Double Engine Review: డబుల్ ఇంజిన్ రివ్యూ.. ఓటీటీలో రెండు తలల పాము కాన్సెప్ట్ మూవీ ఎలా ఉందంటే?-double engine movie review in telugu double engine ott streaming now on aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Engine Review: డబుల్ ఇంజిన్ రివ్యూ.. ఓటీటీలో రెండు తలల పాము కాన్సెప్ట్ మూవీ ఎలా ఉందంటే?

Double Engine Review: డబుల్ ఇంజిన్ రివ్యూ.. ఓటీటీలో రెండు తలల పాము కాన్సెప్ట్ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 19, 2024 09:57 AM IST

Double Engine Movie Review In Telugu: ఇటీవల తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమా డబుల్ ఇంజిన్. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో డబుల్ ఇంజిన్ రివ్యూలో తెలుసుకుందాం.

డబుల్ ఇంజిన్ రివ్యూ.. ఓటీటీలో రెండు తలల పాము కాన్సెప్ట్ మూవీ ఎలా ఉందంటే?
డబుల్ ఇంజిన్ రివ్యూ.. ఓటీటీలో రెండు తలల పాము కాన్సెప్ట్ మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: డబుల్ ఇంజిన్

నటీనటులు: ముని, అజిత్ మోహన్, రోహిత్ నరసింహా, గాయత్రి గుప్తా, రాజు శివరాత్రి, విశ్వేందర్ రెడ్డి తదితరులు

దర్శకత్వం: రోహిత్ పెనుమాత్స

కథ: రోహిత్ పెనుమాత్స, శశి

సంగీతం: వివేక్ సాగర్

నిర్మాతలు: విశ్వదేవ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి

సినిమాటోగ్రఫీ: శశాంక్ రాఘవుల

ఎడిటింగ్: రోహిత్ పెనుమాత్స

థియేట్రికల్ రిలీజ్ డేట్: జనవరి 5, 2024

ఓటీటీ విడుదల తేది: మార్చి 29, 2024

ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా

Double Engine Review In Telugu: పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో గ్రామీణ రియలిస్టిక్ యాసతో తెరకెక్కిన సినిమా డబుల్ ఇంజిన్. జనవరి 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు రెండు నెలల తర్వాత మార్చి 29న ఆహా ఓటీటీలోకి వచ్చేసింది డబుల్ ఇంజిన్. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఆకట్టుకుందో డబుల్ ఇంజిన్ రివ్యూలో చూద్దాం.

కథ:

డానీ (ముని) హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరుకి వెళ్తాడు డానీ. అక్కడ తన ఫ్రెండ్స్ గోపి (అజిత్ మోహన్), నర్సింగ్ (రోహిత్ నరసింహా) కలుసుకుంటాడు. ఊరిలో మూడు రోజులు ఉన్న డానీ తన చిన్ననాటి స్నేహితులతో కలిసి ఏం ప్లాన్ చేశాడు? ఫ్లెక్సీ గురించి జరిగిన గొడవ ఏంటీ?

డానీ అక్క (గాయత్రి గుప్తా) పాత్ర ఎంటీ? డానీని తన తండ్రి హైదరాబాద్‌కు ఎందుకు పంపించాడు? అసలు డబుల్ ఇంజిన్ అంటే ఏంటీ? దానికోసం డానీ అండ్ ఫ్రెండ్స్ ఎందుకు అంతలా ట్రై చేశారు? మరి ఆ పాము దొరికిందా? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే డబుల్ ఇంజిన్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

డబుల్ ఇంజిన్ అంటే రెండు తలల పాము అని సినిమాలో చెప్పారు. ఇదివరకు తెలంగాణలో గతంలో ఈ రెండు తలల పాముకు సంబంధించి అనేక కథనాలు, రూమర్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అలాంటి ఈ యధార్థ సంఘటనల ఆధారంగానే డబుల్ ఇంజిన్ సినిమాను తెరకెక్కించారు. అది కూడా కేవలం రూ. 30 లక్షల వ్యయంతో 12 రోజుల్లోనే చిత్రీకరించడం విశేషం. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల జీవితాన్ని చూపిస్తూ డానీ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో డానీ లైఫ్‌ను ఒక పాటలో చెప్పేసారు. అది పర్వాలేదనిపించింది.

సొంతూరుకి డానీ వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ఫ్రెండ్స్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్, అక్క చివాట్లు, ఫ్లెక్సీ గురించి గొడవతో సినిమా ఇంటర్వెల్ వరకు గడుస్తుంది. అనంతరం గోపికి రెండు తలల పాము కనిపించడంతో మెయిన్ కథలోకి వెళ్లాడు డైరెక్టర్. ఆ విషయం ఫ్రెండ్ డానీకి చెప్పడం, దాని గురించి ఇదివరకు డానీ విన్నది వాళ్లతో షేర్ చేసుకోవడంతో ఆసక్తిగా సాగుతుంది.

ఇంట్రెస్టింగ్ అంశాలు

డబుల్ ఇంజిన్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, రెండు తలల పాము వల్ల వచ్చే లాభాలు, తీరే ఆరోగ్య సమస్యల గురించి చెప్పడం ఇంట్రెస్టింగ్‌ను కలుగ జేస్తుంది. ఇక ఆ డబ్బుతో డానీ ఫ్రెండ్స్ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడం ఫన్నీగా ఉంటుంది. రెండు తలల పామును పట్టుకునేందుకు వేసే ప్లాన్, ఎదురయ్యే చిన్నిపాటి సమస్యలు పర్వాలేదనిపిస్తాయి.

మరి రెండు తలల పాము దొరికిందే.. దాన్ని అమ్ముకున్నారా.. చివరికీ ఏమైంది అనేది చెబితే స్పాయిలర్ అవుతుంది. అయితే, డబుల్ ఇంజిన్ మూవీ గంట 45 నిమిషాలతో తక్కువ నిడివితో ఉన్నప్పటికీ లెంతీ అయినట్లు అనిపిస్తుంది. షార్ట్ ఫిల్మ్‌గా తీయాల్సింది సినిమాలా తెరకెక్కించిన ఫీలింగ్ కలుగుతుంది.

చాలా రియలిస్టిక్‌గా

ఇక సినిమా పూర్తిగా తెలంగాణ యాసతో, చాలా రియలిస్టిక్‌గా తీశారు. దాదాపు పల్లెటూరిలో మాట్లాడుకునే బూతు పదాలను యాజ్ ఇట్ ఈజ్ దించేశారు. కాబట్టి ఫ్యామిలీతో చూడటం కష్టమే. నటీనటులు అంతా కొత్త వాళ్లైనప్పటికీ చాలా బాగా చేశారు. పల్లెటూరులోని యువకులు ఎలా ఉంటారో తలపించారు. ప్రతి పాత్ర బాగా వర్కౌట్ అయింది.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఇక డానీ అక్కగా చేసిన గాయత్రి గుప్తా పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కేవలం రెండు సీన్లలోనే కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. వివేక్ సాగర్ మ్యూజిక్ బాగానే అనిపించింది. కొన్ని చోట్ల బీజీఎమ్ ఆకట్టుకుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్‌కు ఓసారి ఈ సినిమాను కచ్చితంగా చూడొచ్చు.

Whats_app_banner