Aadi Sai Kumar: కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నంతో ఆది రీఎంట్రీ - క్రేజీ ఫెల్లో హీరోయిన్‌తో మ‌రోసారి రొమాన్స్‌!-aadi sai kumar veerabhadram chowdary reunite after 8 years with krishna from brindavanama movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aadi Sai Kumar: కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నంతో ఆది రీఎంట్రీ - క్రేజీ ఫెల్లో హీరోయిన్‌తో మ‌రోసారి రొమాన్స్‌!

Aadi Sai Kumar: కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నంతో ఆది రీఎంట్రీ - క్రేజీ ఫెల్లో హీరోయిన్‌తో మ‌రోసారి రొమాన్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Apr 18, 2024 01:45 PM IST

Aadi Sai Kumar: ఆది సాయికుమార్ కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీ గురువారం ప్రారంభ‌మైంది. ఈ సినిమాకు వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఆది సాయికుమార్ కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీ
ఆది సాయికుమార్ కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీ

Aadi Sai Kumar: దాదాపు ఏడాది గ్యాప్ త‌ర్వాత త‌న కొత్త మూవీని అనౌన్స్‌చేశాడు ఆదిసాయికుమార్‌. విలేజ్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. గురువారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో నిర్మాత దిల్‌రాజుతో పాటు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీకి వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో ఆదిసాయికుమార్‌, వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి కాంబోలో చుట్టాల‌బ్బాయి సినిమా వ‌చ్చింది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ, లవ్, కామెడీ అంశాల‌తో ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీ రాబోతోంది. ఈ సినిమాలో ఆదికి జోడీగా దిగంగ‌నా సూర్య‌వ‌న్షీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క్రేజీ ఫెలో త‌ర్వాత ఆదిసాయికుమార్‌, దిగంగ‌నా సూర్య‌వ‌న్షీ మ‌రోసారి ఈ మూవీలో జంట‌గా క‌నిపించ‌బోతున్నారు.

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

కృష్ణ ఫ్ర‌మ్ బృందావ‌నం మూవీ గురించి ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. "చుట్టలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ చాలా కాలంగా ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి స్క్రిప్ట్ దొరికింది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ ఇది. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే కోసం అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలోని పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను అల‌రించేలా ఉంటాయి" అని అన్నాడు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌...

దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. “మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు ...అనిల్ రావిపూడి గార్లకు థాంక్స్. న్యూ స్టైల్ కామెడీతో ఈ సినిమా కొత్త‌గా ఉంటుంది. ఆదితో పాటు దిగంగ‌నా పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది” అని అన్నారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి అని సాయికుమార్ పేర్కొన్నాడు.

క్రేజీ ఫెలో తర్వాత…

దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ క్రేజీ ఫెల్లో త‌ర్వాత మ‌రోసారి ఆదితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంద‌ని దిగంగ‌నా సూర్య‌వ‌న్షీ చెప్పింది. . డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ చెప్పిన‌ కథ చాలా బాగా నచ్చి ఈ సినిమాను అంగీక‌రించిన‌ట్లు పేర్కొన్న‌ది.

2022లో ఆరు సినిమాలు...

తెలుగులో స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ వ‌చ్చాడు ఆది సాయికుమార్‌. 2022లో అత‌డు న‌టించిన ఆరు సినిమాలు రిలీజ‌య్యాయి. ప‌రాజ‌యాల కార‌ణంగా క‌థ‌ల ఎంపిక‌లో కొన్నాళ్లుగా సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్నాడు ఆదిసాయికుమార్‌. గ‌త ఏడాది ఆది సాయికుమార్ న‌టించిన ఒకే ఒక సినిమా రిలీజైంది. పులి మేక అనే తెలుగు వెబ్‌సిరీస్‌తో ఆది సాయికుమార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

IPL_Entry_Point

టాపిక్