Poco X6 Pro launch: గేమింగ్ ప్రియుల కోసం పోకో నుంచి మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ‘ఎక్స్ 6 ప్రొ’..
Poco X6 Pro launch: వినియోగదారుల విశ్వాసం చూరగొన్న ఎక్స్ సిరీస్ లో లేటెస్ట్ ఫోన్ ఎక్స్ 6 ప్రొ (Poco X6 Pro) ను పోకో మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ ను అమర్చారు.
Poco X6 Pro launch: ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్ లక్ష్యంగా పోకో (POCO) ఇటీవలే తన కొత్త POCO X6 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. POCO ఇండియా 2023లో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ సేల్ లో అగ్ర స్థానానికి చేరుకుంది. యువ వినియోగదారులలో అత్యంత ఆదరణ పొందింన బ్రాండ్ గా నిలిచింది. POCO X5 Pro, X5 మంచి ఆదరణ పొందాయి. ఈ X సిరీస్ లో తాజాగా POCO X6 Pro ను లాంచ్ చేశారు.
బెస్ట్ ఇన్ పర్ఫార్మెన్స్
POCO X6 ప్రో లో మీడియా టెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది అద్భుతమైన వేగం, పనితీరును అందిస్తుంది. LPDDR5X, UFS 4.0తో సహా RAM, ROM సామర్థ్యాలను మరింత మెరుగుపర్చారు. Xiaomi హైపర్ OS పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. గేమింగ్ ప్రియులకు ఇది బెస్ట్ ప్రొడక్ట్ గా నిలుస్తుంది. X6 ప్రో గేమింగ్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. ల్యాగింగ్ సమస్య ఉండదు. ఇందులో ఫ్లాగ్‌షిప్-లెవల్ కూలింగ్ సిస్టమ్ తో పాటు డ్యూయల్ గేమింగ్ యాంటెన్నా ఉన్నాయి.
జనవరి 11 నుంచి..
పోకో ఎక్స్ 6 సిరీస్ ను జనవరి 11, 2024 సాయంత్రం 5:30 గంటలకు చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ పోకో భారతదేశంలో లాంచ్ చేసింది. పోకో ఎక్స్ 6 రెడ్ మి నోట్ 13 ప్రో కు రీబ్రాండెడ్ వెర్షన్ గా ఉంటుందని తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 13 5జీ సిరీస్ జనవరి 13న భారత్ లో లాంచ్ కానుంది. పోకో ఎక్స్ 6 ప్రో లో 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 28 వేల వరకు ఉండవచ్చు.
పోకో ఎక్స్6 ప్రో స్పెసిఫికేషన్లు
పోకో ఎక్స్6 ప్రో 6.67 అంగుళాల 1.5కె ఎల్టిపిఎస్ 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఎస్ఓసితో పనిచేస్తుంది. పోకో ఎక్స్6 ప్రో వెనుక భాగంలో 67 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ కెమెరా సెటప్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్న కెెమెరా సెటప్ ఉంటుంది.