Mix Up Review: మిక్స్ అప్ సినిమా రివ్యూ.. ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా?-mix up movie review in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mix Up Review: మిక్స్ అప్ సినిమా రివ్యూ.. ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా?

Mix Up Review: మిక్స్ అప్ సినిమా రివ్యూ.. ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా?

Sanjiv Kumar HT Telugu
Mar 16, 2024 05:30 AM IST

Mix Up Movie Review In Telugu: ఓటీటీలోకి అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన లేటెస్ట్ సినిమా మిక్స్ అప్. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో మార్చి 15 నుంచి బోల్డ్ మూవీ మిక్స్ అప్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మిక్స్ అప్ రివ్యూలో తెలుసుకుందాం.

మిక్స్ అప్ మూవీ రివ్యూ.. అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఓటీటీ సినిమా ఆకట్టుకుందా?
మిక్స్ అప్ మూవీ రివ్యూ.. అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఓటీటీ సినిమా ఆకట్టుకుందా?

Mix Up Review In Telugu: ఓటీటీలోకి తాజాగా అడుగు పెట్టిన బోల్డ్ కంటెంట్ సినిమా మిక్స్ అప్ (Mix-Up Movie). కమల్ కామరాజు, పూజా జావేరి, ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ ప్రధాన పాత్రలు పోషించగా కామాక్షి భాస్కర్ల, బిందు చంద్రమౌళి కీ రోల్స్ చేశారు. ఈ సినిమాకు హైమా వర్షిణి కథ అందించగా ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించారు. స్ప్రింట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కౌశిక్ సంగీతం అందించారు.

న్యూ ఏజ్ బోల్డ్ మూవీగా తెరకెక్కిన మిక్స్ అప్ సినిమా తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇదివరకే టీజర్, ట్రైలర్‌లో విపరీతమైన బోల్డ్ కంటెంట్ చూపించి అంచనాలు పెంచేసిన మిక్స్ అప్ సినిమా ఎలా ఉందో నేటి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

అభయ్ (కమల్ కామరాజు)-నిక్కీ (అక్షర గౌడ), సాహు (ఆదర్శ్ బాలకృష్ణ)-మైథిలీ (పూజా జావేరి) భార్యభర్తలు. వారికి సెక్స్, లవ్ పరంగా సమస్యలు తలెత్తుతాయి. దాంతో ఈ రెండు జంటలు విడి విడిగా సైకాలిజిస్ట్ (బిందు చంద్రమౌళి)ను కలుస్తారు. వారి వాదనలు విన్న ఆ థెరపిస్ట్ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోండని సలహా ఇస్తుంది. డాక్టర్ సలహాతో ఇరు జంటలు గోవాకు వెళ్తాయి.

ఆసక్తికర విషయాలు

గోవాకు వెళ్లిన ఈ జంటల మధ్య ఏం జరిగింది? అసలు తమ బంధంలో ఉన్న ఇబ్బందులు ఏంటీ? గోవాకు వెళ్లడానికి ఇంకో కారణం ఏంటీ? సాహు, నిక్కీలకు ఫ్రెండ్ అయిన రీతు (కామాక్షి భాస్కర్ల) పాత్ర ఏంటీ? గోవాలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి? చివరికి ఈ రెండు జంటల పరిస్థితి ఏమైంది? వంటి తదితర ఆసక్తిర విషయాలు తెలియాలంటే మిక్స్ అప్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

"సాధారణంగా తెలుగు సాంప్రాదయంలో ఒకప్పుడు భార్యాభర్తలు ఎలాంటి వారు అయిన వారితో జీవితాంతం కలిసి ఉంటారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. తమను అర్థం చేసుకునేవారితోనే జీవితం పంచుకోవాలని అనుకుంటున్నారు. మరి ఆ అర్థం చేసుకోవడం అంటే ఏంటీ?" అనే ప్రశ్నతో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే రెండు జంటలు విడిపోవాలనుకుంటున్నట్లు తమ పార్టనర్‌తో ఉన్న ఇబ్బందులు చెప్పడంతో మూవీ కథలోకి వెళ్తుంది.

కరెక్ట్ పార్టనర్ కోసం

అయితే, రెండు జంటల పరిస్థితి ఒకేలా ఉంటుంది. కానీ, వారు కోరుకున్నట్లుగా వారి భాగస్వామి ఉండరు. అదే వారికి వచ్చిన సమస్య. ఒకరికి సెక్స్ అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. మరొకరికి పెళ్లి, లవ్ అంటే సెక్స్ మాత్రమే కాదు. కేరింగ్, రెస్పెక్ట్ వంటి చాలా ఉంటాయని భావించేవారు. ఒకరికి రావాల్సిన కరెక్ట్ పార్టనర్ మరొకరికి వచ్చారని అర్థమైపోతుంది. వారు వారు తమ కరెక్ట్ పార్టనర్‌లను పెళ్లయిన తర్వాత గోవా ట్రిప్‌లో ఎలా కలుసుకున్నారన్నదే కథ.

గెస్ చేసేలా క్లైమాక్స్

మిక్స్ అప్ సినిమాలో ఊహించని మలుపులు, ట్విస్టులు పెద్దగా ఏముండవు. ప్రారంభంలోని సినిమా క్లైమాక్స్ ఏంటో అర్థమైపోతుంది. ఆ సమయం వరకు వేచి చూడాల్సిందే. అయితే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే సీన్స్ మాత్రం అంతగా లేవనే చెప్పాలి. ఓవైపు బెడ్ రూమ్ సీన్స్ కొన్ని, మరోవైపు బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ సన్నివేశాలతో మూవీ ఉంటుంది. లవ్ ట్రాక్‌కు సంబంధించిన సీన్స్ బాగుంటాయి. కొంచెం ఫీల్ తెప్పించేలా ఉంటాయి.

వాయిస్ ఓవర్ డైలాగ్స్ హైలెట్

ఓపెనింగ్ సీన్, క్లైమాక్స్‌ ఎండ్‌లో వచ్చే వాయిస్ ఓవర్ డైలాగ్స్ మినహా సినిమాలో చెప్పుకునే డైలాగ్స్ ఏం పండలేదు. సినిమా కేవలం గంటన్నర ఉన్నప్పటికీ దాదాపు అంతా ప్లాట్‌గా సాగుతుంది. ట్విస్టులు, ఆసక్తి పెంచే సీన్స్ ఏముండవు. క్లైమాక్స్ ఈజీగా ఊహించుకోవచ్చు. బాగా ఆకట్టుకునే రొమాంటిక్ సీన్‌తో ముగించారు. అది తప్పా ట్రైలర్ కంటే మించిన బూతులు, అడల్ట్ కంటెంట్ సినిమాలో ఎక్కడా లేదు. బీజీఎమ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల యాక్టింగ్

కమల్ కామరాజు తన పాత్రలో బాగా ఒదిగిపోయాడు. లవ్, షై, కేరింగ్ తన నటనతో బాగా మెప్పించాడు. అక్షర గౌడ చాలా హాట్‌గా కనిపించింది నటనతో ఆకట్టుకుంది. మైథిలీ సైతం అవసరమైన సన్నివేశాల్లో గ్లామర్‌గా మిగతా సీన్స్‌లో చాలా పద్ధతిగా కనిపించి పాత్రలో ఒదిగిపోయింది. ఇది వరకు విలన్‌గా చేసిన ఆదర్శ్ బాలకృష్ణ కొంచెం అలాంటి తరహాలోనే కనిపిస్తాడు. అతని యాక్టింగ్ కూడా బాగుంది. కామాక్షి భాస్కర్ల పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.

ఫైనల్‌గా చెప్పాలంటే..

డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో, ఎలా తీయాలనుకున్నాడో అలాగే తీసినట్లు అనిపిస్తుంది. కానీ, ఓవరాల్‌గా చూస్తే మాత్రం మిక్స్ అప్ అవ్వదు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే "పెళ్లి అంటే అవతలి వాళ్లను అర్థం చేసుకోవడమే కాదు. అవతలి వాళ్ల చేత అర్థం చేసుకోబడటం కూడా" అని మంచి సందేశం ఇచ్చిన సినిమాను భార్యాభర్తలు కలిసి ఓసారి చూడొచ్చు. అంతకుమించి కుటుంబసభ్యులతో చూడలేం.

రేటింగ్: 2.25/5

IPL_Entry_Point