Karthika deepam 2 today episode: కార్తీకదీపం 2 సీరియల్.. దీపకు విడాకులు ఇవ్వమన్న శోభ.. వారసురాలిని ఆహ్వానించిన పారిజాతం
Karthika deepam 2 serial april 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపకు విడాకులు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని నరసింహ రెండో భార్య శోభ వార్నింగ్ ఇస్తుంది. అటు దీపను సుమిత్ర వాళ్ళు ఇంటికి తీసుకుని వెళతారు.
Karthika deepam 2 serial april 6th episode: సుమిత్ర దీప వాళ్ళని తమతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది. దాడి చేసిన వ్యక్తి ఎవరో త్వరగా తెలియాలని దశరథ ఎస్సైతో చెప్తాడు. శౌర్య ముద్దు ముద్దు మాటలకు సుమిత్ర వాళ్ళు మురిసిపోతారు. నరసింహ శోభ కాళ్ళు పట్టుకుని ఉంటాడు. దీప మాటలు తలుచుకుని నరసింహ వైపు మింగేసెలా చూస్తుంది. నిజం చెప్పు ఆ తల్లీకూతుళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతుంది. లేదని అంటాడు.
దీపకు విడాకులు ఇచ్చేయ్
ఎలాగైనా దీపని వదిలించుకోమని చెప్తుంది. విడాకులు ఇచ్చేయమని ఖరాఖండీగా చెప్తుంది. ఇవ్వకపోతే ఊరుకునేది లేదని నరసింహకు వార్నింగ్ ఇస్తుంది. దీప ఎక్కడికి పోయిందా అని ఆలోచిస్తాడు. దశరథ దీపని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాడు. నేను అనుకున్న ప్లాన్ నాశనం చేయడానికి నువ్వు ఎక్కడ నుంచి వచ్చావని పారిజాతం మనసులో తిట్టుకుంటుంది. గుమ్మం దగ్గర నిలబడి దిష్టి తీయమని పారిజాతాన్ని సుమిత్ర అడుగుతుంది.
పారిజాతం దిష్టి తీయబోతుంటే నాకు కాదు నా ప్రాణాలు కాపాడిన దీపకు తీయమని చెప్తుంది. ఇంటి అసలు వారసురాలిని దిష్టి తీసి మరీ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. శౌర్య ఇల్లంతా ఆశ్చర్యంగా చూస్తుంది. దాడి చేసింది ఎవరో తెలిసిందా అని శ్రీధర్ అడుగుతాడు. లేదు దాడి చేసిన వ్యక్తిని దీప గుర్తు పట్టగలదు అందుకే తను మన ఇంట్లో కొన్ని రోజులు ఉంటుందని దశరథ చెప్తాడు.
పుట్టింటికి చేరిన దీప
ఇది ఇంట్లో ఉంటే నాకే ప్రమాదమని పారిజాతం టెన్షన్ పడుతుంది. జ్యోత్స్న ఇంట్లో వాళ్ళందరినీ దీపకు పరిచయం చేస్తుంది. నువ్వు మా అమ్మని సేవ్ చేశావని తెలిస్తే దేవతలా చూస్తాడని అంటుంది. ఇంత పెద్ద ఇంట్లో ఉండటం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని దీప అంటుంది. దీంతో సుమిత్ర దీప వాళ్ళని అవుట్ హౌస్ లో ఉండమని చెప్తుంది.
కాపాడిన వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు డబ్బులు ఇచ్చి పంపించేయొచ్చు కదాని పారిజాతం అంటుంది. నోరు మూయకపోతే నీ నెత్తి పగులుతుంది. సుమిత్ర మీద దాడి చేసిన వాడిని పట్టుకునే వరకు దీప ఈ ఇంట్లోనే ఉంటుందని శివనారాయణ గట్టిగా చెప్తాడు.
టెన్షన్ లో పారిజాతం
దీప రౌడీని గుర్తు పడితే నా పరిస్థితి ఏంటని పారిజాతం టెన్షన్ పడుతుంది. శౌర్య ఇంటి ముందు పూలు చూసి మురిసిపోయి ఒక్క క్షణం శోభ తిట్టింది గుర్తు చేసుకుని గట్టిగా అరుస్తుంది. దీప కంగారుగా ఏమైందని అంటుంది. పూలు కోయడానికి వెళ్తే బూచమ్మ, బూచోడు తిట్టారు కదాని భయపడుతుంది. దీప నరసింహ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది.
శౌర్యకి ఈ ఇల్లు బాగా నచ్చింది అలవాటు పడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. మళ్ళీ డబ్బులు లేకుండా ఇంటికి రావొద్దని అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది. సుమిత్ర వాళ్ళు ఉంటున్న ఇల్లు చూపించి ఆ ఇల్లు చాలా బాగుంది నాన్న ఇల్లు కూడా ఇలాగే ఉంటుందా అని అడుగుతుంది. దీప బాధపడుతుంది.
అనసూయని పనిమనిషిని చేసిన మల్లేష్
అనసూయ బయటకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంటుంది. ఎవరు నా ఇంటికి తాళం వేసిందని అంటే వడ్డీ మల్లేష్ అని అంటాడు. నీ కొడుకు చేసిన అప్పు పైసలు ఇవ్వమని అడుగుతాడు. డబ్బులు చేతిలో పెడితే ఇంటి తాళం ఇస్తానని చెప్తాడు. నా పైసలు నా చేతికి వచ్చేదాక నా ఇంట్లో పని చేయమని అనసూయకి చెప్తాడు.
కొడుకు చేసిన పనికి అనసూయ పనిమనిషిగా మారుతుంది. తన బతుకు ఏంటి ఇలా అయిపోయిందని తిట్టుకుంటుంది. సుమిత్ర వాళ్ళు జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకుంటారు. దీని వల్ల మనకు శత్రువులు ఉన్నారని తెలిసిందని అంటాడు. శౌర్య, దీపని జ్యోత్స్న ఇంటికి తీసుకొస్తుంది. తనతో ఆడుకోవడానికి ఎవరూ లేరని అనేసరికి మేము ఉన్నాముగా మాతో ఆడుకోమని సుమిత్ర చెప్తుంది. అక్కడితో నేటితో కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్