Brahmamudi March 14th Episode: బ్రహ్మముడి.. కల్యాణ్ వన్ మ్యాన్ షో.. స్వప్న మాస్ వార్నింగ్.. అత్తాకోడళ్లకు మైండ్ బ్లాక్-brahmamudi serial march 14th episode kalyan angry at mother dhanyalakshmi and wife anamika brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 14th Episode: బ్రహ్మముడి.. కల్యాణ్ వన్ మ్యాన్ షో.. స్వప్న మాస్ వార్నింగ్.. అత్తాకోడళ్లకు మైండ్ బ్లాక్

Brahmamudi March 14th Episode: బ్రహ్మముడి.. కల్యాణ్ వన్ మ్యాన్ షో.. స్వప్న మాస్ వార్నింగ్.. అత్తాకోడళ్లకు మైండ్ బ్లాక్

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 11:26 AM IST

Brahmamudi Serial March 14th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 14వ తేది ఎపిసోడ్‌లో ఎప్పుడు మాట్లాడని కల్యాణఅ వన్ మ్యాన్ షో అనిపించాడు. తల్లికి, భార్యకు ఇద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. అనామికపై షటప్ అంటూ ఫైర్ అయ్యాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 14వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 14వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చి ఎవరు గొడవ చేశారు. మా ఫ్రెండ్షిప్ గురించి తప్పుగా ఎవరు అన్నారు. వాళ్లు ఎవరో నాకు తెలియాలి. అంతవరకు ఈ ఇంట్లోనే ఉంటాను. ఆ అన్నవాళ్లే నన్ను వెతుక్కుంటూ వస్తారు అని కల్యాణ్ అంటాడు. దాంతో అయోమయంగా కనకం, కృష్ణమూర్తి ఉంటారు. దాంతో ఇంకెవరు మీ అమ్మగారు అయి ఉంటారు. లేదా నీ భార్య అనామిక వచ్చి ఉంటుంది అని అప్పు అంటుంది.

గట్టిగా అరిచిన ధాన్యలక్ష్మీ

ఇద్దరూ వచ్చారు అని కనకం అంటుంది. దాంతో కల్యాణ్ షాక్ అవుతాడు. వాళ్ల బాధలో కూడా న్యాయం ఉందిగా అని కనకం అంటుంది. దాంతో వెంటనే వెళ్లిపోతాడు కల్యాణ్. ఇప్పుడు ఇతను వెళ్లి అక్కడ ఎంత పెద్ద గొడవ చేస్తాడో అని కృష్ణమూర్తి అంటాడు. అసలు అక్కడ ఇప్పటికే కావ్యతో ఎంత పెద్ద గొడవ పడుతున్నారో అని అప్పు అంటుంది. మరోవైపు ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. కావ్య అంటూ గట్టిగా అరుస్తుంది ధాన్యలక్ష్మీ.

కావ్యకు బయటకు రాగానే ఇంకా నీ కుట్రలు ఆగలేదా. నా కొడుకుని కోడలిని విడదీయాలని చూస్తున్నావా అని ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. ఏంటే.. అలా అంటుంటే బిత్తర చూపులు చూస్తున్నావ్. ఏం అడుగుతుందో విన్నావ్‌గా అని స్వప్న అంటుంది. బయటకు వెళ్లిన వాళ్ల మెదడును ఏదో పురుగు తొలిచేసినట్లుంది. ఇంటికి వచ్చేలోపు మైండ్ పోయినట్లుంది అని స్వప్న అంటుంది. నేను మీ చెల్లెలిని అడుగుతున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఇప్పుడు ఎందుకు

సరే నేనే అడుగుతున్నాను. నన్ను దోషిని చేయడానికి కారణం ఏంటీ. దానికి ఆధారం ఏంటీ అని కావ్య అడుగుతుంది. నా కొడుకు ఆఫీస్‌కు రాకుండా చేసింది నువ్వే. కవితలు రాసుకునేలా చేసింది నువ్వే. ఎందుకంటే వాడు ఆఫీస్‌కు వస్తే నీ ఆటలు సాగవు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో పిన్నీ.. ఆఫీస్‌కు రావడం ఇష్టం లేదని, బిజినెస్ మైండ్ కాదని, ఆ బావతత్వపు ప్రపంచంలోనే ఉంటానని కల్యాణే చెప్పాడు. కళావతి చెబితే వినేంత చిన్నవాడు కాదు. అది ఎప్పుడో అయిపోయిన రభస. మళ్లీ ఇప్పుడు ఎందుకు అంటున్నావ్ అని రాజ్ అంటాడు.

ఇంట్లో అందరికీ గొడవలు పెడుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరు నేనా.. ఈ ఇల్లు ఒకప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఒకరి సంతోషం మరకొరు కోరుకునేవారు. కానీ, ఇప్పుడు పూటకో గొడవ చేస్తుంది మీరు. ఏదో ఒక కారణంతో రభస చేస్తుంది మీరు అని కావ్య అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ అరిచేసరిరికి అపర్ణ అడ్డుకుంటుంది. ధాన్యలక్ష్మీ ఇది ఇల్లా బజారా. రోజు మాకు ఈ సంత ఏంటీ. మీ అత్తాకోడళ్లు కలిసి రోజుకో పూట గొడవ చేస్తున్నారు. నా కోడలిపై ఎందుకు అరుస్తున్నారు అని అపర్ణ అంటుంది.

మిగిలేది బూడిదే

నా కొడుకు, అప్పు ఇద్దరూ కలిసారు. నువ్ వెనుకాల ఉండి అంతా నడిపిస్తున్నావ్ అని ధాన్యలక్ష్మీ చెబుతుంది. మీరు కడుపుకు అన్నం తింటున్నారా అనుమానం తింటున్నారా. మా అత్తే తింగరిమేళం అనుకుంటే.. మీరు అంతకంటే తింగరిమేళంలా ఉన్నారే. అసలు ఏం అంటున్నారు అని స్వప్న అంటుంది. మీ చెల్లి ఏం చెప్పకముందే నువ్ మధ్యలో వచ్చావేంటీ. అంటే ఇందులో నీ హస్తం కూడా ఉందా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

నా హస్తం ఉంటే భస్మమే. నేను హస్తం పెడితే మిగేలేది బూడిదే. కాబట్టి బురదలోకి రాకండి. ఆ బురద కడుక్కోవాలంటే మీకు జీవితకాలం సరిపోదు అని మాస్ వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఇలా ముగ్గురు అక్కాచెల్లెళ్లు మాట్లాడనీయకుండా చేయాల్సింది చేసుకుంటూపోతున్నారు. కల్యాణ్‌ను నాకు కాకుండా చేస్తున్నారు. అడిగితే ఇలా నోరు వేసుకుని పడిపోతున్నారు అని అనామిక అంటుంది.

గాడిద పళ్లు తోముతున్నారా

అనామిక మర్యాదగా మాట్లాడు. నీ మెడలో కవిగారు తాళి కట్టినప్పుడే మర్చిపోమ్మని అప్పుకి చెప్పాను. అది పెడవచెవిన పెట్టి కల్యాణ్‌ని ఇవాళ అప్పు కలిసింది. కల్యాణ్‌ను అప్పు కలిసిందా. అప్పును వెళ్లి కవిగారు కలిశారా. అసలు వాళ్లు ఎందుకు కలిశారు. ఇక్కడ ఇంట్లో ఉన్న నాకు ఎలా తెలుస్తుంది. దీనికి నన్నెందుకు దోషిని చేస్తున్నారు. నన్నెందుకు నిందిస్తున్నారు అని కావ్య అంటుంది. వాళ్లు కలవడం మీ ఇద్దరూ చూశారా అని స్వప్న అడుగుతుంది. ఇద్దరం చూశాం అని ధాన్యలక్ష్మీ అంటుంది.

స్తే అక్కడే నీ కొడుకుని నిలదీయకుండా.. గాడిద పళ్లు తోముతున్నారా. ఇక్కడికి వచ్చి అరుస్తున్నారు అని స్వప్న అంటుంది. దానికి హేయ్.. అని ధాన్యలక్ష్మీ ముందుకు వస్తే.. హేయ్ అని మరింత ముందుకు వస్తుంది స్వప్న. దాంతో అంతా షాక్ అవుతారు. ధాన్యలక్ష్మీ అక్కడే ఆగిపోతుంది. ధాన్యలక్ష్మీ చాలు ఆపు.. ఇంకా నీ పరువు తీసుకుని.. నా విలువ కూడా తీయకు అని ప్రకాశం అంటాడు. మీరే సరిగ్గా ఉంటే.. నా పరువు ఎందుకు పోతుంది. మీ విలువ ఎందుకు పోతుంది. అసలు ఈ కావ్య ఏం చేస్తుందో మీకు తెలుసా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

నన్ను అనుమానిస్తున్నారు

అసలు నీకేం తెలుసు అని కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. అసలు మీ అత్తాకోడళ్లకు ఏం తెలుసని అక్కడ గొడవ చేసి వచ్చారు. ఆ పెద్దమనుషులను ఎందుకు తిట్టారు. ఏదైనా ఉంటే నీ కొడుకుని నన్ను అడగాలి కదా వాళ్లను అనాల్సిన అవరం ఏంటి. అక్కడ చెసింది చాలక ఇక్కడికి వచ్చి రచ్చ చేస్తున్నారా అని కల్యాణ్ అంటాడు. ఏమైందిరా కల్యాణ్ అని రాజ్ అడిగితే.. నా వ్యక్తిత్వాన్ని అనుమానిస్తున్నారు అన్నయ్య. వదినా వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుని వచ్చారు అని కల్యాణ్ అంటాడు.

దాంతో అంతా షాక్ అవుతారు. అసలు ఆ పెద్దమనుషులను అలా ఎందుకు అన్నారు. వాళ్లు ఏం తప్పు చేశారు అని కల్యాణ్ అంటుంటే.. అనామిక కలుగ జేసుకుంటుంది. దాంతో హేయ్.. షటప్.. అని గట్టిగా అరుస్తాడు కల్యాణ్. దాంతో ఇవాళ కల్యాణ్ గాడు ఏంటీ రెచ్చిపోతున్నాడు అని రుద్రాణితో రాహుల్ అంటాడు. అసలు అప్పుని నువ్ ఏం అన్నావ్. నీకు తలకాయ ఉందా. అసలు మైండ్ ఉందా. మెదడు ఉండే మాట్లాడావా. నేను అప్పుని పెళ్లి చేసుకోవాలంటే ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా కాదనరు. ఆరోజు అప్పు గుండెపగిలి వెళ్లిపోతుంటే జాలిపడ్డానే తప్పా ఆపలేదు. ఎందుకంటే అప్పటికే నా కర్మ కాళి నీ ఆకర్షణలో ఉన్నాను కాబట్టి. ఈ జీవితానికి నువ్వే నా భార్యవి అనుకున్నాను కాబట్టి అని కల్యాణ్ అంటాడు.

ఈ తల్లి చెప్పింది

నిన్ను నువ్ ఎంతైన సమర్థించుకో కానీ ఆ కుటుంబాన్ని వెనుకేసురాకు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎందుకు. ఆ కుటుంబం ఏం చేసింది. వాళ్లు ఏం పాపం చేశారు. అసలు వదినా ఏ పాపం చేసింది. నాలోని కవిి గుర్తించింది. ఈ ప్రంపంచానికి తెలిసిలే చేసింది. పేరు ప్రతిష్టలు తెచ్చుకుని నీ భార్య గొప్పగా ఫీల్ అయ్యేలా చెప్పింది. ఇలా ఏ తల్లి చెబుతుంది.. ఈ తల్లి చెప్పింది అని కల్యాణ్ అంటాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

మా పెద్దమ్మ. పెద్దనాన్న, నానమ్మ, అన్నయ్య.. వీళ్లు నన్ను పెంచారు. ఎప్పుడూ నీ బంగారం, పట్టు చీరలు అని చూసుకున్నావ్ గానీ, నా గురించి పట్టించుకున్నావా. ఎప్పుడైనా ఆలోచించావా. ఇప్పుడు ఇంట్లో చిచ్చు పెడుతున్నావు. ఆ చిచ్చుకు కారణం నా పెళ్లాం. మీ ఇద్దరు కలిసి ఏం చేద్దామనుకుంటున్నారు. ఇల్లును ముక్కలు చేయాలనుకుంటున్నారా అని కల్యాణ్ అంటాడు. అలా చేయాలంటే మీ అమ్మ అమ్మమ్మలు, జేజమ్మలు తిరిగి రావాలిరా. ఏనాడు మాట్లాడని నువ్ ఈ అత్తాకోడళ్లకు గడ్డి పెట్టావ్. ఇక అది వెళ్లి నెమరేసుకోండి వెళ్లండి అని ఇందిరాదేవి అంటుంది.

కావ్య విడాకులు

ఇది అమ్మమ్మ ముద్ద అని ఒక్కకొరిగా గడ్డి పెట్టాలా పదా అని ధాన్యలక్ష్మీని తీసుకెళ్తాడు ప్రకాశం. ఇక్కడ నిలువెత్తు గౌరవం ఉంది. నువ్ అనువంత తలెత్తుకుంటే అసహ్యంగా ఉంది. లోపలికి వెళ్లు అని కల్యాణ్ అనడంతో ఏడుచుకుంటూ అనామిక లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత సారీ వదినా అని చెప్పిసి బాధగా వెళ్లిపోతాడు కల్యాణ్. అంతా మౌనంగా ఉండిపోతారు. తర్వాత కవిగారు మా వాళ్లకు మాట వచ్చే పని ఎందుకు చేస్తున్నారు. మీ అమ్మ భార్య మా వాళ్లను అనే పని ఎందుకు చేస్తున్నారు అని కావ్య అంటుంది.

నేను పాముకు కాటు వేయడం నేర్పట్లేదు. వాటి సహజ గుణం అని కల్యాణ్ అంటే.. మీకు పెళ్లి అయింది. అది మీరు మర్చిపోతున్నారు అని కావ్య అంటుంది. కానీ, అప్పు నా స్నేహం ఎప్పటి నుంచో ఉంది. అది వాళ్లకు అర్థం కావట్లేదు అని కల్యాణ్ అంటాడు. అది సహజం అని కావ్య అంటే.. మాది స్నేహం అని కల్యాణ్ అంటాడు. తర్వాతి ఎపిసోడ్‌లో తాము కలిసేందుకు విడాకులపై సంతకం చేసిన కావ్య వాటిని రాజ్‌కు ఇస్తుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు.

Whats_app_banner