Bhamakalapam 3 OTT: ఓటీటీలోకి భామాకలాపం 3.. రా ఏజెంట్‌గా డేంజరస్ హౌజ్ వైఫ్ ప్రియమణి-bhamakalapam 3 ott release and priyamani as raw agent ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bhamakalapam 3 Ott Release And Priyamani As Raw Agent

Bhamakalapam 3 OTT: ఓటీటీలోకి భామాకలాపం 3.. రా ఏజెంట్‌గా డేంజరస్ హౌజ్ వైఫ్ ప్రియమణి

Sanjiv Kumar HT Telugu
Feb 25, 2024 12:30 PM IST

Bhamakalapam 3 OTT Streaming: ప్రియమణి నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ భామాకలాపం 2. 2022 సంవత్సరంలో వచ్చిన భామాకలాపం సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన భామాకలాపం 2 సైతం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలో భామాకలాపం 3 కూడా రానుంది.

ఓటీటీలోకి భామాకలాపం 3.. రా ఏజెంట్‌గా డేంజరస్ హౌజ్ వైఫ్ ప్రియమణి
ఓటీటీలోకి భామాకలాపం 3.. రా ఏజెంట్‌గా డేంజరస్ హౌజ్ వైఫ్ ప్రియమణి

Bhamakalapam 3 OTT Updates: విలక్షణ నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భామాకలాపం 2’. ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రియమణితోపాటు బ్యూటిఫుల్ సీరత్ కపూర్, నటి శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. రుద్ర ప్రదీప్, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. భామాకలాపం 2 మూవీకి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు.

2022 సంవత్సరంలో విడుదలైన భామాకలాపం చిత్రం ఓటీటీలో విడుదలైన ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. మొదట్లో దీన్ని థియేటర్ రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ, చివరిగా ఓటీటీలోనే భామాకలాపం 2 మూవీని రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 16 నుంచి ఈ మూవీ నేరుగా ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

సస్పెన్స్ కామెడీ హీస్ట్ థ్రిల్రర్‌గా తెరకెక్కిన భామాకలాపం 2 మూవీకి మౌత్ టాక్‌తో పాటు ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో ఇటీవల భామాకలాపం 2 మూవీ సెంచరీ కొట్టిందంటూ ఆహా టీమ్ పేర్కొంది. ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటేసిందని ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్ట్రీమింగ్‌కు వచ్చిన వారంలోనే భామాకలాపం 2 సెంచరీ మిలియన్ స్ట్రీమింగ్ మార్క్ అధిగమించినట్లు ఆహా తెలిపింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మూవీకి ఎంతగా రెస్పాన్స్ వస్తోందో.

అయితే, భామాకలాపం 2లో ఎప్పటిలానే అనుపమ అనే యూట్యూబర్‌గా కనిపించిన ప్రియమణిని డేంజరస్ హౌజ్ వైఫ్‌గా చూపించారు. సినిమాలో యూట్యూబ్ వీడియోస్ ద్వారా సంపాదించిన డబ్బుతో హోటల్ పెట్టుకున్న అనుపమకు రూ. 1000 కోట్ల విలువగల కోడి బహుమతిని ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందో అనే కథాంశంతో సినిమా ఉంటుంది. ఆద్యంతం కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది.

అయితే, భామాకలాపం 2కి కొనసాగింపుగా భామాకలాపం 3 కూడా రానుందని మూవీ ఎండింగ్‌లో చూపించారు. అంతేకాకుండా అందులో ప్రియమణి రోల్ కూడా రివీల్ చేశారు. ది గ్రేట్ కుకింగ్ ఐడల్ పోటీలో పాల్గొన్న అనుపమ వంట నచ్చిన జడ్జ్ తన యూరప్‌లోని తన హౌటల్‌లో హెడ్ చెఫ్‌గా ఉండమంటూ జాబ్ ఆఫర్ చేస్తాడు. అది ఆలోచించుకునేలోపే అనుపమకు రా ఏజెన్సీ నుంచి కాల్ వస్తుంది. హౌజ్ వైఫ్‌గా ఉండి కూడా తన ప్రతిభను చూసి తనకు రా ఏజెంట్‌గా జాయిన్ అవ్వమని కోరుతాడు సదరు అధికారి.

అలా భామాకలాపం 3 మూవీపై చిన్నిపాటి హింట్ ఇచ్చి క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. కాబట్టి, త్వరలో రా ఎజెంట్‌గా మరోసారి డేంజరస్ హౌజ్ వైఫ్‌ అనుపమ కనిపించనుందని తెలుస్తోంది. మరి దానికి అనుపమ ఒప్పుకుంటుందా..? ఒప్పుకుంటే ఎలాంటి సాహసాలు చేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, మరి ఈ భామాకలాపం 3ని ఎప్పటిలాగే ఓటీటీలో రిలీజ్ చేస్తారో..? లేదా థియేయటర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తారా? అనేది చూడాలి.

IPL_Entry_Point