Guppedantha Manasu April 11th Episode: గుప్పెడంత మనసు- మను కాళ్లు పట్టుకున్న శైలేంద్ర- చుక్కలు చూపించిన వసు-guppedantha manasu serial april 11th episode shailendra touches manu feet and pleads guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu April 11th Episode: గుప్పెడంత మనసు- మను కాళ్లు పట్టుకున్న శైలేంద్ర- చుక్కలు చూపించిన వసు

Guppedantha Manasu April 11th Episode: గుప్పెడంత మనసు- మను కాళ్లు పట్టుకున్న శైలేంద్ర- చుక్కలు చూపించిన వసు

Sanjiv Kumar HT Telugu
Apr 11, 2024 08:59 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 11వ తేది ఎపిసోడ్‌లో మను కాళ్లు పట్టుకుని ప్రాధేయపడతాడు శైలేంద్ర. అనంతరం మను విషయంలో శైలేంద్రకు చుక్కలు చూపిస్తుంది వసుధార. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 11వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఏప్రిల్ 11వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1047: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మను దగ్గర శైలేంద్ర ఉండి కాలేజీకి రమ్మంటాడు. మీరు రాకపోతే పనులన్ని అక్కడే ఆగిపోతాయి. కచ్చితంగా రావాల్సిందే అని శైలేంద్ర అడుక్కుంటాడు. నేనే కదా ఆ పదవి తీసుకుంది. ఇప్పుడు నాకు రావాలని లేదు అని మను అంటాడు. అలా అనొద్దు. అప్పుడు కాలేజీకి వచ్చి 50 కోట్లు ఇచ్చి కాపాడారు అని శైలేంద్ర అంటాడు.

ఎందుకు రమ్మంటున్నావ్

దాంతో మను అదోలా చూస్తే.. భయపడిపోయిన శైలేంద్ర.. ఇప్పుడు ఆ విషయం ఎందుకులెండి. మీరు రాకుంటే కాలేజీ చాలా సమస్యల్లో పడుతుంది. నేను మిమ్మల్ని అలా అన్నాననే రావట్లేదు అనుకుంటా. ఇంకోసారి మీ తల్లిదండ్రుల గురించి అడగను. అప్పుడు ఏదో క్యూరియాసిటీగా అన్నాను అని శైలేంద్ర అంటాడు. నన్ను కాలేజీ నుంచి బయటకు పంపించేయాలని తెగ ట్రై చేశావ్ కదా. ఇప్పుడెందుకు మళ్లీ రమ్మంటున్నావ్ అని మను అంటాడు.

అదంతా మనసులో పెట్టుకోకండి. మీరు రాకపోతే మా నాన్న చంపేసిన చంపేస్తారు. ప్లీజ్ మీరు రావాలి అని శైలేంద్ర అంటాడు. మను అలా వినకపోయేసరుకు మను కాళ్లు పట్టుకుంటాడు శైలేంద్ర. మను కాళ్లు పట్టుకుని మీరు కాలేజీకి రావాలి అని ప్రాధేయపడతాడు శైలేంద్ర. ఇంతలో ఏవండి.. ఏంటండి ఇది అని ధరణి గొంతు వినిపిస్తుంది. ఇదేంటీ ధరణి వాయిస్ వినిపిస్తుంది. మను కాళ్లకు మెట్టెలు ఉన్నాయేంటీ అని లేచి ధరణిని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర.

పగటి కలలు

ఏంటండి నా కాళ్లు పట్టుకుని నన్ను కాలేజీకి రమ్మని బతిమిలాడుతున్నారు అని ధరణి అంటుంది. ఇదంతా నా డ్రీమా. ఛీ.. నాకు పగటి కలలు ఎక్కువైపోయాయి అని మనసులో అనుకున్న శైలేంద్ర.. నిన్ను కాదులే వేరేవాళ్లను అని అంటాడు. అలా అయితే వాళ్ల దగ్గర అడగాలి కానీ, నా దగ్గర అడుగుతున్నారు అని ధరణి అంటుంది. దాంతో ఏదొటి చెప్పి కవర్ చేస్తాడు శైలేంద్ర. అనంతరం ధరణి వెళ్లిపోతుంది. తర్వాత మనుకు శైలేంద్ర కాల్ చేస్తాడు.

మను రెండోసారి లిఫ్ట్ చేశాకా.. లంచ్ చేశారా బ్రదర్ అని శైలేంద్ర అంటాడు. విషయం చెప్పమని అంటే.. అదంతా తర్వాత. లంచ్ చేశారా అని శైలేంద్ర అంటాడు. దాంతో కాల్ కట్ చేస్తాడు మను. మళ్లీ కాల్ చేస్తాడు శైలేంద్ర. విషయం చెప్పు. నీ సోది నాకొద్దు అని మను అంటాడు. మీరు కాలేజీకి రావాలి బ్రదర్ అని శైలేంద్ర అంటే.. నువ్వెందుకు అడుగుతున్నావ్ అని మను అంటాడు. మీరు బోర్డ్ డైరెక్టర్స్‌లో ఒకరు కదా. మీరు రాకుంటే పని ఆగిపోతుంది. చాలా పెండింగ్ ఫైల్స్ ఆగిపోయాయి అని శైలేంద్ర అంటాడు.

తండ్రి చెప్పిన మాటలు

మీరు కష్టకాలంలో వచ్చి కాలేజీని ఆదుకున్నారు. మళ్లీ రావాలి. నేను మిమ్మల్ని అలా అన్నందుకు నాకు గిల్టీ ఫీలింగ్ అలానే ఉండిపోతుంది. కావాలంటే సారీ చెబుతాను. సారీ బ్రదర్. మీరు దగ్గర లేరు. మీ కాళ్లు ఫొటో తీసి పంపండి. మీ కాళ్లు పట్టుకుని అడుగుతాను అని శైలేంద్ర అంటాడు. కాలేజీకి రావాలన్నది నా ఇష్టం. నీకెందుకు అని మను అంటే.. మను రాకుంటే తను సెక్యూరిటీ బాయ్‌లా గేట్ దగ్గర ఉండాలి అని ఫణీంద్ర చెప్పింది గుర్తు చేసుకుంటాడు శైలేంద్ర.

లేదు బ్రదర్ రావాలి అని శైలేంద్ర ఎంత చెప్పిన రానని మను అంటాడు. తర్వాత ఇంకోసారి కాల్ చేస్తే మర్యాదగా ఉండదు అని శైలేంద్రకు మెసేజ్ పెడతాడు మను. మరోవైపు వసుధరా ఇంటికి విశ్వనాథం, ఏంజెల్ వస్తారు. ఎలా ఉందమ్మా. ఆ అటాక్ చేసింది ఎవరో తెలిసిందా. ఇన్వేస్టిగేషన్ జరుగుతుందా అనే రకరకాల ప్రశ్నలు అడుగుతాడు విశ్వనాథం. అనుపమను ఇంటికి తీసుకెళ్తానని విశ్వనాథం అంటే.. ఇక్కడ తను కంఫర్ట్‌గా ఉందని మహేంద్ర అంటాడు.

కూతురు తప్పు చేయదు

అలా అయితే.. ఇక్కడి నుంచి ఎందుకు వెళ్లాలనుకుంది అని విశ్వనాథం అంటాడు. మేము మను గురించి అడిగేసరికి అలా వెళ్లిపోయింది. మళ్లీ మేం చెప్పాక వచ్చింది. తనకు ఓకే అయితే మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని మహేంద్ర అంటాడు. నువ్ కూడా అడగాలా డాడీ అడుగు అని అనుపమ అంటుంది. నేను నిన్ను ఎంక్వైరీ చేయడానికి రాలేదు. నీ యోగక్షేమాలు తెలుసుకునేందుకు వచ్చాను. నువ్ మాతో వస్తే తీసుకెళ్దామనుకున్నాను. నాకు తెలుసు. నా కూతురు తప్పు చేయదు అని విశ్వనాథం అంటాడు.

మీరు అందరినీ అర్థం చేసుకుంటారు సార్. అది మేడమ్‌కు కూడా తెలుసు. కానీ, అందరం అడిగేసరికి మీతో అలా అంది అని వసుధార అంటుంది. సరేనమ్మా జాగ్రత్తగా ఉండు అని విశ్వనాథం వెళ్లబోతుంటే.. డాడీ నువ్ మనును కలవాల్సిన అవసరం లేదని చెబుతుంది అనుపమ. అది నా చేతుల్లో లేదమ్మా. మను నీ కొడుకు అని నేను అనుకుంటే తెలిసిందా. ఇది కూడా అంతే. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్ ఏ నిర్ణయం తీసుకోకు. నీకు ఈ డాడీ ఉన్నాడని మర్చిపోకు. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నేను ఉన్నానమ్మా అని ధైర్యం చెబుతాడు విశ్వనాథం.

శైలేంద్రను ఆడుకున్న వసు

మరోవైపు కాలేజీ గేట్ దగ్గర ఉండి మను, ఫణీంద్ర మాటలు గుర్తు చేసుకుంటాడు శైలేంద్ర. ఇంతలో వసుధార కాల్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంది. నీకెందుకు అని శైలేంద్ర అంటే.. సరే ఫణీంద్ర సర్‌ను అడుగుతాను అని వసు అంటుంది. వద్దని చెప్పిన శైలేంద్ర గేట్ దగ్గర ఉన్నానంటాడు. అక్కడ ఏం చేస్తున్నారు. హో.. సెక్యూరిటీ గార్డ్‌లా రిహార్సల్స్ చేస్తున్నారా. సరే చెప్పిన పని ఏం చేశారు. ముందు మీరు క్యాబిన్‌కు రండి అని వసు అంటుంది.

ఆర్టరా.. రిక్వెస్టా అని శైలేంద్ర అంటే.. ఆర్డరే.. మీరు రావాలి. వస్తారు అని నాకు తెలుసు అని వసుధార కాల్ కట్ చేస్తుంది. మా డాడీ పేరు చెప్పుకుని ఆడుకుంటుంది అని శైలేంద్ర వెళ్తాడు. క్యాబిన్‌లోకి వచ్చేముందు పర్మిషన్ అడిగి రావాలని తెలియదా అని అంటుంది వసుధార. అవునా, తెలియదు అని శైలేంద్ర అంటే.. అయితే ఇప్పుడెళ్లి పర్మిషన్ తీసుకోండని వసు అంటుంది. దాంతో శైలేంద్ర వెళ్లి పర్మిషన్ అడిగి వస్తాడు.

ట్విస్ట్ ఇచ్చిన మను

సరే చెప్పిన పని ఏం చేశారు అని వసు అంటే.. ఏ పని గుర్తు లేదని శైలేంద్ర అంటాడు. దాంతో వసుధార ఫణీంద్రకు కాల్ చేసేందుకు ట్రై చేస్తుంటే వద్దని చెప్పి.. మనును కాలేజీకి తీసుకురమ్మనడమే కదా. తను రానంటున్నాడు. రిక్వెస్ట్ చేసినా రానంటున్నాడు అని శైలేంద్ర అంటాడు. వెళ్లి కలిసి తీసుకురావాలి కదా అని వసు అంటుంది. ఫోన్‌లో రానన్నవాడు. కలిస్తే వస్తాడా. ఎందుకు ఇంత చిన్నపనికి నన్ను టార్గెట్ చేస్తున్నారు అని శైలేంద్ర అంటాడు.

ఇంతలో మను వస్తాడు. దాంతో శైలేంద్ర, వసు షాక్ అవుతారు. వసుధార.. అదిగో.. మను వచ్చాడు అని సంతోషంగా, ఆశ్చర్యంగా అంటాడు శైలేంద్ర. వసుధార లోపలికి రమ్మంటుంది. దాంతో మను లోపలికి వస్తాడు. మీకోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ అని శైలేంద్ర అంటే.. నువ్ నన్ను బ్రదర్ అని పిలవకు. చాలా కంపరంగా, ఇరిటేటింగ్‌గా ఉంది అని మను అంటాడు. సరేనని శైలేంద్ర అంటాడు.

వసుధార కోసమా?

నువ్ వెళితే నేను వసుధార మేడమ్‌తో మాట్లాడతాను అని మను అంటాడు. హో.. నువ్ వచ్చింది వసుధారతో మాట్లాడేందుకా. సరే.. బాగా మాట్లాడుకోండి అని శైలేంద్ర వెళ్లిపోతాడు. మనును కూర్చోమంటుంది వసుధార. దాంతో మను కూర్చుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.