Yoga For Diabetes : మధుమేహాన్ని నియంత్రించడంలో ఉపయోగపడే శక్తివంతమైన యోగా ముద్రలు-powerful yoga mudras for diabetes know in details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Diabetes : మధుమేహాన్ని నియంత్రించడంలో ఉపయోగపడే శక్తివంతమైన యోగా ముద్రలు

Yoga For Diabetes : మధుమేహాన్ని నియంత్రించడంలో ఉపయోగపడే శక్తివంతమైన యోగా ముద్రలు

Anand Sai HT Telugu
Apr 13, 2024 05:30 AM IST

Yoga For Diabetes : భారతదేశంలో మిలియన్ల మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. అలాగే డయాబెటిక్ రోగుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని రకాల యోగా ముద్రలు మిమ్మల్లి మధుమేహం నుంచి కాపాడుతాయి.

యోగా ముద్రలు
యోగా ముద్రలు (Unsplash)

మధుమేహానికి ప్రధాన కారణం ఒత్తిడి, సరైన జీవనశైలి సరిగా లేకపోవడం. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి మధుమేహానికి కారణమవుతాయి. మధుమేహంలో 3 రకాలు ఉన్నాయి. అవి టైప్-1 మధుమేహం, టైప్-2 మధుమేహం, గర్భధారణ సమయంలో మధుమేహం. మధుమేహం ఏ రకంగా ఉన్నప్పటికీ, దానిని ముందుగానే గుర్తించి చికిత్స చేయాలి. మధుమేహం కేవలం మందుల మాత్రలు వేసుకోవడమే కాదు కొన్ని యోగా ముద్రలు, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా నియంత్రణలో ఉంటుంది.

యోగా భారతదేశం పురాతన వ్యాయామం. యోగ ముద్రలు అని పిలువబడే యోగ సంజ్ఞలు కొన్ని ఉన్నాయి. ఇవి శరీరంలోని ప్రతి భాగానికి సంబంధించిన శక్తి కేంద్రాలను ప్రేరేపిస్తాయి. జీవక్రియను పెంచడం, చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

మీకు మధుమేహం ఉన్నట్లయితే మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచడంలో మీకు సహాయపడే కొన్ని శక్తివంతమైన యోగా ముద్రలు కింద ఉన్నాయి. మీరు వాటిని చేస్తే, మీరు రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధించవచ్చు.

సూర్య ముద్ర

సూర్య ముద్ర శరీరంలోని వివిధ సమస్యలను సరిచేస్తుంది. ప్రధానంగా ఈ ముద్ర శరీరంలోని జీవక్రియను పెంచుతుంది. సూర్య ముద్రను క్రమం తప్పకుండా చేస్తే, అది బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ ముద్ర చేయడానికి ముందుగా వజ్రాసన భంగిమలో కూర్చోవాలి. తర్వాత బొటనవేలుతో ఉంగరపు వేలును తాకాలి.

ప్రాణ ముద్ర

ప్రాణ ముద్రను జీవిత ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర మూల చక్రాన్ని ప్రేరేపించడం ద్వారా జీవితపు కీలక శక్తిని పెంచుతుంది. ఇది చాలా శక్తివంతమైన ముద్ర. ఈ ముద్ర శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఇది మధుమేహం యొక్క లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ ముద్రకు ధ్యాన స్థితిలో లేదా మీకు నచ్చిన స్థితిలో 5 నిమిషాలు చేయాలి. బొటనవేలు యొక్క కొనలను చూపుడు, ఉంగరపు వేళ్ల చివర్లను తాకేలా ఉంచాలి. ఈ సందర్భంలో మిగిలిన రెండు వేళ్లు నేరుగా ఉండాలి. ఇలా రోజూ 3 సార్లు చేయండి. ఈ ముద్రను నిలబడి కూడా చేయవచ్చు. ఈ ముద్రను రెండు చేతులతో చేయవచ్చు.

అపాన ముద్ర

మధుమేహ వ్యాధిగ్రస్తులకు అపాన ముద్ర మరొక శక్తివంతమైన యోగా ముద్ర. ఇది చాలా సులభమైన ముద్ర. ఇది శరీరంలోని అవయవాలను సమతుల్యం చేస్తుంది. శరీర అవయవాల పనితీరును నియంత్రించడమే కాకుండా శరీరంలోని అనవసరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఈ ముద్ర వేస్తే విపరీతంగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఈ ముద్రను ఇష్టమైన యోగా భంగిమలో కూర్చోవాలి. అప్పుడు ఉంగరపు వేలు, మధ్య వేలును బొటన వేలును చివర్లతో టచ్ చేయాలి. మిగిలిన రెండు వేళ్లు నిటారుగా ఉండాలి. ఈ ముద్రను నిలబడి కూడా చేయవచ్చు. మీకు కావలసినంత కాలం మీరు దీన్ని చేయవచ్చు.

జ్ఞానముద్ర

జ్ఞాన ముద్ర ఒత్తిడి, ఆందోళన నుండి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ యోగా ముద్రను కూర్చుని లేదా నిలబడి చేయవచ్చు. ఈ ముద్రకు బొటనవేలు యొక్క కొనను చూపుడు వేలు యొక్క కొనను తాకడం అవసరం. అన్ని ఇతర వేళ్లు నేరుగా ఉండాలి. అలాగే కళ్లు మూసుకుని శ్వాస పీల్చుకోండి. ఇలా రోజూ చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

లింగ ముద్ర

లింగ ముద్ర పురుష పునరుత్పత్తి అవయవాన్ని సూచిస్తుంది. ఈ ముద్ర శరీరంలోని ఫైర్ ఎలిమెంట్ ను ప్రేరేపిస్తుంది. ఇది శరీర జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరం బరువు తగ్గడం ప్రారంభిస్తే, రక్తంలో చక్కెర స్థాయి కూడా స్థిరీకరించబడుతుంది. ఈ ముద్రను నిలబడి లేదా కూర్చోని చేయవచ్చు. దీని కోసం రెండు చేతుల వేళ్లను గట్టిగా కలుపుతూ ఉండాలి, ఎడమ బొటనవేలు మాత్రమే నేరుగా ఉండాలి. కుడి బొటనవేలు మూసివేయాలి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు యోగా ముద్ర వేసే ముందు తమ వైద్యుడిని సంప్రదించాలి. భోజనం చేసిన వెంటనే యోగ ముద్ర చేయకూడదు. యోగా ముద్ర చేయడానికి ఉత్తమ సమయం ఉదయామే. కొత్తవారు సరైన యోగా నిపుణుల పర్యవేక్షణలో యోగా ముద్ర, యోగాసనాలను అభ్యసించాలి.

Whats_app_banner