Krishna mukunda murari april 13th: కృష్ణ, మురారి ఒక్కటి కాకుండా ముకుంద స్కెచ్.. ఈసారి కూడా ఆగిపోతుందా?-krishna mukunda murari serial april 13th episode meera stirs up rajini against murari and krishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari April 13th: కృష్ణ, మురారి ఒక్కటి కాకుండా ముకుంద స్కెచ్.. ఈసారి కూడా ఆగిపోతుందా?

Krishna mukunda murari april 13th: కృష్ణ, మురారి ఒక్కటి కాకుండా ముకుంద స్కెచ్.. ఈసారి కూడా ఆగిపోతుందా?

Gunti Soundarya HT Telugu
Apr 13, 2024 07:57 AM IST

Krishna mukunda murari serial april 13th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కృష్ణ వాళ్ళకి శోభనానికి ముహూర్తం పెట్టిద్దామని రేవతి భవానీని అడుగుతుంది. అయితే ముహూర్తాలు ఏమి వద్దని భవానీ అంటుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 13వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 13వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial april 13th episode: చుడీదార్ కృష్ణకు బాగోదని మురారి అంటాడు. దీంతో కృష్ణ తనని కొట్టేందుకు గరిటె పట్టుకుని వెంట పడుతుంది. కాసేపు అటూ ఇటూ పరుగులు పెడుతూ ముకుంద చుట్టూ ఉంటారు. అది చూసి ముకుంద, ఆదర్శ్ రగిలిపోతారు. భవానీ వాళ్ళని ఆపి ఇద్దరినీ పక్క పక్కన నిలబడమని చెప్తుంది.

ముహూర్తం పెట్టిద్దామన్న రేవతి

తను చెప్పింది పాటించాలని భవానీ కృష్ణ వాళ్ళకు చెప్తుంది. అలా అని మాట ఇవ్వమని అంటుంది. అలా అంటారు ఏంటి ఎప్పుడైనా మా స్వార్థం గురించి ఆలోచించామా అని కృష్ణ అంటుంది. అదే నా బాధ కూడా ఏ స్వార్థం లేకుండా పిచ్చిదానిలా అందరి గురించి ఆలోచిస్తావ్. ఇప్పుడైనా నీ గురించి కొంచెం ఆలోచించుకుని ఉంటే ఈ పాటికి మీ అత్తయ్యని ఎప్పుడో నానమ్మని చేసి ఉండేదానివి అంటుంది.

మళ్ళీ వీళ్ళ శోభనం గురించి ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచించాలని ముకుంద అనుకుంటుంది. ఇంతకముందు ముకుంద, ఆదర్శ్ గురించి వద్దని చెప్పి శోభనం వద్దని చెప్పింది. తర్వాత ముహూర్తం పెట్టినా ఏదో ఒక ఆటంకం వచ్చింది. ఈసారి ఏ ఆటంకం లేదు పైగా కృష్ణ అడిగింది కాబట్టి తనవైపు నుంచి ఏ సమస్య లేదు. పంతులుకి ఫోన్ చేసి ముహూర్తం పెట్టిద్దామని రేవతి అడుగుతుంది.

ముకుందకు షాక్ఇచ్చిన భవానీ

అవసరం లేదని భవానీ అనేసరికి అందరూ ఒక్క క్షణం షాకింగ్ గా చూస్తారు. ఈ శోభనాలు, ముహూర్తాలు ఏవి వద్దు. ముహూర్తం పెట్టిన ప్రతిసారి ఏదో ఒక సమస్య. అందుకే ఈ సారి ముహూర్తాలు లేవు. ఎప్పుడో భార్యాభర్తలైన మీరు ఈరోజు నుంచి నిజమైన భార్యాభర్తలుగా మెలగండి అని భవానీ చెప్తుంది.

కృష్ణ, మురారి ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడతారు. ఇదేంటి ఈవిడ ఇంత పెద్ద షాక్ ఇచ్చింది. శోభనం ముహూర్తం పెడితే ఏదో ఒకటి చేసి చెడగొట్టాలని అనుకుంటే ఇలా అన్నది. ప్రతి రాత్రి వీళ్ళకు నేనెక్కడ కాపలా ఉండేదని ముకుంద టెన్షన్ పడుతుంది.

తొమ్మిది నెలలు తిరిగే లోగా నీ చేతికి మనవడో మనవరాలో వచ్చేస్తుంది. అలాగే ఇంకొక మనవడు కూడా వస్తాడని రజిని అనేసరికి అందరూ అయోమయంగా చూస్తారు. దేని గురించని కృష్ణ అంటే ఇన్నాళ్ళూ పక్కన వాళ్ళ గురించి ఆలోచించింది చాలు ఇప్పటికైనా నీ గురించి ఆలోచించుకోమని భవానీ చెప్తుంది.

మురారి చేతిని వదలని ముకుంద

ఇంతకాలానికి పెద్దమ్మ అర్థం చేసుకుని చెప్పాల్సిన మాట చెప్పిందని మురారి సంతోషంగా అనుకుంటాడు. అప్పుడే ముకుంద వచ్చి ఇప్పుడు మీరు హ్యాపీ కదా అంటుంది. కంగ్రాట్స్ చెప్తూ చెయ్యి ఇస్తుంది. మురారి ఇవ్వకుండా ఉంటే ముకుంద బలవంతంగా తన చేతిని తీసుకుంటుంది.

ముకుంద ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉండేది. మీ స్టోరీ మొత్తం నాకు తెలుసు. మురారి చేతిని విడిపించుకోవడానికి చూస్తాడు. కానీ ముకుంద మాత్రం వదలకుండా పట్టుకుని ఉంటుంది. నేను కాస్త డిసప్పాయింట్ అయ్యాను శోభనానికి ముహూర్తాలు పెడతారు ఏమో కృష్ణకి చెల్లెలిలాగా ఏర్పాట్లు చేద్దామని అనుకున్నాను కానీ ఆ అవకాశం లేకుండా పోయిందని అంటుంది.

కృష్ణ డౌట్

కృష్ణ అటుగా వచ్చి వాళ్ళని చూస్తుంది. కృష్ణ వచ్చేసరికి ముకుంద వెళ్ళిపోతుంది. మీరా ఏం మాట్లాడుతుంది చెయ్యి పట్టుకుని వదలకుండా ఉందని అడుగుతుంది. కంగ్రాట్స్ చెప్పింది శోభనానికి ముహూర్తాలు లేవని పెద్దమ్మ లైన్ క్లియర్ చేసింది కదా అందుకే చెప్పిందని అంటాడు.

కంగ్రాట్స్ మీకు చెప్పడం ఏంటి నాకు కదా చెప్పాల్సిందని కృష్ణ డౌట్ గా అడుగుతుంది. కాసేపు మురారి శోభనం గోల మొదలుపెడతాడు. ముకుంద భవానీ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఏంటి? మోడ్రన్ అత్తలాగా ముహూర్తాలు లేకుండా రాత్రి పగలు అని చూడొద్దని అల్టిమేటం ఇచ్చిందని తిట్టుకుంటుంది.

రజిని పరువు పాయే

రజినికి ఫోన్ చేసి పిలుస్తుంది. సంగీత కూడా వస్తే తనని బయటకు వెళ్ళమని పంపించేస్తుంది. తను చెప్పేది నోరు మూసుకుని వినమని ముకుంద రజినిని గౌరవం లేకుండా మాట్లాడుతుంది. వామ్మో పిన్ని గారు దగ్గర నుంచి రావే పోవే దాకా వచ్చావా అని అంటుంది.

అంతా మీ కూతురు పెళ్లి కోసమేనని కవర్ చేస్తుంది. కృష్ణ, మురారి ఒక్కటి కాకుండా ముకుంద రజినికి ఏదో ప్లాన్ చెప్తుంది. కృష్ణ అందంగా రెడీ అయి గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వస్తుంది. భార్య అందాన్ని చూసి మురిసిపోతాడు. కాసేపు మురారిని ఆటపట్టిస్తుంది.

హనీమూన్ కి వెళ్దామన్న మురారి

హనీమూన్ కి వెళ్దామని మురారి అంటాడు. అవసరం లేదని కృష్ణ కోపంగా అంటుంది. కనీసం మన ఫామ్ హౌస్ అయినా వెళ్ళి నువ్వు నేను ఒక మూడు రోజులు ఏ డిస్ట్రబెన్స్ రాకూడదని మురారి అంటాడు. ముహూర్తాలు కుదరడం లేదని కదా అత్తయ్య అలా చెప్పారు. కాబట్టి అలాంటి ప్లాన్స్ అవసరం లేదని కృష్ణ చెప్తుంది.

అప్పుడంటే ముకుంద ఉండేది తనకోసం ఆలోచించి వద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ముకుంద ఇలా ఎందుకు చేసిందోనని అంటాడు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అని తిడుతుంది. అక్కడితో నేటి కృష్ణ మురారి ముకుంద సీరియల్ ఎపిసోడ్ ముగిసింది. 

IPL_Entry_Point