Brahmamudi April 8th Episode: బ్రహ్మముడి.. తన గొయ్యి తానే తీసుకున్న రాజ్.. జెనరల్ మేనేజర్‌గా రాహుల్, పాపం అనామిక-brahmamudi serial april 8th episode raj advice to kavya for find vennela rudrani plan on anamika brahmamudi today episod ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 8th Episode: బ్రహ్మముడి.. తన గొయ్యి తానే తీసుకున్న రాజ్.. జెనరల్ మేనేజర్‌గా రాహుల్, పాపం అనామిక

Brahmamudi April 8th Episode: బ్రహ్మముడి.. తన గొయ్యి తానే తీసుకున్న రాజ్.. జెనరల్ మేనేజర్‌గా రాహుల్, పాపం అనామిక

Sanjiv Kumar HT Telugu
Apr 08, 2024 07:53 AM IST

Brahmamudi Serial April 8th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 8వ తేది ఎపిసోడ్‌లో కావ్యకు సలహా ఇచ్చి తన గొయ్యి తానే తీసుకుంటాడు రాజ్. అలాగే అనామికను పిచ్చిదాన్ని చేసి కొత్త ప్లాన్ వేస్తారు రుద్రాణి, రాహుల్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 8వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 8వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటి బయట అనామిక రావడం కోసం ఎదురుచూస్తుంటారు రాహుల్ అండ్ రుద్రాణి. అనామిక రావడంతోనే బాగా నటించాలి అని రుద్రాణి అంటుంది. పొగడటం అంటే కష్టం కానీ, తిట్టడం ఈజీ మామ్ అని రాహుల్ అంటాడు. అనామికకు వినిపించేలా గట్టిగా రాహుల్ మాట్లాడుతాడు.

కొడుకుగా పుట్టడమే తప్పు

ఏ తల్లి అయినా కొడుకును మంచి పొజిషన్‌లో చూడాలనుకుంటుంది. కానీ, నువ్ మాత్రం ఇంకా బానిసలాగే పడి ఉండమని చెబుతున్నావ్. ఎండీ సీటులో ఏం చేయలేకపోయావ్. మన రాహులే కదా అని ఊరుకున్నాను. కనీసం నాకోసం ఈ ఒక్క పని కూడా చేయట్లేదు అని రాహుల్ అంటాడు. మనం చెబితే ఎవరు వింటారు అని రుద్రాణి అంటుంది. అలా చెప్పి తప్పించుకోకు మామ్. అసలు నీ కొడుకుగా పుట్టడమే నా తప్పు అని రాహుల్ అంటాడు.

అదంతా విన్న అనామిక వచ్చి.. అలా తల్లితో మాట్లాడటం కరెక్ట్ కాదని అంటుంది. గట్టు మీద కూర్చున్నవాళ్లు ఏమైనా చెబుతారు. వాళ్లకేం తెలుసు నా బాధ అని రాహుల్ వెళ్లిపోతాడు. ఏమైంది ఆంటీ అని రుద్రాణిని అనామిక అడుగుతుంది. కల్యాణ్ ఎండీ అయ్యాడు. కనీసం రాహుల్‌ను జెనరల్ మేనేజర్‌ను చేయమని అడుగుతున్నాడు. కానీ, వాడిని ఎవరిని నమ్ముతారు. ఒక్కసారి తప్పు చేస్తే అంతే. రెండోసారి అవకాశం ఇవ్వరా. ఈ ఇంట్లో మాకు సపోర్ట్ చేసేవాళ్లు ఎవరున్నారు అని రుద్రాణి ఇలా స్కెచ్ వేస్తుంది.

పిచ్చిది ఏమంటుంది

ఊరుకోండి ఆంటీ. నేను కల్యాణ్‌తో మాట్లాడి రాహుల్‌ను జెనరల్ మేనేజర్‌గా పెట్టుకోమని చెబుతాను. మాకోసం ఎంతో చేశారు. మీకోసం ఇది కూడా చేయలేనా. కల్యాణ్‌ను ఏదోలా ఒప్పిస్తాను. రాహుల్‌కు చెప్పి ఆఫీస్‌కు రెడీ అవ్వమని చెప్పండి. నేను మీకున్నా. ఏది ఉన్నా నాకు చెప్పండి అని వెళ్లిపోతుంది అనామిక. దాంతో తెగ సంబరపడిపోతుంది రుద్రాణి. ఇంతలో వచ్చిన రాహుల్ ఏమంటుంది పిచ్చిది అని అడుగుతాడు.

కల్యాణ్‌ను ఒప్పిస్తాను అంటుంది. రాజ్ ఎలాగు లేడు కాబట్టి.. నువ్ ఆఫీస్‍కు వెళ్లి.. కల్యాణ్‌ను చేతగాడి వాడిని చేసి నువ్ ఎండీ అవ్వాలి అని రుద్రాణి అంటుంది. అవుతాన్ మామ్ అని రాహుల్ అంటాడు. మరోవైపు బాబు ఏడుస్తుంటే రాజ్ ఊరుకోపెడతుంటాడు. అమ్మ వస్తుంది. పాలు ఇస్తుంది. ఆడిస్తుంది అని రాజ్ అంటాడు. అది విన్న కావ్య కోపంతో రాజ్‌పై అరుస్తుంది. నేను వాడికి అమ్మను ఎలా అయ్యాను. నన్ను అమ్మగా ఎలా పరిచయం చేస్తారు అని గొడవ పెట్టుకుంటుంది.

అమ్మను చేయకండి

కావాలంటే వాడికి మీ నాన్న పెళ్లాం అని పరిచయం చేయండి. ఇంట్లో వాళ్లను వరుసపెట్టి వరుసలు చెబుతూ పరిచయం చేయండి. అంతేకానీ నన్ను వాడికి అమ్మను చేస్తే మాత్రం ఊరుకోను. అమ్మనా బొమ్మనా. ముద్దు లేదు. ముచ్చట లేదు. నవ మాసాలు మోయకుండానే తల్లిని ఎలా చేస్తారు. వాడి ముడ్డి కడిగాను, మూతి కడుగుతున్నాను. నాతో అన్ని పనులు చాలా తెలివిగా చేయిస్తున్నారు. అమ్మ వస్తుంది, ఉగ్గు తెస్తుంది, పాలు ఇస్తుంది అని నన్ను ఇంకోసారి వాడి అమ్మను చేయకండి అని గట్టిగానే ఇస్తుంది కావ్య.

కావ్య మాటలకు సైలెంట్ అయిపోతాడు రాజ్. అనంతరం వెన్నెల గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించినా కావ్య.. రాజ్‌తో నాకో సలహా కావాలి అంటుంది. నాకు ఓ చిన్నప్పటి ఫ్రెండ్ ఉంది. కానీ అడ్రస్ తెలియదు. ఇప్పుడు దాన్ని వెతికి పట్టుకోవాలంటే ఏం చేయాలని అడుగుతుంది కావ్య. ఇప్పుడు ఆ ఫ్రెండ్‌తో పనేంటో అని రాజ్ అంటే.. దాని భర్త కూడా ఇలాగే వేరే బిడ్డను తీసుకొచ్చాడు. అప్పుడు అది ఏం చేసిందో తెలుసుకోవాలి అని కావ్య అంటుంది.

కామన్ ఫ్రెండ్స్‌తో తెలుసుకో

తన భర్తను ఇంట్లో నుంచి గెంటిసిందో, విడాకులు ఇచ్చిందా, పుట్టింటికి వెళ్లిపోయిందా, పంచాయితీలో నిలబెట్టి పరువుతీసిందా అనేది నాకు తెలియాలి అని కావ్య అంటే.. నా గొయ్యి నేనే తీసుకోవాలా అని రాజ్ అంటాడు. లేదు వాడు ఆడుకునే గిలక్కాయాతో తవ్వుకోండి గొయ్యి అని కావ్య పంచ్ వేస్తుంది. సోషల్ మీడియాలో ట్రై చేయి.. లేదంటే కామన్ ఫ్రెండ్స్‌తో తెలుసుకో అని రాజ్ సలహా ఇచ్చి వెన్నెలను పట్టుకోవడంలో తనకు తెలియకుండానే తన గొయ్యి తాను తీసుకుంటాడు.

బాగుంది అనుకున్న కావ్య.. ఈమాత్రం చచ్చు ఐడియాస్ నాకు రాక కాదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రై చేశాను. కామన్ ఫ్రెండ్స్‌ను అడగాలి అని కావ్య అంటుంది. ఈ పనికిమాలిన తెలివితేటలతో ఇన్నాళ్లు ఎలా బతికేస్తున్నావ్ అని రాజ్ అంటాడు. ఈ పనికిమాలిన తెలివితేటలతోనే వెన్నెలను పట్టుకుని మీ సంగతి తేలుస్తాను అని కావ్య అనుకుంటుంది. ఇంతకీ నీ ఫ్రెండ్ పేరెంటి అని రాజ్ అంటే.. పున్నమి అని చెప్పి వెళ్లిపోతుంది.

మీ నిర్ణయమే కదా

ఇంటికి లాయర్ వస్తాడు. ఎవరైనా రమ్మన్నారా అని సుభాష్ అంటే.. నేనే పిలిచాను. ఇంట్లో వాళ్లకోసం, కంపెనీ బాధ్యతలు, స్థానాలకు సంబంధించి పిలిచాను అని రాజ్ అంటాడు. లాయర్ వచ్చాడంటే నాకు ఏదో కీడు శంకిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందరిముందు చర్చించి తీసుకో అని అపర్ణ అంటుంది. ఇది నా నిర్ణయం కాదు. మీరంతా కలిసి తీసుకున్నదే. నా ప్లేసులో కల్యాణ్ బాధ్యతలు తీసుకోవడం మీ అందరి నిర్ణయమే కదా అని రాజ్ అంటాడు.

నా స్థానంలో ఎలాంటి పవర్స్ లేకుండా కల్యాణ్ కూర్చున్న లాభం ఏముంది. అందుకే వాడి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాసిద్దామనుకుంటున్నాను. వాడికి ఫుల్ చెక్ పవర్ ఇష్యూ చేద్దామనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అయితే.. అనామిక, ధాన్యలక్ష్మీ సంతోషపడతారు. ఆహా.. కల్యాణ్‌తో చెక్ మీద ఒక్క సంతకం తీసుకుంటే చాలు.. మా ఫ్యామిలీ సమస్యలు తొలగిపోతాయి అని అనామిక అనుకుంటుంది.

ఊహించుకోలేకపోతున్నాను

రాజ్ నిన్ను ఎండీ పదవి నుంచి వద్దంటే మాత్రం ఇలా చేస్తావా. కావ్య నీ భర్త అన్ని స్థాయిలు కోల్పోతున్నాడు. నువ్ ఏం అనవా. నీ అభిప్రాయం చెప్పవా అని ఇందిరాదేవి అంటుంది. నా అభిప్రాయం. మా ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడే సత్య హరిశ్చంద్రుడు. తండ్రి మాటను జవదాటకుండా అయోధ్యను విడిచిన రాముడు వంటి యుగపురుషుడు. వాళ్లలాగే ఉత్తమపురుషుడు అని గొప్పగా చెబుతూనే తన బాధను చెబుతుంది కావ్య.

దాంతో ఎమోషనల్ అయిన రాజ్ కళావతి అంటాడు. ఏంటండి. ఏమైనా తప్పుగా మాట్లాడానా. ఇంట్లో వాళ్లు మిమ్మల్ని ఏమైనా తప్పుగా అన్నారా.. ఆ బిడ్డ ఎవరు అని అడిగారు. ఆ బాబుకు తల్లి ఎవరు అని అడిగారు. దేనికి మీ దగ్గర సమాధానం లేదు. బిడ్డ కోసం మీ సర్వస్వం ధారపోస్తున్నారు. అంత ఎత్తులో మిమ్మల్ని చూసిన నేను ఇలా చూడలేకపోతున్నాను. ఒక సామాన్యుడిలా ఊహించుకోలేకపోతున్నాను అని కావ్య అంటుంది.

సింహాసనంపైనే ఉండాలి

దీనంతటికి కారణం ఆ బిడ్డ. ఆ బిడ్డ పుట్టుకకు వెనుక ఉన్న కారణం చెప్పండి అని కావ్య అంటుంది. అంటే నీకు కల్యాణ్‌కు చెక్ పవర్ ఇవ్వడం ఇష్టంలేదా అని రుద్రాణి అంటుంది. నేను ఏం అంటున్నాను. మీరు ఏం అర్థం చేసుకున్నారు. నేను నా భర్త స్థాయి గురించి మాట్లాడుతున్నా. స్థానం కాదు. నాకు అన్యాయమే జరిగిందే న్యాయమే జరిగిందో. నా కాపురం సంగతి నేను తేల్చుకోగలను అని కావ్య అంటుంది.

కానీ, నా భర్తను ఎలాంటి స్థాయి లేకుండా ఒక అనామకుడిలా చూడలేను. కావాలంటే కవిగారికి మా ఆయనకు సంబంధించి ఆస్తి మొత్తం ఇచ్చేసిన నాకు పర్వాలేదు. కానీ, రాజు ఎప్పుడు సింహాసనంపైనే ఉండాలి. పరివారం మధ్య కాదు. ఎవరు ఏమనుకున్నా మా ఆయన దుగ్గిరాల కుటుంబానికి అసలైన వారసుడు. కంపెనీకి ఆయన ఎప్పుడూ అధినేతగా ఉండాలి అని కావ్య అల్లాడించేస్తుంది. అంతా ఎమోషనల్ అవుతారు.

బిడ్డను వదిలిపెట్టు

ఇవాళ పరిష్కారం దిశగా అందరం మాట్లాడాలి అని కావ్య అంటుంది. అనామిక, ధాన్యలక్ష్మీ మాత్రం కంగారుపడతారు. విన్నావా రాజ్. నువ్ తీసుకున్న నిర్ణయం వల్ల నీ స్థాయి పడిపోతుందని చెబుతుంది. ఏదైనా చేసేముందు భార్య అంతరగం ఏంటో తెలుసుకుని తీసుకోవాలి. నీ భార్య అడిగినదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని సుభాష్ అంటాడు. కళావతి నువ్ కూడా నా నిర్ణయానికి అడ్డు చెబుతున్నావా అని రాజ్ అంటే.. లేదని కావ్య అంటుంది.

మరి ఎందుకు అడ్డు పడుతున్నావ్ అని రాజ్ అడుగుతాడు. నాకు అన్యాయం చేసినా మీకు న్యాయం కావాలని అడగడం తప్పే అయితే నన్ను క్షమించండి అని కావ్య అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఆ బిడ్డ కోసం స్థాయి దిగజారుతున్నావ్. ఇప్పటికైనా నిజం బయటపెట్టమని, లేదంటే బిడ్డను వదిలిపెట్టమని రాజ్‌తో అపర్ణ అంటుంది.

Whats_app_banner