Krishna mukunda murari serial may 1st: కోడలికి ఘనంగా సీమంతం చేసిన భవానీ.. కృష్ణని ఇంట్లో నుంచి గెంటేసేందుకు మీరా స్కెచ్
Krishna mukunda murari serial may 1st episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కృష్ణ నెల తప్పిందని భవానీ తనకి సంతోషంగా సీమంతం చేస్తుంది. ఇంట్లో వాళ్ళ ప్రేమ చూసి తనకి పిల్లలు పుట్టరని కృష్ణ గుండెలు పగిలేలా ఏడుస్తుంది.
Krishna mukunda murari serial may 1st episode: ఎండలో రోడ్డు మీద ఒకావిడ మామిడి కాయలు అమ్ముతూ ఉంటుంది. ఆవిడ ఈ ఎండలో ఉండటం ఎందుకు కాయలన్నీ మనం కొనేసి తనని ఇంటికి పంపించేద్దామని అంటాడు. ఎంత మంచి మనసు మీది కానీ ఎందుకు మనకు ఇంత అన్యాయం చేశాడని కృష్ణ బాధపడుతుంది.
కృష్ణ షాక్
బుట్ట మామిడి కాయలు కొనేస్తాడు. ఇంటి దగ్గర భవానీ వాళ్ళందరూ కృష్ణ వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే మురారి వాళ్ళు బుట్ట మామిడి కాయలు పట్టుకుని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇల్లు మొత్తం డెకరేట్ చేసి ఉండటం చూసి అయోమయంగా చూస్తారు.
భవానీ కృష్ణ దగ్గరకు వెళ్ళి సంతోషంగా పలకరించి ముద్దు పెట్టుకుంటుంది. నువ్వు చెప్పకపోయినా మాకు తెలిసిపోయింది. మీరు సర్ ప్రైజ్ అవడం కోసం ఈ పార్టీ అరెంజ్ చేశాము. మీరు చెప్పకపోయినా మీరు తెచ్చుకున్న మామిడి కాయలు చెప్తున్నాయి నువ్వు తల్లివి కాబోతున్నావని భవానీ అనేసరికి కృష్ణ షాక్ అవుతుంది.
భవానీ సీరియస్
నీ వాలకం చూసి అనుమానం వచ్చి హాస్పిటల్ కి కాల్ చేశాను. గైనకాలజిస్ట్ దగ్గర ఉన్నారు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. మీరు నాకు సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు చూశారా నేనే మీకు సర్ ప్రైజ్ ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్ చాలా సంతోషంగా ఉందని అంటుంది.
కృష్ణ ఏదో చెప్పబోతుంటే భవానీ మాట్లాడనివ్వదు. రజిని మధ్యలో కలుగజేసుకుని కృష్ణ ఏదో మాట్లాడాలని చూస్తుంది విను వీళ్ళ వాలకం చూస్తుంటే అక్కడ ఏమి లేదు నువ్వే ఊహించుకుంటున్నావని అనిపిస్తుందని అంటుంది. భవానీ ఫ్రెండ్స్ కూడా రజిని మాటలకు సపోర్ట్ చేస్తారు.
కుమిలిపోతున్న కృష్ణ
నోరు మూస్తావా అనుమానం వచ్చి హాస్పిటల్ కి కాల్ చేసి నిజం తెలుసుకున్నానని భవానీ అంటుంది. కృష్ణ, మురారి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. భవానీ చిన్నపిల్లలా సంతోషపడిపోతుంది. కృష్ణ గదిలోకి వచ్చి భవానీ మాటలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
మురారి వచ్చి తనని ఓదారుస్తాడు. అత్తయ్య, పెద్దత్తయ్య ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నారు. నేను తల్లిని కాబోతున్నానని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈ నిజాన్ని దాస్తూ అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. మోసం చేస్తున్నానని తట్టుకోలేకపోతున్నానని అంటుంది.
నువ్వు తల్లివి కాబోతున్నావ్
మోసం చేయడం లేదని మురారి సర్ది చెప్పేందుకు చూస్తాడు. ఏం జరుగుతుందో ఏం చేయాలో అర్థం కావడం లేదని కృష్ణ అంటుంది. ఈ అబద్దాన్ని కంటిన్యూ చేయడం తప్ప ఏం చేయలేమని మురారి చెప్తాడు. సరోగసి ధైర్యంతో ముందుకు వెళ్దాం. మనం ఎప్పుడైతే సరోగసికి వెళ్లాలని అనుకున్నామో అప్పుడే నువ్వు తల్లివి అయినట్టు. ఏదో ఒక రూపంలో నువ్వు తల్లివి కాబోతున్నావ్ అది నిజమని అంటాడు.
రేవతి వచ్చి కృష్ణతో మాట్లాడుతుంది. విషయం తనకైనా చెప్పొచ్చు కదా అని సంతోషంగా మాట్లాడుతుంది. తన మాటలు విని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కడుపులో ఏమి దాచుకోలేవు కదా తింగరి నా దగ్గర విషయమే ఎలా దాచి పెట్టావని అని సరదాగా అంటుంది. నా కడుపులో ఏమి దాచుకోలేను అందుకేనేమో బిడ్డని కూడా దాచుకోకుండా ఆ దేవుడు చేశాడని కృష్ణ గుండెలు పగిలేలా ఏడుస్తుంది.
నా కల నెరవేరుతుంది
సరోగసి ప్రాసెస్ మొదలవబోతుంది. కృష్ణ, మురారి సంతకాలు పెడితే తన కల నెరవేరుతుందని ముకుంద తెగ ఆనందపడుతుంది. ఆదర్శ్ ముకుందని పలకరిస్తాడు. ఆదర్శ్ మళ్ళీ పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఇంటి నిండా గెస్ట్ లు ఉన్నారు ఏంటి హడావుడి అని ముకుంద ఏం తెలియనట్టు ఆదర్శ్ ని అడుగుతుంది.
ఆవిడగారు నెల తప్పిందట. లోకంలో ఎవరూ తల్లి కాలేదు అన్నట్టు మా అమ్మ అందరినీ పిలిచి హడావుడి చేస్తుందని ఆదర్శ్ కోపంగా చెప్తాడు. అక్కడ సరోగసి అని చెప్పి ఇక్కడ గర్భవతి అని నాటకం ఆడుతున్నారా? ఈ నాటకం ఎన్నాళ్ళు ఆడతారో నేను చూస్తానని ముకుంద మనసులో అనుకుంటుంది.
కృష్ణకి సీమంతం
కృష్ణ మంచి మనసు ఉన్నది, త్యాగశీలి అనుకుంటుంది మా అమ్మ. కానీ నిజం తెలిస్తే ఇలాంటి వాళ్ళు కన్న వాళ్ళు వారాసులే కారని బయటకు గెంటేస్తుందని ఆదర్శ్ కూరహసం మీద విషాన్ని కక్కేస్తాడు. కృష్ణ మీకు మంచిది కాకపోవచ్చు కానీ అందరికీ మంచిది. మీ కోపాన్ని మీ దగ్గర దాచుకొండని ఆదర్శ్ కి చెప్తుంది.
భవానీ కృష్ణకి నగలన్నీ పెట్టి అందంగా ముస్తాబు చేస్తుంది. అందరూ కృష్ణకి సీమంతం చేస్తారు. కృష్ణ బాగా ఏడుస్తుంది.
తరువాయి భాగంలో..
మీరా కృష్ణ, మురారి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తుంది. అందరూ సంతోషంగా ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు. అప్పుడే ఒకావిడ ఇంటికి వస్తుంది. ఇక్కడ సరోగసి మథర్ కావాలని అడిగారు మాట్లాడదామని వచ్చామని చెప్పడంతో కృష్ణ వాళ్ళు షాక్ అవుతారు.
టాపిక్