Zee Telugu Sankranthi Sambaralu:సంక్రాంతికి జీ తెలుగులో డబుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ -రెండు స్పెష‌ల్ షోస్ -హోస్ట్‌లు వీళ్లే!-zee telugu sankranthi special shows pandagante itta undala and bava maradalla sankranthi host and guests locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Sankranthi Sambaralu:సంక్రాంతికి జీ తెలుగులో డబుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ -రెండు స్పెష‌ల్ షోస్ -హోస్ట్‌లు వీళ్లే!

Zee Telugu Sankranthi Sambaralu:సంక్రాంతికి జీ తెలుగులో డబుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ -రెండు స్పెష‌ల్ షోస్ -హోస్ట్‌లు వీళ్లే!

Nelki Naresh Kumar HT Telugu
Jan 11, 2024 02:31 PM IST

Zee Telugu Sankranthi Sambaralu:ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జీ తెలుగులో పండగంటే ఇట్టా వుండాల, బావ మరదళ్ల సరదా సంక్రాంతి పేరుతో రెండు స్పెష‌ల్ షోస్ టెలికాస్ట్ కానున్నాయి. ఈ షోలో ప‌లువురు సినీ, టీవీ న‌టీన‌టులు సంద‌డి చేయ‌బోతున్నారు.

పండగంటే ఇట్టా వుండాల
పండగంటే ఇట్టా వుండాల

Zee Telugu Sankranthi Sambaralu: సంక్రాంతి పండుగను మరింత సరదాగా మార్చేందుకు జీ తెలుగు సిద్దమైంది. అంబరాన్నంటే సంబరాల పండుగ వేళ డ‌బుల్ వినోదం అందించేందుకు స్పెష‌ల్ షోతో మీ ముందుకు వచ్చేస్తోంది జీ తెలుగు. భోగి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఆదివారం, సోమవారం రెండు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనుంది.

తెలుగు ప్రజల పెద్ద పండుగ వేళ తమ అభిమాన నటీనటుల ప్రదర్శనలు, అల్లరి, వినోదం, ఆటపాటలతో సాగే సంక్రాంతి సంబరాలను ఈ సంక్రాంతి కానుకగా తన వీక్షకులకు అందించేందుకు సిద్దమైంది. రెండు రోజుల మెగా సంక్రాంతి ప్రత్యేక వేడుక కానుక‌గా జ‌న‌వ‌రి 14న‌ - 'పండగంటే ఇట్టా వుండాల, జ‌న‌వ‌రి 15న బావ మరదళ్ల సరదా సంక్రాంతి కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం కానున్నాయి.

పండగంటే ఇట్టా వుండాల...

పండగంటే ఇట్టా వుండాల కార్య‌క్ర‌మంలో వెండితెర, బుల్లితెర న‌టీన‌టులు చాలా మంది సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ షో కోసం అందాల తారలు అంతా కలిసి ఓకే వేదికపై చేరి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు. పండగంటే ఇట్టా వుండాల జనవరి 14న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ షోకు యాంకర్స్‌గా రవి, వర్షిణి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

జీవిత స్పెష‌ల్ గెస్ట్‌...

ప్రముఖ నటుడు రాజ శేఖర్, ఆయన సతీమణి జీవిత పండ‌గంటే ఇట్టా వుండాల‌కు స్పెష‌ల్ గెస్ట్‌లుగా హాజ‌రుకానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ‌రుగ‌నున్న‌ అంత్యాక్షరి లో పడమటి సంధ్యా రాగం సీరియల్​ నటీనటులు, గాయనీగాయకుల పోటీప‌డ‌నున్నారు. ఇక, ఆ తర్వాత డ్రామా జూనియర్ కిడ్స్ రాజ శేఖర్, జీవితలకు అంకితమిస్తూ చేసిన స్కిట్ అందరినీ భావోద్వేగానికి గురిచేయడం ఖాయ‌మ‌ని నిర్వ‌హ‌కులు చెబుతున్నారు.

ఫ‌న్ టాస్టిక్ అవార్డ్స్‌...

ఈ కార్యక్రమంలో వినోదాన్ని రెట్టింపు చేసేందుకు ఫన్-టాస్టిక్ అవార్డులను ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఆద్యంతం న‌వ్వుల‌తో సాగే ఫంటాస్టిక్ అవార్డ్స్ లో టీవీ సెలబ్రిటీలు ఫన్నీ అవార్డులను తీసుకోడానికి పోటీ పడబోతున్నారు. అంద‌రికి గుర్తుండిపోయేలా కామెడీ ప్ర‌ధానంగా ఈ అవార్డుల ప్ర‌జెంటేష‌న్‌ను డిజైన్ చేయ‌బోతున్నారు.

ఫన్-టాస్టిక్ అవార్డుల ప్రదానం తర్వాత ప్రేక్షకులకు మరొక సర్​ప్రైజ్ ప్లాన్​ చేసింది జీ తెలుగు. సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది రకరకాల వంటలు, పిండి వంటలు.. ఆ సంప్రదాయాన్ని, సంస్కృతిని ఇనుమడించేలా మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు సంఖ్యలో 500 రకాల ఆహార పదార్థాలతో తయారుచేసిన అతిపెద్ద థాలీని తయారు చేసింది. రకరకాల ప్రాంతాలకు చెందిన స్వీట్లు, పిండి వంటలు, పచ్చళ్లు, పొడులు, కూరలు.. ఇలా 500 రకాల వైవిధ్యమైన ఆహారపదార్థాలను ప్రత్యేక నైపుణ్యం గల పాకశాస్త్ర నిపుణులతో చేయించి నోరూరించేలా అతిపెద్ద థాలీని వడ్డించి సంక్రాంతి పండుగ విశిష్టతను చాటారు.

బావ మరదళ్ల సరదా సంక్రాంతి

బావ మరదళ్ల సరదా సంక్రాంతి కార్య‌క్ర‌మానికి శ్యామల, సౌమ్య యాంకర్స్‌గా వ్యవహారించ‌నున్నారు. ఇందులో జీ తెలుగు పాపులర్​ నటీనటులతో పాటు సినిమా ఆర్టిస్ట్‌లు రాశి, ఆమని, సుమన్​ పాల్గొని పాల్గొన‌నున్నారు.

ఆటపాటలు, సరదా కబుర్లు, అద్భుతమైన ప్రదర్శనలతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో ‘సలార్​’ సినిమాలో నటించిన బాల నటులు వేసిన స్కిట్లు, చేసిన అల్లరి ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. అంతేకాదు, ఈ సంక్రాంతి వేడుకలో హనుమాన్​ చిత్రబృందం కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించనుంది. ఈ జనవరి 14, 15 తేదీల్లో సంప్రదాయం, వినోదం, సంక్రాంతి స్ఫూర్తితో పండుగ జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్