Brahmamudi April 4th Episode: బ్రహ్మముడి- కావ్యకు దొరికేసిన రాజ్ బిడ్డ తల్లి- అప్పుకోసం బ్రోకర్ చెంపలు వాయించిన కల్యాణ్
Brahmamudi Serial April 4th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 4వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్ నుంచి వెన్నెల గురించి అడిగి తెలుసుకున్న కావ్య స్కూల్‌కు వెళ్తుంది. అక్కడ వెన్నెల ఫొటో అడ్రస్ చూసి దొరికేసావ్ అని కావ్య అంటుంది. అప్పు కోసం బ్రోకర్‌ను కొడతాడు కల్యాణ్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని కల్యాణ్‌ను కావ్య అడుగుతుంది. చేస్తాను అని కల్యాణ్ అంటాడు. సహాయం కాదు. ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. మీ అన్నయ్యకు వెన్నెల అనే ఫ్రెండ్ ఉందా. ఎందుకంటే మీ అన్నయ్య ఆ బాబు తల్లి పేరు వెన్నెల అని చెప్పారు అని కావ్య అంటుంది. ఎంత ఆలోచించినా ఆ వెన్నెల అనే అమ్మాయి గురించి నాకు తెలియదు అని కల్యాణ్ అంటాడు.
పదో తరగతి ఫ్రెండ్
లేదు కవిగారు. మీకు ఎప్పుడో ఓసారి ఆమె గురించి చెప్పే ఉంటారు. మీకు చెప్పకుండా ఏం చేయరు అని కావ్య అంటుంది. అప్పుడు గుర్తుకు వచ్చిందని చెప్పిన కల్యాణ్.. అన్నయ్యకు పదో తరగతిలో వెన్నెల అనే క్లాస్ మేట్ ఉండేది. ఆమె అన్నయ్యను చాలా ప్రేమించేది. కానీ, తర్వాత ఏమైందో తెలియదు అని కల్యాణ్ అంటాడు. ఆ స్కూల్ పేరు అడిగి తెలుసుకున్న కావ్య.. అక్కడికి వెళ్తుంది. తర్వాత అప్పు కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటీ అని కల్యాణ్ అనుకుంటాడు.
మరోవైపు పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో బ్రోకర్ అన్న మాటలు తలుచుకుంటూ గదిలో పడుకుని ఏడుస్తూ కూర్చుంటుంది అప్పు. తల్లి కనకం వచ్చి గది తలుపు కొడుతుంది. రెండ్రోజుల నుంచి అలాగే ఉంటున్నావా అని అంటుంది. అయినా కూడా అప్పు తలుపు తీయదు. తలనొస్తుందని అని కన్నీళ్లతో చెప్పి పడుకుంటుంది. ఇంతలో కల్యాణ్ వస్తాడు. అది చూసి కనకం వాళ్లు షాక్ అవుతారు. మీరు ఇలా వస్తే మీ వాళ్లు గొడవ చేస్తారని అంటుంది. వాళ్లను నేను చూసుకుంటాను అని కల్యాణ్ అంటాడు.
ఏడుస్తూ కూర్చుంటావా
కల్యాణ్ తలుపు కొట్టడంతో అప్పు వచ్చి తలుపు తీస్తుంది. అప్పు ఏడవడం చూసి అంతా షాక్ అవుతారు. నువ్ ఏడవడం ఏంటీ బ్రో అని కల్యాణ్ అంటే.. బాధగా కల్యాణ్ చేతిను హగ్ చేసుకుంటుంది. అది చూసి షాక్ అయిన కనకం అప్పు.. అని గట్టిగా అరిచి మందలిస్తుంది. తర్వాత బ్రోకర్ అన్న మాటలు, జరిగిందంతా చెబుతుంది. వాడు అంతలా అవమానిస్తే.. ఇలా ఏడుస్తూ కూర్చుంటావా.. వాడు ఎవడు. పద వాడి పని చెబుదాం అని అప్పు చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతాడు కల్యాణ్.
మరోవైపు కల్యాణ్ చెప్పిన స్కూల్‌కు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్న కావ్య.. రాజ్ టెన్త్ క్లాస్ మేట్ వెన్నెల గురించి అడుగుతుంది. అప్పటి అడ్మిషన్ రిజిస్టర్ తీసుకొచ్చి ఇస్తాడు ప్రిన్సిపాల్. అందులో వెన్నెల పేరు చూస్తుంది కావ్య. బాబుకు తల్లి దొరికేసింది. వెన్నెల వచ్చేస్తున్నాను అని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ కొడుకును ఆడిస్తుంటే.. అంతరాత్మ బయటకు వచ్చి టీజ్ చేస్తుంటాడు. నా జీవితంలో ఏకైక లక్ష్యం శోభనం లేకుండా చేశావు కదరా అని రాజ్‌ను ఏదో ఒకటి అంటుంటాడు.
కావ్య బయటపెడుతుంది
కనీసం ఆ అమ్మాయి ఎవరో చెప్పురా. మన కళావతిలా అందంగా ఉంటుందా అని అడిగితే రాజ్ సైలెంట్‌గా ఉంటాడు. హో.. ఉండదా.. మరి కత్తిలా అయినా ఉంటుందా. ప్రతిదానికి ఈ సైలెన్స్ ఏంట్రా. నాకైనా నిజం చెప్పరా. నాకు చెప్పకపోయినా.. మన పెళ్లం మాత్రం ఊరుకోదు. ఆ వెన్నెలను ఏ మబ్బుల వెనకు దాచిపెట్టినా పట్టుకొచ్చి బయటకు తీసుకొస్తుంది. అందరిముందు బయటపెడుతుంది అని రాజ్ అంతరాత్మ అంటాడు. .
స్కూల్‌లో చూసిన అడ్రస్‌కు వెళ్తుంది కావ్య. అక్కడ ఓ మహిళ డోర్ తీస్తుంది. మీకోసమే వచ్చాను అని చెప్పిన కావ్య.. ఇంకా ఎన్నాళ్లు ఇలా దాక్కుంటారు. వచ్చి మా ఇంట్లో నిజం చెప్పండి. మా ఆయనతో ఉన్న సంబంధం గురించి ఇంట్లో అందరికీ చెప్పండి అని గొడవ పెట్టుకుంటుంది కావ్య. దాంతో ఆ మహిళ ఎంతగానో కంగారుపడిపోయి.. వాళ్ల భర్తను పిలుస్తుంది. భర్త ఉండి కూడా మా ఆయనతో సంబంధం పెట్టుకున్నావా అని కావ్య అంటుంది.
ఈ అడ్రస్ ఇచ్చారు
దాంతో వాళ్ల భర్త ఏంటిది అని అడుగుతాడు. నా కాపురంలో చిచ్చు పెట్టకు. అసలు నువ్ ఎవరికోసం వచ్చావో క్లియర్‌గా తెలుసుకో అని ఆమె అంటుంది. నేను అన్ని సరిగ్గా తెలుసుకునే వచ్చాను వెన్నెల అని కావ్య అంటుంది. వెన్నెల.. ఆమె ఎవరు. నా పేరు సావిత్రి అని ఆమె చెబుతుంది. దాంతో షాక్ అయిన కావ్య.. సారీ అండి చిన్న తప్పు జరిగింది. వెన్నెల గురించి అడిగితే ఈ అడ్రెస్ ఇచ్చారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్లు అయింది అని కావ్య అంటుంది.
పదేళ్లు అవుతుంది. అంతకుముందు ఇంటి ఓనర్స్ అనుకుంటా. వాళ్ల అడ్రస్ కూడా తెలియదు. ఇది మా నాన్న కొన్నారు. ఆయన కూడా లాస్ట్ ఇయర్ చనిపోయారు అని సావిత్ర భర్త చెబుతాడు. దాంతో సారీ అండి అని మరోసారి చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు అనామికను పొగుడుతుంది ధాన్యలక్ష్మీ. నేను చేయలేనిది నువ్ చేశావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. అలా ఎలా వదిలేస్తాను. ఇన్ని రోజులు అనుకుంది అదే కదా అని అనామిక అంటుంది.
రుద్రాణి డ్రామా
ఇంతలో వచ్చిన రుద్రాణి.. ఏదైతేనేం అనుకున్నది అనుకున్నట్లు సాధించావ్. నేను చెప్పినట్లే చేశావ్ అని అంటుంది. దాంతో చాల్లే ఆపండి. ఇంకా ఎందుకు నటిస్తున్నారు. కల్యాణ్‌ను ఎండీగా చేసేందుకు సహాయం చేస్తానని చెప్పి.. మధ్యలో రాహుల్‌ను ఎండీని చేయమంటారా అని అనామక రివర్స్ అవుతుంది. మీరు ఇంత అమాయకంగా ఉన్నారు కాబట్టే.. ఇంట్లో వాళ్లు మీతో అలా ఆడుకుంటున్నారు. నేను రాహుల్ గురించి మాట్లాడకపోయి ఉంటే.. కల్యాణ్‌కు ఎండీ సీటు వచ్చేది కాదు అని రుద్రాణి అంటుంది.
మీరు మాత్రమే అడిగితే.. ఇంట్లో వాళ్ల దృష్టిలో స్వార్థపరుల్లా మిగిలిపోయేవారు. నేను నా కొడుకును తక్కువ చేసి మాట్లాడాను కాబట్టే.. రాహుల్ కంటే కల్యాణ్ నయం అనుకుని వాడికి ఇచ్చారు. మీకోసం నా కొడుకును కూడా తక్కువ చేశాను అలాంటిది మీరు నన్ను అలా అంటారా అని ఏడుస్తున్నట్లు పెద్ద డ్రామా చేస్తుంది రుద్రాణి. దాంతో అది చూసి పడిపోయిన అనామిక, ధాన్యలక్ష్మీ రుద్రాణికి సారీ చెబుతారు. ఇంట్లో అంతా నన్ను తప్పు పడతారు. నేను అనడం వల్లే కల్యాణ్ ఎండీ అయ్యాడు. ఈ ఫలితం అయినా మీరు గుర్తిస్తే చాలు అని రుద్రాణి ఏడుస్తున్నట్లు వెళ్లిపోతుంది.
బ్రోకర్‌ను వాయించిన కల్యాణ్
మరోవైపు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కల్యాణ్ బ్రోకర్ చెంపలు వాయిస్తాడు. వెంటనే బయటే ఉన్న పోలీసుల ముందుకు, మీడియా ముందుకు లాక్కొచ్చి.. మరి కొడతాడు. అది చూసిన పోలీసులు అడ్డుకుంటారు. మీరే ఇలా చేతిల్లోకి లా తీసుకుంటే ఎలా అని పోలీస్ అంటే.. మీరు చేయట్లేదని నేను చేస్తున్నాని మళ్లీ బ్రోకర్ చెంపలు వాయిస్తాడు కల్యాణ్. అది చూసిన మీడియా ప్రశ్నలు వేస్తుంది. పోలీసుల ముందే ఎందుకు అలా కొడుతున్నారు అని అడుగుతారు.
వీడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే మోసం చేశాడు. నా ఫ్రెండ్ లైఫ్‌తో ఆడాకోవాలని చూశాడు. నా ఫ్రెండ్ పోలీస్ ట్రైనింగ్ అవుతోంది. దానికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. ఇవాళ ఏకంగా గెస్ట్ హౌజ్‌కు రమ్మన్నాడు అని కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో నా కొడుకుతో అప్పు ఎందుకు బరితెగించి తిరుగుతుంది అని కనకంపై ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మీ.
ఇంటితో సంబంధం తెంచుకోవాలి
తర్వాత అప్పు వల్లే నువ్ చెడిపోతున్నావ్ అని కల్యాణ్‌ను అంటుంది. ఇక నుంచి ఇలా జరగకూడదంటే.. ఈ ఇంటితో ఈ కనకం కుటుంబం శాశ్వతంగా సంబంధం తెంచుకోవాలి. జీవితంలో ఈ ఇంటి గడప తొక్కకూడదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి చిన్నత్తయ్య అని కావ్య అరుస్తుంది.
టాపిక్