Best laptops for video editing : వీడియో ఎడిటింగ్ కోసం టాప్-5 బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే..
Laptops for video editing : వీడియో ఎడిటింగ్ కోసం మంచి ల్యాప్‌టాప్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! టాప్-5 బెస్ట్ వీడియో ఎడిటింగ్ ల్యాప్టాప్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
Best video editing laptops : యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో వీడియో ఎడిటింగ్‌కి ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని క్యాష్ చేసుకునేందుకు వీడియో ఎడిటర్లు తమ స్కిల్స్‌ని ప్రదర్శిస్తున్నారు. మరి మీరు కూడా ఒక వీడియో ఎడిటర్ ఆ? ఈ రేస్‌లో వెనకపడకుండా ఉండాలంటే.. మీ దగ్గర ఒక మంచి వీడియో ఎడిటింగ్ ల్యాప్‌టాప్ ఉండాల్సిందే! మీకు ఉపయోగపడే.. టాప్-5 బెస్ట్ వీడియో ఎడిటింగ్ ల్యాప్టాప్స్ లిస్ట్‌ని మేము సిద్ధం చేశాము. ఓసారి చూసేయండి..
బెస్ట్ వీడియో ఎడిటింగ్ ల్యాప్టాప్స్..
యాపిల్ మాక్‌బుక్ ప్రో:- ఇందులో 13 ఇంచ్ రెటీనా డిస్ప్లే ఉంటుంది. 8 కోర్ సీపీయూతో ఎం1 చిప్ వస్తోంది. 256జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ దీని సొంతం. 20 గంటల బ్యాటరీ లైఫ్ ఉండటం విశేషం. ఇవన్నీ.. ఈ మాక్‌బుక్ ప్రో పాజిటివ్ పాయింట్స్. కానీ ధర ఎక్కువగా ఉండటం, కనెక్టివిటీ పోర్ట్స్ తక్కువగా ఉండటం నెగిటివ్ పాయింట్స్.
హెచ్‌పీ పెవీలియన్:- పర్ఫార్మెన్స్ని పోర్టెబులిటీని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది ఈ హెచ్‌పీ పెవీలియన్ ల్యాప్‌టాప్. వీడియో ఎడిటింగ్‌కి ఇది బెస్ట్ ల్యాప్‌టాప్ అవుతుంది! ఇందులో 14 ఇంచ్ మైక్రే ఎడ్జ్ డిస్ప్లే, 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రాసెసర్, గ్రాఫిక్స్ పవర్‌ఫుల్‌గా ఉండటం, స్టోరేజ్ ఆప్షన్ ఎక్కువగా ఉండటం పాజిటివ్ పాయింట్స్. కానీ బ్యాటరీ లైఫ్ యావరేజ్‌గా ఉండటం, డిస్ప్లే ఇంకాస్త బ్రైట్‌గా ఉండొచ్చు అనేవి నెగిటివ్ పాయింట్స్. ఈ హెచ్‌పీ పెవీలియన్ ధర రూ. 75వేలు.
Best laptops for video editing : ఏసస్ వివోబుక్:- ఇదొక హై పర్ఫార్మెన్స్ ల్యాప్‌టాప్. వీడియో ఎడిటింగ్‌కి కంటెంట్ క్రియేషన్కి ఇది సెట్ అవుతుంది! ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 11300హెచ్ ప్రాసెసర్, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్, ఎన్విడియా జీఫోర్స్ ఎంఎక్స్350 గ్రాఫిక్స్ వంటివి ఈ ల్యాప్‌టాప్ ఫీచర్స్. డిజైన్ ఇంప్రెసివ్‌గా ఉండటం, ప్రాసెసర్- గ్రాఫిక్స్ పవర్‌ఫుల్‌గా ఉండటం పాజిటివ్ పాయింట్స్. బ్యాటరీ లైఫ్ యావరేజ్‌గా ఉండటం, బరువు ఎక్కువగా ఉండటం నెగిటివ్ పాయింట్స్. ఈ వీడియో ఎడిటింగ్ ల్యాప్‌టాప్ ధర రూ. 75,990.
సామ్సంగ్ గెలాక్సీ బుక్ ప్రో:- ఇందులో 13.3 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ దీని సొంతం. 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్, 20 గంటల పాటు నడిచే బ్యాటరీ లైఫ్ వంటివి ఈ మోడల్ ఫీచర్స్. స్క్రీన్, పవర్ఫుల్ ప్రాసెసర్- గ్రాఫిక్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్.. దీని పాజిటివ్ పాయింట్స్. కనెక్టివిటీ పోర్ట్స్ తక్కువగా ఉండటం, ధర ఎక్కువగా ఉండటం నెగిటివ్ పాయింట్స్. ధర రూ. 1లక్ష.
Video editing laptops under ₹1 lakh : హెచ్‌పీ పెవీలియన్ గేమింగ్:- ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఏఎండీ రైజెన్ 5 4600హెచ్ ప్రాసెసర్, 1టీబీ హెచ్డీడీ స్టోరేజ్, ఎన్వీడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1650 గ్రాఫిక్స్, బ్యాక్లిట్ కీబోర్డ్ వంటివి ఫీచర్స్. బ్యాటరీ లైఫ్ యావరేజ్‌గా ఉండటం, బరువు కాస్త ఎక్కువగా ఉండటం నెగిటివ్ పాయింట్స్. ఈ మోడల్ ధర రూ. 1.1లక్షలు!
పర్ఫార్మెన్స్, పోర్టెబులిటీ, ఎఫార్డెబులిటీ, వాల్యూ ఫర్ మనీని పరిగణలోకి తీసుకుంటే.. వీడియో ఎడిటింగ్ కోసం హెచ్‌పీ పెవీలియన్ ది బెస్ట్ ల్యాప్‌టాప్ అవుతుంది. కనీ ఓవరాల్ ప్రాడక్ట్ పరంగా చూసుకుంటే.. మాక్‌బుక్ ప్రో 14.. వీడియో ఎడిటింగ్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్‌గా నిలుస్తుంది.
వీడియో ఎడిటింగ్ ల్యాప్‌టాప్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
How to select best video editing laptop : వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్‌టాప్‌ని తీసుకోవాలని చూస్తుంటే.. ప్రాసెసర్, గ్రాఫిక్స్, స్టోరేజ్, బ్యాటరీ లైఫ్‌పై దృష్టిపెట్టాలి. పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. డిస్ప్లే క్వాలిటీ, పోర్టెబులిటీ అనుకూలంగా ఉండాలి. అయితే.. హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్, ప్రాసెసర్స్ ఉన్న గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా వీడియో ఎడిటింగ్‌కి చక్కగా ఉపయోగపడతాయి.
సంబంధిత కథనం