IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడకుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే పరిమితమైన స్టార్ క్రికెటర్లు వీళ్లే
IPL 2024: ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయల అమ్ముడుపోయిన కొందరు క్రికెటర్లు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కైల్ మేయర్స్, నవదీప్ సైనీతో పాటు పలువురు క్రికెటర్లు సీజన్ మొత్తం జట్టుతోనే ఉన్నా ఒక్క మ్యాచ్‌లోనూ వారికి ఆడే అవకాశం రాలేదు.
IPL 2024: ఈ ఐపీఎల్‌లో కొందరు క్రికెటర్లు ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలో దిగకుండానే కోట్లు సంపాదించారు. సీజన్ మొత్తం టీమ్ వెంటే ఉన్నా వారికి ఒక్క అవకాశం కూడా రాలేదు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్లతో పాటు పలువురు ఫారిన్ క్రికెటర్లు ఉన్నారు.
ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్...
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌ను యాభై లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్నది. 2023 సీజన్‌లో పదమూడు మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలతో 379 పరుగులు చేశాడు కైల్ మేయర్స్. గత సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే 38 బాల్స్‌లో 73 రన్స్ చేసి అదరగొట్టాడు. కానీ ఈ సీజన్‌లో మాత్రం కైల్ మేయర్స్‌కు నిరాశే మిగిలింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఈ ఆల్‌రౌండర్‌కు రాలేదు. జట్టు కూర్పు దెబ్బతినకూడదని లక్నో మేనేజ్‌మెంట్ పెద్దగా మార్పులు చేయలేదు. దాంతో కైల్ మేయర్స్ సీజన్ మొత్తానికి బెంచ్‌కు పరిమితమయ్యాడు
నవదీప్ సైనీ...
టీమిండియా పేసర్ నవదీప్ సైనీని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో రెండు కోట్ల అరవై లక్షలకు రిటెయిన్ చేసుకుంది. గత సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన నవదీప్ సైనీ ఈ సీజన్‌లో మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా కనిపించలేదు. 2013 నుంచి 2021 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతోన్నాడు. టీమ్ ఇండియా తరఫున రెండు టెస్ట్‌లు, ఎనిమిది వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు నవదీప్ సైనీ.
సన్‌రైజర్స్ క్రికెటర్
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ను సన్‌రైజర్స్ కోటిన్నరకు కొన్నది.ఈ సీజన్ మొత్తం అతడు జట్టుతోనే ట్రావెల్ చేసిన తుది జట్టులో ఒక్క మ్యాచ్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ట్రావిస్‌హెడ్, క్లాసెన్ పరుగుల వరద పారించడంతో గ్లెన్ ఫిలిప్స్‌కు నిరాశే మిగిలింది.
రహమతుల్లా గుర్భాజ్...
అప్ఘన్ హిట్టర్ రహమతుల్లా గుర్బాజ్‌ను యాభై లక్షలకు ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకున్నది. గత సీజన్‌లో బ్యాటింగ్‌లో రాణించాడు గుర్భాజ్. 11 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో 227 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో మాత్రం అతడు ఒక్కసారి కూడా బరిలో దిగలేకపోయాడు.
నలుగురు క్రికెటర్లు..
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దేశవాళీతో పాటు అండర్ 19 వరల్డ్ కప్‌లో మెరుపులు మెరిపించిన పలువురు ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వలేదు. ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్‌తో పాటు యశ్ ధుల్, స్వస్తిక్ చికారలను కొనుగోలు చేసిన వారు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
టాపిక్