సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదని వ్యాఖ్యానించారు. మీ చర్యలతో దెబ్బతిన్న మా పార్టీ వాళ్లు…రేపు నేను చెప్పినా వినే పరిస్థితులు ఉండవని హెచ్చరించారు.