Krishna mukunda murari april 22nd episode: కృష్ణ ఈ ఇంటి దేవత, రజినికి భవానీ వార్నింగ్.. గుండెలు పగిలేలా ఏడ్చిన మురారి
Krishna mukunda murari serial april 22nd episode: ముకుంద వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కృష్ణ ఇక ఈ జన్మకి పిల్లల్ని కనే యోగ్యం లేదని డాక్టర్ పరిమళ చెప్పడంతో మురారి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. కృష్ణకి నిజం తెలియకుండా దాచిపెడతాడు.
Krishna mukunda murari serial april 22nd episode: కృష్ణని హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. కృష్ణకి ఏమవుతుందోనని మురారి చాలా బాధపడతాడు. నీ బాధ చూస్తుంటే బాధగా ఉంది కానీ అది కృష్ణ కోసం కాబట్టి పట్టించుకోనని ముకుంద మనసులో అనుకుంటుంది. చిన్న కడుపు నొప్పికి ఎందుకు అంత కంగారుపడటం అని మురారికి సర్ది చెప్తుంది.
ముకుంద టెన్షన్
ఏదో తినడం వల్ల, తాగడం వల్ల నొప్పి రాలేదని తెలుసుకున్న కృష్ణ ట్యాబ్లెట్ గురించి తెలుసుకోకుండా ఉంటుందా? టెస్ట్ లో పానకంలో కలిపిన ట్యాబ్లెట్ వల్ల ఇలా జరిగిందని నిజం తెలిస్తే ఏం చేయాలని ముకుంద టెన్షన్ పడుతుంది. తన టెన్షన్ ని మురారి గమనిస్తాడు. ఏదో చెప్పి కవర్ చేస్తుంది.
రేవతి మధుకు ఫోన్ చేసి కృష్ణకి ఎలా ఉందని భయపడుతుంది. స్కానింగ్ కి పంపించారని చూస్తున్నారని కంగారుపడొద్దని మధు నచ్చజెప్తాడు. ఆదర్శ్ రేవతి దగ్గరకు వచ్చి మీరా గురించి అమ్మని ఆడగమన్నాను కదా అడిగావా అంటాడు. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం నువ్వు ఏం అడుగుతున్నావ్. కృష్ణకి అలా అయి హాస్పిటల్ కి వెళ్తే పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా అని తిడుతుంది.
ఆదర్శ్ పెళ్లి గోల
చిన్న కడుపు నొప్పికి ఆలోచించడం ఎందుకు. ఏం కాదులే అంటాడు. రేవతి ఆదర్శ్ మాటలకు చాలా బాధపడుతుంది. మీ అమ్మతో మాట్లాడాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అన్నదని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. ముకుంద చావుకు కృష్ణ కారణమని అందరికీ తెలుసు కానీ తనని ఎవరు ఏమి అనరు. కానీ కడుపు నొప్పి రాగానే నేను విలవిల్లాడిపోవాలా అనుకుంటాడు.
కృష్ణకి గర్భసంచి తీసేయాలి
కానీ మురారి మాత్రం టెన్షన్ గా అడుగుతాడు. వాళ్ళ మాటలు ముకుంద వింటూ ఉంటుంది. కృష్ణకి గర్భసంచి తీసేయాలని చెప్పేసరికి మురారి షాక్ అవుతాడు. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని ముకుంద మాత్రం తెగ సంతోషపడుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ పరిమళ గర్భసంచి తీసేయడం ఏంటి? ఏదో మామూలు కడుపు నొప్పి అన్నావ్ కదా అంటాడు.
వారం రోజుల్లో ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలని చెప్తుంది. మురారి చాలా బాధపడతాడు. ఈ జన్మకి కృష్ణకి పిల్లలు పుట్టే యోగం లేదని చెప్తుంది. కృష్ణ భవానీకి ఇచ్చిన మాట గుర్తు చేసుకుని మురారి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. అలా జరగడానికి వీల్లేదు కృష్ణ పిల్లలని కనాలి అది తన జీవితాశయం అంటాడు.
కృష్ణకు నిజం చెప్పొద్దు
ఏం చేయలేమని పరిమళ అంటే మురారి మాత్రం ఆవేశపడతాడు. మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేసినా అదే వస్తుంది కృష్ణకి గర్భసంచి తీసేయాలి. తనకి ఇక పిల్లలు పుట్టరని అంటుంది. ఇంట్లో అందరం ఎన్ని ఆశలు పెట్టుకున్నామో తెలుసా అని మురారి ఫీల్ అవుతాడు.
ఇప్పుడు పిల్లల కంటే కృష్ణ క్షేమంగా ఉండటం ముఖ్యం తన గురించి ఆలోచించమని పరిమళ సర్ది చెప్తుంది. తను పిల్లల్ని కనలేదని తెలిస్తే ఏమౌవుతుందని ఏడుస్తాడు. ఇప్పుడు తను ఉన్న పరిస్థితిలో నిజం తెలిస్తే అసలు తట్టుకోలేదు, విషయం చెప్పొద్దని పరిమళ అంటుంది.
వందరెట్లు సంతోషం ఇస్తా మురారి
ఆపరేషన్ చేసిన తర్వాత అప్పుడు చెప్దామని చెప్తుంది. నువ్వు ఏడిస్తే కృష్ణకి అనుమానం వస్తుందని అంటుంది. సారీ మురారి నిన్ను కన్నీళ్ళు పెట్టిస్తున్నాను. ఈ బాధను మర్చిపోయేలా వంద రెట్లు సంతోషం నేను నీకు ఇస్తానని ముకుంద అనుకుంటుంది.
సంగీత బాధగా కూర్చుని ఉంటే రజిని తినడానికి తీసుకొచ్చి ఇస్తుంది. కానీ తనకు మనసు బాగోలేదని సంగీత అంటుంది. పాపం కృష్ణక్క కడుపు నొప్పి అని హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఎలా ఉందో ఏంటోనని అంటుంది. దానికి కడుపు నొప్పి వస్తే నీకేంటి బాధ అయినా అది అంత తొందరగా పోయే రకం కాదులే అంటుంది.
ఇంట్లో నుంచి గెంటేస్తానన్న భవానీ
భవానీ కోపంగా రజిని అని అరుస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకొనని వార్నింగ్ ఇస్తుంది. కృష్ణ కళ్ళలో నుంచి కన్నీటి బొట్టు పడినా కూడా ఈ కుటుంబం విలవిల్లాడిపోతుంది.
కృష్ణ అంటే ఎవరనుకుంటున్నావ్. మా ఇంటి కోడలు మా వంశాన్ని నిలబెట్టే మహాలక్ష్మి. నేను ఏదో మాట వరసకు అలా అన్నాను. నేనేం కావాలని అనలేదని రజిని అంటుంది. కృష్ణ గురించి ఇంకొక్క మాట మాట్లాడిన ఊరుకునేది లేదు. నువ్వు ఇంకొక్కసారి నోరు జారితే గడప దాటాల్సి వస్తుందని గట్టిగా బుద్ధి చెప్తుంది.
ఆదర్శ్ వాళ్ళ మాటలు వింటూనే ఉంటాడు. ముకుంద చనిపోవడానికి కారణం కృష్ణ కానీ అమ్మ తనని దేవతగా చూస్తుందని తిట్టుకుంటాడు. కృష్ణ బాధగా కూర్చుంటే మురారి పరిమళ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. తన మూడ్ మార్చాలని అనుకుంటాడు.
రేపటి ఎపిసోడ్లో..
పిల్లలు కావాలన్న పెద్దత్తయ్య కోరిక నెరవేర్చడం కంటే ఈ జీవితంలో మరొక ఆశ లేదని కృష్ణ అంటుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ముకుంద బొమ్మ ఇస్తుంది. నేను పిల్లలని కంటానని ఈ వంశానికి వారాసులని ఇస్తానని ఈ ఇంట్లో అందరూ నన్ను ఎంత అపురూపంగా చూస్తున్నారోనని మురారి దగ్గరకు వచ్చి కృష్ణ సంతోషంగా చెప్తుంది. మురారి ఆ మాటలకు కూలబడిపోతాడు. మిమ్మల్ని ఇంత బాధగా ఎప్పుడు చూడలేదు ఏమైందని అడుగుతుంది.
టాపిక్