Krishna mukunda murari april 30th: మురారి బిడ్డ ముకుంద కడుపులో.. కృష్ణ నెల తప్పిందని భవానీ ఆనందం, ఆదర్శ్ జలస్
Krishna mukunda murari serial april 30th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. మురారి బిడ్డ ముకుంద కడుపులోనే పెరిగేలా వైదేహి ప్లాన్ చేస్తుంది. ఈ నిజం తెలిసిన రోజు కృష్ణ గుండె పగిలిపోవడం ఖాయమని ముకుంద సంతోషపడుతుంది.
Krishna mukunda murari serial april 30th episode: కృష్ణ వాళ్ళు వైదేహిని కలిసేందుకు వస్తారు. అప్పుడే ముకుంద వైదేహికి ఫోన్ చేస్తుంది. ఏం చేయాలనే దాని గురించి వైదేహికి ముకుంద తన ప్లాన్ మొత్తం వివరిస్తుంది.
కృష్ణ నెల తప్పింది
కృష్ణ తన పరిస్థితి తలుచుకుని భయపడుతుంది. మురారి ఓదార్పుగా మాట్లాడతాడు. నువ్వు తొమ్మిది నెలలు మోయకపోయినా నువ్వు తల్లివి కాగలవు. అన్ని మర్చిపోయి ఈ అవకాశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామని చెప్తాడు.
ఈ విషయం పెద్దత్తయ్యకు తెలిస్తే అంటే తెలుస్తుంది బిడ్డలు లేకుండా పోవడం కంటే ఇది బెటర్ కదా. సరోగసి సక్సెస్ అయిన తర్వాత ఇంట్లో చెప్దామని అంటాడు. కృష్ణ ఎక్కడని భవానీ అడుగుతుంది. హాస్పిటల్ కి వెళ్ళిందని రేవతి చెప్తుంది. కృష్ణ కంగారు చూస్తుంటే తను నెల తప్పినట్టు ఉందని భవానీ అంటుంది.
భవానీ హాస్పిటల్ కి ఫోన్ చేసి కృష్ణ గురించి అడుగుతుంది. కృష్ణ వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తే ఖచ్చితంగా తను నెలతప్పినట్టేనని ఫిక్స్ అవుతుంది. కృష్ణ వాళ్ళు ప్రెగ్నెన్సీ గురించి కనుక్కోవడానికి హాస్పిటల్ కి వచ్చారని గైనకాలజిస్ట్ ని కలిశారని హాస్పిటల్ వాళ్ళు చెప్తారు.
నా కోడలు తల్లి కాబోతుంది
కృష్ణ నెల తప్పిందని భవానీ, రేవతి సంతోషపడతారు. వాళ్ళకి సర్ ప్రైజ్ ఇవ్వాలని భవానీ అంటుంది. రేవతి మాత్రం కృష్ణ నెల తప్పితే చెప్పకుండా ఎందుకు ఉంటుందని డౌట్ పడుతుంది. హాస్పిటల్ వాళ్ళు చెప్పారు కదా నా కోడలు తల్లి కాబోతుందని భవానీ సంబరపడుతుంది.
భవానీ తన స్నేహితులకు ఫోన్ చేసి కృష్ణ విషయంలో అవమానపరిచారని వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఇంట్లో చిన్న పార్టీ ఉందని, తన కోడలు కృష్ణ తల్లి కాబోతుందని సంబరంగా చెప్తుంది. హాస్పిటల్ లో కృష్ణ వాళ్ళు సరోగసి గురించి డాక్టర్ వైదేహితో మాట్లాడతారు.
సరోగసి మథర్ దొరకడానికి రెండు నెలలు టైమ్ పడుతుందని వైదేహి చెప్తుంది. తమకు అంత టైమ్ లేదని త్వరగా చూడమని చెప్తుంది. సరోగసి అంటే ఆషామాషీ కాదని అంటుంది. సరోగసి కోసం మీలాగే ఒక జంట వచ్చింది, వాళ్ళ కోసం ఒక మథర్ ని చూశామని ఆమెని మీకు ఇస్తామని వైదేహి చెప్తుంది.
సరోగసి మథర్ గురించి కృష్ణ ఆరాటం
కృష్ణ ఆత్రంగా వెంటనే చెప్పేయండి సంతకాలు పెట్టేస్తానని అంటుంది. సరోగసి కోసం ఒప్పుకున్న అమ్మాయి ఎవరని కృష్ణ అడుగుతుంది. బిడ్డను కనే దాకా ఎలాంటి వివరాలు చెప్పేది లేదని వైదేహి చెప్తుంది. అప్పుడే ముకుంద హాస్పిటల్ దగ్గరకు వస్తుంది.
సరే మేము ఆవిడను కలవము కానీ తనని ఒకసారి చూపించమని అడుగుతుంది. ముందు వాళ్ళని ఒప్పించనివ్వండి తర్వాత ఆలోచిద్దామని వైదేహి సర్ది చెప్తుంది. కృష్ణ వాళ్ళు రావడం ముకుంద చూస్తుంది. తొమ్మిది నెలలు బిడ్డని మోసే ఆవిడ నా పక్కన ఉంటే నా బిడ్డ నా పక్కన ఉంటుంది కదాని కృష్ణ అంటుంది. నా బిడ్డని మోయలేకపోతున్నాననే బాధ కొంచెమైన తగ్గుతుందని అంటుంది.
కృష్ణకి నిజం తెలిస్తే
ఆవిడ ఎవరో తెలిస్తే నీ పక్కన ఉండేలా చూసుకుంటానని మురారి మాట ఇస్తాడు. ముకుంద వైదేహిని కలుస్తుంది. సరోగసి మథర్ ఎవరో చూపించమని క్యూరియాసిటిగా అడిగిందని వైదేహి చెప్తుంది. అది అలాగే ఉండనివ్వు కానీ కృష్ణకి నిజం తెలిసిన రోజు తన గుండె పగిలిపోవడం ఖాయమని ముకుంద ఆనందపడుతుంది.
భవానీ ఇంట్లో సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాట్లు జరుగుతాయి. ఇంట్లో ఏంటి హడావుడని ఆదర్శ్ మధుని అడుగుతాడు. కృష్ణ నెల తప్పింది పెద్ద పెద్దమ్మ పార్టీ ఇస్తుందని మధు సంతోషంగా చెప్తాడు. ఆదర్శ్ ఫేస్ మాడిపోతుంది. భవానీ ఫ్రెండ్స్ నోటికి పని చెప్తారు. ఆదర్శ్ ని చూసి మీ అమ్మ నిన్ను ఇలాగే వదిలేస్తుందా మళ్ళీ పెళ్లి చేస్తుందా అంటారు.
ఆదర్శ్ జలస్
భవానీ ఫ్రెండ్స్ సుచరిత వాళ్ళ మాటలు విని ఆదర్శ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. కృష్ణ సరోగసి మథర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆవిడ ఎవరో ఏంటోనని అంటుంది. కృష్ణ వాళ్ళు రోడ్డు మీద మామిడి కాయలు కనిపిస్తే వాటి దగ్గర ఆగుతారు. ఇక రేపటి ఎపిసోడ్లో లో భవానీ ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీ చూసి కృష్ణ వాళ్ళు షాక్ అవుతారు. కృష్ణ నెల తప్పిందని భవానీ సంతోషంగా మాట్లాడుతుంది.
టాపిక్