CBN Appeal: ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని సిఎస్‌, ఈసీ-సీఈఓ మీనాకు చంద్రబాబు ఫోన్.. వైసీపీ ప్రచారంపై ఆందోళన-chandrababu phoned ec ceo meena to distribute pensions to every house ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cbn Appeal: ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని సిఎస్‌, ఈసీ-సీఈఓ మీనాకు చంద్రబాబు ఫోన్.. వైసీపీ ప్రచారంపై ఆందోళన

CBN Appeal: ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని సిఎస్‌, ఈసీ-సీఈఓ మీనాకు చంద్రబాబు ఫోన్.. వైసీపీ ప్రచారంపై ఆందోళన

Sarath chandra.B HT Telugu
Apr 02, 2024 12:11 PM IST

CBN Appeal: ప్రభుత్వ పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేయడంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌ చేశారు.

చంద్రబాబు
చంద్రబాబు

CBN Appeal: వాలంటీర్లలో పెన్షన్ల Pensions పంపిణీ నిలిపివేయాలన్న సెర్ప్ Serp అధికారుల ఆదేశాలు టీడీపీ TDPని కలవర పెడుతున్నాయి. వాలంటీర్లపై చర్యల్లో భాగంగా పెన్షన్ల పంపిణీ నిలిపివేయాలనే ఉత్తర్వులు టీడీపీకి నష్టం కలిగిస్తాయనే ఆందోలన ఆ పార్టీలో నెలకొంది. సోమవారం పెన్షన్ల పంపిణీ ఇంటింటికి చేపట్టాలని కోరుతూ చీఫ్‌ సెక్రటరీ CS, సీఈఓEC CEOలకు టీడీపీ నేతలు వినతి పత్రాలు సమర్పించారు.

మంగళవారం ఉదయం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్ మీనాకు చంద్రబాబు ఫోన్ చేశారు. తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. చీఫ్‌ సెక్రటరీ జవహర్ రెడ్డితో చంద్రబాబు నాయుడు మంగళవారం ఫోనులో మాట్లాడారు.

పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదన్న విషయాన్ని సీఎస్ తో చంద్రబాబు ప్రస్తావించారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని కోరారు. ఎండల సమయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని వివరించారు. రెండుమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులను రావాలని చెప్పడం సరికాదన్నారు.

సచివాలయం సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేపట్టలాని చంద్రబాబు కోరారు. ఏ ఒక్క లబ్దిదారుడికీ ఇబ్బంది లేకుండా వెంటనే పంపిణీ ప్రక్రియను చేపట్టాలన్నారు. సీఎస్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా తోనూ చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు.

పెన్షన్ ల విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేలా.... ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పెన్షన్ ల విషయంలో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారం పైనా చర్యలు తీసుకోవాలి ఎన్నికల ప్రధాన అధికారి మీనాను చంద్రబాబు కోరారు.

రేపట్నుంచి పెన్షన్ల పంపిణీ…

రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో బుధవారం నుంచి ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయాలని చీఫ్‌ సెక్రటరీ కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, సెక్రటరీల సాయంతో పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగలవారం బ్యాంకుల నుంచి నగదు తీసుకుని పంపిణీకి ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు.

ఏప్రిల్ 3వ తేదీ ఉదయం నుంచి గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఫించన్ల పంపిణీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను జారీ చేశారు. ఫించన్లను ఏవిధంగా పంపిణీ చేయాలనే దానిపై వివిధ జిల్లాల కలక్టర్లు,రాష్ట్ర స్థాయి అధికారుల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు.ఫించన్ల పంపిణీపై వెంటనే సవరించిన మార్గదర్శక ఆదేశాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయాలని భావించిన వృద్ధులకు, వికలాంగులకు ఇళ్ల వద్దే పంపిణీ చేయాలని నిర్ణయించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందచేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం