ఒప్పుకున్నాను. అన్నయ్య రాగానే నేను పక్కకు తప్పుకుంటాను అని కల్యాణ్ అంటుంది.
దాంతో షాక్ అవుతుంది అనామిక. కల్యాణ్ వెళ్లి పడుకుంటాడు. కానీ, నేను అలా జరగనివ్వను కదా కల్యాణ్. నువ్వే ఎప్పటికీ రారాజువి అని అనామిక అనుకుంటుంది. మరోవైపు రాత్రి రాజ్ పడుకున్నాక పుట్టుమచ్చ చూసేందుకు కావ్య ప్రయత్నిస్తుంది. అది చూసి రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి సంతోషిస్తుంది. కనీసం కళావతి నుంచి అయిన రొమాన్స్ వస్తుంది అని సంబరపడిపోతాడు. అంతరాత్మ మాటలకు రాజ్ నిద్ర లేస్తాడు.
కావ్యకు రాజ్ ట్విస్ట్
అరేయ్.. కాసేపు అలాగే పడుకోరా. నువ్ తీయ్.. పట్టుకో అని అంతరాత్మ అంటే.. కావ్యను రాజ్ చూస్తాడు. చూసి ఉలిక్కిపడతాడు. దాంతో బొద్దింక అని కావ్య కవర్ చేస్తుంది. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి రాజ్ బనియన్ పైకి అనేలా చేసి నడుముపై చూస్తుంది. కానీ, రాజ్ నడుముపై పుట్టిమచ్చ ఉండదు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఇదేంటి లేదు అనుకుంటుంది. తర్వాత బొద్దింక లేదు అని చెబుతుంది. ఇక్కడ.. బొద్దింక, ముద్దింక, వద్దింక అని కావ్య, రాజ్ అంతరాత్మ, రాజ్ చెప్పే డైలాగ్ చాలా కామెడీగా ఉంటుంది.
తర్వాత పడుకున్న కావ్య.. ఇదేంటీ పుట్టుమచ్చ లేదు. రుద్రాణి గారు అన్నారు కదా. రాజ్ కొడుకే అని కావ్య ఆలోచిస్తుంది. పుట్టమచ్చ లేనంతమాత్రాన నా కొడుకు నా కొడుకు కాకుండా పోడు అని రాజ్ సూపర్ ట్విస్ట్ ఇస్తాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఇదేంటి ఎక్కడ బయటపడలేదు కదా అని కావ్య అనుకుంటుంటే.. ఆ పడుకో అని మళ్లీ రాజ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్