ASUS ROG Phone 8 Pro : ఆసుస్​ పవర్​ఫుల్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్​.. రోగ్​ ఫోన్​ 8 ప్రో ధర ఎంతంటే!-technology news check out asus rog phone 8 pro gaming smartphone price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Asus Rog Phone 8 Pro : ఆసుస్​ పవర్​ఫుల్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్​.. రోగ్​ ఫోన్​ 8 ప్రో ధర ఎంతంటే!

ASUS ROG Phone 8 Pro : ఆసుస్​ పవర్​ఫుల్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్​.. రోగ్​ ఫోన్​ 8 ప్రో ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Jan 27, 2024 12:15 PM IST

ASUS ROG Phone 8 Pro price in India : ఆసుస్​ రోగ్​ ఫోన్​ 8 ప్రో ఇండియాలో రిలీజ్​ అయ్యింది. ఈ పవర్​ఫుల్​, గేమింగ్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఆసుస్​ ఆర్​ఓజీ ఫోన్​ 8 ప్రో వచ్చేసింది. ఫీచర్స్​, ధర వివరాలు..
ఆసుస్​ ఆర్​ఓజీ ఫోన్​ 8 ప్రో వచ్చేసింది. ఫీచర్స్​, ధర వివరాలు..

ASUS ROG Phone 8 Pro 5G features : ఆసుస్​ సంస్థ నుంచి మరో కొత్త గేమింగ్​​ స్మార్ట్​ఫోన్​.. ఇండియాలో రిలీజ్​ అయ్యింది. దీని పేరు ఆసుస్​ రోగ్​ ఫోన్​ 8 ప్రో. ఈ పవర్​ఫుల్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్​​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఆసుస్​ రోగ్​ ఫోన్​ 8 ప్రో ఫీచర్స్​..

ఆసుస్​ రోగ్​ ఫోన్​ 8 ప్రోలో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​, ఐపీ68 రేటెడ్​ డస్ట్​- వాటర్​ రెసిస్టెన్స్​, ఫింగర్​ప్రింట్​ స్కానర్​ వంటివి వస్తున్నాయి. 165 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ ఎల్​టీపీఓ అమోలెడ్​ డిస్​ప్లే ఇందులో ఉంటుంది. గొరిల్లా గ్లాస్​ విక్టస్​ 2 ప్రొటెక్షన్​ దీనికి లభిస్తోంది.

ఆసుస్​ రోగ్​ ఫోన్​ 8 ప్రో గేమింగ్​ గ్యాడ్జెట్​లో 50ఎంపీ ప్రైమరీ, 13ఎంపీ అల్ట్రా-వైడ్​, 32ఎంపీ టెలిఫొటో లెన్స్​తో కూడిన రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

Best gaming smartphones in India : ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ప్రాసెసర్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఆర్​ఓడీ యూఐ సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 65వాట్​ వయర్డ్​, 15వాట్​ క్యూఐ- వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​.. ఈ ఆసుస్​ కొత్త గ్యాడ్జెట్​కి లభిస్తోంది.

ఆసుస్​ రోగ్​ ఫోన్​ 8 ప్రో ధర ఎంతంటే..

ఆసుస్​ రోగ్​ ఫోన్​ 8 ప్రో 16 జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ ధర రూ. 94,999. 24జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ ధర రూ. 1,19,999గా ఉంది. ఇందులో హై ఎండ్​ మోడల్​ కూడా ఉంది. హై ఎండ్​ మోడల్​లో ఆర్​ఓజీ ఎయిరోయాక్టివ్​ కూలర్​ ఎక్స్​ ఫీచర్​ వస్తుంది. దీనిని రూ. 5,999 పెట్టి సపరేట్​గా కొనాల్సి ఉంటుంది.

ASUS ROG Phone 8 Pro release date : సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​, విజయ్​ సేల్స్​ ద్వారా ఈ మొబైల్​ని విక్రయిస్తోంది ఆసుస్​. ఇప్పటికే దీని సేల్స్​ మొదలయ్యాయి.

రోగ్​ ఫోన్​ సిరీస్​లో లేటెస్ట్​ ఎంట్రీ ఈ ఆసుస్​ ఆర్​ఓజీ ఫోన్​ 8 ప్రో. గత మోడల్స్​తో పోల్చుకుంటే, ఇందులో మరిన్ని ఉపయోగపడే ఫీచర్స్​ కనిపిస్తున్నాయి. కెమెరా సెటప్​ ప్రాక్టికల్​గా ఉంది. డిస్​ప్లే మెరుగుపడింది. వయర్​లెస్​ ఛార్జింగ్​ కూడా వస్తుండటం పాజిటివ్​ పాయింట్​. కొంత డబ్బులు ఉండి, హై పర్ఫార్మింగ్​, పవర్​ఫుల్​ స్మార్ట్​ఫోన్​ని కొనాలని భావిస్తున్న వారికి.. ఈ ఆసుస్​ రోగ్​ ఫోన్​ 8 ప్రో మంచి ఆప్షన్​ అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం