Tillu Square OTT: ఓటీటీలోకి అప్పుడే టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Tillu Square OTT Release: సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన మార్క్ చూపించిన సినిమా టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్, రైట్స్ ధర, ప్లాట్ ఫామ్ విషయాల్లోకి వెళితే..
Tillu Square OTT Streaming: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన నటనతో మరోసారి అదరగొట్టిన సినిమా టిల్లు స్క్వేర్. ఎన్నో అంచనాలతో, భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మార్చి 29న ఎట్టకేలకు వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. డీజే టిల్లు సినిమాకు మించిన వినోదం టిల్లు స్క్వేర్ మూవీలో ఉందని ఆడియెన్స్, నెటిజన్స్ అంటున్నారు. అంతేకాకుండా సినిమాకు ఫుల్ పాజిటివ్‌గా రివ్యూలు వస్తున్నాయి.
లిల్లీ పాత్రలో
మరోసారి తన డైలాగ్ టైమింగ్, డెలివరీతో సిద్ధు జొన్నలగడ్డ అట్రాక్ట్ చేశాడని అంటున్నారు. అలాగే లిల్లీ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ హాట్ సీన్లలో అదరగొట్టిందని చెబుతున్నారు. ఫస్టాఫ్ అంతా ఫుల్ రొమాన్స్‌తో సాగిన మూవీ సెకండాఫ్‌లో ట్విస్టులతో బాగా నవ్వించేసిందని రివ్యూలు వస్తున్నాయి. మొత్తానికి టిల్లు గాడు మరోసారి అదిరిపోయే హిట్ కొట్టాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక నిర్మాత నాగవంశీ అయితే టిల్లు స్క్వేర్ సినిమా రూ. 100 కోట్ల మార్క్ చేరుకుంటుందని నమ్మకంగా చెప్పారు.
టిల్లు స్క్వేర్ డిజిటల్ స్ట్రీమింగ్
ప్రస్తుతం టిల్లు స్క్వేర్ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో సినిమా ఓటీటీ రైట్స్, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ విషయాలు ఆసక్తిగా మారాయి. బడా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ టిల్లు స్క్వేర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని ఇదివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ. 13 నుంచి 15 కోట్లు పెట్టి సొంతం చేసుకుందని ప్రస్తుతం జోరుగా టాక్ నడుస్తోంది. సినిమా విడుదల కంటే ముందే భారీ ధర చెల్లించి నెట్‌ఫ్లిక్స్ టిల్లు స్క్వేర్ మూవీ హక్కులను చేజిక్కించుకుందని సమాచారం.
అప్పుడే ఓటీటీ రిలీజ్
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నిబంధనల ప్రకారం థియేట్రికల్ విడుదల తర్వాత నెల రోజులకు ఓటీటీలో సినిమాను స్ట్రీమింగ్ చేస్తారను తెలిసిందే. అలాగే టిల్లు స్క్వేర్ సినిమాను కూడా ఏప్రిల్ చివరి వారంలో లేదా ఆగస్ట్ మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. లేదా అందులో మార్పులు కూడా చోటు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే, టిల్లు స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేవరకు మాత్రం ఆగాల్సిందే.
టిల్లు స్క్వేర్ శాటిలైట్ రైట్స్
ఇక టిల్లు స్క్వేర్ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానెల్ స్టార్ మా కొనుగోలు చేసింది. దీనికి కూడా టిల్లు స్క్వేర్ నిర్మాతలకు స్టార్ మా భారీగానే ముట్టజెప్పిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, టిల్లు స్వేర్ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇంకా వీకెండ్‌లో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగి వసూళ్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
కలెక్షన్లతో
కాగా, సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. 2022లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది టిల్లు స్కేర్. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇక ఎట్టకేలకు మార్చి 29న శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ కలెక్షన్లతో అదరగొడుతోంది.
టాపిక్