Krishna mukunda murari april 19th: మీరా దుర్మార్గానికి బలైన కృష్ణ.. ముకుందని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆదర్శ్
Krishna mukunda murari serial april 19th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కృష్ణకు తల్లి అయ్యే అవకాశం లేకుండా చేసేందుకు ముకుంద ట్యాబ్లెట్ కలిపి పానకం ఇస్తుంది. అది కృష్ణ తాగేస్తుంది.
Krishna mukunda murari serial april 19th episode: ఆదర్శ్ మాటలు తనని చాలా బాధించాయని కృష్ణ చెప్తుంది. తన మాటలు ఎందుకు నమ్మడం లేదని కృష్ణ బాధగా అంటుంది. వీళ్ళ మాటలు ముకుంద వింటూ ఉంటుంది.
అసలు ఆదర్శ్ కి నీమీద ఎందుకు కోపం, ఉంటే ముకుంద మీద ఉండాలి. ఇప్పుడే తేల్చేస్తానని మురారి వెళ్లబోతుంటే కృష్ణ ఆపుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు ఏదో ఒక రోజు నన్ను కూడా అర్థం చేసుకుంటాడని తనకి తానే సర్ది చెప్పుకుంటుంది.
మురారిని పొగిడిన ముకుంద
మురారి నుంచి నిన్ను దూరం చేసేందుకు నేను ఉపయోగిస్తున్న ఆయుధం అది ఏంటి నిన్ను అర్థం చేసుకునేదని ముకుంద మనసులో అనుకుంటుంది. ముకుంద మురారి వాళ్ళ దగ్గరకు వచ్చి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తుంది.
కృష్ణ మాత్రం కోపంగా తనని పలకరించకుండా ఉంటుంది. ఏమైంది కృష్ణకు ఎందుకు అలా ఉందని అంటుంది. తన మీద కోపమని మురారి చెప్తాడు. మిమ్మల్ని చూస్తే కోపం ఉండదు. మీలాంటి భర్త దొరకడం ఏ ఆడపిల్లకి అయినా అదృష్టం, బంగారం చూసుకున్నట్టు చూసుకోవాలని అంటుంది.
ముకుంద మురారి బుగ్గ తాకడానికి ట్రై చేస్తుంటే ఆపుతాడు. కృష్ణతో ఎలాగైనా ట్యాబ్లెట్ కలిపిన పానకం తాగించాలని ముకుంద తెగ ఆరాటపడుతుంది. కృష్ణ ఆదర్శ్ గురించి ఆలోచిస్తూ చిరాకుగా ఉంటే మురారి వచ్చి కౌగలించుకుంటాడు.
ఆదర్శ్ కి ఎవరో నూరిపోస్తున్నారు
ఆదర్శ్ మాటలు బాధగా ఉన్నాయని అంటాడు. తన మాటలు పట్టించుకోవద్దని చెప్తాడు. అసలు నామీద ఎందుకు కోపం నేనేం చేశాను. ముకుంద విషయం అనుకుంటే మీరు మంచి వాళ్ళు అయితే నేను చెడ్డదాన్ని ఎందుకు అయ్యాను. నామీద ఆదర్శ్ కి ఎవరో చెడుగా చెప్పారని కృష్ణ అనుమానిస్తుంది.
కృష్ణ వాళ్ళ మాటలు ముకుంద వింటూ ఉంటుంది. సరే నువ్వు అనుకున్నట్టే అనుకుందాం కానీ నువ్వు అంటే ఈ ఇంట్లో పడని వాళ్ళు ఎవరు ఉన్నారు. వాడికి తోచినట్టు చేస్తున్నాడు. మీరా మన ఇంటికి వస్తే తనకి ముకుంద పేరు ఎందుకు పెట్టాడు. పెట్టమని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఈ మధ్య వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియడం లేదు.
అత్తయ్య అని పిలిచిన ముకుంద
ఆదర్శ్ నీతో మాట్లాడకపోయినా పట్టించుకోవద్దని మురారి సర్ది చెప్తాడు. ఆదర్శ్ కి ఎవరో నూరిపోస్తున్నారని కృష్ణ బాగానే కనిపెట్టింది. అది నేనే అని తెలుసుకునేలోపు మొత్తం జరిగిపోవాలని ముకుంద అనుకుంటుంది. ఈరోజు ఇంట్లో జరిగే పండుగ కృష్ణ జీవితంలో విషాదాన్ని నింపాలని అనుకుంటుంది.
పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయా అని భవానీ కృష్ణని అడుగుతుంది. అయిపోయాయని కృష్ణ చెప్తే ముకుంద కూడా పూర్తి అయ్యాయి అత్తయ్య అనేస్తుంది. తను అలా పిలవడంతో అందరూ షాకింగ్ గా చూస్తారు. ఇంతలో పంతులు రావడంతో దాని సంగతి మర్చిపోతారు. పంతులు ముకుందని చూసి ఎవరని అడుగుతాడు.
ముకుందని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆదర్శ్
మా ఇంటి మనిషే అని భవానీ చెప్తుంది. ఈరోజు అన్నీ మంచి మాటలు చెవులో పడుతున్నాయి. పొరపాటున పిలిచినా ముకుంద అమ్మని అత్తయ్య అని పిలిచింది. అమ్మ కూడా ముకుందని ఈ ఇంటి మనిషి అంటుంది. ఎలాగైనా అమ్మకి ముకుంద విషయం చెప్పాలని అనుకుంటాడు.
శ్రీరామనవమి కళ్యాణం చేసేందుకు మురారి, కృష్ణ పీటల మీద కూర్చుంటారు. నీతో కలిసి పూజ చేయాలని అనుకున్నాను. కానీ వచ్చే శ్రీరామనవమికి అసలు మిస్ అవనని ముకుంద అనుకుంటుంది. అటు ఆదర్శ్ వచ్చే శ్రీరామనవమికి మనం ఇద్దరం కలిసి పూజలో కూర్చోవాలి ముకుంద అని అనుకుంటాడు.
ముకుంద పక్కనే ఆదర్శ్ కావాలని కూర్చుంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఈయన గోల తప్పడం లేదని ముకుంద తిట్టుకుంటుంది. ఆదర్శ్ కృష్ణ గురించి వెనుక మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణ మేక వన్నె పులి, తేనె పూసిన కత్తి. ఇలాంటి వాటికి కృష్ణ నిదర్శనం అని ముకుందతో ఆదర్శ్ అంటుండటం కృష్ణ వింటూనే ఉంటుంది.
ట్యాబ్లెట్ కలిపేసిన ముకుంద
ఆదర్శ్ మాటలకు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. పూజ పూర్తి అవుతుంది. ముకుంద వెళ్ళి పానకంలో ట్యాబ్లెట్ కలిపి తీసుకొస్తుంది. భవానీ కృష్ణకు పుట్టబోయే బిడ్డ గురించి సంతోషంగా మాట్లాడుతుంది. ఈరోజుతో కృష్ణ పిల్లల్ని కనే అదృష్టానికి దూరం కాబోతుంది. మీ కోరిక నెరవేరేది తనతోనే అని ముకుంద మనసులోనే సంతోషపడుతుంది.
ట్యాబ్లెట్ వేసి ముకుంద కలుపుతూ ఉంటే సంగీత వచ్చి ఏంటి కలుపుతున్నావని అడుగుతుంది. ముకుంద షాక్ అవుతుంది. చూసేసిందా అని టెన్షన్ పడుతుంది. ఆదర్శ్ కి పానకం తానే ఇస్తానని లేదంటే అమ్మ తిడుతుందని సంగీత అంటుంది. ముకుంద అనుకున్నట్టుగానే కృష్ణ ఆ పానకం తాగేస్తుంది.
తరువాయి భాగంలో..
కృష్ణ బిడ్డ గురించి మాట్లాడుతుంది. ఒక్కసారిగా కడుపులో నొప్పిగా ఉందని అల్లాడిపోతుంది. కృష్ణని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. నొప్పి భరించలేకపోతున్నాను పెద్దత్తయ్య చచ్చిపోతానని భయంగా ఉందని అంటుంది. ముకుంద మాత్రం సంతోషంగా ఉంటుంది.
టాపిక్