YouTube Create : ‘యూట్యూబ్​ క్రియేట్’​ లాంచ్​.. ఇక వీడియో ఎడిటింగ్​ చాలా ఈజీ!-youtube launches new ai enabled editing app called youtube create ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Youtube Create : ‘యూట్యూబ్​ క్రియేట్’​ లాంచ్​.. ఇక వీడియో ఎడిటింగ్​ చాలా ఈజీ!

YouTube Create : ‘యూట్యూబ్​ క్రియేట్’​ లాంచ్​.. ఇక వీడియో ఎడిటింగ్​ చాలా ఈజీ!

Sharath Chitturi HT Telugu
Sep 22, 2023 11:40 AM IST

YouTube Create : యూట్యూబ్​ క్రియేట్​ అనే పేరుతో కొత్త యాప్​ను లాంచ్​ చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం. ఈ యాప్​తో సింపుల్​గా వీడియోలను ఎడిట్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

యూట్యూబ్​ క్రియేట్​ లాంచ్​.. ఇక వీడియో ఎడిటింగ్​ చాలా ఈజీ!
యూట్యూబ్​ క్రియేట్​ లాంచ్​.. ఇక వీడియో ఎడిటింగ్​ చాలా ఈజీ! (Youtube)

YouTube Create : మీకు యూట్యూబ్​ ఛానెల్​ ఉందా? వీడియో ఎడిటింగ్​ విషయంలో ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ సమస్యలకు చెక్​ పెట్టే సమయం వచ్చేసింది! కొత్తగా ఓ వీడియో ఎడిటింగ్​ యాప్​ను లాంచ్​ చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం యూట్యూబ్​. దీని పేరు యూట్యూబ్​ క్రియేట్​. ఇండియా, యూకే, ఫ్రాన్స్​, ఇండోనేషియా, కొరియా, సింగపూర్​లో ఈ ఏఐ ఆధారిత యాప్​నకు చెందిన ఆండ్రాయిడ్​ బీటా వర్షెన్​ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఇది ఐఓఎస్​కు అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా ఇది లాంచ్​ అవ్వనుంది.

గురువారం జరిగిన మేడ్​ ఆన్​ యూట్యూబ్​ ఈవెంట్​లో ఈ యూట్యూబ్​ క్రియేట్​ను లాంచ్​ చేసింది సంస్థ. ఎవరైనా సులభంగా వీడియో ఎడిటింగ్​ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యాప్​ను తీసుకొచ్చినట్టు వెల్లడించింది.

YouTube Create video editing : "వీడియోలు తయారు చేయడం వెనుక ఉండే కష్టం గురించి మాకు తెలుసు. మరీ ముఖ్యంగా కంటెంట్​ క్రియేషన్​ జర్నీని ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న వారికి ఇది మరింత కష్టంగా ఉంటుంది. వీడియో ఎడిటింగ్​ ప్రక్రియను సులభతరం చేసేందుకే.. యూట్యూబ్​ క్రియేట్​ యాప్​ను తీసుకొచ్చాము. ఇదొక మొబైల్​ యాప్​," అని గూగుల్​ ఆధారిత సంస్థ వెల్లడించింది. ఇదొక ఫ్రీ యాప్​ అని, షార్ట్స్​, లాంగ్​ ఫార్మాట్​ వీడియోలను ఇందులో చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- ITR for YouTube Income: ‘యూట్యూబ్’ ఆదాయానికి కూడా ఐటీఆర్ దాఖలు చేయాలా?

అంతేకాకుండా.. ఈ యాప్​నకు కృత్రిమ మేథ శక్తిని కూడా జోడించింది యూట్యూబ్​. ఏడిటింగ్​, ట్రిమ్మింగ్​, ఆటోమెటిక్​ కాప్షనింగ్​, వాయిస్​ఓవర్​, ట్రాన్సీషన్స్​ వంటివి ఏఐ ఆధారంగా చేసుకోవచ్చు. బీట్​ మ్యాచింగ్​ టెక్నాలజీతో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్​ని కూడా ఈ యూట్యూబ్​ క్రియేట్​లో పొందొచ్చు.

YouTube Create app : 3వేలకుపైగా మంది యూట్యూబ్​ క్రియేటర్లను సంప్రదించి, వారి నుంచి ఫీడ్​బ్యాంక్​ పొందిన తర్వాత.. ఈ యాప్​ను రూపొందించినట్టు సంస్థ చెప్పింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ను తీసుకొస్తూనే ఉంటామని హామీనిచ్చింది.

'ఏఐ'తో ఎడిటింగ్​..

ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ని ఉపయోగించుకుని ఓ కొత్త ఫీచర్​పై పరీక్షలు చేస్తున్నట్టు యూట్యూబ్​ వెల్లడించింది. ఈ డ్రీమ్​ స్క్రీన్​ ఫీచర్​ అందుబాటులోకి వస్తే.. మనం ఏది టైప్​ చేస్తే అది మన వీడియో బ్యాక్​గ్రౌండ్​లోకి వచ్చేస్తుందని తెలిపింది.

"కొంతమంది క్రియేటర్లకు ఈ డ్రీమ్​ స్క్రీన్​ ఫీచర్​ ఇస్తాము. వచ్చే ఏడాదిలో పూర్తిస్థాయిలో అందరికి ఇస్తాము," అని యూట్యూబ్​ ప్రకటించింది.

WhatsApp channel

సంబంధిత కథనం