Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial latest episode promo kavya warning to anamika parents ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Sanjiv Kumar HT Telugu
Apr 28, 2024 07:36 AM IST

Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరిగనుందనేది ప్రోమోల్లో చూస్తే..

అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ
అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో భర్త కల్యాణ్‌పై అనామిక గృహ హింస కేసు పెడుతుంది. వెనక్కి తీసుకోవాలంటే అప్పును జీవితంలో కలవకూడదని, తనకు క్షమాపణ చెప్పాలని అంటుంది. దానికన్న జైలు శిక్షే నయమని చెప్పి పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు కల్యాణ్. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైతో రాజ్, కావ్య మాట్లాడుతుంటారు. పోలీస్ స్టేషన్‌లో అప్పు, కల్యాణ్ ఓ పక్కన నిల్చుంటారు.

కోర్టులో హాజరు చేయాల్సిందే

ఆ అమ్మాయి పెట్టింది మాములు కేసు కాదు కదా సార్. ఈ కేసులన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి సార్. రేపు వీళ్లని కోర్టులో హాజరు పరచాల్సిందే అని ఎస్సై చెబుతాడు. దాంతో రాజ్, కావ్య, అప్పు కంగారుపడిపోతారు. అప్పు, కల్యాణ్ ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు. కట్ చేస్తే.. దుగ్గిరాల ఇంట్లో కనకం రచ్చ చేస్తుంటుంది.

ఈ దుగ్గిరాల వారి కుటుంబం ఈనాడు నా కూతురికి ఏ న్యాయం చెబుతుందో, ఏ సమాధానం చెబుతుందో.. ఎలా ఈ తల్లి గుండెల్లో రగిలే చిచ్చును ఆర్పేస్తుందో.. అది తెలుసుకునే దాకా.. నేను మీ నట్టింట్లోనే కూర్చుంటాను అని కనకం అంటుంది. అలాగే ఇంటి మెట్లపై అలాగే కూర్చుని చూస్తుంది కనకం.

బెదిరించిన కావ్య

మరోవైపు అనామిక తల్లిదండ్రులను రాజ్‌తోపాటు కలుస్తుంది కావ్య. మీ కూతురు స్టేషన్‌కు వచ్చి కేసు విత్ డ్రా చేసుకుంటే సరే సరి.. లేదంటే సరాసరి ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్తాం అని కావ్య బెదిరిస్తుంది. దాంతో అనామిక తల్లిదండ్రులు భయపడిపోతారు. రాజ్ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అటు కనకం, ఇటు కావ్య ఇలా తల్లీ కూతుళ్లు అందరినీ వణికించేశారు. ఏప్రిల్ 29న ప్రసారమయ్యే బ్రహ్మముడి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది.

Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో మను హంతకుడు అనడానికి ఆధారాలు ఏవని వసుధార అడుగుతుంది. దానికి ఓ వీడియోను పోలీస్ చూపిస్తాడు. ఆ వీడియో చూసి షాక్ అయిన వసుధారతో తాను గన్ పేల్చింది నిజమేనని, కానీ, అది గాల్లోకి కాల్చినట్లు మను చెబుతాడు. రాజీవ్‌ను మను కాల్చడం చూసిన ప్రత్యక్ష సాక్షి అని మను పీఏను చూపిస్తాడు పోలీస్. దాంతో వసు, మను, మహేంద్ర మరింత షాక్ అవుతారు.

వ్యతిరేకంగా పీఏ సాక్ష్యం

మనుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు మను పీఏ పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. రాజీవ్‌ను షూట్ చేయడం తాను చూశానని, కానీ రాజీవ్ అరవడం మాత్రమే విన్నట్లు చెబుతాడు పీఏ. రాజీవ్‌ను బెదిరించడానికే తాను అలా మిస్ ఫైర్ చేసినట్లు మను చెబుతాడు. రాజీవ్‌ను బెదిరించి వదిలేసినట్లు జరిగిందంతా మొత్తం చెబుతాడు మను.

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో పిల్లలు లేకపోయిన పర్వాలేదని మురారి చెబితే కృష్ణ ఎమోషనల్ అవుతుంది. పెద్దత్తయ్యను చూడగానే ఎక్కడ బోరున ఏడుస్తూ నిజం చెప్పేస్తానేమో అని గుండెల్లో వణుకుపుడుతుంది ఏసీపీ సార్ అని కృష్ణ అంటుంది. ఆ మాటలను చాటు నుంచి మీరా వింటూ ఉంటుంది.

ముకుందతోనే మురారికి బిడ్డ

పెద్దత్తయ్యకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా.. మనకు రక్తం పంచుకుపుట్టిన బిడ్డే కావాలన్నా.. ఒకే ఒక్క మార్గం ఉంది సార్ అని కృష్ణ చెబుతుంది. ఏంటది అని మురారి అడుగుతాడు. సరోగసీ అని కృష్ణ చెబుతుంది. అది విని మీరా చాలా సంబరపడిపోతుంది.

ఒక మంచి అమ్మాయిని చూసి సరోగసీకి వెళ్లిపోదాం సార్ అని ఆనందంగా కృష్ణ అంటుంది. దాంతో నువ్ కోరుకుందే చేద్దాం అని మురారి చెబుతాడు. కృష్ణ సంతోషంగా ఫీల్ అవుతుంటుంది. అది విన్న మీరా.. యస్.. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇక మురారి నా వాడు కాకుండా ఎవరు ఆపలేరు కృష్ణ అని మీరా అనుకుంటుంది. అయితే, ఆ సరోగసీ విధానం మీరా అలియాస్ ముకుందకే చేస్తారని తెలుస్తోంది. ముకుంద ద్వారానే మురారి-కృష్ణలకు బిడ్డ పుట్టనుందని అర్థమవుతోంది.

Whats_app_banner