Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 5 బెస్ట్ ట్రెండింగ్ సినిమాలు.. ఆ మూడు మాత్రం మిస్ అవ్వొద్దు!-best 5 movies in aha ott trending to watch must watch ott trending movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott: ఓటీటీలో ఆహా అనిపించే 5 బెస్ట్ ట్రెండింగ్ సినిమాలు.. ఆ మూడు మాత్రం మిస్ అవ్వొద్దు!

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 5 బెస్ట్ ట్రెండింగ్ సినిమాలు.. ఆ మూడు మాత్రం మిస్ అవ్వొద్దు!

Sanjiv Kumar HT Telugu
Mar 27, 2024 07:13 AM IST

OTT Trending Movies This Week: అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా పేరు తెచ్చుకున్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలను అందిస్తుంటుంది. అయితే, తాజాగా ఈ ఓటీటీలో ఆహా అనిపించే 5 బెస్ట్ ట్రెండింగ్ సినిమాలపై లుక్కేయడమే కాకుండా మిస్ అవ్వకూడని మూవీస్ ఏంటో చూద్దాం.

ఓటీటీలో ఆహా అనిపించే 5 బెస్ట్ ట్రెండింగ్ సినిమాలు.. ఆ మూడు మాత్రం మిస్ అవ్వొద్దు!
ఓటీటీలో ఆహా అనిపించే 5 బెస్ట్ ట్రెండింగ్ సినిమాలు.. ఆ మూడు మాత్రం మిస్ అవ్వొద్దు!

Aha OTT Trending Movies: దేశంలో ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక తెలుగు రాష్టాల్లో అయితే వాటిలో ఉపయోగించేవి కొన్ని మాత్రమే. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5 ఓటీటీ, సోనీ లివ్‌తోపాటు తెలుగు ఓటీటీలు ఆహా, ఈటీవీ విన్‌లను తెలుగు ఆడియెన్స్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు. మరి అచ్చ తెలుగు ఓటీటీ సంస్థగా పేరు తెచ్చుకున్న ఆహా ఈ మధ్య చాలా సినిమాలనే స్ట్రీమింగ్ చేస్తోంది. మరి వాటిలో ట్రెండింగ్ అయ్యే సినిమాలు, వాటిలో మిస్ కాకూడని మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం.

మిక్స్ అప్

న్యూ ఏజ్ బోల్డ్ కంటెంట్ సినిమాగా లేటెస్ట్‌గా ఆహా ఓటీటీలోకి వచ్చిన సినిమా మిక్స్ అప్ (Mix Up OTT). కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జావేరి, అక్షర గౌడ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాకు ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించారు. బోల్డ్ సీన్స్, అడల్ట్ కంటెంట్, ఘాటు బెడ్ సీన్స్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్‌లో ఉంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువండి రిలేషన్, నమ్మకం, లవ్, సెక్స్ వంటి ఇతర అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను ఇంకా చూడకుంటే మాత్రం చూసేయండి.

చెఫ్ మంత్ర సీజన్ 3

మెగా డాటర్ నిహారిక కొణిదెల హోస్ట్‌గా చేస్తున్న షో చెఫ్ మంత్ర సీజన్ 3. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీస్, హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు హాజరవుతుంటారు. వారితో వంట చేయిస్తూ సినిమాకు సంబంధించిన ముచ్చట్లు అడుగుతుంటుంది హోస్ట్ నిహారిక. మూడు వారాల నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షో ఆహాలో టాప్ 2 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. సెలబ్రిటీలకు ఎలాంటి వంటలు వచ్చో తెలుసుకోవాలనుకుంటే ఈ షో చూసేయండి.

భూతద్ధం భాస్కర్ నారాయణ

క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా భూతద్ధం భాస్కర్ నారాయణ. క్రైమ్ మర్డర్స్‌కి మైథాలజీ కాన్సెప్ట్ యాడ్ చేసి ఒక డిఫరెంట్ వేలో ప్రజంట్ చేసిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. శివ కందుకూరి, రాశి సింగ్ హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమా ఆహాలో మూడో స్థానంలో ట్రెండింగ్‌లో అదరగొడుతోంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్స్ ఇష్టపడే వారికి ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు

హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. శివాని నాగరం హీరోయిన్‌గా శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీతోపాటు మంచి మెసేజ్ ఒరియెంటెడ్‌ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఆహాలో టాప్ 4 ప్లేసులో ట్రెండ్ అవుతోంది. లవ్, క్యాస్ట్, సామాజిక అంశాల వంటి కథలు నచ్చేవారు ఈ సినిమాను చూసేయొచ్చు.

భామా కలాపం 2

హీరోయిన్ ప్రియమణి మెయిన్ లీడ్ రోల్ చేసిన భామా కలాపం సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే భామా కలాపం 2. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా టాప్ 5లో ట్రెండింగ్ అవుతోంది. ఇక వీటి తర్వాతి స్థానాల్లో డీజే టిల్లు, కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో, బబుల్ గమ్, కోట బొమ్మాళి, కీడా కోలా సినిమాలు వరుసగా ట్రెండింగ్ అవుతున్నాయి.

మిస్ అవ్వకుండా

Must Watch OTT Movies: వీటన్నింటిలో భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana), కోట బొమ్మాళి (Kota Bommali Movie), అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band OTT), భామాకలాపం 2 (Bhamakalapam 2) సినిమాలను మాత్రం మిస్ అవ్వకుండా చూసేయండి.

WhatsApp channel