Krishan mukunda murari april 15th: ఒక్కటైన కృష్ణ, మురారి.. గుండెలు పగిలేలా ఏడ్చిన ముకుంద, మర్డర్ స్కెచ్ వేసిన మీరా-krishna mukunda murari serial april 15th episode meera breaks down as krishna murari share romantic night ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishan Mukunda Murari April 15th: ఒక్కటైన కృష్ణ, మురారి.. గుండెలు పగిలేలా ఏడ్చిన ముకుంద, మర్డర్ స్కెచ్ వేసిన మీరా

Krishan mukunda murari april 15th: ఒక్కటైన కృష్ణ, మురారి.. గుండెలు పగిలేలా ఏడ్చిన ముకుంద, మర్డర్ స్కెచ్ వేసిన మీరా

Gunti Soundarya HT Telugu
Apr 15, 2024 08:03 AM IST

Krishan mukunda murari serial april 15th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఎట్టకేలకు కృష్ణ, మురారి ఒక్కటి అవుతారు. వాళ్ళని అలా చూసిన ముకుంద గుండెలు పగిలేలా ఏడుస్తుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishan mukunda murari serial april 15th episode: కృష్ణ పాల గ్లాసు తీసుకుని గదిలోకి వస్తుంది. హనీ మూన్ కి వెళ్దామని మురారి అంటే ఆ అవసరం లేదని అంటుంది. ఇద్దరూ రొమాంటిక్ గా గడుపుతారు. వాళ్ళు ఇద్దరూ దగ్గరగా ఉండటం ముకుంద కిటికీలో నుంచి చూస్తుంది. పాల గ్లాసు పంచుకోవడం చూసి ముకుంద కుమిలి కుమిలి ఏడుస్తుంది.

ఒక్కటైన కృష్ణ మురారి

మురారి, కృష్ణ ఒక్కటి కావడం చూసి ముకుంద గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తెల్లరిన తర్వాత కృష్ణ లేని టైమ్ లో నిద్రపోతున్న మురారి దగ్గరకు వస్తుంది. బెడ్ మొత్తం పూలు ఉండటం చూసి ఏడుస్తుంది. తనని తాకడానికి చూస్తుంది కానీ మళ్ళీ ఆగిపోతుంది. ఏడుస్తూ తనవైపు బాధగా చూస్తుంది.

ఎంత అన్యాయం చేశావ్ మురారి. నీకోసం ఎంత తపించాను ఎన్ని పాట్లు పడ్డాను. చివరికి నా రూపాన్ని మార్చుకుని పునర్జన్మ ఎత్తాను. కానీ చివరికి ఆ కృష్ణకి సొంతం అయిపోయావు. నీకు ఇది న్యాయమా? అంతా జరిగిపోయింది కదాని వదిలేస్తానని అనుకుంటున్నావ్ ఏమో నేను అసలు వదులుకోను.

అసలు ప్లాన్ ఇప్పుడే

అసలు ప్లాన్ ఇప్పుడే మొదలు పెట్టబోతున్నాను. కృష్ణ నీకు దూరమై నువ్వు నాకు దగ్గర కాకుండా ఎవరూ ఆపలేరని అనుకుంటుంది. అప్పుడే కృష్ణ కాఫీ పట్టుకుని గది వైపు నడుచుకుంటూ వస్తుంది. ముకుంద వెళ్లబోతుంటే తన చీర తగిలి టేబుల్ మీద వస్తువు కింద పడుతుంది.

చప్పుడికి మురారికి మెలుకువ వస్తుంది. కృష్ణ పక్కన ఉందని అనుకుని తనతో మాట్లాడుతూ పిలుస్తాడు. కృష్ణ రా అని అంటుంటాడు. అప్పుడే కృష్ణ గదిలోకి అడుగుపెడుతుంది. మురారి నిద్రలో మాట్లాడుతుంటే కృష్ణ నవ్వుకుంటుంది. కృష్ణ వచ్చేసరికి ముకుంద తనకు కనిపించకుండా తలుపు వెనుక నిలబడి తర్వాత మెల్లగా గదిలో నుంచి వెళ్ళిపోతుంది.

మురారి కృష్ణ సరసాలు

మురారి నిద్రలో పిలుస్తుంటే రావు ఏంటి రా కృష్ణ అని అంటూ అంటాడు. కృష్ణ ఏసీపీ సర్ అని పిలుస్తుంది. ఇక్కడే ఉన్నావా మళ్ళీ వెళ్లిపోయావ్ అనుకున్నా అంటాడు. ఏమైంది మీకు నేను ఇప్పుడే వస్తున్నానని చెప్తుంది. నువ్వు ఇప్పుడే రావడం ఏంటి ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నావ్ గా, ఆ గ్లాసు ఏదో కింద పడేస్తే మెలుకువ వచ్చిందని చెప్తాడు.

మీ చెయ్యి తగిలి కిందపడి ఉంటుందని అంటే కాదు ఇక్కడే ఉన్నావని అంటాడు. కాదు ఎవరో వచ్చినట్టు అనిపించదని అంటాడు. వీళ్లిద్దరినీ ముకుంద చాటుగా చూస్తూ ఉంటుంది. ఇద్దరూ సంతోషంగా గడపడం చూసి ముకుంద అసహనంగా వెళ్ళిపోతుంది.

ముకుంద అకౌంట్ లో డబ్బులు

ముకుంద కోపంగా తండ్రి దగ్గరకు వస్తుంది. వచ్చీ రాగానే డబ్బులు అకౌంట్ లో ఎందుకు వేశావని తండ్రిని తిడుతుంది. నీ అకౌంట్ లోనే కదా వేసింది ఎందుకు అంటున్నావని అంటాడు. నేను ఇప్పుడు మీరాని.. నువ్వు వేసింది ముకుంద అకౌంట్లో అంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఈ మొహంతో డ్రా చేస్తే బ్యాంక్ వాళ్ళు ఒప్పుకుంటారా అంటుంది. అడగకుండా నా అకౌంట్ లో ఎవరు వేయమన్నారని తిడుతుంది.

అడుగుదామని నీకు ఫోన్ చేశాను కానీ నువ్వు మాట్లాడకుండా కాల్ కట్ చేశావని చెప్తాడు. ఇప్పుడు డబ్బులు ఎలా తీసుకోవాలని అంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మొహం మార్చుకున్నానని డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. అది తీసుకెళ్ళి బ్యాంక్ లో ఇచ్చి నీ కొత్త మొహం ఫోటోస్ ఇవ్వమని శ్రీనివాస్ చెప్తాడు.

నువ్వు తండ్రివేనా?

నువ్వు నన్ను అడ్డంగా బుక్ చేయాలని డిసైడ్ అయ్యావు నాన్న. నేను ముకుందని అని బ్యాంక్ లో చెప్తే మొత్తం అందరికీ తెలిసిపోతుంది. అదే నీ ప్లాన్. నీకు నీ కొడుకు దేవ్ కరెక్ట్ నాలా మంచిగా ఉండకూడదు. తండ్రి అనేవాడు కూతురు సుఖం కోరుకుంటాడు. కానీ నువ్వు నీ కూతురుని కష్టాల పాలు చేయాలని చూస్తున్నావ్ అసలు నువ్వు తండ్రివేనా అని నిలదీస్తుంది.

అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను. అసలు నువ్వు కూతురివేనా? ఇంతకన్నా ఏ తండ్రి సపోర్ట్ చేయడు. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీకోసం ఇదంతా చేస్తున్నాను. అందుకే ఇల్లు అమ్మిన డబ్బు నీ అకౌంట్ లో వేశాను. వెళ్ళు ఆ డబ్బు తీసుకుంటావో అకౌంట్ లో ఉంచుకుంటావో నీ ఇష్టమని అంటాడు.

కృష్ణ మంచిది

మురారి, కృష్ణని ఎంత విడదీయాలని చూసినా రాత్రి వాళ్ళిద్దరూ ఒక్కటి అయ్యారని ఏడుస్తూ చెప్తుంది. నా జీవితంలో నేను ఊహించనిది రాత్రి జరిగిపోయింది. ఆ బాధ చెప్పుకోడానికి నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. అంతా నా ఖర్మ అని ఏడుస్తుంది.

ఎందుకమ్మా నీకు ఈ పంతం అంటాడు. పంతం కాదు నాన్న ప్రేమ అంటుంది. ఆ ప్రేమని పంతంగా మార్చుకున్నావ్. నీకన్నా కృష్ణ అందగత్తె కాదు నీ కన్నా ముందు మురారిని ప్రేమించలేదు. అయినా మురారి కృష్ణని వదులుకోలేదు అంటే ఏంటి అర్థం అంటాడు.

కృష్ణ అడ్డు తొలగిస్తాను

మంచితనం తన మంచితనంతో ఇంట్లో వాళ్ళందరినీ కట్టేసింది. తనలో ఉన్నది నాలో లేనిది ఆ మంచితనమేనని చెప్తుంది. అప్పుడు నీ ప్రవర్తన మార్చుకోవాలి. రూపం మార్చుకుని ఏం లాభమని అంటాడు.

మంచితనంతో సాధించలేము. మళ్ళీ నేను గతం ఉన్న దారిలో వెళ్లలేను. కానీ నేను నా గమ్యం చేరుకోవాలంటే ఉన్న ఒక్క అడ్డు ఆ కృష్ణని తొలగించాలి. కృష్ణ అంటే ఇంట్లో అందరికీ అభిమానం. తను ఉన్నంత కాలం నేను నా లక్ష్యం చేరుకోలేను. తప్పో ఒప్పో ముకుందగా చనిపోయిన నేను మరొకరిని బలి ఇవ్వడానికి వెనుకాడను అనేసరికి శ్రీనివాస్ షాక్ అవుతాడు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point