Murder Mubarak Review: మర్డర్ ముబారక్ మూవీ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Murder Mubarak Review In Telugu: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లోకి లెటెస్ట్‌గా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్. డైరెక్టర్ హోమి అదజానియా దర్శకత్వంలో బాలీవుడ్‌లోని అగ్ర నటీనటులు యాక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో నేటి రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: మర్డర్ ముబారక్
నటీనటులు: పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, డింపుల్ కపాడియా, ఆశిమ్ గులాటి, సుహేల్ నాయర్, టిస్కా చోప్రా, తారా అలీషా బెర్రీ, వరుణ్ మిత్ర తదితరులు
దర్శకత్వం: హోమి అదజానియా
నిర్మాత: దినేష్ విజన్
సంగీతం: సచిన్ జిగర్
సినిమాటోగ్రఫీ: లినేష్ దేశాయ్
ఎడిటింగ్: అక్షర ప్రభాకర్
విడుదల తేది: మార్చి 15, 2024
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
Murder Mubarak Review Telugu: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ జోనర్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ మర్డర్ ముబారక్. సారా అలీఖాన్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, వరుణ్ మిత్ర వంటి పాపులర్ హిందీ నటీనటులు ప్రధానపాత్రలుగా నటించిన ఈ మూవీకి డైరెక్టర్ హోమి అదజానియా దర్శకత్వం వహించారు. ఆయన ఇది వరకు కాక్ టెయిల్, బీయింగ్ సైరస్, ఫైండింగ్ ఫాన్సీ చిత్రాలతో పాటు సాసు బహు ఔర్ ఫ్లెమింగో వంటి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.
మర్డర్ ముబారక్ మూవీని అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యూ టు డెత్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. మార్చి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మర్డర్ మిస్టరీ ఈ మూవీ ఎలా ఉందో నేటి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఢిల్లీ రాయల్ క్లబ్‌లో బాలీవుడ్ సినీ తారల నుంచి వీఐపీల వరకు మెంబర్స్‌గా ఉంటారు. ఆ క్లబ్‌కు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఎన్నికల రోజున జుంబా ట్రైనర్ లియో జిమ్ చేస్తూ మరణిస్తాడు. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఏసీపీ భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) ఎంట్రీ ఇస్తాడు. మరి లియోది యాక్సిడెంటా? లేదా మర్డరా? లేదా ఆత్మహత్య? అని ఏసీపీ కనిపెట్టారా? ఢిల్లీ రాయల్ క్లబ్‌లో ఉన్న మెంబర్స్‌ది వ్యక్తిగత జీవితం ఏంటీ? వాళ్ల జీవితాల్లో ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటీ? అసలు ఆ క్లబ్‌లో ఎన్ని మర్డర్స్ జరిగాయి? వాటిని చేసింది ఎవరు అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే? మర్డర్ ముబారక్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఢిల్లీ రాయల్ క్లబ్‌లో వెయిటర్ గప్పీ రామ్ రక్తపుమడుగులో కనిపించడంతో మర్డర్ ముబారక్ సినిమా స్టార్ట్ అవుతుంది. మర్డర్ సీన్‌తో మంచి క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రారంభమైన ఈ సినిమా మొదటి అరగంట బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత మూవీ అంతా చాలా స్లోగా, ప్లాట్‌గా సాగుతుంది. మొదటి అరగంటలో రివీల్ అయ్యే అసలు హత్య ఏంటనేది సినిమాలో మంచి ట్విస్ట్ అని చెప్పొచ్చు. రాయల్ క్లబ్‌లోని మెంబర్స్ అయిన ఒక్కో పాత్ర పరిచయంతో ఎవరు ఏంటి అనేది చూపించారు.
ప్లస్ అండ్ మైనస్
ఆ పాత్రలు వారి స్థానం, హోదాతో ఇంట్రెస్టింగ్‌గా బాగానే చూపించారు. కానీ, కాస్తా లెంతీ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఆ తర్వాత చాలా బోరింగ్‌గా సీన్లు ఉంటాయి. ఎంగేజింగ్‌గా, గ్రిప్పింగ్‌గా ఇన్వెస్టిగేషన్ సాగదు. అక్కడక్కడ కామెడీ టచ్ ఇస్తారు. అది కాస్తా పర్వాలేదు. మధ్యలో వచ్చే పాటలు బాగున్నాయి. బీజీఎమ్ పర్వాలేదు. సినిమాలో ప్రతి పాత్రను అనుమానించేలా చివరి వరకు ఒకరకమైన సస్పెన్స్ క్రియేట్ చేశారు. సినిమాకు చాలా సమయం తీసుకున్న కొన్ని సన్నివేశాలను స్పష్టంగా వివరించలేదు.
ఓవరాల్‌గా చెప్పాలంటే?
క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఊహించని విధంగా ఆకట్టుకుంటుంది. ఇక మూవీలో ప్రతిపాత్రకు అఫైర్ ఉండటం కాస్తా విసుగ్గా అనిపిస్తుంది. సినిమాలో బాగానే బోల్డ్, అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడలేం. విజయ్ వర్మ, సారా అలీ ఖాన్ మధ్య వచ్చే శృంగార సన్నివేశం అసంబద్ధంగా పెట్టినట్లు అనిపిస్తుంది. నటీనటుల పర్ఫామెన్స్ మెచ్చుకునేలా ఉంది. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే స్టార్టింగ్, ఎండింగ్ బాగుండి మధ్యలో బోర్ కొట్టించే సినిమా మర్డర్ ముబారక్.
రేటింగ్: 2.25/5
టాపిక్