Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి- అనామికను కొట్టేంతపని చేసిన కనకం- ఇక పుట్టింటికే- పూల బొకేలో రాజ్ బిడ్డ రహస్యం
Brahmamudi Serial April 29th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 29వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల కుటుంబాన్ని కనకం వణికించేసింది. అనామికపై పూలకుండీ ఎత్తి మరి చంపుతా అని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పూల బొకేతో రాజ్ బిడ్డ రహస్యంపై కావ్యకు ఆధారం దొరికింది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో పోలీసులతో కల్యాణ్ వెళ్లిపోతాడు. నిన్ను కట్టుకున్నందుకు నేను, ఆ పిల్లను కట్టుకున్నందుకు వాడు జీవితాంతం భరించాలి అని ప్రకాశం బాధతో ఆవేశంగా అంటాడు. ధాన్యలక్ష్మీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇన్నాళ్లు నా కోడలు అని నెత్తిన పెట్టుకున్నావ్.. చివరికి కల్యాణ్‌కు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందో చూశావా అని అపర్ణ అంటుంది.
అక్కలం ఉన్నామని
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఆ అప్పుతో కల్యాణ్ తిరిగినప్పుడు ఎవరైనా ఆపారా అని అనామిక అంటుంది. చాలు ఆపు.. ఎడ్డి మొహం దానా. ఇంకోసారి అప్పు గురించి తప్పుగా మాట్లాడితే నాలుకు కోస్తాను. కల్యాణ్‌ను అప్పు పెళ్లి చేసుకోవాలంటే నువ్ కాదు కదా.. నీ బాబు అడ్డు వచ్చిన చేసుకునేది. లేపుకెళ్లి పెళ్లి చేసుకునే రకం. ఇంట్లో ఇద్దరం అక్కలం ఉన్నాం కాబట్టి సైలెంట్‌గా ఉంటుంది. లేకుంటే నల్లిని నలిపినట్లు నలిపేస్తుంది జాగ్రత్త అని స్వప్న కోపంగా అరుస్తుంది.
చాలు ఆపు.. చెల్లిని అదుపులో పెట్టుకోవడం చేతకాదు గానీ, రౌడీలా మాట్లాడుతున్నావ్ అని స్వప్నను అంటుంది ధాన్యలక్ష్మీ. దాంతో సైలెంట్‌గా ఉంటుంది స్వప్న. ఎవరో దారినపోయేదానికి భయపడి నా కొడుకు మీద కేసు పెడతావా. ఇది నీకు న్యాయంగా ఉందా. నేను నీకు ఏం తక్కువ చేశాను. ఎన్ని విషయాల్లో నీకు సపోర్ట్‌గా నిలబడ్డాను. చివరికీ ఇదేనా నాకు ఇచ్చే గౌరవం అని అనామికను ధాన్యలక్ష్మీ అడుగుతుంది.
కుర్చీ మడతపెట్టి
ఏం చేయమంటారు అత్తయ్య.. ఈ కావ్యలా అని అనామిక అంటుంటే.. ఏయ్.. నోర్మూయ్.. కావ్య గురించి ఒక్క మాట మాట్లాడితే ఊరుకోను. ఇందాకా దాన్ని పిచ్చిది అన్నావ్. అది పిచ్చిది కాదే. కాపురం నిలబెట్టుకోడాని కష్టపడుతుంది. అది నీలా కేసు పెట్టలేదు. అలాంటి దాని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇంకోసారి దాని గురించి మాట్లాడితే.. నిన్ను.. నీకు సపోర్ట్ చేసేవాళ్లను కుర్చీ మడత పెట్టి.. అని స్వప్న అంటుంటే.. కావ్య ఆపుతుంది.
అవేం మాటలు అక్క అని లోపలికి తీసుకెళ్తుంది కావ్య. నీకు బుద్ధి ఉందా. నా కొడుకు దేవుడు లాంటి వాడు. చెబితే వింటాడు. అలాంటి వాడిని ఇంతలా అవమానిస్తావా అని ధాన్యలక్ష్మీ బాధగా అంటుంది. ఇంతలో కలుగుజేసుకున్న రుద్రాణి.. ధాన్యలక్ష్మీ తొందరపడకు. ఇప్పుడు అరిచి లాభం లేదు. ఏం చేయాలో పెద్దవాళ్లు ఆలోచిస్తారు. ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు పెడుతుంది అని పక్కకు తీసుకెళ్తుంది రుద్రాణి. షాక్ అవుతంది ధాన్యలక్ష్మీ.
ధాన్యలక్ష్మీ కన్విన్స్
తర్వాత పైకి వెళ్తుంది అనామిక. ఎందుకు పక్కకు తీసుకొచ్చావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. నువ్ ఆవేశంలో ఉన్నావ్. కానీ జరుగుతున్న మంచి గురించి ఆలోచించట్లేదు. అనామిక అన్ని ఆలోచించే చేసింది. అప్పుతో తిరగొద్దని ఎంతమంది, ఎన్నిరకాలుగా చెప్పిన కల్యాణ్ విన్నాడా. లేదు. కానీ, ఇప్పుడు అప్పుతో తిరగడానికి ఆలోచిస్తాడు. ఆ అప్పుకున్న పొగరుకు ఇక కల్యాణ్ మొహం కూడా చూడదు అని రుద్రాణి చెబుతుంది.
నువ్ చెప్పింది కూడా కరెక్టే. బాధగా అనిపించినా కల్యాణ్ మారితే చాలు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో రుద్రాణి సంతోషిస్తుంది. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో అప్పుకు కల్యాణ్ సారీ చెబుతాడు. ఎందుకురా భయ్.. నువ్వేమైనా కంప్లైట్ ఇచ్చావా. లేదు కదా అని అప్పు అంటుంది. మన తప్పు లేకపోయినా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని కల్యాణ్ అంటే.. నీ భార్యపై చేయి చేసుకోవడం తప్పే కదరా అని అప్పు అంటుంది.
వరకట్నం కేసు కూడా పెట్టింది
మనమేంటో మనకు తెలుసు. ఇక ఎవరు ఏమనుకుంటే ఏంటీ అని అప్పు అంటుంది. దీంతో నీ పోలీస్ జాబ్ ఏమవుతుంది. నీ భవిష్యత్ ఏమవుతుంది అని కల్యాణ్ అంటాడు. బావ మీరెందుకు వచ్చారని అప్పు అంటే.. వదినా మీరు పోలీస్ స్టేషన్‌కు రావడం ఏంటని కల్యాణ్ అంటాడు. ఇక్కడికి తప్పు చేసిన వాళ్లే రావాలని రూల్ లేదు. అందుకు మీరే ఎగ్జాంపుల్ అని కావ్య అంటుంది. తర్వాత ఎస్సైతో రాజ్ మాట్లాడుతాడు.
ఆ అమ్మాయి ఎంత చెప్పిన వినలేదని ఎస్సై అంటే.. తనకు కల్యాణ్‌పై ఓవర్ పొసెసివ్‌నెస్. ఇప్పుడు ఏం చేస్తే వీళ్లు బయటపడతారు. మినిస్టర్, మీ పై ఆఫీసర్స్ ఎవరితో అయినా ఒప్పిస్తే సరేనా అని రాజ్ అంటాడు. లేదు సారు. ఆమె పెట్టిన కేసులు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వరకట్నం కేసుతోపాటు డొమెస్టిక్ వయెలెన్స్ కేసు కూడా పెట్టింది. ఇలాగే చాలా మంది మిస్ యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏం చేయలేం. రేపు వీళ్లను కోర్టులో హాజరుపరచాలి అని ఎస్సై అంటాడు.
ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు
అప్పు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది. నిర్దోషిగా బయటపడకుండే కెరీర్ పోతుందని కావ్య అంటుంది. అసలు వాళ్లిద్దరి మధ్య ఉంది మంచి ఫ్రెండ్షిప్ అంతే. కోర్టుకు వెళితే దుగ్గిరాల ఇంటి పరువు పోతుంది. ఏం చేయాలో చెప్పండి అని రాజ్ అడుగుతాడు. ఒకే ఒక అవకాశం ఉంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. మీ ఫ్యామిలీ మీద ఉన్న గౌరవంతో నేను ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మీరు ఎలాగైనా అనామికను ఒప్పించి కేసు విత్ డ్రా చేసుకునేలా చేయండి అని ఎస్సై అంటాడు.
కానీ, అనామిక ఎవరి మాట వినట్లేదు అని రాజ్ అంటే.. లేదు వింటుంది. ఎవరు చెబితే వింటుందో నాకు తెలుసు అని రాజ్‌ను కావ్య తీసుకెళ్తుంది. మరోవైపు ఇంట్లో అందరూ దిగాలుగా కూర్చుంటారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాజ్ కూడా ఫోన్ చేయలేదు. అక్కడ ఏం జరుగుతుందో అని ఇందిరాదేవి అనుకుంటుండగా.. కనకం వచ్చి పూలకుండీ బద్దలు కొడుతుంది. దాంతో అంతా షాక్ అయితే. పైనుంచి అనామిక వస్తుంది.
అరిష్టం తెస్తుందో
పొగరుగా అనామిక వస్తుంటే కనకం చూస్తుంది. ఏయ్ దిగవే.. రావే కిందకు. నీ సంగతి ఏంటో తేల్చుకుందామని వచ్చాను అని అరుస్తుంది కనకం. ధాన్యలక్ష్మీ కలగజేసుకుంటే.. నువ్ ఆపు. కోడలిని తెచ్చుకోవడం కాదు. కొడుకుకు ఏ అరిష్టం తెస్తుందో కూడా చూసుకోవాలి అని కనకం అంటుంది. మరి నీ కూతురుకి ఎలా ఉండాలో చెప్పలేవా అని ధాన్యలక్ష్మీ అంటే.. ఆపు.. ఇంకోసారి నా కూతురు గురించి అంటే మర్యాద ఉండదని కనకం అంటుంది.
ఏం చేసింది నా కూతురు. నా ఇంటి చుట్టు తిరగమని చెప్పిందా. నీ కోడలు టార్చర్ చెప్పుకోమందా. ఈ జానాబెత్తడు లేనిదానిది ఇంట్లో నుంచి గెంటేసి తన స్థానంలో వచ్చి కూర్చుందా అని కనకం అంటుంది. మీకు ఇంకా సిగ్గు లేదా. ఇలా మాట్లాడుతున్నారు అని అనామిక అంటుంది. దాంతో కోపాన్ని అణుచుకుంటూ పళ్లు రాలగొడతాను తన చేతిని కంట్రోల్ చేసుకుంటుంది కనకం. నా సంగతి తెలీదు నీకు. ఇందాకా పూలకుండీ పగిలినట్లు నీ తల పగులుతుంది అని కనకం అంటుంది.
చంపేసి జైళ్లో కూర్చుంటా
దానికి అనామిక షాక్ అవుతుంది. నువ్ అసలు చదువుకున్నావా. ఆడ పుట్టుక పుట్టావా. మగాడు, అమ్మాయి కనిపిస్తే అదే సంబంధం అంటగడతావా. నీకే గనుక సిగ్గు ఉంటే.. కల్యాణ్ బాబుకు ఉత్తరాలు రాసి నీ వైపు తిప్పుకునేలా చేసేందుకు ఊరుకున్న నీ అమ్మా బాబును అను. నీ అమ్మా బాబుకు ఉందా సిగ్గు అని కనకం అంటుంది. ఏమంటుందో చూశారా అత్తయ్య అని అనామిక అంటే.. నిజమే కదా. కల్యాణ్‌కు ఆస్తి ఉందనే కదా వల వేసి పడేశావ్ అని స్వప్న అంటుంది.
నువ్ అన్న మాట నీకే వర్తిస్తుందని గుర్తు చేస్తున్నాను అని స్వప్న అంటుంది. నీ అక్క చెల్లెల్లు చేసిందేంటి అని అనామిక అంటే.. కోపం కట్టలు తెంచుకున్న కనకం ఏయ్.. అనుకుంటూ పూలకుండీతో అనామికను కొట్టేందుకు పైకి లేపుతుంది. ఇంకోసారి నా కూతుళ్ల గురించి తప్పుగా అంటే.. నిన్ను చంపేసి జైళ్లో కూర్చుంటాను అని కనకం అంటుంది. అనామిక భయపడిపోతుంది. దాంతో ఇందిరాదేవి కనకం.. ఏమిటీ వెర్రీ ఆవేశం. ఇటువ్వు. కాస్తా స్థిమితంగా ఉండు అని ఇందిరాదేవి అంటుంది.
బరితెగించిన ఆడదాన్ని
ఎలా ఉండాలమ్మా. ఎందుకు ఉండాలి. నా కూతుళ్లు మీ ఇంటి కోడళ్లు అయినప్పటి నుంచి మేము బాధగా వెళ్లిపోతూనే ఉన్నాం. మేమంటే అంత చులకనా. మాకంటే ఎందులో గొప్ప. ఇవాళ జరిగింది అన్యాయమని ఎవరు అడగరా. నిలదీయారా. మీ ఇంటి వారసుడిని పోలీస్ స్టేషన్‌కు పంపించి ఈ బరితెగించిన ఆడదాన్ని ఇంటి మహరాణిలా ఒక్కో మెట్టు దిగి వస్తుంటే ఇదేంటని ఎవరు ప్రశ్నించరా అని కనకం అంటుంది.
ఎవరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పినా నీ కూతురు కల్యాణ్ వెంట తిరగడం మానట్లేదు అని అనామిక అంటుంది. నా కూతురే కల్యాణ్ కావాలనుకుంటే నీ ప్రేమకు ఎందుకు సపోర్టే చేస్తుంది. మధ్యవర్తిత్వం ఎందుకు చేస్తుంది. నీకు గుర్తులేదా. నీకు తలకాయ లేదా. అందులో మెదడు లేదా అని కనకం అంటుంది. ఎందుకు కనకం గొంతు చించుకుంటున్నావ్. ఇదేం వీధి కాదు. దుగ్గిరాల ఇల్లు అని రుద్రాణి అంటంది.
పుట్టింటికి అనామిక
దుగ్గిరాల కుటుంబం అయితే ఏంటీ గొప్పా అని కనకం అంటే.. నీలాంటి వాళ్లు అడుగుపెట్టలేనంత గొప్పది అని రుద్రాణి అంటుంది. అలా అయితే మరి మొగుడిని వదిలేసి వచ్చిన నువ్వేందుకు ఉన్నావ్ అని కనకం అంటుంది. ధాన్యలక్ష్యీ మధ్యలోకి వస్తే.. హేయ్.. ఆగమని చెప్పానా నీకు.. రేపు ఇది చేసిన పనికి కల్యాణ్ ఎగిరి తంతే పుట్టింటికి వెళ్లి నీలా పడి ఉంటుంది. నువ్ కూడా వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇంటి పరువుకు మచ్చ తేకూడదనే ఇక్కడ మాట్లాడుతున్నా. లేకుంటే వీధిలో గొడవ చేసేదాన్ని. కుళాయిల దగ్గర బిందలో సన్మానం చేయించేదాన్ని అని కనకం అంటుంది.
కనకం ఒక ఆడపిల్ల భవిష్యత్తు నాశనం చేయడం తప్పే. అప్పును అవమానించిన, తప్పుబట్టిన కల్యాణ్ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నట్లే. కానీ, నవ్విలా దండెత్తి వచ్చి దుర్భాషలాడటం మంచిది కాదు అని అపర్ణ అంటుంది. కడుపు కోత. దానికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. వీళ్లంతా దాన్ని అంటే పోనీలే వీళ్ల సంస్కారం అంతే అనుకున్నాను. కానీ, ఇవాళ ఏ తప్పు చేయకుండా స్టేషన్‌కు వెళ్లింది. రేపు దానికి పెళ్లి అవుతుందా. రేపు దాని జీవితం ఏమవుతుంది. జైలుకు వెళితే అసలు నా బిడ్డ ఏమవుతుంది అని కనకం అడుగుతుంది.
బాబు రహస్యం బయటకు
దానికి ఇక్కడికి వచ్చి అరిస్తే ఏమస్తుంది అని రుద్రాణి అంటుంది. ఇదేదో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నా కూతురుని బలాదూర్ తిరగనివ్వనని, కల్యాణ్‌తో తిరగనివ్వనని రాసి ఇవ్వండి. పోలీసులు దయతలుస్తారు అని అనామిక అంటుంది. నేను రాసివ్వను. అలా రాసిస్తే.. నా కూతురు నిజంగా తప్పుడు ఉద్దేశంతో తిరిగినట్లు అవుతుంది. నాకు న్యాయం కావాలి. కానీ, నేను తగ్గను అని కనకం అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటి ముందు ఓ ఫ్లవర్ బుకేను ఎవరో పడేస్తారు. అది చూసి కావ్య తీసుకుంటుంది. దానిపై మై డియర్ కళావతి హ్యాపీ యానివర్సరీ అని రాసి ఉంటుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. అంటే, ఇది మా పెళ్లి రోజు.. నాకు ఇవ్వడానికి మా ఆయన కొన్న బుకేనా. అంటే నాకోసం ప్రేమతో కొన్న మనిషి.. నాకు ఇచ్చేలోపే బిడ్డను తీసుకొని ఎందుకు వచ్చారు. అంటే ఇది కొనడానికి.. బాబును తీసుకుని రావడానికి మధ్య ఏదో జరిగింది. అదేంటో తెలుసుకుంటాను అని కావ్య అనుకుంటుంది.