Andhra Pradesh assembly elections 2024 update in Telugu
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
election-header-title-arrow(left)

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024

election-header-title-arrow(right)
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికల షెడ్యూలు జారీచేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు 11 జూన్ 2024తో ముగియనుంది. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న మూడో ఎన్నిక ఇది. 2014లో టీడీపీ, 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా, వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు దక్కించుకోవాలి. 2019లో వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ 49.95 శాతం ఓట్లతో 151 సీట్లు దక్కించుకుంది. అయితే ఇందులో దాదాపు డజను మంది సభ్యులు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ తదితర పార్టీల్లో చేరారు. 2019లో టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 సీట్లు దక్కించుకుంది. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 2019లో 5.53 శాతం ఓట్లతో 1 సీటు దక్కించుకుంది.
బరిలో నిలిచే పార్టీలు ఇవే
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో టీడీపీ 144 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ మొత్తం 175 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎం) కలిసి పోటీ చేస్తున్నాయి.
కీలక అంశాలు ఇవే
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కేవలం సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేసిందని, అభివృద్ధిని, రాజధానిని మరిచిందని, అవినీతిలో కూరుకుపోయిందని విపక్షాలు ఆరోపిస్తూ వీటినే ప్రచార అంశాలుగా చేసుకున్నాయి. ఇక విద్యారంగంలో, గృహ నిర్మాణ రంగంలో, వైద్య బీమా, ఆరోగ్యం, గ్రామ సచివాలయ సేవల్లో సమూల మార్పులు తెచ్చి పేదలకు పెద్దపీట వేశామని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారన్న విషయాన్ని ప్రస్తావిస్తోంది.
timer-clock-icon రిజల్ట్ తేదీ కౌంట్ డౌన్
32రోజు :5గంటలు :43నిమిషాలు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు - 2019

కీలక అభ్యర్థులు

evenct akkk

లేటెస్ట్ ఫోటోలు

లేటెస్ట్ వెబ్ స్టోరీలు