Brahmamudi March 11th Episode: బ్రహ్మముడి.. కావ్యకు పాస్ పోర్ట్, అమెరికా వెళ్లిపోమన్న రాజ్.. అమ్మమ్మ చివరి అస్త్రం-brahmamudi serial march 11th episode indiradevi final astra on raj over reverse drama to kavya brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 11th Episode: బ్రహ్మముడి.. కావ్యకు పాస్ పోర్ట్, అమెరికా వెళ్లిపోమన్న రాజ్.. అమ్మమ్మ చివరి అస్త్రం

Brahmamudi March 11th Episode: బ్రహ్మముడి.. కావ్యకు పాస్ పోర్ట్, అమెరికా వెళ్లిపోమన్న రాజ్.. అమ్మమ్మ చివరి అస్త్రం

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 12:40 PM IST

Brahmamudi Serial March 11th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్‌లో కావ్య, భాస్కర్‌కు రివర్స్ అయి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు రాజ్. మరోవైపు అప్పుని కలవడానికి కల్యాణ్ వెళ్తాడు. అది తెలిసిన అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య, భాస్కర్‌ని చూసి రాజ్ ఉడికిపోతాడు. ఇంతలో బయటకు వచ్చిన రాజ్ అంతరాత్మ ఇలాగే చూస్తూ ఉంటే కళావతిని తన బావ ఎగరేసుకొని వెళ్తాడు అని అంటుంది. పంతానికి పోయి అందంగా ఉన్న భార్యకు దూరంగా ఉంటున్నావ్. ఇన్నాళ్లుగా ప్రతి రాత్రి నన్ను ఎండగడుతున్నావ్. నా బతుకుని నిస్సారంగా చేస్తున్నావ్ అని రాజ్ అంతరాత్మ బాధగా చెబుతుంది.

నీకు జెలసీగా లేదా

ఇప్పుడైనా నీ మనసులోని ప్రేమను బయట పెట్టు అని రాజ్ అంతరాత్మ అంటుంది. దానికి నో నెవ్వర్. నేనేంటి ప్రేమను బయటపెట్టడం ఏంటీ అని రాజ్ అంటాడు. దానికి నువ్ కళావతిని ప్రేమించట్లేదా అని అడిగితే.. లేదు. తనపై మిల్లీ మీటర్ అంతా ప్రేమ కూడా లేదు అని తేల్చి చెబుతాడు రాజ్. మరి ఇలా వాళ్లను చూడటం ఎందుకు. వాళ్లు ఏం మాట్లాడుకుంటే నీకేంటీ. నీకు జెలసీగా లేదా. ఉడుక్కోవట్లేదా అని రాజ్ అంతరాత్మ అంటుంది.

లేదు. నేను ఏదో చల్లగాలి పీల్చుకుంటున్నాను అంతే. వాళ్లు ఏం చేసిన పట్టించుకోను. చేసింది చాలు లోపలికి వచ్చేయ్ అని రాజ్ అంటాడు. దాంతో రాజ్ అంతరాత్మ మాయమైపోతుంది. నేను స్వరాజ్‌నురా నేను ప్రేమించడం ఏంటీ నెవ్వర్ అని అనుకున్న రాజ్ తన గదిలోకి వెళ్లి ఇక నుంచి వాళ్లు ఏం మాట్లాడుకున్నా నాకు ఏం పర్వాలేదు. కంట్రోల్.. ఫ్రస్టేషన్ అవ్వొద్దు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య, భాస్కర్ వస్తారు.

రాజ్ ఓవరాక్షన్

హేయ్.. తమ్ముడు అన్నయ్య ఇప్పటి దాకా ఎక్కడికి వెళ్లావ్. ఇది నీ ఇల్లే అనుకో. ఈ చల్లగాలిని ఎలా పీలుస్తావో అలాగే ఈ ఇల్లును పూర్తిగా వాడేసుకో. అసలే చిన్న నాటి మరదలు కోసం అమెరికా నుంచి వచ్చిన నిన్ను దూరంగా పెట్టి పాపిష్టి వాన్ని అయ్యాను. కోపిష్టిని అయ్యాను. కాలికి దెబ్బ తగిలి తమ్ముడు అన్నయ్య రోగిస్టి అయ్యాడు అని రాజ్ నానా హైరానా చేస్తూ డ్రామా చేస్తుంటాడు. తర్వాత మీరు ఏదో మాట్లాడటానికి వచ్చినట్లు ఉన్నారు. సినిమాకు వెళ్తారా. షికారుకు వెళ్తారా. పార్క్‌కు వెళ్తారా. పబ్‌కు వెళ్తారా అని చెప్పండి చెప్పండి అని పదే పదే అంటాడు రాజ్.

రాజ్ ప్రవర్తనకు ఇద్దరూ షాక్ అవుతారు. తర్వాత మా బావ ఆఫీస్‌కు సంబంధించి మీటింగ్ ఏదో ఉందట. మీ దగ్గర చాలా సూట్స్ ఉన్నాయి కదా. అందులో ఒకటి ఇస్తారా అని కావ్య అడుగుతుంది. అలా అడుగుతావేంటీ కళావతి. దానికి అడగాల. తీసుకో.. నీకోసం నా కబోర్ట్ మొత్తం తెరుస్తాను అని సూట్స్ మొత్తం బయట వేస్తాడు. అందులో నుంచి ఒకటి భాస్కర్ సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత కావాలంటే కళావతిని నీతోపాటు తీసుకెళ్లు అని రాజ్ అంటాడు.

మేకపోతు గాంభీర్యం

తర్వాత రాజ్ కారు కీస్ ఇచ్చి.. కారులో కళావతిని తీసుకెళ్లు.. మోసుకెళ్లు. డబ్బులు కావాలా. ఏం కావాలన్న అడుగు అని పంపించేస్తాడు రాజ్. దాంతో ఇద్దరూ షాక్ అయి వెళ్లిపోతారు. అనంతరం నవ్వుకున్న రాజ్.. రేయ్ అంతరాత్మ బయటకు రా అని రాజ్ అనడంతో బయటకు వస్తుంది. చూశావా.. నేను ఏమాత్రం ఫీల్ అవ్వలేదు అని రాజ్ అంటాడు. ఈ మేకపోతు గాంభీర్యం ఎన్ని రోజులో చూస్తాను. వాళ్లు ఇంకా రెచ్చిపోతే అప్పుడు చూసి కుళ్లుకుని చస్తావ్ అని రాజ్ అంతరాత్మ అంటుంది.

అలా ఏం జరగదు. నువ్ లోపలికి వచ్చేయ్ అని రాజ్ అంటాడు. అనంతరం మా అమ్మ చెప్పినట్లు కల్యాణ్‌ను మచ్చిక చేసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉందని అనామిక అనుకుంటు కాఫీ తీసుకొస్తుంది అనామిక. ఇంతలో అప్పుకు కాల్ చేసిన కల్యాణ్ కలవాలని అంటాడు. ఎందుకు అని అప్పు అడిగితే.. ఇప్పుడు కారణాలు చెప్పాల్సి వస్తుందని కల్యాణ్ అంటాడు. నీకు పెళ్లి అయింది. మనం ఫ్రెండ్స్ అనుకున్నా ఇతరులు అనుకోవాలి అని అప్పు అంటుంది.

తనకు పేరు ఉంది

ఇతరుల గురించి ఎందుకు అని కల్యాణ్ అంటే.. నేను పట్టించుకుంటాను అని అప్పు అంటుంది. నేను బాధలో ఉన్నాను అన్న కలవవా. మనం కలుస్తున్నాం అని కాల్ కట్ చేస్తాడు కల్యాణ్. ఆ మాటలు అన్ని విన్న అనామిక కోప్పడుతుంది. ఎవరు ఫోన్‌లో అని అనామిక అడిగితే.. విన్నావ్ కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నావ్ అని కల్యాణ్ అంటాడు. దాన్ని ఇప్పుడు కలవడానికి వెళ్తున్నావ్ అని అనామిక అంటే.. దాన్ని దీన్ని ఏంది తనకు పేరుంది అని కల్యాణ్ అంటాడు.

పెళ్లయిన వాడితో మాట్లాడేదానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని అనామిక అంటే.. నాకు ఉంది. అందుకే నువ్ ఏం చేసిన గౌరవంగా మాట్లాడుతున్నా అని కల్యాణ్ అంటాడు. మరోవైపు పెళ్లయిన వాన్ని కలిస్తే ఏమనుకుంటారు అని కనకం అప్పుని అడిగితే.. మేము ఏంటో మాకు తెలుసు. నాకు కష్టం అని తెలిసి ఎన్నోసార్లు వచ్చి హెల్ప్ చేశాడు. అలాంటిది వాడికి కష్టం అంటే నేను పిలిస్తే పిలవకుండా ఎలా ఉంటాను అని అప్పు అంటుంది.

రాజ్ ట్విస్ట్ గురించి

మేము మారం. మా బంధంలో తప్పు లేదు. నీకు తప్పని అనిపిస్తే నువ్ చూడకు అని చెప్పేసి వెళ్లిపోతాడు కల్యాణ్. ఏంటయ్యా ఇది ఇలా వెళ్లిపోతుంది అని కనకం అంటే.. తప్పు చేస్తే మందలించొచ్చు. హెల్ప్ చేస్తానంటే ఏం అంటాం. తప్పు చేయని కూతురుని మందలించలేం అని కృష్ణమూర్తి అంటాడు. రాజ్ అలా ట్విస్ట్ ఇచ్చిన దాని గురించి మాట్లాడుకుంటూ వస్తుంటారు కావ్య, భాస్కర్. అది చూసి మీరు అనుకున్న పని పూర్తి అయినట్లుందని ఇందిరాదేవి అడుగుతుంది.

జరిగినదానికి వెటకారంగా రివర్స్ చెబుతారు కావ్య, భాస్కర్. ఏంటీ అలా చెబుతున్నారు అని ఇందిరాదేవి అంటుంది. అక్కడ అలా జరగలేదు. ఆయన మాకు సూట్ ఏ బాధ లేకుండా ఇచ్చారు. కలిసి వెళ్లమని కారు కూడా ఇచ్చారని కావ్య చెబుతుంది. అర్థమైంది వాడు రివర్స్ అయ్యాడు. వాడు ఎలా వచ్చిన వాడికి స్పీడ్ బ్రేకర్స్ ఎలా వేయాలో నాకు తెలుసు. ఉండండి చెబుతాను అని వెళ్లిపోతుంది ఇందిరాదేవి. కల్యాణ్ అన్న మాటలు తలుచుకుంటూ ఏడుస్తుంది అనామిక.

ఎవరు విలువ ఇస్తారు

ఇంతలో అనామిక దగ్గరికి వచ్చిన ధాన్యలక్ష్మీ ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. ఆ స్వప్న ఎన్ని మాటలు అందో చూశావుగా. తాతయ్యగారు ప్రాపర్టీ కూడా రాసిచ్చారు. ఇలా గొడవ పెట్టుకున్నవాళ్లకు ఆస్తి రాసిస్తే.. మీ అబ్బాయికి మీకు ఏం మిగులుతుంది. ఏదో ఒకరోజు రోడ్డు మీదకు వెళ్లాల్సి వస్తుంది అని అనామిక అంటుంది. అంతదాకా వచ్చేవరకు నేను చూస్తానా. ఎన్ని గొడవలు ఉన్నా నువ్ నీ భర్తతో అన్యూన్యంగా ఉండాలి. కల్యాణ్ బయట పడుకోడం చూశాను. మీకు ఎన్ని గొడవలు ఉన్నా రూమ్ వరకే చూసుకోవాలి. ఇలా బయట పడితే నీకు ఎవరు విలువ ఇస్తారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

తప్పు ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ మీ గొడవలను బెడ్ రూమ్ వరకే ఉంచుకోవాలి అని ధాన్యలక్ష్మీ అంటే.. మీ అబ్బాయి తప్పు చేసిన ప్రేమగా ఉందామని అనుకున్నా. కానీ, ఆయన తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అప్పుతో మాట్లాడుతున్నారు. పెళ్లయిన నాకు అది ఎలా ఉంటుంది అని అనామిక అంటుంది. వాడు అలా మాట్లాడడు అని ధాన్యం అంటే.. లేదని గట్టిగా చెబుతుంది అనామిక. తర్వాత సరే నీ మూడ్ మార్చేందుకు మనం బయటకు వెళ్దాం. ఫ్రెష్ అయి రా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

అమెరికాలో సెటిల్ కావొచ్చు

దాంతో అనామిక వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ చేసింది డైజెస్ట్ చేసుకోలేకపోతారు కావ్య, భాస్కర్. ఇంతలో తమ్ముడు అన్నయ్య అని రాజ్ పిలుస్తాడు. దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్యకు పాస్ పోర్ట్ తీసుకొచ్చి ఇస్తాడు రాజ్. మీ బావతో అమెరికాకు వెళ్లి కొత్త లైఫ్ లీడ్ చేయడానికి లైన్ క్లియర్ అయిపోయింది. మనం విడిపోయాక నువ్ సంతోషంగా మీ బావతో కలిసి అమెరికాలో సెటిల్ కావొచ్చు అని రాజ్ అంటాడు. దాంతో షాక్ అయిన కావ్య ఇందిరాదేవికి చెబుతుంది. ఇక లాభం లేదు చివరి అస్త్రం వదలాల్సిందే అని ఇందిరాదేవి అంటుంది.