Brahmamudi March 23rd Episode: బ్రహ్మముడి.. రాజ్ బిడ్డ రహస్యం తెలుసుకోనున్న కావ్య.. అపర్ణకు చురకలు, కల్యాణ్‌కు పట్టం-brahmamudi serial march 23rd episode dhanyalakshmi started war against raj for kalyan brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 23rd Episode: బ్రహ్మముడి.. రాజ్ బిడ్డ రహస్యం తెలుసుకోనున్న కావ్య.. అపర్ణకు చురకలు, కల్యాణ్‌కు పట్టం

Brahmamudi March 23rd Episode: బ్రహ్మముడి.. రాజ్ బిడ్డ రహస్యం తెలుసుకోనున్న కావ్య.. అపర్ణకు చురకలు, కల్యాణ్‌కు పట్టం

Sanjiv Kumar HT Telugu
Mar 23, 2024 08:43 AM IST

Brahmamudi Serial March 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 23వ తేది ఎపిసోడ్‌లో రాజ్ బిడ్డను తీసుకురావడంతో ఎవరి ప్లాన్స్ వారు వేస్తున్నారు. ఇంట్లో ఇక కురుక్షేత్రమే అని చెప్పిన ధాన్యలక్ష్మీ కైకేయిలా కల్యాణ్‌కు పట్టం కట్టాలని చూస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 23వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 23వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌ బిడ్డను తీసుకురావడంతో ఎందుకింతా దగా చేశారు. ఎందుకింత మోసం చేశారు అని నిలదీస్తుంది కావ్య. ఆరోజు పెళ్లిలో నేను ముసుగుతో వచ్చాను. కానీ తాళి కట్టే సమయానికి ముసుగు తీశాను. కానీ, మీరు ఏడిదాపాటు ముసుగులోనే ఉన్నారు. మోసం చేశానని నన్ను దూరం పెట్టారు. నేను మీకు విడాకులు ఇస్తే కలిసి ఉందామని అంటారని అనుకున్నాను. కానీ, ఇలా బిడ్డను తీసుకొచ్చి కలిసి ఉందామని అంటారని అనుకోలేదు అని కావ్య అంటుంది.

ఇది న్యాయమేనా

అసలు అంతా బిడ్డ గురించే అడుగుతున్నాం కానీ. ఆ బిడ్డను కన్న తల్లి ఎవరు. చెప్పండి అని రాజ్ వెళ్లిపోతుంటే గట్టిగా అడుతుంది కావ్య. ఆ చప్పుడుకు బిడ్డ లేచి ఏడుస్తాడు. దాంతో రాజ్ ఆ బిడ్డను ఎత్తుకుని లాలిస్తాడు. అది చూసి విసుగ్గా వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు ఇందిరాదేవిని ఇది న్యాయమేనా అని అడుగుతుంది కనకం. రాజ్‌లో ప్రేమలో ఉందని, అది బయటకు తీసుకురావాలని ఏదో ప్రయత్నం చేశారు. కానీ వచ్చింది వేరే అమ్మాయిపై ఉన్న ప్రేమకు ప్రతిరూపం. ఇప్పుడు కూడా నా కూతురు దేనికోసం ఎదురుచూడాలి అమ్మా అని కనకం అంటుంది.

ఆ బిడ్డకు తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాలా. ఆ ఆడది వచ్చి నా కూతురు స్థానం తీసుకుంటే మేము ఇంటి బయట ఉండి దీనస్థితిలో అడుక్కోవాలా అని కనకం అంటుంది. అమ్మా మీరు పెద్దవారు. ఎప్పుడూ రాముడుకే మొర పెట్టుకునే కప్ప అదే రాముడు వల్లి బాధ కలిగితే ఎవరికి చెప్పుకోవాలమ్మా. నా కూతురుని బాధపెట్టే హక్కు ఆయనకు లేదమ్మా అని కృష్ణ మూర్తి అంటాడు. మీ అమ్మాయికి నిజంగానే తీరని కష్టం వచ్చింది. అంతా శూన్యంగా మారింది. ఇప్పుడు నేను ఎవరికీ ఏ సంజాయిషీ ఇచ్చుకోలేను. ఏ పరిష్కారం చూపించలేను. నన్ను క్షమించండి అని చేతులతో పశ్చాత్తాప పడుతుంది ఇందిరాదేవి.

పెంపకంపై నిందలు

అమ్మా మిమ్మల్ని క్షమించేంత గొప్ప వాళ్లు ఇక్కడ ఎవరు లేరమ్మా. కానీ, నా బిడ్డకు ఏదో ఒక పరిష్కారం చూపించాలమ్మా అని కనకం అంటుంది. ఇంతలో ఏంటీ చూపించేది అంటూ అపర్ణ ఎంట్రీ ఇస్తుంది. ఈ ఇంట్లో ఎవరు ఎవరినీ ఓదార్చాలో అర్థం కానీ శూన్యంలోకి వెళ్లిపోయాం. మా జీవితాలే తలకిందులు అయ్యాయి. మా నమ్మకాలే ముక్కలైపోయాయి. మా పెంపకంపై నిందలు పడిపోతున్నాయి. ఇది మా ఇంటి సమస్య. మేము చూసుకుంటాం. మా అత్తగారిని నిలదీస్తున్నారు ఏంటీ అని అపర్ణ అంటుంది.

ఎంత మాట అమ్మా. మేము నిలదీయట్లేదు. మా అమ్మాయి దీనస్థితిని విన్నవించుకుంటున్నాం అని కృష్ణమూర్తి అంటాడు. మా అమ్మాయి కడుపులో రగులుతున్న చిచ్చు గురించి బాధపడటం మీకు తప్పుగా కనిపిస్తుందా అని కనకం అంటుంది. నీ కూతురు కడుపుని చిచ్చు రగట్లేదు. అసలు నీ కూతురు జేష్ట్యదేవిలా మా ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచే మా ఇంట్లో సమస్యలు మొదలు అయ్యాయి. ఆ తల్లి పాదం అలాంటిది. ఆరోజు నుంచి ఈరోజు వరకు నా కొడుకుకు ప్రశాంతతే కరువైంది. అందుకే వాడు ఈ పని చేసి ఉంటాడు అని అపర్ణ అంటుంది.

మర్యాదగా వెళ్లిపోండి

ఏం పని అమ్మా. ఘనకార్యమా. ఇంకొక బిడ్డను తీసుకురావడమా. భార్య జీవితాన్ని నాశనం చేయడమా. మేము పుట్టెడు దుఖంలో ఉంటే శాపనార్థాలు పెడతారేంటీ. మేము తిరిగి ఏం అనలేమనా. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమౌవుతుందా. నా కూతురు మీ అవమానాలు భూదేవిలా భరిస్తుంటే మీరు ఇచ్చే బిరుదు జేష్ట్యదేవి అనా అని కనకం అంటుంది. కనకం ఇప్పుడు నేను ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. మర్యాదగా వెళ్లిపో అని అపర్ణ అంటుంది.

ఇప్పటివరకు మీరు మాకు వెలగబెట్టిన మర్యాద ఏంటమ్మా. నీ కొడుకు తప్పు చేస్తే అది కూడా నా కూతురు తప్పు అంటున్నారే. నా కూతురుకి అన్యాయం చేసి పైగా దానిదే తప్పంటే మర్యదగా ఉండదు అని కనకం అంటుంది. ఇంకా ఆపు.. అంత కష్టంగా ఉంటే నీ కూతురుని ఇప్పుడే తీసుకెళ్లమని అపర్ణ అంటుంది. దాంతో పంపించడి. నా కూతురు నాకు బరువు కాదు. నీ కోటలో బానిసలా ఉండే కన్నా తీసుకెళ్తాను అని కనకం అంటుంది. ఇంతలో కావ్య వస్తుంది.

నిలదీయకుండా రాను

అమ్మా ఏంటిది అని కావ్య అంటుంది. చూశావా నీ అత్తగారు ఏమంటున్నారో. నీ సహనం చాతకాని తనం అయింది. ఇంకా సర్దుకుపోమ్మని ఏ తల్లి చెప్పదు. పదా మన ఇంటికి వెళ్దాం అని కనకం అంటుంది. ఎక్కడికి రావాలి. అసలు ఎందుకు రావాలి. నేను ఏ నేరం చేశానని నాకు ఈ శిక్ష వేశాడు ఆ పెద్దమనిషి. అతన్ని నిలదీయకుండా ఎందుకు రావాలి. ఆ పెద్దమనిషిని నిలబెట్టి నిలదీయకుండా ఎందుకు రావాలి. అత్తతో పడక అత్తింటి గడప దాటే రకం కాదు నీ కూతురు. దీనంగా హీనంగా పుట్టింటికి పరిగెత్తుకు వచ్చే అబల కాదు నీ కూతురు అని కావ్య అంటుంది.

అవును, నాకు అన్యాయం జరిగింది. న్యాయం కావాలి కదా. మొదటిసారి ఈ ఇంట్లో అధర్మం కాలు మోపింది. ధర్మం అడగాలి కదా. ఆ బిడ్డ ఏంటీ. అసలు వాస్తవం ఏంటో నిలదీసే దాకా నన్ను ఏ శక్తి అడుగు బయటపెట్టమని శాసించలేదు అని ఇన్ డైరెక్టుగా అపర్ణ గురించి అంటుంది. దాంతో అపర్ణ షాక్ అయి చూస్తుంది. ఇక్కడ నమ్మకం చచ్చింది. ఈ దుగ్గిరాల కుటుంబం నాకు ఏ సమాధానం చెబుతుందో తెలుసుకునేదాకా నేను కదిలేదు లేదు వదిలేది లేదు వచ్చేది లేదు చచ్చేది లేదు అని కావ్య అంటుంది.

తల్లిని తీసుకొస్తాడు

ప్రశాంతంగా వెళ్లమని కనకంకు చెబుతుంది కావ్య. అది కాదని కనకం అంటే.. అప్పు తీసుకెళ్లు అని చెబుతుంది కావ. దాంతో అప్పు వాళ్లను తీసుకెళ్తుంది. మరోవైపు కావ్య పెళ్లి పెటాకులు అయింది. నా కడుపు నిండిపోయిందని రుద్రాణి అంటుంది. ఇన్నాళ్లు పెద్దకోడలు అని విర్రవీగింది. ఇప్పుడు పరువు అంతా పోయిందని అనామిక అంటుంది. ఇవాళ బిడ్డను తీసుకొచ్చాడు. రేపు ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తాడు. రాజ్ పరువు బజారున పడుతుంది అని రుద్రాణి అంటుంది.

దాంతో ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. రాజ్ పరువు పోతే కుటుంబం పరువు పోయినట్లే. ఈ ఇంట్లో ఉంటూ పరువు పోవాలని అనుకుంటున్నావా. అది నీకు సంతోషాన్ని ఇవ్వడం ఏంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంకో అమ్మాయిని రాజ్ తల్లిని చేశాడంటే నమ్మకలేకపోతున్నా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని రాహుల్ అంటాడు. సరిపోయింది. ఆయన ఆల్రెడీ బిడ్డను పట్టుకుని పాతాళంలోకి పడిపోయాడు. అత్తయ్య మీ నమ్మకం కన్నా వాస్తవం ముఖ్యమైనది అని అనామిక అంటుంది.

రుద్రాణి స్కెచ్

రేపో మాపో అంతా ఆ బిడ్డను ఒప్పుకుంటారు. తర్వాత ఆ బిడ్డను వంశ వారసుడిగా చేశారు. తర్వాత కల్యాణ్‌కు ఏం మిగలదు. కావ్య ఎటు వెళ్లలేక ఇంట్లో సర్దుకుపోతుంది కావ్య. దాంతో సమస్య అయిపోతుంది అని అనామిక అంటుంది. అంటే మంచిగా ఆలోచిస్తే మనకే మంచి జరగదు. అపర్ణకు చురకలు అంటించి ఆ బిడ్డను వారసుడిగా చేయొద్దు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ఇంట్లో ఎవరెవరు ఎలా ఆలోచిస్తారు అని రుద్రాణి చెబుతుంది.

ఏది ఏమైనా ఈ ఇంట్లో మరో కురుక్షేత్రం మొదలు కాబోతుంది. ఈ కోటకు బీటలు పడ్డాయి. రాజ్‌ను దింపేసి నా కొడుకుకు పట్టాభిషేకం జరిపించేదాకా నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని ధాన్యలక్ష్మీ రామాయణంలో కైకేయిలా అంటుంది. చేయ్.. చేయ్.. నువ్ రాజ్‌ను గద్దే దింపితే నేను నీ కొడుకుని తప్పించే నా కొడుకుకు పట్టం కట్టేలా చేస్తాను అను రుద్రాణి శకునిలా స్కెచ్ వేస్తుంది. మరోవైపు ఏ ధైర్యంతో మీ అమ్మవాళ్లతో మాట్లాడావు అని ఇందిరాదేవి అంటుంది.

ప్రశ్నార్థకంగానే

ధైర్యం ఏమో గానీ పిరికితనం లేదు. అయ్యో అంతా అయిపోయిందని బాధపడే సాధారణ అమ్మాయిని కాదు అని కావ్య అంటుంది. దాంతో విడాకులు ప్లాన్ ఇచ్చినందుకు నన్ను క్షమించమ్మా అని చేతులతో మొక్కుతుంది ఇందిరాదేవి. నేను చేసేది ఇక ఏం లేదు. వాడి జీవితంలో ఇంకో ఆడది ఉందని తెలిసాకా మీ ఇద్దరిని కలిసి ఉండమని చెప్పలేక. విడిపోమని చెప్పలకే. ఇంత అనుభవం ఉండి నిస్సాహయంగా ఉండిపోయాను. నువ్ అడిగితే ఇంట్లో ఎవరు సమాధానం చెప్పలేరు. కానీ, నీ జీవితం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది అని ఇందిరాదేవి అంటుంది.

పుట్టింటికి వెళ్లడం మాత్రం పరిష్కారం కాదని అర్థమవుతోంది అని కావ్య అంటుంది. నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. నీకు రాజ్‌పై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నీలాంటి కోడలు ఈ ఇంటికి రావడం అదృష్టం అనుకున్నా. కానీ, నా మనవడు చేసిన పనికి మంచి కోడలు వెళ్లిపోతుందేమో అనిపిస్తుంది. నువ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న కాదనే శక్తి ఎవరికీ లేదు అని ఇందిరాదేవి వెళ్లిపోతుంది. మరోవైపు ఇంటికి కావ్య రానన్నందుకు కనకం ఆవేశపడుతుంది.

కర్మకాండలకు వస్తుంది

వస్తువులు పగులకొడుతుంది. ఇంత జరిగినా ఎందుకు ఉంటుంది అని కనకం అంటుంది. తనవైపు కూడా ఆలోచించు అని కృష్ణమూర్తి అంటాడు. ఇవాళ బిడ్డతో వచ్చాడు. రేపు ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తాడు. సవితి పోరుతో నా కూతురు ఉండాల్సిన అవసరం లేదు అని కనకం అంటుంది. అలా అయితే నేనే తీసుకొస్తాను. రాకుంటే నేను చస్తానని చెబుతాను. అయినా రాకుంటే నిజంగానే చస్తాను. నా కర్మకాండలకు వస్తుంది కదా. అప్పుడు గదిలో బంధించుకో అని చెప్పేసి ఆవేశంగా వెళ్లిపోతాడు కృష్ణమూర్తి.

మరోవైపు కృష్ణుడితో మొర పెట్టుకుంటుంది కావ్య. ఆయన జీవితంలో నాకు తెలియని మరో కోణం ఉందని బయటపడింది. పెళ్లి రోజు ఏ భర్త ఏ భార్యకు ఇవ్వని బహుమతి తీసుకొచ్చాడు. ఇంటి పెద్దలు కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని కావ్య అంటుంది. ఇంతలో ఆ మాటలు వచ్చి ఇందిరాదేవి వింటుంది. నేను ఇప్పుడు పుట్టింటికి వెళ్లాలా. ఎలా వెళ్లను. నా భర్త వ్యసనపరుడు కాదే. దుర్మార్గుడు కాదే. ఎవరైనా బాధలో ఉంటే తీర్చేవాడే. అలాంటిది ఇంత పెద్ద తప్పు ఎలా చేశాడు అని కావ్య అనుకుంటుంది.

రహస్యం ఏంటీ

ఇప్పుడు నేను వెళ్లిపోతే నా భర్త చేసిన పనికి ఆ మచ్చ అలాగే ఉండిపోదా. లేదు అలా జరగనివ్వను. నేను వెళ్లిపోను. అసలు రహస్యం ఏంటో తెలుసుకునే తీరుతాను అని కావ్య అనుకుంటుంది. అమ్మా కావ్య నీకు ఎంత అనుభవం ఉందని వాడి వ్యక్తిత్వాన్ని నమ్ముతున్నావ్. అంటే నువ్ అర్థం చేసుకున్నంతగా మేము అర్థం చేసుకోలేకపోతున్నామా అని ఇందిరాదేవి అంటుంది. నా అంతరాత్మ ఒప్పుకోలేకపోతుంది అమ్మమ్మ. ఇష్టం లేకున్నా కుటుంబం కోసం నాతో సర్దుకుపోయినావాడు ఇలా చేశాడంటే నమ్మకం కుదరడం లేదు. ఆయనే చెప్పినంత మాత్రానా నిజం అని కాదు కదా అని కావ్య అంటుంది.

Whats_app_banner